Nimmagadda Prasad
-
చేసిందంతా చేసి.. నంగనాచి కబుర్లా చంద్రబాబూ: మంత్రి బొత్స
సాక్షి, విశాఖపట్నం: ఈనాడు, ఆంధ్రజ్యోతి ప్రజలను ఫూల్స్‌ను చేస్తున్నాయని మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, పెన్షన్లను అడ్డుకొని వారే తప్పుడు రాతలు రాస్తున్నాయని ధ్వజమెత్తారు. ‘‘ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసిందెవరు? సిటిజన్ ఫర్ డెమొక్రసీ పేరుతో ఫిర్యాదు చేశారు. సిటిజన్ ఫర్ డెమొక్రసీ సంస్థకు నిమ్మగడ్డ రమేష్ అధ్యక్షుడు. చంద్రబాబును దేవుడు క్షమించడు’’ అని మంత్రి బొత్స ధ్వజమెత్తారు. ‘‘వికలాంగులకు, పెన్షనర్లకు ఏం సమాధానం చెప్తారు?. ప్రతిదీ రాజకీయం చేస్తారా? మానవత్వం ఉండొద్దా?. చేసిందంతా చేసి నంగనాచి కబుర్లు చెబుతున్నారు. నిమ్మగడ్డ రమేష్‌ను అడ్డుపెట్టుకుని కుంత్రంతాలు పన్నారు. ఇన్ని నెలలు వాలంటీర్లు పెన్షన్లు పంపిణీ చేస్తే అప్పుడు రాని ఇబ్బంది ఇప్పుడెందుకు వచ్చింది’’ అంటూ మంత్రి నిలదీశారు. చీపురుపల్లి పోటీపై మంత్రి బొత్స కామెంట్స్ బొత్సకు రెండు కొమ్ములు.. కళా వెంకట్రావుకు మూడు కొమ్ములు వుంటాయా?. ఎన్నికలు ఎక్కడైనా ఒక్క తీరుగానే జరుగుతాయి. మూడు అక్షరాల గంటా పోయి.. రెండు అక్షరాల కళా వచ్చాడు తప్ప అంతకు మించిన మార్పు లేదు. వాలంటీర్లు రాజీనామాలపై స్పందించిన బొత్స ఏదో ఒక కారణంతో రిజైన్ చేస్తే వాళ్ల అభ్యర్థన పరిశీలించి నిర్ణయం తీసుకుంటాం. రాజకీయ లబ్ధి కోసం ప్రజలను ఫూల్స్ చేద్దాం అనుకుని చంద్రబాబు ఫూల్ అయ్యాడు. ఇదీ చదవండి: వలంటీర్లంటేనే వణికిపోతున్న పెత్తందారులు -
అవ్వాతాతలపై బాబు పగ..
సాక్షి, అమరావతి: ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధులుగా.. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల అమలులో క్షేత్రస్థాయిలో ఎలాంటి పైరవీలు, లంచాలకు తావులేకుండా.. కుల, మత, ప్రాంత, వర్గాలకు అతీతంగా.. అర్హత ఉన్న ప్రతీఒక్కరికీ సంక్షేమ పథకాలను ఠంఛనుగా అందజేయడంలో కీలకంగా ఉన్న వలంటీర్లపై చంద్రబాబు నేతృత్వంలోని ఎల్లో గ్యాంగ్ చివరకు తన పగ సాధించింది. అవ్వాతాతలకు ఏ కష్టం లేకుండా నెలనెలా ఒకటో తారీఖు పొద్దున్నే తలుపుకొట్టి మరీ పింఛన్లు అందజేస్తున్న ఈ వలంటీర్లపై చంద్రబాబు, పవన్‌కళ్యాణ్ మొదటినుంచీ రకరకాల వివాదాస్పద ఆరోపణలు చేస్తూ తమ అక్కసును, ఆక్రోశాన్ని వెళ్లగక్కుతూ వచ్చారు. ఇప్పుడు ఎన్నికల వేళ అవ్వాతాతలు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు తదితర దాదాపు 66.40 లక్షల మంది లబ్ధిదారులను మళ్లీ టీడీపీ పాలనలో మాదిరిగా ఇబ్బందులకు గురిచేయడానికే చంద్రబాబు బరితెగించారు. ఇందుకు సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ అనే సంస్థను పావుగా వాడుకున్నారు. చంద్రబాబు సేవలోనే తరిస్తున్న నిమ్మగడ్డ.. నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ ఐఏఎస్ అధికారి అయినప్పటికీ.. ఆయన పూర్తిగా చంద్రబాబు రాజకీయ ప్రయోజనాల కోసమే మొదటి నుంచీ పనిచేసిన వ్యక్తే. స్థానిక సంస్థల నిర్వహణలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని ఆయనపై ఆరోపణలు వెల్లువెత్తాయి. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే నిమ్మగడ్డను రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా సిఫార్సు చేశారు. వాస్తవానికి.. 2018లో రాష్ట్రంలో సర్పంచుల పదవీకాలం ముగిసినా.. 2019 సాధారణ ఎన్నికల ముందు ఆ ఎన్నికల జరిగితే నాటి చంద్రబాబు ప్రభుత్వానికి రాజకీయ ఇబ్బందులు తలెత్తుతాయని భావించి నిబంధనలకు విరుద్ధంగా కోర్టు సాకుల పేరుతో సార్వత్రిక ఎన్నికలు ముగిసేవరకు సర్పంచి ఎన్నికలు జరగకుండా నిమ్మగడ్డ అడ్డుకున్నారు. ఇక జగన్ సీఎం అయ్యాక కూడా.. 2020 ఆరంభంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ కొనసాగుతున్న సమయంలో ప్రభుత్వానికి కనీసం సమాచారం కూడా ఇవ్వకుండా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ హోదాలో నిమ్మగడ్డ కరోనా పేరుతో స్థానిక సంస్థల ఎన్నికలను అర్థంతరంగా వాయిదా వేశారు. అప్పట్లో ఈ నిర్ణయం కూడా తీవ్ర వివాదాస్పదమైంది. వలంటీర్లపై సుప్రీంకోర్టులోనూ నిమ్మగడ్డ కేసులు.. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ పదవీ విరమణ చేసిన తర్వాత తన పూర్తి సమయాన్ని ఆయన తన బాస్ చంద్రబాబుకే కేటాయించారు. ప్రస్తుత అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఆయన నేతృత్వంలో పలువురు ద్వారా చంద్రబాబు సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ సంస్థను ఏర్పాటుచేసి, ఆ సంస్థ ద్వారా వలంటీర్ల వ్యవస్థపై పెద్దఎత్తున ఫిర్యాదులు చేస్తూ కోర్టులోనూ కేసులు దాఖలు చేయించారు. వలంటీర్ల వ్యవస్థ చెల్లుబాటునే ప్రశ్నిస్తూ సుప్రీంకోర్టులో కేసు నమోదు చేసి, ఆ తర్వాత తనంతట తానుగా ఆ కేసును ఉపసంహరించుకున్నారని అధికారులు చెప్పారు. ఆ తర్వాత వలంటీర్లకు వ్యతిరేకంగా ఢిల్లీ హైకోర్టులోనూ కేసు దాఖలు చేశారని, రాష్ట్ర హైకోర్టులోనూ కేసులు వేసినట్లు అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే.. ఈ ఏడాది ఫిబ్రవరి 23, 25 తేదీల్లో వరుసగా రెండుసార్లు వలంటీర్లపై కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ సంస్థ ఫిర్యాదు చేసింది. రూ.లక్షల్లో లాయర్లకు ఫీజులు.. సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ సంస్థ ద్వారా వలంటీర్లపై మొత్తం కథ నడిపించిన చంద్రబాబు ఇందుకు లాయర్ల ఫీజుల నిమిత్తం రూ.లక్షల్లో వెచ్చించారు. సుప్రీంకోర్టులో ఇందుకు సంబంధించిన కేసులు వాదించేందుకు ఖరీదైన లాయర్లను వినియోగించారు. నిజానికి.. అంత పెద్ద లాయర్లను భరించడం ఈ సంస్థవల్ల కాదు కాబట్టి చంద్రబాబే వెనుకనుండి ఇదంతా నడిపిస్తున్నారు. ఇక ఈ కేసులను కపిల్ సిబాల్, సిద్ధార్థ దవే., పీబీ సురేష్ వంటి సీనియర్ లాయర్లు వాదిస్తున్నారు. వీళ్ల ఫీజులు రోజుకు రూ.