registration cancelled
-
వే2వెల్త్ కమోడిటీస్ రిజిస్ట్రేషన్ రద్దు
న్యూఢిల్లీ: ప్రస్తుతం మూతబడిన నేషనల్ స్పాట్ ఎక్సే్చంజ్ (ఎన్ఎస్ఈఎల్) కేసులో వే2వెల్త్ కమోడిటీస్ రిజిస్ట్రేషన్‌ను రద్దు చేస్తూ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నిర్ణయం తీసుకుంది. ఎన్ఎస్ఈఎల్కి సంబంధించిన అక్రమ ’పెయిర్డ్ కాంట్రాక్టుల్లో’ ట్రేడింగ్ చేసే సదుపాయం కల్పించడం ద్వారా ఇన్వెస్టర్లను వే2వెల్త్ రిస్కులోకి నెట్టిందని సోమవారం జారీ చేసిన ఉత్తర్వుల్లో వ్యాఖ్యానించింది. నియంత్రణ సంస్థ అనుమతి లేని పెయిర్డ్ కాంట్రాక్టుల విషయంలో వివేకవంతంగా వ్యవహరించడంలో కంపెనీ విఫలమైందని సెబీ పేర్కొంది. ఈ నేపథ్యంలో సెక్యూరిటీల మార్కెట్లో బ్రోకింగ్ సంస్థగా కొనసాగే అర్హత కోల్పోయిందని తెలిపింది. 15 రోజుల్లోగా క్లయింట్లు తమ సొమ్మును విత్‌డ్రా చేసుకునేందుకు లేదా సెక్యూరిటీస్, డబ్బును బదిలీ చేసుకునేందుకు వే2వెల్త్ కమోడిటీస్ వీలు కల్పించాలని సెబీ ఆదేశించింది. ఒకవేళ క్లయింట్లు డబ్బు, సెక్యూరిటీలను విత్‌డ్రా చేసుకోవడంలో విఫలమైతే వాటిని తదుపరి 15 రోజుల్లోగా మరో బ్రోకింగ్ సంస్థకు బదలాయించాలని సూచించింది. 2009లో ఎన్ఎస్ఈఎల్ ప్రవేశపెట్టిన పెయిర్డ్ కాంట్రాక్టుల స్కీముతో ఇన్వెస్టర్లకు ఏకంగా రూ. 5,500 కోట్ల మేర నష్టం వాటిల్లింది. దీనికి సంబంధించి 2022 నవంబర్‌లో కొత్త క్లయింట్లను తీసుకోకుండా అయిదు బ్రోకరేజీలపై సెబీ ఆరు నెలల నిషేధం విధించింది. -
ఏపీ: అక్రమ లే అవుట్ల రిజిస్ట్రేషన్లు నిలిపివేత
సాక్షి, అమరావతి : సుబ్బారావు విజయవాడ శివారులోని ఒక వెంచర్లో ప్లాట్ కొనుగోలు చేశాడు. కూడబెట్టుకున్న సొమ్ముకు మరికొంత అప్పు చేసి రిజిస్టర్ చేయించుకున్నాడు. తీరా ఇప్పుడు ఆ లే అవుట్‌కు అనుమతుల్లేవని బయటపడింది. కొనేవరకు వెంటపడిన దళారిగానీ, వెంచర్ యజమానిగానీ సమాధానం చెప్పడంలేదు. సుబ్బారావుకు దిక్కుతోచడంలేదు. ఇకపై ఇటువంటి అక్రమాలు జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం చెక్ పెట్టింది. సామాన్యులు మోసపోకుండా చూసేందుకు చర్యలు చేపట్టింది. అనధికార, అక్రమ లే అవుట్లపై పురపాలకశాఖ కొరఢా ఝుళిపించింది. వీటి రిజిస్ట్రేషన్లకు అడ్డుకట్ట వేసింది. అనధికార, అక్రమ లే అవుట్ల వివరాలను అన్ని జిల్లాల్లో రిజిస్ట్రార్ కార్యాలయాలకు పంపింది. ఆ లే అవుట్లల్లో రిజిస్ట్రేషన్లు చేయవద్దని కోరింది. ప్రజలు మోసపోకుండా ముందే పరిశీలించుకునేందుకు వీలుగా ఈ జాబితాలను పట్టణ, వార్డు సచివాలయాల్లోను, పట్టణాభివృద్ధి సంస్థల పరిధిలోని పంచాయతీల్లోను అందుబాటులో ఉంచింది. దీంతో సామాన్యులకు ఊరట లభించింది. రాష్ట్రంలో అనధికార, అక్రమ లే అవుట్ల రిజిస్ట్రేషన్లను నిలిపేయడం ఇదే తొలిసారి. 