K V Thomas
-
పీఏసీ తదుపరి చైర్మన్‌గా ఖర్గే
-
పీఏసీ తదుపరి చైర్మన్‌గా ఖర్గే
న్యూఢిల్లీ: ప్రజా పద్దుల సంఘం(పీఏసీ) తదుపరి చైర్మన్‌గా లోక్‌సభలో కాంగ్రెస్ నేత మల్లికార్జున్ ఖర్గే నియామకానికి రంగం సిద్ధమైంది. కాంగ్రెస్‌కే చెందిన ప్రస్తుత చైర్మన్ కేవీ థామస్ మూడో విడత పదవీకాలం ఏప్రిల్ 30తో ముగియనుంది. ఖర్గేను పీఏసీ చైర్మన్‌గా నియమించాలని సిఫార్సు చేస్తూ కాంగ్రెస్ నాయకత్వం మంగళవారం లోక్‌సభ స్పీకర్‌కు లేఖ రాసినట్లు సమాచారం. దళిత నాయకుడైన ఖర్గే గతంలో కర్ణాటక ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు. యూపీఏ హయాంలో రైల్వే, కార్మిఖ శాఖలు నిర్వహించారు. పీఏసీ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టినా లోక్‌సభలో కాంగ్రెస్ నేతగా ఆయన కొనసాగుతారని సమాచారం. -
రేషన్ చక్కెరకు రెక్కలు!
న్యూఢిల్లీ: చౌక ధరల దుకాణాల ద్వారా అందిస్తున్న చక్కెర ధర పెరిగే అవకాశముంది. దీని రిటైల్ ధరను పెంచుకోవడానికి రాష్ట్రాలకు స్వేచ్ఛ ఇచ్చేందుకు కేంద్ర ఆహార మం త్రిత్వ శాఖ.. కేబినెట్ పరిశీలన కోసం ఓ ప్రతిపాదనను సిద్ధం చేసింది. ఆ శాఖ మంత్రి కేవీ థామస్ బుధవారమిక్కడ ఈ సంగతి వెల్లడించారు. చక్కెర సేకరణ ధర ఎక్కువగా ఉంది కనుక ప్రజా పంపిణీ వ్యవస్థ(పీడీఎస్) ద్వారా ఇచ్చే చక్కెర ధరను పెంచాలని పలు రాష్ట్రాలు కోరుతున్నాయన్నారు. ఈ అంశంపై ఆర్థిక మంత్రితో చర్చించానని, కేబినెట్ నిర్ణయం తీసుకోవాల్సి ఉందని తెలిపారు. చక్కెర ధరను కేజీకి గరిష్టంగా రూపాయి పెంచాలని ఆహార శాఖ ప్రతిపాదించినట్లు సమచారం. బహిరంగ మార్కెట్లో కేజీ రూ.35-40 పలుకుతున్న చక్కెరను రేషన్ షాపుల్లో పదేళ్లుగా రూ.13.50కి అందజేస్తున్నారు. ఈ ఏడాది మేలో చెక్కర ధరలపై ప్రభుత్వ నియంత్రణ ఎత్తేసిన కేంద్రం ఈ నెల నుంచి రాష్ట్రాలు పీడీఎస్ కోసం చక్కెరను బహిరంగ మార్కెట్ల నుంచి సేకరించాలని పేర్కొంది. కేజీకి రూ.18.50 మాత్రమే సబ్సిడీ ఇస్తామని స్పష్టం చేసింది. -
ఎన్ఎస్ఈఎల్ ఈ-కాంట్రాక్ట్లపైనా నిషేధం
న్యూఢిల్లీ: ఇప్పటికే నేషనల్ స్పాట్ ఎక్స్ఛేంజీ(ఎన్ఎస్ఈఎల్)లో నిలిచిపోయిన కొత్త కమోడిటీ కాంట్రాక్ట్‌లకు జతగా ప్రభుత్వం తాజాగా ఈ సిరీస్ కాంట్రాక్ట్‌లను సైతం నిషేధించింది. దీంతో ఎన్ఎస్ఈఎల్లో ట్రేడింగ్ పూర్తిగా నిలిచిపోయింది. ముందుగా రూ. 5,600 కోట్లమేర నిలిచిపోయిన చెల్లింపుల సెటిల్మెంట్ను పూర్తిచేయాల్సిందిగా ఎన్‌ఎస్‌ఈఎల్‌ను ఆదేశించినట్లు ఆహారం, వినియోగ వ్యవహారాల మంత్రి కేవీ థామస్ చెప్పారు. ఎన్ఎస్ఈఎల్లో ఈ సిరీస్ కాంట్రాక్ట్‌లను సైతం నిషేధించినట్లు తెలిపారు. ఈ అంశంపై రెండు రోజుల్లో నోటిఫికేషన్‌ను విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. కాగా, ఈ సిరీస్‌లో భాగంగా పసిడి, వెండిలతోపాటు ప్రాథమిక లోహాలకు సంబంధించిన కాంట్రాక్ట్‌లను ఎన్ఎస్ఈఎల్ నిర్వహిస్తుంది.ఈక్విటీలలో నగదు విభాగాన్ని పోలి ఈ సిరీస్ కాంట్రాక్ట్‌ల నిర్వహణ ఉంటుందని థామస్ పేర్కొన్నారు.