లక్షల్లో ఉంటుందన్నది తెలిసిందే. నరకప్రాయమైన ఆ రోజులు మళ్లీ.. చంద్రబాబు బ్యాచ్ కుట్రలతో అవ్వాతాతలు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు తదితర దాదాపు 66.40 లక్షల మంది లబ్ధిదారులు మళ్లీ రోడ్డున పడనున్నారు. అప్పట్లో చంద్రబాబు పాలనలో వీళ్లు పడ్డ కష్టాలు అన్నీ ఇన్నీ కావు. అవి మళ్లీ పునరావృతం కానున్నాయి. ఆ రోజుల్లో పింఛన్ల కోసం బ్యాంకులకు వెళ్తే చాంతాడంత క్యూలు.. మండే ఎండల్లో తిండి లేకుండా నిరీక్షణ.. ఈలోపు సమయం మించిపోతే మళ్లీ బ్యాంకుల నుంచి ప్రదక్షిణలు చేయాల్సిన పరిస్థితి. కానీ, 2019లో జగన్ ముఖ్యమంత్రి అయ్యాక వీరి కష్టాలన్నింటికీ మంగళం పాడుతూ వలంటీర్ల వ్యవస్థకు శ్రీకారం చుట్టారు. ఇది ఎప్పటికైనా తన పుట్టి ముంచుతుందని చంద్రబాబు గ్రహించి సందర్భం వచ్చినప్పుడల్లా వలంటీర్లపై తన అక్కసు వెళ్లగక్కేవారు. బాబు జేబు సంస్థ ముసుగులో.. తన జేబు సంస్థ అయిన సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ సంస్థను చంద్రబాబు కొద్దిరోజుల ముందే ఏర్పాటు చేయించారు. దీని ముసుగులో చంద్రబాబు తన కుట్రలకు ఎప్పటినుంచో పదునుపెట్టారు. ఎన్నికల సమయంలో ఈ వలంటీర్లను ఎలాగైనా విధుల నుంచి దూరం పెట్టాలని పచ్చబ్యాచ్ కుట్ర పన్నింది. ఇందులో భాగంగా.. తన నమ్మినబంటు.. రాష్ట్ర ప్రధాన ఎన్నికల మాజీ అధికారి నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ ఈ సంస్థకు నేతృత్వం వహించి బాబు డైరెక్షన్లో కేంద్ర ఎన్నికల సంఘానికి మొన్న ఫిబ్రవరి నుంచి అదేపనిగా వలంటీర్ల వ్యవస్థపై ఫిర్యాదులు చేస్తూ వచ్చారు. దీంతో కేంద్ర ఎన్నికల సంఘం వలంటీర్ల ద్వారా పింఛన్ల పంపిణీ సహా ప్రభుత్వ సంక్షేమ పథకాలకు సంబంధించి ఎలాంటి నగదు పంపిణీ చేపట్టవద్దంటూ ప్రభుత్వానికి తాజాగా ఆదేశాలు జారీచేసింది. ఈ విషయం ఈసీ కూడా తన ఉత్తర్వులో స్పష్టంగా పేర్కొంది. -
‘మ్యాట్రిక్స్’ ప్రసాద్ రీఎంట్రీ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: నిమ్మగడ్డ ప్రసాద్.. మ్యాట్రిక్స్ ప్రసాద్‌గా తెలుగు ప్రజలకు సుపరిచితమైన ప్రముఖ వ్యాపారవేత్త. ఖాయిలాపడ్డ మ్యాట్రిక్స్ ల్యా»ొరేటరీస్ను 2000 సంవత్సరంలో ఆయన కొనుగోలు చేశారు. ఆరేళ్లలోనే బిలియన్ డాలర్ కంపెనీగా తీర్చిదిద్దారు. అప్పట్లో స్టాక్మార్కెట్లో మ్యాట్రిక్స్ ఓ సంచలనం. కంపెనీ షేర్లను కొనుగోలు చేసిన ఇన్వెస్టర్లు తమ పెట్టుబడిపై ఇబ్బడిముబ్బడిగా లాభాలు గడించారు. ఫార్మా దిగ్గజం మైలాన్ ల్యాబ్స్ 2006లో మ్యాట్రిక్స్‌ను 1.1 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది. ఈ డీల్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ పరిచయం ఎందుకంటే తాను ఏ అమెరికా కంపెనీకి అయితే 17 ఏళ్ల క్రితం మ్యాట్రిక్స్‌ను విక్రయించారో.. ఇప్పుడు అదే మైలాన్ (ప్రస్తుతం వియాట్రిస్) నుంచి నిమ్మగడ్డ ప్రసాద్ తిరిగి ఆ వ్యాపారాన్ని కైవసం చేసుకుంటున్నారు. వియాట్రిస్‌కు చెందిన భారత ఏపీఐ వ్యాపారాన్ని కొనుగోలు చేయడానికి నిమ్మగడ్డ ప్రసాద్ ప్రమోట్ చేస్తున్న ఐక్వెస్ట్ ఎంటర్ప్రైసెస్ తాజాగా ఒప్పందం కుదుర్చుకుంది. అంతర్జాతీయంగా పోటీపడి మరీ టెండర్లలో విజయం సాధించి వియాట్రిస్ ప్లాంట్లను ఐక్వెస్ట్ చేజిక్కించుకుంటోంది. ఏటా రూ.6,000 కోట్లు.. తాజా డీల్ పూర్తి అయితే హైదరాబాద్‌లో మూడు, ఆంధ్రప్రదేశ్‌లోని వైజాగ్‌లో మూడు భారీ స్థాయి యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియెంట్ (ఏపీఐ) తయారీ ప్లాంట్లతోపాటు హైదరాబాద్‌లో పరిశోధన, అభివృద్ధి కేంద్రం ఐక్వెస్ట్ చేతికి రానున్నాయి. అలాగే థర్డ్–పార్టీ ఏపీఐ విక్రయాలు కూడా సంస్థ పరం కానున్నాయి. ఈ డీల్ పూర్తి కావడానికి ఆరు నెలల సమయం పట్టొచ్చని అంచనా. ఆరు ప్లాంట్ల వార్షికాదాయం సుమారు రూ.6,000 కోట్లు ఉంది. ఈ ప్లాంట్లలో తయారైన ఉత్పత్తులను 10 ఏళ్లపాటు కొనుగోలు చేసేందుకు వియాట్రిస్ అంగీకరించింది. రానున్న రోజుల్లో హైదరాబాద్ కేంద్రంగా పెద్ద ఫార్మా కంపెనీగా ఆవిర్భవించనున్నట్టు ఐక్వెస్ట్ తెలిపింది. కాగా, భారత్‌లో మహిళల ఆరోగ్య సేవల వ్యాపారాన్ని స్పెయిన్‌కు చెందిన ఇన్సడ్ ఫార్మాకు వియాట్రిస్ విక్రయిస్తోంది. ఐక్వెస్ట్, ఇన్సడ్ డీల్స్ ద్వారా వియాట్రిస్‌కు సుమారు రూ.10,000 కోట్లు సమకూరుతున్నాయి. రుణ భారాన్ని తగ్గించుకోవడానికి వియాట్రిస్ అంతర్జాతీయంగా వివిధ విభాగాల్లో వాటాల విక్రయం ద్వారా దాదాపు రూ.29,950 కోట్లు అందుకుంటోంది. ఇదే అతిపెద్ద పెట్టుబడి.. ఫార్మాస్యూటికల్ రంగంలో తమ కంపెనీ నుంచి ఇదే అతిపెద్ద పెట్టుబడి అని ఐక్వెస్ట్ ఎంటర్ప్రైసెస్ ఈడీ, నిమ్మగడ్డ ప్రసాద్ కుమార్తె గునుపాటి స్వాతి రెడ్డి ఈ సందర్భంగా తెలిపారు. ప్రపంచ ఔషధ పరిశ్రమలో భారత్ గణనీయంగా దృష్టిని ఆకర్షిస్తున్న సరైన సమయంలో ఈ డీల్ కుదుర్చుకున్నట్టు చెప్పారు. కాగా, ఏఐజీ హాస్పిటల్స్, కేర్ హాస్పిటల్స్, సెలాన్ లే»ొరేటరీస్ తదితర సంస్థల్లో ఐక్వెస్ట్ ద్వారా నిమ్మగడ్డ ప్రసాద్ గతంలో పెట్టుబడులు పెట్టి వీటి అభివృద్ధిలో పాలుపంచుకున్నారు. సృజనాత్మక ఆలోచనలను విజయవంతమైన వ్యాపార వ్యూహాలుగా మార్చారు. కంపెనీలను వృద్ధి బాటలో నడిపించడంతోపాటు వాటాదారులకు మెరుగైన విలువను సృష్టించారు. 2012లో కేర్ హాస్పిటల్స్‌లో, 2015లో మా టీవీలో తనకున్న వాటాలను విక్రయించారు. మా టీవీని స్టార్ టీవీ సుమారు రూ.2,350 కోట్లకు కొనుగోలు చేయడం అప్పట్లో మీడియా రంగంలో సంచలనం కలిగించింది. -
ఫౌండేషన్‌కు విరాళమివ్వడమూ నేరమేనా?
సాక్షి, హైదరాబాద్: నిరుపేదల వైద్య చికిత్సలకు ఆర్థికసాయం అందించే వైఎస్సార్ ఫౌండేషన్‌కు పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్ రూ.7 కోట్లు విరాళం ఇచ్చారని, దీన్ని కూడా సీబీఐ నేరంగా చూస్తోందని ఆయన తరఫు న్యాయవాది టి.నిరంజన్‌రెడ్డి హైకోర్టుకు నివేదించారు. వైఎస్ జగన్ కంపె నీల్లో పెట్టుబడులకు సంబంధించి తమపై నమోదు చేసిన కేసులను కొట్టివేయాలంటూ వాన్‌పిక్ ప్రాజెక్ట్స్, నిమ్మగడ్డ ప్రసాద్ వేర్వేరుగా దాఖలు చేసిన క్వాష్ పిటిషన్లను న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ సోమవారం మరోసారి విచారించారు. నిమ్మగడ్డ ఫౌండేషన్ పేరుతో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, దాదాపు రూ.130 కోట్లు సేవా కార్యక్రమాలకు విరాళంగా ఇచ్చారని నిరంజన్‌రెడ్డి నివేదించారు. సండూర్ పవర్, భారతీ సిమెంట్స్‌లో నిమ్మగడ్డ పెట్టిన పెట్టుబడులకు భారీగా లాభాలు వచ్చాయని, అయితే పెట్టుబడులు పెట్టినట్లుగా మాత్రమే చార్జిషీట్లో సీబీఐ పేర్కొందని, వచ్చిన లాభాలను ప్రస్తావించడం లేదని తెలిపారు. రూ.850 కోట్లు పెట్టుబడి పెట్టినట్లు సీబీఐ పేర్కొనడం నిరాధారమని, పెట్టుబడులకు వచ్చిన లాభాలను కూడా కలిపి ఆ మొత్తాన్ని పెట్టుబడిగా చూపిస్తోందని అన్నారు. సీబీఐ ఆరోపణలకు ఎటువంటి ఆధారాలు లేవని స్పష్టం చేశారు. మంగళవారం కూడా వాదనలు కొనసాగనున్నాయి. -
ఆటలకు అండగా నిలుస్తాం!
►కేరళ బ్లాస్టర్స్ యజమాని నిమ్మగడ్డ ప్రసాద్ ►హైదరాబాద్ ఫుట్‌బాల్ అకాడమీతో ఒప్పందం హైదరాబాద్: క్రీడలను అభిమానించేవారి సహకారం లేకుండా ఏ క్రీడలు కూడా అభివృద్ధి చెందలేవని ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఫుట్‌బాల్ జట్టు కేరళ బ్లాస్టర్స్ సహ యజమాని నిమ్మగడ్డ ప్రసాద్ అన్నారు. ఇదే కారణంతో గత కొంత కాలంగా తాము అన్ని రకాల క్రీడలకు అండగా నిలిచేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. హైదరాబాద్ నగరంలో ప్రతిభ గల చిన్నారులను గుర్తించి వారికి తగిన శిక్షణ ఇచ్చేందుకు ప్రసాద్ ముందుకు వచ్చారు. ఈ క్రమంలో హైదరాబాద్ ఫుట్‌బాల్ అకాడమీ (హెచ్ఎఫ్ఏ)తో బ్లాస్టర్స్ జత కట్టింది. దీని ద్వారా హెచ్‌ఎఫ్‌ఏలో ఇప్పటికే శిక్షణ పొందుతున్న దాదాపు 300 మంది ట్రైనీలకు బ్లాస్టర్స్ యాజమాన్యం సాంకేతిక సహకారం అందిస్తుంది. ‘ఇక్కడ శిక్షణ పొందిన మెరికల్లాంటి ఆటగాళ్లు త్వరలో మా జట్టుతో పాటు భారత జట్టులో చోటు దక్కించుకుంటారని ఆశిస్తున్నాం. కేరళ టీమ్ కోచ్‌లు కూడా ఈ అకాడమీలో అవసరమైన ట్రైనింగ్ అందిస్తారు. గతంలో భారత ఫుట్‌బాల్‌లో అనేక మంది దిగ్గజాలు హైదరాబాద్‌కు చెందినవారే. నాటి వైభవం తిరిగి తీసుకు వచ్చే ప్రయత్నంలోనే ఇక్కడ ఈ కార్యక్రమం మొదలు పెట్టాం’ అని ప్రసాద్ చెప్పారు. హైదరాబాద్‌లో ఫుట్‌బాల్ ఆటకు మరింత గుర్తింపు తెచ్చేందుకు తమ అకాడమీ కృషి చేస్తోందని హెచ్ఎఫ్ఏ ఫౌండర్ మొహమ్మద్ ఆతిఫ్ హైదర్ పేర్కొన్నారు. బుధవారం జరిగిన ఈ కార్యక్రమంలో హెచ్ఎఫ్ఏ ప్రతినిధులు తేజో అనంత్ దాసరి, పవన్ కుమార్ దువ్వా, కోచ్ తంగ్బోయ్, బ్లాస్టర్స్ ఆటగాళ్లు రినో, ప్రశాంత్‌లతో పాటు చాముండేశ్వరీనాథ్ పాల్గొన్నారు. -
విజ్ఞానం పంచే కాన్వెంట్
కొత్త సినిమా గురూ! టీనేజ్ లవ్‌స్టోరీలు, స్కూలు, కాలేజీ వయసు ప్రేమకథలు తెలుగు సినిమాకు కొత్త కాదు. ఆ ప్రేమకు పిల్లలు పెంచుకోవాల్సిన విజ్ఞానాన్నీ, దానితో వచ్చే విజయాన్నీ ముడిపెడితే? అలవాటైన స్కూల్ ఏజ్ లవ్‌స్టోరీలోనే పిల్లలకు పాఠం కూడా నేర్పే అలాంటి ప్రయత్నం - ‘నిర్మలా కాన్వెంట్’. పారిశ్రామిక వేత్త ‘మ్యాట్రిక్స్’ నిమ్మగడ్డ ప్రసాద్‌తో కలసి హీరో నాగార్జున నిర్మించిన ఈ లేటెస్ట్ సినిమా కథ సింపుల్. అనగనగా భూపతిపురం గ్రామం. రాజా గారి 99 ఎకరాలకు నీళ్ళు దళితుడు వీరిగాడి (ఎల్బీ శ్రీరామ్) ఒక ఎకరం చేను మీద నుంచి రావాల్సిందే! రాజా గారిని ధిక్కరించి, వీరిగాడు హతమారి పోతాడు. చచ్చినా ఆ ఎకరం అమ్మవద్దని కొడుకు (సూర్య) దగ్గర మాట తీసుకొని మరీ కన్నుమూస్తాడు. ఆ ఫ్లాష్‌బ్యాక్ కథ ఇప్పటి మూడో తరానికి వచ్చేసరికి, రాజా గారి మనవ రాలు శాంతి (శ్రేయాశర్మ), వీరి గాడి మనుమడూ, బ్రిలియంట్ స్టూడెంట్ శామ్యూల్ (హీరో శ్రీకాంత్ కుమారుడు రోషన్) ప్రేమలో పడతారు. సహజంగానే హీరోయిన్ తండ్రి అడ్డం పడతాడు. కొడుకు ప్రేమ కోసం ఎకరం భూమీ రాసిచ్చేస్తానంటాడు హీరో తండ్రి. అందరూ చెప్పుకొనేంత గొప్పవాడూ, కోటీశ్వరుడూ అయితే అప్పుడు పెళ్ళి సంగతి చూస్తానంటాడు హీరోయిన్ తండ్రి. తల్లితండ్రుల్ని వదిలి, హైదరాబాద్ వచ్చిన హీరో అక్కడ నటుడు నాగార్జునను కలుస్తాడు. ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’లో టాప్ 10 విజేతల్ని తలదన్నే నాలెడ్జ్ తనదనీ, తనకొక్క ఛాన్స్ ఇమ్మంటాడు. ఆ పై హీరో ప్రేమనెలా గెలిచాడన్నది మిగతా సినిమా. రెండున్నర గంటల సినిమాలో ఫస్టాఫ్ అంతా హీరో, అతని నలుగురు స్నేహితుల చుట్టూ తిరిగే కాన్వెంట్ పిల్లల అల్లరి, ప్రేమ. అన్నీ ఊహించదగినట్లే నడిచిపోతుంటాయి. నాగార్జున ఎంటరయ్యే సెకండాఫ్ నుంచి ఆసక్తి పెరుగుతుంది. దీర్ఘకాలంగా సినీరంగ అనుభవమున్న జి. నాగ కోటేశ్వరరావుకు కూడా దర్శకుడిగా ఇదే తొలి సినిమా. ఆయన కుమారుడూ, చిరంజీవి, నాగార్జున సహా పలువురు అగ్రతారల సినీ ప్రచార వ్యూహ నిపు ణుడూ అయిన జి.కె. మోహన్ తెర వెనుక ఉండి ఈ సినిమాను నడిపించి, ‘నాన్నకు ప్రేమతో’ ఇచ్చిన ఈ గిఫ్ట్ గౌరవం పెంచే సెంటిమెంటల్ అంశం. వంద చిత్రాల మైలురాయి దాటేసిన హీరో శ్రీకాంత్ తన కుమారుడు రోషన్‌ను పూర్తిస్థాయి హీరోగా పరిచయం చేసిన తొలి సినిమా ఇది. అందంగా కనిపించే రోషన్ డైలాగ్ డెలివరీ, నటనలోని ఈజ్ చూస్తే, ఎక్కడా ఫస్ట్ ఫిల్మ్ హీరోలా అనిపించడు. నటన, డ్యాన్సుల లాంటివి ఇంకా ఎంత సాధన చేస్తే, భవిష్యత్తులో అంత మంచి హీరోగా, లవ్‌స్టోరీలకు కొత్త కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తాడు. అతనితో పాటు, యాంకర్ సుమ కుమారుడు రోషన్ కనకాల (ఎలక్ట్రీషియన్ కొడుకు పాత్ర), సంగీతం రోషన్ సాలూరి (సంగీత దర్శకుడు కోటి కుమారుడు)తో కలిపి మొత్తం ముగ్గురు రోషన్లు ఈ సినిమాలో ఉన్నారు. కెమేరా విశ్వేశ్వర్, గాయ కుడు ఏ.ఆర్. అమీన్ (రహ్మాన్ కుమారుడు) లాంటి కొత్తవాళ్ళు, ప్రముఖుల వారసులూ ఉన్నారు. నట, సాంకేతిక నైపుణ్యానికి నిర్మాణ విలువలు కలిసి దృశ్యాలు తెరపై రిచ్‌గా కనిపిస్తాయి. నాగార్జున ఈ చిత్రంలో తన నిజజీవిత పాత్రలో కనిపించడమే కాక, చివరలో రోలింగ్ టైటిల్స్‌లో ‘కొత్త కొత్త భాష...’ పాటకి నర్తించారు, ప్రచార చిత్రాల కోసం పాడారు! చాలా ఏళ్ళ క్రితమే ‘సీతారామరాజు’లో సిగరెట్ పాట పాడిన నాగార్జునను సింగర్‌గా ఇదే ‘తొలి పరిచయం’ అని టైటిల్స్ ప్రస్తావిస్తాయి. కథాగమనం ఎలా ఉంటుందో ముందో పసిగట్టేలా ఉన్నా, ఈ సినిమాలో చాలా సన్నివేశాల్లో రివాల్వర్ ఎవరు కనిపెట్టారు, ‘హలో’ పదం పుట్టుక - ఇలా ప్రపంచ విజ్ఞాన గుళికలు చాలా వస్తాయి. ఆ రకంగా ఇది పేరులో ఉన్నట్లే, ప్రతి ఒక్కరికీ పాఠాలు నేర్పే ‘కాన్వెంట్’. బలమైన పాత్రలు, సెంటిమెంట్లు, సందర్భాలు అల్లుకొంటే బాగుండేదనిపించినా, కొత్త దర్శకుడు, కొత్త నటీనటులు, కొత్త సాంకేతిక నిపుణులతో ఇంత ‘రిచ్’ ప్రయత్నం చేసినందుకు అభినందించాలి. క్లైమాక్స్ ఘట్టాల్లో పోలికలు చూశాక, ‘అబ్బ....ఛ’ అనుకోకపోతే, తెలుగు తెర ‘స్లమ్ డాగ్ మిలియనీర్’. వెండితెరపై... రెండున్నర గంటల బుల్లితెర ‘మీలో ఎవరు కోటీశ్వరుడు!’ - రెంటాల జయదేవ -
ఆనందంతో కన్నీళ్లొచ్చాయి : ఊహాశ్రీకాంత్
‘‘రోషన్‌ను క్రికెటర్ చేద్దామనుకుని ఐదో తరగతి నుంచే శిక్షణ ఇప్పించా. బాగా ఆడేవాడు. రాష్ట్రస్థాయికి ఎంపికయ్యే టైమ్‌లో ‘రుద్రమదేవి’ చిత్రానికి అవకాశం వచ్చింది. ఆ చిత్రం తర్వాత నటనపై తనకు పూర్తి స్థాయిలో ఇంట్రెస్ట్ కలిగింది. అప్పుడు వచ్చిన అవకాశమే ‘నిర్మలా కాన్వెంట్’ అని హీరో శ్రీకాంత్ అన్నారు. ఆయన తనయుడు రోషన్ హీరోగా జి.నాగకోటేశ్వర రావు దర్శకత్వంలో నాగార్జున సమర్పణలో అన్నపూర్ణ స్టూడియో, మ్యాట్రిక్స్ టీమ్ వర్క్స్ పతాకాలపై నిమ్మగడ్డ ప్రసాద్ నిర్మించిన ‘నిర్మలా కాన్వెంట్’ ఈ శుక్రవారం విడుదలవుతోంది. ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ- ‘‘నా మొదటి చిత్రం ‘పీపుల్స్ ఎన్కౌంటర్’ టైమ్‌లో నాకు ఎటువంటి సినిమా బ్యాక్‌గ్రౌండ్ లేదు. అందుకే ఏ పాత్ర వస్తే అది చేశాను. కానీ, రోషన్‌కు మా బ్యాక్‌గ్రౌండ్ ఉంది. ఎదిగే కొద్ది ఒదిగి ఉండమని నేను, ఊహా రోషన్‌కు చెప్పాం. తను అది పాటిస్తున్నందుకు హ్యాపీగా ఉంది. ఆడియో వేడుకలో రోషన్ స్టేజ్‌పై మాట్లాడిన మాటలకు నా కళ్లల్లో ఆనందభాష్పాలొచ్చాయి. ఈ చిత్రం విడుదలయ్యాక రెండేళ్లు గ్యాప్ తీసుకుని, డ్యాన్స్, ఫైట్స్, నటనలో రోషన్‌కి ఇంకా ట్రైనింగ్ ఇప్పించి, రీ-లాంచ్ చేస్తాం’’ అని తెలిపారు. ‘‘రోషన్ ఎలా నటిస్తున్నాడో చూడ్డానికి సెట్స్‌కి వెళ్లలేదు. నాగార్జునగారితో సీన్స్ చేసేటప్పుడు కొంచెం టెన్షన్‌గా ఉందని రోషన్ చెబితే సలహాలు ఇచ్చా. తనని తొలిసారి తెరపై చూసినప్పుడు ఓ తల్లిగా నా కళ్లల్లో నీళ్లొచ్చాయి’’ అని ఊహా చెప్పారు. రోషన్ మాట్లాడుతూ- ‘‘ఎనిమిదో తరగతి చదువుతున్నప్పుడు ‘రుద్రమదేవి’లో నటించే అవకాశం వచ్చింది. టీవీలో, సినిమాలో కనిపించొచ్చు కదా అని ఓకే చెప్పేశా. ఆ తర్వాత క్రికెట్‌పై ఇష్టం పోయి సినిమాలపై పెరిగింది. నటనలో అమ్మ, నాన్నలే నా ఇన్స్పిరేషన్. వారి సలహాలతో ‘నిర్మలా కాన్వెంట్’చిత్రంలో ఎమోషన్ సీన్స్‌లో బాగా నటించా’’ అని చెప్పారు. -
ఇది మా స్నేహంలో కొత్త అడుగు
చిత్ర పరిశ్రమలో కొత్తవారిని ఎంకరేజ్ చేయడానికి ముందుంటారు నాగార్జున. పలు రంగాల్లో కొత్తవారిని ప్రోత్సహిస్తున్న పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్. ఇద్దరూ మంచి స్నేహితులు. వ్యాపారాల్లో భాగస్వాములు. వీరిద్దరూ కలసి నిర్మించిన సినిమా ‘నిర్మలా కాన్వెంట్’. ఈ 16న రిలీజ్ కానున్న ఈ చిత్రంలో హీరోగా శ్రీకాంత్ తనయుడు రోషన్, దర్శకుడిగా జి.నాగకోటేశ్వరరావు, సంగీత దర్శకుడిగా కోటి తనయుడు రోషన్ సాలూరి సహా పలువురు పరిచయమవుతున్నారు. నాగ్, నిమ్మగడ్డ ప్రసాద్ పంచుకున్న విశేషాలు... అమల మెచ్చుకుంది - నాగార్జున ఏడాది క్రితం కాన్సెప్ట్ ఫిల్మ్స్ వాళ్లు ఈ కథను నాకూ, ప్రసాద్‌గారికి వినిపించారు. ఎప్పట్నుంచో ప్రసాద్ గారికి సినిమా నిర్మాణం మీద ఆసక్తి. ‘నాగ్.. మనం కలసి ఓ సినిమా తీద్దాం’ అనేవారు. ఆయన వ్యాపారంలోకి నేను ఎంటరయ్యా. ఇప్పుడు నా వ్యాపారంలోకి ఆయన్ను తీసుకొచ్చాను. వినూత్న ఆలోచనలతో ఏదైనా చేయడమంటే ప్రసాద్‌గారికి ఇష్టం. నాకూ కొత్తదనం అంటే ఇష్టం. ఇద్దరి మనస్తత్వాలు బాగా కలిశాయి. ఆ విధంగా మా స్నేహంలో ఈ కొత్త ప్రయాణం ప్రారంభమైంది. ప్రసాద్‌గారు బాగా సినిమాలు చూస్తారు. మాకు అందమైన కొత్త ఎక్స్పీరియన్స్ ఇది. ప్రసాద్‌గారి దగ్గర డబ్బులకు సమస్య లేదు. నాతో కలవాల్సిన అవసరం లేదు. మాది డబ్బుతో ముడిపడిన బంధం కాదు. ఇద్దరం కలసి ఐడియాలు డిస్కస్ చేసుకోవడం, కలసి ప్రయాణించడం చక్కటి అనుభూతి. ఆడియో వేడుకలో హీరో రోషన్ మాట్లాడిన తీరు చూసి ముచ్చటేసింది. చిన్న వయసు లోనే అంత ఎమోషనల్‌గా, మెచ్యూర్డ్‌గా మాట్లాడడం మామూలు కాదు. శ్రీకాంత్, ఊహ కళ్లల్లో నీళ్లు తిరుగుతుంటే నా కళ్లలో నీళ్లు వచ్చేశాయి. సినిమాలో బాగా చేశాడు. ఇప్పటివరకూ ఆల్మోస్ట్ హీరోగానే చేశాను. ఈ సినిమాలో మాత్రం నేను హీరో కాదు. వెరీ ఇంపార్టెంట్ సపోర్టింగ్ రోల్ చేశా. (నవ్వుతూ..) ఈ ఏడాది బెస్ట్ సపోర్టింగ్ రోల్ అవార్డు వస్తుందని ఆశిస్తున్నాను. ఇతర సినిమాల్లో మంచి కథలు, పాత్రలు వస్తే తప్పకుండా సపోర్టింగ్ రోల్స్ చేస్తా. నేను పాడిన పాట సినిమాలో ఉండదు. ఏఆర్ రెహమాన్ తనయుడు అమీన్ పాడిన పాట ఉంటుంది. ‘ఇంత బాగా పాడతావ్ అనుకోలేదు’ అని అమల మెచ్చుకుంది. నాకు ప్రేమకథలంటే ఇష్టం. నా సినిమాల్లో ఎక్కువ ప్రేమకథలే. ఏ మనిషైనా ఎప్పు డైనా ప్రేమ అనేది టచ్ చేయక పోతే అతను మనిషే కాదు. ఇది కూడా మంచి ప్రేమకథ. ఈ సినిమాలో కైలాష్ ఖేర్ ‘ముందు నుయ్యి’ అనే పాట పాడారు. కథ విన్నాక ‘పాతాళ భైరవి’లో లాంటి పాట ఉంటే బాగుంటుం దని ప్రసాద్‌గారే సలహా ఇచ్చారు. మరిన్ని సిన్మాలు తీస్తా - నిమ్మగడ్డ ప్రసాద్ నేనూ, నాగార్జున ముందు స్నేహితులం. ఆ తర్వాత వ్యాపారంలో భాగస్యాములయ్యాం. కొత్తవాళ్లతో సినిమా తీయాలని ఇద్దరికీ ఆసక్తి ఉంది. అక్కినేని కుటుంబం, అన్నపూర్ణ స్టూడియోస్‌తో నాకు వ్యక్తిగతంగా చాలా అటాచ్మెంట్. నాకు ఏయన్నార్‌గారితో మెమరబుల్ మూమెంట్స్ ఉన్నాయి. ఆ అటాచ్‌మెంట్‌తో నాగ్, నేనూ ఎప్పుడూ సినిమా ప్రొడక్షన్ గురించి అనుకునేవాళ్లం. నిర్మాతగా మారడానికి అంతకు మించి ప్రత్యేక కారణాలేమీ లేవు. నాగ్ చెప్పినట్లు మా స్నేహంలో కొత్త ప్రయాణం ఇది. ఎవరో మనకు తెలియని హీరోలను మనం చూడాల్సిన అవసరం లేదు. స్నేహితుల్లో, సమాజంలోనో ఎక్కడో మన ముందే హీరోలు ఉంటారు. మ్యాట్రిక్స్ కంపెనీ టేకోవర్ చేసినప్పుడు ఓ ‘ఆర్ అండ్ డీ’ సీనియర్ని ఇంటర్వ్యూ చేశాను. ఐదేళ్ల జీతం డిపాజిట్ చేయమని అడిగాడు. అంత డబ్బులుంటే ఎందుకు సిక్ కంపెనీ కొంటాను. ‘యంగ్‌స్టర్స్‌కి ఎందుకు చాన్స్ ఇవ్వకూడదు’ అని ఆ రోజు అనిపించింది. హెచ్ఆర్ని పిలిచి ఈ వయసులో సైంటిస్ట్‌లు కావాలని చెప్పా. ఓ బిలియన్కి మ్యాట్రిక్స్ అమ్మినప్పుడు ఎంప్లాయిస్ ఏవరేజ్ ఏజ్ 28 ఏళ్లు మాత్రమే. యంగ్‌స్టర్స్‌కి చాన్స్ ఇవ్వడం మొదట్నుంచీ ఉంది. సింగర్‌గా నాగ్ సహా 10 మంది కొత్తవాళ్లు దీంతో పరిచయమవు తున్నారు. ఇది స్వచ్ఛమైన ప్రేమకథ. నాకు సంగీతమంటే ప్రాణం. ఈ పాటలు నా మనసుకు హత్తుకున్నాయి. నాగార్జున ఇంత బాగా పాడతారని అనుకోలేదు. రాజీవ్ కనకాల, సుమల కుమారుడు రోషన్ కూడా ఈ సినిమాతో పరిచయం అవుతున్నాడు. హీరో రోషన్ ఆడియో ఫంక్షన్లో మాట్లాడిన తీరు న్యాచురల్‌గా అనిపించింది. మా అబ్బాయి మాట్లాడుతున్నట్టు అనిపించింది. చిన్నప్పుడు ఓ మొక్క నాటేటప్పుడు.. ‘నేను మరణించినా చెట్టు నీడలో చాలామంది బతుకుతారు’ అని తాతయ్య చెప్పారు. ఫిల్మ్ ఇండస్ట్రీ మీద హైదరాబాద్‌లో 3 లక్షల మంది బతుకుతున్నారు. కొత్తవాళ్లకి ఛాన్స్‌లిస్తే ఎంతోమంది పైకి వస్తారు. ఫ్యూచర్లో తప్పకుండా సినిమాలు నిర్మిస్తాను. -
ఈ వెలుగుల వెనుక ఓ ‘శక్తి’
సింధు పతకం గెలవగానే ఎవరికి వాళ్లు ‘మా వల్లే మా వల్లే’ అంటూ లేని గొప్పతనాన్ని తమకు ఆపాదించుకుంటున్నా... హైదరాబాద్ బ్యాడ్మింటన్ హబ్‌గా మారడం వెనక గోపీచంద్ ఆలోచనతో పాటు ఓ బలమైన ‘శక్తి’ సహకారం ఉంది. కేవలం స్నేహం కోసం ఆ రోజుల్లోనే ఐదు కోట్ల రూపాయలు ఇచ్చిన ఆ శక్తి పేరు నిమ్మగడ్డ ప్రసాద్. ఆ రోజుల్లో ఆయన ఇచ్చిన ఆర్థిక సహకారం వల్లే ఈ రోజు బ్యాడ్మింటన్ ఈ స్థాయిలో నిలబడగలిగిందంటే అతిశయోక్తి కాదు. * స్నేహం కోసం అకాడమీకి డబ్బు ఇచ్చిన నిమ్మగడ్డ ప్రసాద్ * 2003లోనే ఐదు కోట్ల రూపాయలు సహాయం సాక్షి క్రీడావిభాగం: గోపీచంద్ దగ్గర స్థలం ఉంది... అకాడమీ ఎలా నిర్మించాలనే ఆలోచన ఉంది... ప్రపంచస్థాయి వసతులతో మంచి అకాడమీ నిర్మిస్తేనే గొప్ప ఫలితాలు వస్తాయి... కానీ చేతిలో డబ్బు లేదు... తన అకాడమీ కల సాకారం కావాలంటే కనీసం నాలుగు కోట్ల రూపాయలు కావాలి... ఎలా..? 2003లో గోపీచంద్ అకాడమీ నిర్మాణానికి పూనుకున్న సమయంలో ఉన్న పరిస్థితి ఇది. ప్రభుత్వం స్థలం అయితే ఇచ్చిందిగానీ అకాడమీ నిర్మాణానికి డబ్బు మాత్రం ఇవ్వదు. ఈ సమయంలో ఒక కార్పొరేట్ సంస్థను కలిసి ఆయన తన ప్రయత్నాన్ని వెల్లడించారు. ఒకసారి తేరిపార చూసిన ఆయన... ‘మన దేశంలో బ్యాడ్మింటన్‌ను ఎవరు పట్టించుకుంటారండీ’ అంటూ ఒక వ్యంగ్య విమర్శ చేశాడు. ఇలాంటి సమయంలో ప్రసాద్‌ను కలిసి గోపి అకాడమీ గురించి వివరించి, నాలుగు కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పాడు. అప్పటికే వ్యాపారంగంలో బాగా ఎదిగిన ప్రసాద్... ఏ మాత్రం ఆలోచించకుండా సహాయం చేశారు. రెండు కోట్ల రూపాయలు డొనేషన్‌గా ఇచ్చారు. మరో రెండు కోట్లు ఇస్తామని చెప్పిన వేరేవాళ్లు ఎంతకీ ఇవ్వలేదు. దీంతో మిగిలిన రెండు కోట్లు కూడా ప్రసాద్ ఇచ్చేశారు. అకాడమీ పూర్తయినా నిర్వహణకు డబ్బులు లేక మళ్లీ కష్టాలు ఎదురయ్యాయి. ఈ సమయంలో ప్రసాద్ మరో కోటి రూపాయలు ఇచ్చేశారు. దీంతో అకాడమీ సాఫీగా నడిచింది. అందుకే గోపీ ఈ అకాడమీకి ‘నిమ్మగడ్డ ఫౌండేషన్ గోపీచంద్ అకాడమీ’ అని పేరు పెట్టాడు. ఎంత డబ్బున్నా ఐదు కోట్ల రూపాయలు ఊరికే ఇవ్వడం అంటే చాలామందికి మనసు రాదు. నిజానికి 13 సంవత్సరాల క్రితం ఇది చాలా పెద్ద మొత్తం. మరి ప్రసాద్ ఎందుకు ఇచ్చారు..? దీనికి సమాధానం స్నేహం. గోపీ బ్యాడ్మింటన్ స్టార్ కాకముందే ప్రసాద్, గోపీ తండ్రి స్నేహితులు. ఎల్బీ స్టేడియంకు సమీపంలోని ఒక ఇంట్లో పక్క పక్క పోర్షన్లలో ఉండేవారు. సహజంగానే మధ్య తరగతి కుటుంబాల్లో పెరిగే స్నేహం... పక్కపక్కన ఉన్న ఈ ఇద్దరి కుటుంబాలకూ పెరిగింది. ఆ తర్వాత ఉద్యోగ బాధ్యతల దృష్యా గోపీ తండ్రి నిజామాబాద్ వెళ్లిపోయారు. ఇటు ప్రసాద్ మ్యాట్రిక్స్ లేబోరేటరీస్ ద్వారా ఉన్నతస్థితికి వెళ్లారు. ఎంత ఎదిగినా ఆ కుటుంబాల మధ్య స్నేహం మాత్రం అలాగే కొనసాగింది. ఆటలపై మొదటి నుంచి ఆసక్తి చూపే ప్రసాద్... గోపీ అకాడమీ ప్రతిపాదనతో రాగానే వెంటనే సహాయం చేశారు. గత పుష్కర కాలంలో నగరంలో బ్యాడ్మింటన్ బాగా అభివృద్ధి చెందింది. క్రమంగా గోపీచంద్ అకాడమీ అనే పేరుతోనే అందరూ గుర్తుంచుకున్నారు. కానీ ఇప్పటికీ, ఎప్పటికీ ఆ అకాడమీ పేరు ‘నిమ్మగడ్డ ఫౌండేషన్ గోపీచంద్ అకాడమీ’. ప్రపంచస్థాయి అకాడమీ నిర్మిస్తానని గోపీ వచ్చినప్పుడు చాలా సంతోషం వేసింది. మళ్లీ నాకు డబ్బు తిరిగి ఇవ్వొద్దు. ఒక ఒలింపిక్ పతకం తెచ్చి చూపించండి అని అడిగాను. కచ్చితంగా తెస్తానని మాట ఇచ్చాడు. 2012లోనే సైనా రూపంలో గోపీ పతకం తెచ్చాడు. ఇప్పుడు సింధు రజతం తెచ్చేసింది. నాకు ఇచ్చిన మాట నిలుపుకున్నాడు. భారత్‌కు ఒలింపిక్ పతకం మన అకాడమీ నుంచి రావడం గర్వకారణం’ - నిమ్మగడ్డ ప్రసాద్ ఆటల పట్ల ఆసక్తి క్రీడల పట్ల ఆసక్తి ఉన్నా గతంలో ప్రసాద్ ఎప్పుడూ ఆటలకు సంబంధించిన వ్యాపారంలోకి రాలేదు. ఏ రంగంలో అడుగుపెట్టినా విజయం సాధించే వ్యక్తిగా వ్యాపార వర్గాల్లో పేరున్న ప్రసాద్... ఇప్పుడు ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఫుట్‌బాల్ ద్వారా ఇందులోకి వచ్చేశారు. సచిన్ టెండూల్కర్ యజమానిగా ఉన్న కేరళ బ్లాస్టర్స్ జట్టులో ప్రసాద్, చిరంజీవి, నాగార్జున, అల్లు అరవింద్ కలిసి వాటాలు కొన్నారు. భవిష్యత్తులోనూ క్రీడల్లో మరింతగా భాగం కావాలని ఆయన భావిస్తున్నారు. ‘నా చిన్నతనంలో నేను క్రికెట్ ఆడుకోవడానికి వెళితే మా నాన్న బ్యాట్ విరగ్గొట్టి చదువుకోమన్నారు. అప్పటితరంలో చదువుకే ప్రాధాన్యత. కానీ ఇప్పుడు ప్రాధాన్యతలు మారాయి. స్పోర్ట్స్ కూడా ప్రొఫెషనల్‌గా మారాయి. ఒక ఇంట్లో ఒక్కరికి ఉద్యోగం వస్తే ఆ చుట్టూ ఉన్న పది ఇళ్లలో పిల్లలు కూడా అదే మార్గంలో వచ్చి ఉద్యోగాలు వెతుక్కుంటారు. ఇప్పుడు సింధు విజయం సాధించిన తర్వాత మరింత మంది బ్యాడ్మింటన్‌లోకి వస్తారు’ అని ప్రసాద్ అన్నారు. -
‘థింక్ పై’లో నిమ్మగడ్డ ప్రసాద్ పెట్టుబడులు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వ్యాపారవేత్త నిమ్మగడ్డ ప్రసాద్ తాజాగా పర్యావరణ అనుకూల టెక్నాలజీ స్టార్టప్ సంస్థ ‘థింక్ పై’లో ఇన్వెస్ట్ చేశారు. అయితే, ఎంత మొత్తం పెట్టుబడి పెట్టినదీ వెల్లడి కాలేదు. ఏంజెల్ ఫండింగ్ రూపంలో లభించిన నిధులను కార్యకలాపాల విస్తరణకు వినియోగించుకోనున్నట్లు ‘థింక్ పై’ తెలిపింది. గోద్రెజ్ ఇంటీరియో, రుస్తుమ్జీ తదితర క్లయింట్లకు ఇప్పటికే కొన్ని ఉత్పత్తులు విక్రయించినట్లు వివరించింది. ప్రసాద్ గతంలో మ్యాట్రిక్స్ ల్యాబరేటరీస్, మా టీవీ తదితర సంస్థల్లో ఇన్వెస్ట్ చేశారు. -
సచిన్, చిరు, నాగ్.. ఇక బిజినెస్ పార్ట్నర్లు
హైదరాబాద్: భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, తెలుగు సినీ దిగ్గజాలు చిరంజీవి, నాగార్జునతో పాటు ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్, ప్రముఖ వ్యాపారవేత్త నిమ్మగడ్డ ప్రసాద్ ఇప్పుడు వ్యాపార భాగస్వాములయ్యారు. కేరళ బ్లాస్టర్స్ పేరుతో ఫుట్‌బాల్ జట్టును కొనుగోలు చేశారు. గతంలో చిరంజీవి కుటుంబ సభ్యులు, నాగార్జున, నిమ్మగడ్డ ప్రసాద్ భాగస్వాములుగా ఉన్నారు. వీరు ఓ తెలుగు టీవీ చానెల్‌ను నిర్వహించారు. ఇప్పుడు తెలుగు సినీ ప్రముఖులతో సచిన్ వ్యాపార భాగస్వామి అయ్యాడు. సచిన్ టెండూల్కర్, అంజలి దంపతులతో పాటు చిరంజీవి, నాగార్జున, అల్లు అరవింద్, నిమ్మగడ్డ ప్రసాద్ ప్రత్యేక విమానంలో రేణిగుంటకు వెళ్లి అక్కడి నుంచి తిరుమలకు వెళ్లిన సంగతి తెలిసిందే. బుధవారం ఉదయం వారు శ్రీవారిని సందర్శించుకున్నారు. కొత్త వ్యాపారం ప్రారంభిస్తున్న నేపథ్యంలో స్వామి వారి ఆశీస్సులు తీసుకున్నట్టు సమాచారం. -
తిరుమలకు సచిన్, నాగార్జున, చిరంజీవి
తిరుమల: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుడి దర్శనం కోసం మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్, భార్య అంజలి టెండుల్కర్ తిరుమల చేరుకున్నారు. అలాగే మెగాస్టార్ చిరంజీవి, హీరో నాగార్జున, అల్లు అరవింద్, నిమ్మగడ్డ ప్రసాద్, నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ తదితరులు ప్రత్యేక విమానంలో మంగళవారం సాయంత్రం రేణిగుంట విమానాశ్రయం చేరుకున్నారు. అక్కడ నుంచి సచిన్, తన భార్యతో కలిసి కారులో ముందుగా తిరుమల బయల్దేరి వెళ్లారు. అనంతరం హీరో నాగార్జున, ఇతరులు మరో వాహనంలో వెళ్లారు. బుధవారం వేకువజామున వీరంతా వీఐపీ బ్రేక్ దర్శనంలో స్వామివారిని దర్శించుకోనున్నారు. కాగా నాగార్జున గడ్డం పెంచి కొత్త లుక్‌లో కనిపించారు. -
నిమ్మగడ్డ, బ్రహ్మానందరెడ్డిలకు ఊరట
సాక్షి, హైదరాబాద్: జగన్ కంపెనీల్లో పెట్టుబడుల వ్యవహారంలో పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్‌కు హైకోర్టు ఊరటనిచ్చింది. సీబీఐ కోర్టులో జరుగుతున్న విచారణకు వ్యక్తిగత హాజరు నుంచి ఆయనకు మినహాయింపునిచ్చింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ రాజా ఇలంగో గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. వాన్‌పిక్ ప్రాజెక్టు, ఇందూటెక్ భూముల వ్యవహారంలో సీబీఐ నమోదు చేసిన కేసుల్లో నిమ్మగడ్డ నిందితునిగా ఉన్నారు. ఈ కేసుల్లో సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం జరుపుతున్న విచారణకు ప్రతి శుక్రవారం కోర్టు ముందు ఆయన హాజరు కావాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరుతూ నిమ్మగడ్డ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన హైకోర్టు.. వ్యక్తిగత విచారణ నుంచి ఆయనకు మినహాయింపునిస్తూ మధ్యం తర ఉత్తర్వులు ఇచ్చింది. పిటిషనర్ తరఫున న్యాయవాది ప్రభాకర్ శ్రీపాద వాదనలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. బ్రహ్మానందరెడ్డికి సైతం... జగన్ కంపెనీల్లో పెట్టుబడుల వ్యవహారంలో వాన్‌పిక్ ప్రాజెక్టుకు సంబంధించిన కేసులో నిందితునిగా ఉన్న ఐఆర్ఎస్ అధికారి బ్రహ్మానందరెడ్డికి సైతం హైకోర్టు ఊరటనిచ్చింది. సీబీఐ ప్రత్యేక కోర్టులో జరుగుతున్న విచారణకు వ్యక్తిగత హాజరు నుంచి ఆయనకు మినహాయింపునిచ్చింది. అలాగే ఈ కేసు నుంచి తనను డిశ్చార్జ్ చేయాలంటూ ఆయన దాఖలు చేసుకున్న పిటిషన్‌ను మూడు నెలల్లోపు పరిష్కరించాలని సీబీఐ కోర్టును ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ రాజా ఇలంగో ఉత్తర్వులు జారీ చేశారు. వాన్‌పిక్ పోర్ట్స్‌తో అవగాహన ఒప్పందం విషయంలో ప్రైవేటు వ్యక్తులకు లబ్ధి చేకూర్చేలా వ్యవహరించారని తనపై సీబీఐ నమోదు చేసిన కేసు కొట్టేయాలని, అలాగే వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపునిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని బ్రహ్మానందరెడ్డి దాఖలు చేసిన పిటిషన్ గురువారం హైకోర్టులో విచారణకు వచ్చింది. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది వినోద్‌కుమార్ దేశ్‌పాండే వాదనలు వినిపిస్తూ, వాన్‌పిక్ పోర్ట్స్ వ్యవహారంలో పిటిషనర్ సొంత నిర్ణయాలేవీ లేవని, మంత్రి మండలి నిర్ణయాలను మౌలిక వసతుల ప్రత్యేక కార్యదర్శిగా అమలు చేశారని వివరించారు. ఈ మొత్తం వ్యవహారంలో పిటిషనర్ వ్యక్తిగతంగా లబ్ధి పొందినట్లు సీబీఐ ఎక్కడా చెప్పలేదని, ఈ కేసు నుంచి తప్పించాలని కోరుతూ పిటిషనర్ సీబీఐ ప్రత్యేక కోర్టులో దాఖలు చేసిన డిశ్చార్జ్ పిటిషన్‌పై తీవ్రజాప్యం జరుగుతోందని వివరించారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. వ్యక్తిగత హాజరు నుంచి బ్రహ్మానందరెడ్డికి మినహాయింపునిచ్చారు. డిశ్చార్జ్ పిటిషన్‌ను మూణ్నెల్లలో పరిష్కరించాలని సీబీఐ కోర్టును ఆదేశించారు. సీబీఐకి నోటీసు కౌంటర్ దాఖలు చేయాలన్నారు. -
జోగులాంబ సేవలో నిమ్మగడ్డ ప్రసాద్
ఆలంపూర్ (మహబూబ్‌నగర్) : ప్రముఖ పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్ మహబూబ్‌నగర్ జిల్లా ఆలంపూర్లోని జోగులాంబ ఆలయంలో పూజలు చేశారు. కుటుంబసభ్యులతో కలసి గురువారం ఉదయం ఆలయానికి చేరుకున్న ఆయనకు అర్చకులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం వారు జోగులాంబకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. -
'మా' బ్రాండ్ 'స్టార్'గా మారుతోంది...
-
'మా' బ్రాండ్ 'స్టార్'గా మారుతోంది...
హైదరాబాద్ : తెలుగు ఎంటర్టైన్మెంట్ మార్కెట్లోకి స్టార్ ఇండియా గ్రూప్ ఎంటరైంది. మా టీవీకి, స్టార్ గ్రూప్ సంస్థ మధ్య వ్యాపార ఒప్పందం కుదిరింది. స్టార్ ఇండియా ఆపరేషన్స్‌లో మాటీవీ భాగం కానుంది.కొన్ని వాటాలను మాటీవీ...స్టార్ గ్రూప్‌కు విక్రయించింది. మాటీవీ మేనేజ్మెంట్ బుధవారం మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా మాటీవీతో ఒప్పంద వివరాలను సీఈవో నిమ్మగడ్డ ప్రసాద్ వివరించారు. ఈ కార్యక్రమంలో మాటీవీ భాగస్వాములు హీరోలు అక్కినేని నాగార్జున, చిరంజీవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్టార్ ప్రతినిధి ఉదయ్ శంకర్ మాట్లాడుతూ ఇప్పటివరకూ తమకు తెలుగులో ప్రసారాలు లేవని, మాటీవీతో టైఅప్‌తో ఆ లోటు తీరిందన్నారు. అయితే బ్రాడ్కాస్ట్ బిజినెస్‌లో భాగస్వాములం మాత్రమేనని స్టార్ ప్రతినిధులు తెలిపారు. కంపెనీ యాజమాన్యం కొనసాగుతుందని, ప్రమోటర్లు వాళ్లే ఉంటారని పేర్కొన్నారు. ఇక నుంచి మా బ్రాండ్...స్టార్‌గా మారుతుందన్నారు. రెగ్యులేటర్ అనుమతులు రాగానే అమల్లోకి వస్తుందన్నారు. తెలుగు ప్రేక్షకులకు అత్యుత్తమ కార్యక్రమాలు అందించేందుకు ప్రయత్నిస్తామని తెలిపారు. -
ఆస్తుల అటాచ్మెంట్ కేసు 23కి వాయిదా
సాక్షి, న్యూఢిల్లీ: వాన్‌పిక్ ప్రమోటర్ నిమ్మగడ్డ ప్రసాద్, జగతి పబ్లికేషన్స్ లిమిటెడ్ ఆస్తుల అటాచ్మెంట్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ న్యాయప్రాధికార సంస్థ విచారణను ఈ నెల 23కి వాయిదా వేసింది. వాన్‌పిక్ ప్రమోటర్లు వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం నుంచి లబ్ధి పొంది ఆయన కుమారుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి కంపెనీలకు పెట్టుబడుల రూపంలో అక్రమంగా నిధులు సమకూర్చారని ఆరోపిస్తూ ఎన్ఫోర్స్మెంట్ డెరైక్టరేట్(ఈడీ) నిమ్మగడ్డ ప్రసాద్ ఆస్తులను, జగతి పబ్లికేషన్స్ ఆస్తులను అటాచ్ చేయడం విదితమే. ఈ కేసులో గురువారం ఈడీ తన వాదనలు వినిపించింది. కాగా న్యాయాధికారి ఈ విచారణను ఈ నెల 23వ తేదీకి వాయిదా వేశారు. -
అమితాబ్ బాటలో... బుల్లితెరపై నాగ్
ప్రముఖ నటుడు నాగార్జున బుల్లితెరపై మెరవనున్నారు. 28 ఏళ్ల సినీ ప్రస్థానం తర్వాత ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ గేమ్ షో ద్వారా డ్రాయింగ్ రూమ్‌లో వీక్షకులను పలకరించనున్నారు. జూన్ మొదటివారం నుంచి ‘మా’ టీవీలో ఈ కార్యక్రమం ప్రసారం కానుంది. హిందీతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, మరాఠీ, భోజ్‌పురి భాషల్లో ఇప్పటికే విజయవంతమైన ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ ఫార్ములాతోనే ఈ గేమ్ షో రూపొందుతోంది. రూపొందుతోంది. ఇప్పటి వరకు తెలుగు చానల్స్‌లో వచ్చిన గేమ్ షోలకు భిన్నంగా, ప్రయోజనాత్మకంగా ఈ ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ను నిర్మిస్తున్నట్లు ‘మా’ టీవీ యాజమాన్యం నిమ్మగడ్డ ప్రసాద్, అల్లు అరవింద్ పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ఈ షో పరిచయ కార్యక్రమంలో ‘మా’ టి.వి. చైర్మన్ నిమ్మగడ్డ ప్రసాద్ మాట్లాడుతూ, ‘‘సమాజంలో, ముఖ్యంగా గత నాలుగైదేళ్ళలో చాలా బాధలు పడ్డాం. ప్రతికూల భావనలు ఎక్కువయ్యాయి. ఈ పరిస్థితుల్లో మానవీయంగా ఉంటూ, మారుమూల ప్రాంతపు మనిషి కూడా జీవితంలో గెలుపు సాధించి, మరెంతో మందికి ప్రేరణనివ్వడం కోసమే ఈ ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ చేపట్టాం’’ అని పేర్కొన్నారు. ఈ గేమ్ షోకు నాగార్జునను హోస్ట్‌గా ఎంచుకోవడంపై ఆయన వివరణనిస్తూ, ‘‘చాలా ఏళ్ళుగా నాగ్ నాకు స్నేహితుడు, సన్నిహితుడు. అయితే, ఈ షోకు దాదాపు 37 - 38 మంది స్టార్లను అనుకున్నా, చివరకు నాగార్జునే సరైన వ్యక్తి అని నిర్ధారణకు వచ్చాం. ఆ రకంగా ఆ వడపోతలన్నీ దాటుకొని నాగార్జున ఈ హోస్ట్ హోదాను తనకు తాను సంపాదించుకున్నారే తప్ప మాకు మేము ఇచ్చింది కాదు’’ అని చెప్పారు. ‘ఆరేళ్ళ క్రితం ‘మా’ టి.వి.ని చేపట్టిన మేము ఓ సవాలుగా తీసుకొని, ఈ ‘మట్టిలోని మాణిక్యాన్ని’ సానబెట్టి, అందమైన రత్నంగా తీర్చిదిద్దాం. ఇవాళ తెలుగులోని సర్వజన వినోదాత్మక టీవీ చానళ్ళ (జి.ఇ.సి)లలో నంబర్ వన్ స్థానానికి తీసుకురాగలిగాం. దీనికి మా సంస్థలో పని చేసిన, చేస్తున్న ఉద్యోగుల కృషే కారణం’’ అని ఆయన వ్యాఖ్యానించారు. ‘‘కొద్ది నెలలుగా ప్రథమస్థానంలో నిలిచిన ‘మా’ చానల్‌ను ఆ స్థానంలో సుస్థిరంగా నిలబెట్టేందుకు చేస్తున్న విశిష్టమైన కార్యక్రమమే ఈ తాజా గేమ్ షో. ఈ ఆరేళ్ళలో ‘మా’ టి.వి. నిర్వహణలో నేర్చుకున్న మేనేజ్మెంట్ పాఠాలను అవ్యవస్థీకృతంగా ఉన్న మన సినీ రంగంలో కూడా అమలు చేయాలని భావిస్తున్నాను’’ అని ‘మా’ టి.వి. బోర్డు డెరైక్టర్లలో ఒకరైన నిర్మాత అల్లు అరవింద్ చెప్పారు. నాగార్జున మాట్లాడుతూ -‘‘ఇంతకాలం సినిమాలతో మిమ్మల్ని అలరించిన నేను బుల్లితెరవైపు ఎందుకు దృష్టిసారించాను? అనే ప్రశ్న మీ అందరికీ కలగొచ్చు. సామాన్యులతో సహా ప్రతి ఒక్కరికీ కలలుంటాయి. వాటిని నిజం చేసుకోవాలని ఉంటుంది. దాన్ని నెరవేర్చడానికే నేను ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా మారాను. అయితే... ఈ భారాన్ని మోయడం అంత తేలికైన విషయం కాదు. నిద్రపోతుంటే కలలో కూడా ప్రశ్నలు, సమాధానానే వినిపిస్తున్నాయి’’ అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో అమల, ఈ గేమ్ షో రూపకర్తల బృందమైన సిద్దార్ధబసు, అనిత బసు, షెనాయ్ తదితరులు పాల్గొన్నారు. ‘ఇది నాకు కూడా ఓ సవాల్’ - నాగార్జున కార్యక్రమంలో భాగంగా విలేకరులు సంధించిన ప్రశ్నలకు నాగార్జున చెప్పిన సమాధానాల్లో కొన్ని... ఇది నాకు కొత్త అవతారం. అయితే.. ‘కౌన్‌బనేగా కరోడ్‌పతి’ ద్వారా అమితాబ్ వేసిన ముద్ర చెరిగిపోయేది కాదు. ఆయన అంత కాకపోయినా... ఆయన దరిదాపులకు వెళ్లేలా ప్రయత్నం చేస్తా. ఈ కార్యక్రమం ఓ విధంగా నాకు కూడా సవాల్. దీన్ని చేయడం అంత తేలికైన విషయం కాదని ఒప్పుకున్న తర్వాత తెలిసింది. ప్రస్తుతం ప్రాక్టీస్‌లో ఉన్నా. ప్రముఖుల కన్నా... సామాన్యులకే ఈ కార్యక్రమం విషయంలో పెద్ద పీట వేయడం జరుగుతుంది. ఎస్ఎంఎస్ల ద్వారా మేం సూచించే టోల్ ఫ్రీ నంబర్ల ద్వారా, ఇంటర్నెట్ ద్వారా అభ్యర్థుల్ని ఎంపిక చేస్తాం. అడపాదడపా సెలబ్రిటీలు కూడా పాల్గొంటారు. అయితే... అదంతా చారిటీలో భాగం మాత్రమే. ఈ కార్యక్రమం నాకు ప్లస్ అవుతుందా, నేను ఈ కార్యక్రమానికి ప్లస్ అవుతానా అంటే... అది పరస్పరం ఉపయోగకరం. చేసేవాణ్ణి, చూసేవాణ్ణి కూడా పూర్తిగా లీనం చేసుకునే కార్యక్రమం ఇది. దీని ద్వారా నా సొంత శైలిని సృష్టించుకోవడానికి ప్రయత్నిస్తా.నాన్నకు అమితాబ్ అంటే చాలా ఇష్టం. చాలా విషయాల్లో ఆయనను మెచ్చుకునేవారు. ఈ రోజు మన మధ్య లేకపోయినా... పై నుంచి నాన్న ఆశీస్సులు నాకు ఉంటాయి. టీవీలో ఈ గేమ్ షో ప్రసారం ఎప్పుడు మొదలవుతుందా అని నేను కూడా ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాను. -
బెయిల్ షరతులు సడలించండి: నిమ్మగడ్డ
సాక్షి, హైదరాబాద్: వ్యాపార అవసరాల కోసం నెల రోజులపాటు హైదరాబాద్ విడిచి వెళ్లేందుకు అనుమతించాలని కోరుతూ పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్ సీబీఐ ప్రత్యేక కోర్టులో పిటషన్ దాఖలు చేశారు. వ్యాపార కార్యకలాపాల కోసం ఇతర ప్రాం తాలకు వెళ్లాల్సి ఉన్నందున హైదరాబాద్ విడిచి వెళ్లరాదన్న షరతును సడలించాలని కోరారు. ఈ పిటిషన్‌పై విచారణను కోర్టు ఈనెల 7కు వాయిదా వేసింది. విజయరాఘవకు బెయిల్ షరతుల సడలింపు: ఎమ్మార్ కేసులో నిందితునిగా ఉన్న ఎమ్మార్ ఎంజీఎఫ్ ఫైనాన్స్ విభాగం ఉన్నతాధికారి విజయరాఘవ బెయిల్ షరతులను సీబీఐ కోర్టు శుక్రవారం సడలించింది. శనివారం నుంచి 2014 ఏప్రిల్ 26 వరకు రాష్ట్ర వ్యాప్తంగా, తమిళనాడు, కర్ణాటక, ఒడిశా, మహారాష్ట్రలో పర్యటించేందుకు కోర్టు అనుమతించింది. -
నిమ్మగడ్డ, బ్రహ్మానందరెడ్డిలకు బెయిల్
సాక్షి, హైదరాబాద్: వైఎస్ జగన్మోహన్రెడ్డి కంపెనీల్లో వాన్‌పిక్ పెట్టుబడులకు సంబంధించిన కేసులో నిందితులుగా ఉన్న పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్, ఐఆర్ఏఎస్ అధికారి కేవీ బ్రహ్మానందరెడ్డిలకు సీబీఐ ప్రత్యేక కోర్టు సోమవారం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఒక్కొక్కరూ రూ. 2 లక్షల చొప్పున రెండు పూచీకత్తు బాండ్లు సమర్పించి బెయిల్ పొందాలని, న్యాయస్థానం అనుమతి లేకుండా హైదరాబాద్ విడిచి వెళ్లరాదని, సాక్షులను ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రభావితం చేయరాదని ప్రత్యేక కోర్టుల ప్రధాన న్యాయమూర్తి యు.దుర్గాప్రసాద్‌రావు షరతులు విధించారు. కోర్టు వాయిదాలకు క్రమం తప్పకుండా హాజరుకావాలని, న్యాయస్థానం విధించిన షరతులను వారు ఉల్లంఘిస్తే బెయిల్ రద్దు చేయాలని సీబీఐ ఎప్పుడైనా కోర్టును కోరవచ్చని స్పష్టం చేశారు. బెయిల్ మంజూరు చేస్తే సాక్షులను ప్రభావితం చేస్తారని ఆందోళన వ్యక్తం చేసిన సీబీఐ అందుకు బలమైన ఆధారాలను చూపలేదని, ఈ నేపథ్యంలో వీరిద్దరూ బెయిల్‌కు అర్హులేనని న్యాయమూర్తి తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. బెయిల్ ఉత్తర్వులు వెలువరించే సమయానికి కోర్టు సమయం ముగియడంతో...పూచీకత్తు బాండ్లను వీరిద్దరి తరఫు న్యాయవాదులు మంగళవారం కోర్టుకు సమర్పించనున్నారు. ఈ కేసులో నిమ్మగడ్డ, బ్రహ్మానందరెడ్డిలను గత ఏడాది మే 15న సీబీఐ అరెస్టు చేసింది. దాదాపు 17 నెలల జైలు జీవితం తర్వాత వీరిద్దరూ మంగళవారం మధ్యాహ్నం 2 గంటల తర్వాత జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉంది. -
నిమ్మగడ్డ బెయిల్‌పై విచారణ 3కు వాయిదా
సాక్షి, హైదరాబాద్: వైఎస్ జగన్మోహన్రెడ్డి కంపెనీల్లో వాన్‌పిక్ పెట్టుబడుల కేసులో నిందితుడైన పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్, ఐఆర్ఏఎస్ అధికారి కేవీ బ్రహ్మానందరెడ్డిల బెయిల్ పిటిషన్లపై విచారణ అక్టోబర్ 3కు వాయిదా పడింది. ఈ పిటిషన్లపై కౌంటర్లు దాఖలు చేసేందుకు తమకు గడువు కావాలని సీబీఐ స్పెషల్ పీపీ సురేంద్ర సీబీఐ ప్రత్యేక కోర్టుకు గురువారం విజ్ఞప్తి చేశారు. దీనిపై నిమ్మగడ్డ తరఫు న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ కేసు దర్యాప్తు అధికారిగా ఎస్పీ చంద్రశేఖర్ ఇక్కడే ఉన్నారని, అయినా కౌంటర్ దాఖలుకు గడువు కోరడం భావ్యం కాదని తెలిపారు. వాన్‌పిక్ అంశంపై మాత్రమే దర్యాప్తు చేసిన అధికారులు ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నారని, వారు హైదరాబాద్‌కు రావడానికి కొంత సమయం పడుతుందని.. అందుకే గడువు కోరుతున్నామని సురేంద్ర నివేదించారు. స్పందించిన న్యాయమూర్తి విచారణను 3కు వాయిదా వేశారు. కౌంటర్ దాఖలు చేయడంతోపాటు అదే రోజు వాదనలు వింటామని న్యాయమూర్తి స్పష్టం చేశారు. -
బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన నిమ్మగడ్డ
హైదరాబాద్ : ప్రముఖ పారిశ్రామిక వేత్త నిమ్మగడ్డ ప్రసాద్ మంగళవారం నాంపల్లి సీబీఐ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. గతంలో ఆయనకు సీబీఐ కోర్టు మధ్యంతర బెయిల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. నిమ్మగడ్డ ప్రసాద్ మామ రామ్ ప్రకాష్ ఆర్య అంత్యక్రియలకు హాజరయ్యేందుకు సీబీఐ న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. అంతకు ముందు నిమ్మగడ్డ సుప్రీంకోర్టు, హైకోర్టు, నాంపల్లి కోర్టుల్లో బెయిల్ మంజూరు చేయాలంటూ పిటిషన్ దాఖలు చేసినా... సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందంటూ సీబీఐ అభ్యంతరం తెలిపిన విషయం తెలిసిందే. -
జగన్ రిమాండ్ 3 వరకు పొడిగింపు
తన కంపెనీల్లో పెట్టుబడుల వ్యవహారంలో వైఎస్.జగన్మోహన్రెడ్డి రిమాండ్‌ను సీబీఐ ప్రత్యేక కోర్టు అక్టోబరు 3 వరకు పొడిగించింది. ఇదే కేసులో నిందితులుగా ఉన్న ఆడిటర్ వి.విజయసాయిరెడ్డి, పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్, ఐఆర్ఏఎస్ అధికారి కేవీ.బ్రహ్మానందరెడ్డిల రిమాండ్‌ను కూడా కోర్టు వచ్చే నెల 3 వరకు పొడిగించింది. వీరి రిమాండ్ గడువు ముగియడంతో శుక్రవారం చెంచల్‌గూడ జైలు నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రత్యేక కోర్టుల ప్రధాన న్యాయమూర్తి యు.దుర్గాప్రసాద్‌రావు ఎదుట హాజరుపర్చారు. అలాగే ఇతర ఛార్జిషీట్లలో నిందితులుగా ఉన్న మాజీ మంత్రులు ధర్మాన ప్రసాదరావు, సబితా ఇంద్రారెడ్డి, ఐఏఎస్ అధికారి బీపీ.ఆచార్య, రాంకీ సంస్థల అధినేత అయోధ్యరామిరెడ్డి, గనుల శాఖ మాజీ డెరైక్టర్ వీడీ రాజగోపాల్, నిమ్మగడ్డ ప్రకాష్, ఈశ్వర్ సిమెంట్స్ పూర్వ ఎండీ సజ్జల దివాకర్‌రెడ్డి, దాల్మియా సిమెంట్స్ ఎండీ పునీత్దాల్మియా, ఉద్యోగులు సంజయ్ ఎస్.మిత్రా, నీల్‌కమల్‌బేరి, జయ్‌దీప్‌బసు తదితరులు కోర్టు ఎదుట హాజరుకాగా...సీనియర్ ఐఏఎస్ అధికారులు వెంకట్రామిరెడ్డి, మన్మోహన్సింగ్, శ్యామూల్, శ్రీలక్ష్మి, ఫార్మా కంపెనీల ప్రతినిధులు హాజరునకు మినహాయింపు కోరుతూ వారి తరఫు న్యాయవాదులు పిటిషన్లు దాఖలు చేయగా కోర్టు అనుమతించింది. ఈ కేసు తదుపరి విచారణను కోర్టు వచ్చేనెల 3కు వాయిదా వేసింది. ఇదిలా ఉండగా ఇదే కేసులో నిందితుడు, మాజీ మంత్రి మోపిదేవి వెంకట రమణారావుకు వెన్నునొప్పి చికిత్స కోసం ప్రత్యేక కోర్టు ఇటీవల 45 రోజులు తాత్కాలిక బెయిల్ మంజూరు చేసింది. వైద్యం కోసం ఆసుపత్రిలో చేరిన కారణంగా కోర్టుకు హాజరుకాలేకపోతున్నట్లు మోపిదేవి తరఫు న్యాయవాది కోర్టుకు నివేదించారు. ఇదిలా ఉండగా అన్ని చార్జిషీట్లను కలిపి విచారించాలంటూ జగన్ దాఖలు చేసిన పిటిషన్, దర్యాప్తు పూర్తయ్యే వరకూ అభియోగాల నమోదు ప్రక్రియను ఆపాలంటూ ఇతర నిందితులు దాఖలు చేసుకున్న పిటిషన్లపై విచారణను కోర్టు ఈనెల 23కు వాయిదా వేసింది. -
నిమ్మగడ్డ ప్రసాద్‌కు మధ్యంతర బెయిల్