సాక్షి, హైదరాబాద్: వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కంపెనీల్లో వాన్‌పిక్ పెట్టుబడుల కేసులో నిందితుడైన పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్, ఐఆర్‌ఏఎస్ అధికారి కేవీ బ్రహ్మానందరెడ్డిల బెయిల్ పిటిషన్లపై విచారణ అక్టోబర్ 3కు వాయిదా పడింది. ఈ పిటిషన్లపై కౌంటర్లు దాఖలు చేసేందుకు తమకు గడువు కావాలని సీబీఐ స్పెషల్ పీపీ సురేంద్ర సీబీఐ ప్రత్యేక కోర్టుకు గురువారం విజ్ఞప్తి చేశారు.
దీనిపై నిమ్మగడ్డ తరఫు న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ కేసు దర్యాప్తు అధికారిగా ఎస్పీ చంద్రశేఖర్ ఇక్కడే ఉన్నారని, అయినా కౌంటర్ దాఖలుకు గడువు కోరడం భావ్యం కాదని తెలిపారు. వాన్‌పిక్ అంశంపై మాత్రమే దర్యాప్తు చేసిన అధికారులు ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నారని, వారు హైదరాబాద్‌కు రావడానికి కొంత సమయం పడుతుందని.. అందుకే గడువు కోరుతున్నామని సురేంద్ర నివేదించారు. స్పందించిన న్యాయమూర్తి విచారణను 3కు వాయిదా వేశారు. కౌంటర్ దాఖలు చేయడంతోపాటు అదే రోజు వాదనలు వింటామని న్యాయమూర్తి స్పష్టం చేశారు.
నిమ్మగడ్డ బెయిల్‌పై విచారణ 3కు వాయిదా
Published Fri, Sep 27 2013 2:44 AM | Last Updated on Fri, Sep 1 2017 11:04 PM
Advertisement
Advertisement