attachment of properties
-
‘కరకట్ట నివాసం జప్తు’ పిటిషన్.. ఇరువైపులా ముగిసిన వాదనలు
సాక్షి, కృష్ణా: కరకట్టపై చంద్రబాబు అక్రమ నివాసాన్ని(లింగమనేని గెస్ట్‌హౌజ్) జప్తునకు అనుమతి కోరుతూ సీఐడీ దాఖలు చేసిన పిటిషన్‌పై ఇవాళ(శుక్రవారం) వాదనలు కొనసాగాయి. వాస్తవానికి ఇవాళ తీర్పు వెలువడాల్సి ఉంది. అయితే.. విజయవాడ ఏసీబీ కోర్టులో ఇప్పటికే సీఐడీ వాదనలు పూర్తి కాగా.. తమ వాదనలూ వినాలని లింగమనేని తరపు న్యాయవాది కోరడంతో కోర్టు అనుమతి ఇచ్చింది. ఈ క్రమంలో.. లింగమనేని తరపున అడ్వొకేట్ అశ్వినీ కుమార్ ఇవాళ(జూన్ 2, 2023 శుక్రవారం) వాదనలు వినిపించారు. ఈ పిటిషన్లో సీఐడీ తరపున అడ్వొకేట్ వివేకానంద వాదించారు. ఇరు పక్షాల వాదనలు నేటికి పూర్తి కావడంతో జూన్ 6వ తేదీకి తదుపరి విచారణ వాయిదా వేసింది ఏసీబీ కోర్టు. అదే రోజు ఈ పిటిషన్‌పై తుది తీర్పు వెలువడే అవకాశం ఉంది. కరకట్టపై లింగమనేని రమేష్ గెస్ట్ హౌస్‌ను చంద్రబాబు అక్రమంగా పొందారనేది ఏపీసీఐడీ ప్రధాన అభియోగం. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు సీఆర్డీయే మాస్టర్ ప్లాన్, ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్లలో లింగమనేనికి లబ్ది చేకూర్చి బదులుగా ఆయన ఇంటిని గెస్ట్ హౌస్‌గా పొందారని సీఐడీ చెబుతోంది. ఇదీ చదవండి: చంద్రబాబు అద్దె కొంప కహానీ ఇదీ! -
16 కోట్ల ఏజేఎల్ భవనం అటాచ్
న్యూఢిల్లీ: కాంగ్రెస్ ఆధ్వర్యంలోని అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్(ఏజేఎల్)కు చెందిన రూ.16.38 కోట్ల విలువైన భవనాన్ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అటాచ్ చేసింది. మనీ ల్యాండరింగ్‌కు పాల్పడినట్లు ఆరోపిస్తూ ఏజేఎల్‌తోపాటు, ఆ సంస్థ సీఎండీ, కాంగ్రెస్ సీనియర్ నేత మోతీలాల్ వోరాకు నోటీసులు జారీ చేసింది. ముంబైలోని అత్యంత ఖరీదైన బాంద్రా ఏరియాలోని తొమ్మిదంతస్తుల భవనంలోని కొంత భాగాన్ని అటాచ్ చేసినట్లు శనివారం ఈడీ తెలిపింది. గాంధీ కుటుంబసభ్యులతోపాటు కాంగ్రెస్ సీనియర్ నేతల ఆధ్వర్యంలోని ఏజేఎల్ గ్రూపు ఆ పార్టీకి చెందిన నేషనల్ హెరాల్డ్ పత్రికను నిర్వహిస్తోంది.1992లో హరియాణా సీఎంగా ఉన్నపుడు కాంగ్రెస్ సీనియర్ నేత భూపీందర్ హూడా పంచ్‌కులలోని భూమిని తక్కువ ధరకే ఏజేఎల్‌కు కేటాయించి, అధికార దుర్వినియోగం, అవకతవకలకు పాల్పడ్డారని ఈడీ ఆరోపిస్తోంది. ఆ భూమి వాస్తవ విలువ రూ.64.93 కోట్లు కాగా కేవలం రూ.59.39 లక్షలకే ఏజేఎల్‌కు అప్పగించారంటూ ఈడీ ఇప్పటికే ఆ భూమిని అటాచ్ చేసింది. ఈ కేసులో హూడా, వోరాలను ప్రశ్నించింది. ఇందుకు సంబంధించి 2018లో మోతీలాల్ వోరా, భూపీందర్ హూడాపై పంచ్‌కుల కోర్టులో చార్జిషీటు వేసింది. -
మాయావతి మాజీ కార్యదర్శికి ఐటీ షాక్
