న్యూఢిల్లీ: ప్రస్తుతం మూతబడిన నేషనల్ స్పాట్ ఎక్సే్చంజ్ (ఎన్‌ఎస్‌ఈఎల్) కేసులో వే2వెల్త్ కమోడిటీస్ రిజిస్ట్రేషన్‌ను రద్దు చేస్తూ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నిర్ణయం తీసుకుంది. ఎన్‌ఎస్‌ఈఎల్‌కి సంబంధించిన అక్రమ ’పెయిర్డ్ కాంట్రాక్టుల్లో’ ట్రేడింగ్ చేసే సదుపాయం కల్పించడం ద్వారా ఇన్వెస్టర్లను వే2వెల్త్ రిస్కులోకి నెట్టిందని సోమవారం జారీ చేసిన ఉత్తర్వుల్లో వ్యాఖ్యానించింది. నియంత్రణ సంస్థ అనుమతి లేని పెయిర్డ్ కాంట్రాక్టుల విషయంలో వివేకవంతంగా వ్యవహరించడంలో కంపెనీ విఫలమైందని సెబీ పేర్కొంది.
ఈ నేపథ్యంలో సెక్యూరిటీల మార్కెట్‌లో బ్రోకింగ్ సంస్థగా కొనసాగే అర్హత కోల్పోయిందని తెలిపింది. 15 రోజుల్లోగా క్లయింట్లు తమ సొమ్మును విత్‌డ్రా చేసుకునేందుకు లేదా సెక్యూరిటీస్, డబ్బును బదిలీ చేసుకునేందుకు వే2వెల్త్ కమోడిటీస్ వీలు కల్పించాలని సెబీ ఆదేశించింది. ఒకవేళ క్లయింట్లు డబ్బు, సెక్యూరిటీలను విత్‌డ్రా చేసుకోవడంలో విఫలమైతే వాటిని తదుపరి 15 రోజుల్లోగా మరో బ్రోకింగ్ సంస్థకు బదలాయించాలని సూచించింది. 2009లో ఎన్‌ఎస్‌ఈఎల్ ప్రవేశపెట్టిన పెయిర్డ్ కాంట్రాక్టుల స్కీముతో ఇన్వెస్టర్లకు ఏకంగా రూ. 5,500 కోట్ల మేర నష్టం వాటిల్లింది. దీనికి సంబంధించి 2022 నవంబర్‌లో కొత్త క్లయింట్లను తీసుకోకుండా అయిదు బ్రోకరేజీలపై సెబీ ఆరు నెలల నిషేధం విధించింది.
Comments
Please login to add a commentAdd a comment