న్యూఢిల్లీ: ఇప్పటికే నేషనల్ స్పాట్ ఎక్స్ఛేంజీ(ఎన్‌ఎస్‌ఈఎల్)లో నిలిచిపోయిన కొత్త కమోడిటీ కాంట్రాక్ట్‌లకు జతగా ప్రభుత్వం తాజాగా ఈ సిరీస్ కాంట్రాక్ట్‌లను సైతం నిషేధించింది. దీంతో ఎన్‌ఎస్‌ఈఎల్‌లో ట్రేడింగ్ పూర్తిగా నిలిచిపోయింది. ముందుగా రూ. 5,600 కోట్లమేర నిలిచిపోయిన చెల్లింపుల సెటిల్‌మెంట్‌ను పూర్తిచేయాల్సిందిగా ఎన్‌ఎస్‌ఈఎల్‌ను ఆదేశించినట్లు ఆహారం, వినియోగ వ్యవహారాల మంత్రి కేవీ థామస్ చెప్పారు. ఎన్‌ఎస్‌ఈఎల్‌లో ఈ సిరీస్ కాంట్రాక్ట్‌లను సైతం నిషేధించినట్లు తెలిపారు. ఈ అంశంపై రెండు రోజుల్లో నోటిఫికేషన్‌ను విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. కాగా, ఈ సిరీస్‌లో భాగంగా పసిడి, వెండిలతోపాటు ప్రాథమిక లోహాలకు సంబంధించిన కాంట్రాక్ట్‌లను ఎన్‌ఎస్‌ఈఎల్ నిర్వహిస్తుంది.ఈక్విటీలలో నగదు విభాగాన్ని పోలి ఈ సిరీస్ కాంట్రాక్ట్‌ల నిర్వహణ ఉంటుందని థామస్ పేర్కొన్నారు.
ఎన్‌ఎస్‌ఈఎల్ ఈ-కాంట్రాక్ట్‌లపైనా నిషేధం
Published Wed, Aug 7 2013 3:28 AM | Last Updated on Fri, Sep 1 2017 9:41 PM
Advertisement
Advertisement