జగతి ఎఫ్‌డీల కేసు విచారణ 27కి వాయిదా | Jagati FD's Case investigations to be postponed to augest 27 | Sakshi
Sakshi News home page

జగతి ఎఫ్‌డీల కేసు విచారణ 27కి వాయిదా

Published Thu, Aug 8 2013 3:09 AM | Last Updated on Fri, Sep 1 2017 9:42 PM

Jagati FD's Case investigations to be postponed to augest 27

సాక్షి, న్యూఢిల్లీ: జగతి పబ్లికేషన్స్‌కు చెందిన రూ.34.65 కోట్ల ఫిక్స్‌డ్ డిపాజిట్ల(ఎఫ్‌డీలు)ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్(ఈడీ) అటాచ్ చేయడానికి సంబంధించిన కేసులో పీఎంఎల్‌ఏ న్యాయ ప్రాధికార సంస్థ చేపట్టిన విచారణ ఈ నెల 27వ తేదీకి వాయిదా పడింది. ఢిల్లీలోని పీఎంఎల్‌ఏ న్యాయ ప్రాధికార సంస్థ చైర్మన్ కె.రామమూర్తి ఎదుట బుధవారం ఈ కేసు విచారణకు వచ్చింది. ఈడీ లేవనెత్తిన పలు అంశాలపై కౌంటర్ దాఖలు చేయడానికి తమకు కొంత వ్యవధి కావాలని ఈ సందర్భంగా జగతి తరఫు న్యాయవాది రవిగుప్తా అభ్యర్థించారు. ఇందుకు సమ్మతించిన రామమూర్తి.. ఇరుపక్షాల న్యాయవాదులను సంప్రదించిన అనంతరం ఈ నెల 27కి విచారణను వాయిదావేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement