సాక్షి, న్యూఢిల్లీ: వాన్‌పిక్ ప్రమోటర్ నిమ్మగడ్డ ప్రసాద్, జగతి పబ్లికేషన్స్ లిమిటెడ్ ఆస్తుల అటాచ్‌మెంట్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ న్యాయప్రాధికార సంస్థ విచారణను ఈ నెల 23కి వాయిదా వేసింది.
వాన్‌పిక్ ప్రమోటర్లు వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం నుంచి లబ్ధి పొంది ఆయన కుమారుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కంపెనీలకు పెట్టుబడుల రూపంలో అక్రమంగా నిధులు సమకూర్చారని ఆరోపిస్తూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్(ఈడీ) నిమ్మగడ్డ ప్రసాద్ ఆస్తులను, జగతి పబ్లికేషన్స్ ఆస్తులను అటాచ్ చేయడం విదితమే. ఈ కేసులో గురువారం ఈడీ తన వాదనలు వినిపించింది. కాగా న్యాయాధికారి ఈ విచారణను ఈ నెల 23వ తేదీకి వాయిదా వేశారు.
ఆస్తుల అటాచ్‌మెంట్ కేసు 23కి వాయిదా
Published Fri, Jul 18 2014 1:10 AM | Last Updated on Sat, Sep 2 2017 10:26 AM
Advertisement
Advertisement