జగన్ బెయిల్ పిటిషన్పై 23న తీర్పు
హైదరాబాద్ : వైఎస్ జగన్మోహన్ రెడ్డి బెయిల్ పిటిషన్పై వాదనలు పూర్తి కాగా, తీర్పు ఈనెల 23వ తేదీకి వాయిదా పడింది. క్విడ్ ప్రో కో కేసులో దర్యాప్తు పూర్తైనందున బెయిల్ మంజూరు చేయాలని జగన్ తరపు న్యాయవాది బుధవారం నాంపల్లి సీబీఐ కోర్టును కోరారు. దర్యాప్తు పెండింగ్‌లో ఉందని సీబీఐ కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టు గతంలో బెయిల్ నిరాకరించిన విషయాన్ని గుర్తు చేశారు.
బెయిల్ అనేది ప్రాథమిక హక్కని... వ్యక్తిపై ఆధారపడి బెయిల్ నిరాకరించడం తగదని అన్నారు. విచారణలో తనను తాను డిఫెండ్ చేసుకునే నిందితుడికి బెయిల్ మంజూరు చేయొచ్చంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను జగన్ తరపు న్యాయవాది ప్రస్తావించారు. ఒకవేళ సాక్ష్యుల్ని ప్రభావితం చేశారని భావిస్తే... బెయిల్‌ను రద్దు చేయొచ్చని ఆయన తెలిపారు.