సాక్షి, ముంబై: ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మయావతికి మాజీ కార్యదర్శి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి నేత్‌రామ్‌కు ఐటీ విభాగం షాకిచ్చింది. అక్రమ ఆస్తులకు సంబంధించి ఆదాయ పన్నుఅధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. నోయిడా, కోల్‌కతా, ముంబైతోపాటు మొత్తం 19 స్థిరాస్తులను ఆదాయపు పన్ను శాఖ ఎటాచ్ చేసింది. నేత్రకు చెందిన మొత్తం 230 కోట్ల రూపాయల విలువైన 'బినామి' ఆస్తులను ఎటాచ్ చేసినట్టుగా అధికారిక వర్గాలు మంగళవారం తెలిపాయి. 1988 బినామీ ఆస్తి లావాదేవీల నిషేధ చట్టం సెక్షన్ 24 (3) కింద, వివిధ వాణిజ్య, నివాస ఆస్తులను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపింది. జప్తుచేసిన వాటిలో వాణిజ్య, నివాస సముదాయాలుతోపాటు రూ.1.64 కోట్ల నగదు, రూ.50 లక్షల విలువైన ‘మాంట్ బ్లాంక్' కలాలు, నాలుగు విలాసవంతమైన ఎస్యూవీ కార్లు ఉన్నాయి. బీఎస్పీ అధినేత మాయావతి ముఖ్యమంత్రి పదవిలో ఉండగా వివిధ ఉన్నత పదవుల్లో పనిచేసిన నేత్రామ్ నివాసం, కార్యాలయాలపై ఈ ఏడాది మార్చిలో ఐటీ శాఖ అధికారులు దాడులు చేసి రూ.300 కోట్ల విలువైన బినామీ ఆస్తులకు సంబంధించిన పత్రాలను స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. యూపీలో బీఎస్పీ పాలనలో షుగర్ మిల్లుల పెట్టుబడుల కుంభకోణం కేసులో అవినీతి ఆరోపణలకు సంబంధించి సీబీఐ కూడా ఆయనను విచారిస్తోంది. కాగా ఈ చట్టాన్ని ఉల్లంఘించిన వారికి ఏడు సంవత్సరాల వరకు కఠినమైన జైలు శిక్ష, బినామీ ఆస్తి మార్కెట్ విలువలో 25 శాతం వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. -
ఆస్తుల అటాచ్మెంట్ కేసు 23కి వాయిదా
సాక్షి, న్యూఢిల్లీ: వాన్‌పిక్ ప్రమోటర్ నిమ్మగడ్డ ప్రసాద్, జగతి పబ్లికేషన్స్ లిమిటెడ్ ఆస్తుల అటాచ్మెంట్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ న్యాయప్రాధికార సంస్థ విచారణను ఈ నెల 23కి వాయిదా వేసింది. వాన్‌పిక్ ప్రమోటర్లు వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం నుంచి లబ్ధి పొంది ఆయన కుమారుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి కంపెనీలకు పెట్టుబడుల రూపంలో అక్రమంగా నిధులు సమకూర్చారని ఆరోపిస్తూ ఎన్ఫోర్స్మెంట్ డెరైక్టరేట్(ఈడీ) నిమ్మగడ్డ ప్రసాద్ ఆస్తులను, జగతి పబ్లికేషన్స్ ఆస్తులను అటాచ్ చేయడం విదితమే. ఈ కేసులో గురువారం ఈడీ తన వాదనలు వినిపించింది. కాగా న్యాయాధికారి ఈ విచారణను ఈ నెల 23వ తేదీకి వాయిదా వేశారు. -
జగతి ఎఫ్‌డీల కేసు విచారణ 27కి వాయిదా
సాక్షి, న్యూఢిల్లీ: జగతి పబ్లికేషన్స్‌కు చెందిన రూ.34.65 కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్ల(ఎఫ్డీలు)ను ఎన్ఫోర్స్మెంట్ డెరైక్టరేట్(ఈడీ) అటాచ్ చేయడానికి సంబంధించిన కేసులో పీఎంఎల్ఏ న్యాయ ప్రాధికార సంస్థ చేపట్టిన విచారణ ఈ నెల 27వ తేదీకి వాయిదా పడింది. ఢిల్లీలోని పీఎంఎల్ఏ న్యాయ ప్రాధికార సంస్థ చైర్మన్ కె.రామమూర్తి ఎదుట బుధవారం ఈ కేసు విచారణకు వచ్చింది. ఈడీ లేవనెత్తిన పలు అంశాలపై కౌంటర్ దాఖలు చేయడానికి తమకు కొంత వ్యవధి కావాలని ఈ సందర్భంగా జగతి తరఫు న్యాయవాది రవిగుప్తా అభ్యర్థించారు. ఇందుకు సమ్మతించిన రామమూర్తి.. ఇరుపక్షాల న్యాయవాదులను సంప్రదించిన అనంతరం ఈ నెల 27కి విచారణను వాయిదావేశారు.