రేషన్ చక్కెరకు రెక్కలు! | Centre plans to give freedom to states to hike PDS sugar price | Sakshi
Sakshi News home page

రేషన్ చక్కెరకు రెక్కలు!

Published Thu, Aug 8 2013 5:12 AM | Last Updated on Fri, Sep 1 2017 9:42 PM

Centre plans to give freedom to states to hike PDS sugar price

న్యూఢిల్లీ: చౌక ధరల దుకాణాల ద్వారా అందిస్తున్న చక్కెర ధర పెరిగే అవకాశముంది. దీని రిటైల్ ధరను పెంచుకోవడానికి రాష్ట్రాలకు స్వేచ్ఛ ఇచ్చేందుకు కేంద్ర ఆహార మం త్రిత్వ శాఖ.. కేబినెట్ పరిశీలన కోసం ఓ ప్రతిపాదనను సిద్ధం చేసింది. ఆ శాఖ మంత్రి కేవీ థామస్ బుధవారమిక్కడ ఈ సంగతి వెల్లడించారు. చక్కెర సేకరణ ధర  ఎక్కువగా ఉంది కనుక ప్రజా పంపిణీ వ్యవస్థ(పీడీఎస్) ద్వారా ఇచ్చే చక్కెర ధరను పెంచాలని పలు రాష్ట్రాలు కోరుతున్నాయన్నారు.
 
 ఈ అంశంపై ఆర్థిక మంత్రితో చర్చించానని, కేబినెట్ నిర్ణయం తీసుకోవాల్సి ఉందని తెలిపారు. చక్కెర ధరను కేజీకి గరిష్టంగా రూపాయి పెంచాలని ఆహార శాఖ ప్రతిపాదించినట్లు సమచారం. బహిరంగ మార్కెట్లో కేజీ రూ.35-40 పలుకుతున్న చక్కెరను రేషన్ షాపుల్లో పదేళ్లుగా రూ.13.50కి అందజేస్తున్నారు. ఈ ఏడాది మేలో చెక్కర ధరలపై ప్రభుత్వ నియంత్రణ ఎత్తేసిన కేంద్రం ఈ నెల నుంచి రాష్ట్రాలు పీడీఎస్ కోసం చక్కెరను బహిరంగ మార్కెట్ల నుంచి సేకరించాలని పేర్కొంది. కేజీకి రూ.18.50 మాత్రమే సబ్సిడీ ఇస్తామని స్పష్టం చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement