
బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన నిమ్మగడ్డ
హైదరాబాద్ : ప్రముఖ పారిశ్రామిక వేత్త నిమ్మగడ్డ ప్రసాద్ మంగళవారం నాంపల్లి సీబీఐ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. గతంలో ఆయనకు సీబీఐ కోర్టు మధ్యంతర బెయిల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. నిమ్మగడ్డ ప్రసాద్ మామ రామ్ ప్రకాష్ ఆర్య అంత్యక్రియలకు హాజరయ్యేందుకు సీబీఐ న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. అంతకు ముందు నిమ్మగడ్డ సుప్రీంకోర్టు, హైకోర్టు, నాంపల్లి కోర్టుల్లో బెయిల్ మంజూరు చేయాలంటూ పిటిషన్ దాఖలు చేసినా... సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందంటూ సీబీఐ అభ్యంతరం తెలిపిన విషయం తెలిసిందే.