6,076 లే అవుట్లు.. 34,167 ఎకరాలు పురపాలకశాఖ రాష్ట్రంలో ఇప్పటివరకు 6,076 అనధికార లే అవుట్ల రిజిస్ట్రేషన్లను నిలిపివేసింది. మొత్తం 34,167 ఎకరాల్లో ఈ లే అవుట్లు వేశారు. వాటిలో నిబంధనల మేరకు రోడ్లు, పార్కులకు భూమి కేటాయించకపోవడం, ప్రభుత్వ స్థలాలను ఆక్రమించినవి, ప్రైవేటు వివాదాల్లో ఉన్న భూములు మొదలైనవి ఉన్నాయి. ఆ అంశాలను పట్టించుకోకుండా లే అవుట్లు వేసి సామాన్యులకు విక్రయించాలని కొందరు రియల్టర్లు భావించారు. నిబంధనల ప్రకారం వాటికి అనుమతులు తీసుకోకుండా ప్లాట్లు వేసి విక్రయాలకు సిద్ధమయ్యారు. ముందు అమ్మి సొమ్ముచేసుకుంటే తరువాత ఎప్పుడో క్రమబద్ధీకరించుకోవచ్చని ఎత్తుగడ వేశారు. దీన్ని గమనించిన పురపాలకశాఖ ఆ లే అవుట్లను బ్లాక్ లిస్టులో పెట్టింది. వాటిని రిజిస్ట్రేషన్ చేయొద్దని రిజిస్ట్రార్ కార్యాలయాలకు జాబితా కూడా సమర్పించింది. అనధికార లే అవుట్ల రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. ఆ ప్లాట్లు కొనుగోలు చేసి సామాన్యులు ఇబ్బందులు పడకుండా పురపాలక శాఖ అడ్డుకోగలిగింది. నిబంధనలను పాటిస్తేనే భవిష్యత్‌లో వాటికి రిజిస్ట్రేషన్లకు అవకాశం కల్పిస్తారు. సామాన్యులు మోసపోకూడదనే.. అనధికార, అక్రమ లే అవుట్లలో ప్లాట్లు, ఫ్లాట్లు కొనుగోలు చేసి సామాన్యులు మోసపోతున్నారు. దీన్ని అడ్డుకునేందుకే ఇటువంటి లే అవుట్ల రిజిస్ట్రేషన్లను నిలిపివేయించాం. ఇది సత్ఫలితాలను ఇస్తోంది. వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేసేందుకు ఈ కార్యాచరణ చేపట్టాం. - వి.రాముడు, డైరెక్టర్, టౌన్ ప్లానింగ్ విభాగం, పురపాలకశాఖ జిల్లాల వారీగా రిజిస్ట్రేషన్లు నిలిపేసిన అనధికార, అక్రమ లే అవుట్లు -
జీఎస్టీ రిటర్ను ఎగవేస్తే.. ఖాతా జప్తే
న్యూఢిల్లీ: వస్తు, సేవల పన్నుల (జీఎస్టీ) రిటర్నులు దాఖలు చేయని అసెసీలు కఠిన చర్యలు ఎదుర్కొనాల్సి రానుంది. ప్రభుత్వం.. అలాంటి అసెసీల బ్యాంకు ఖాతాలను స్తంభింప చేయడం లేదా ఏకంగా రిజిస్ట్రేషన్‌ను కూడా రద్దు చేసే అవకాశాలు ఉన్నాయి. జీఎస్టీ రిటర్నులను దాఖలు చేయని సంస్థలతో వ్యవహరించాల్సిన విధానాలకు సంబంధించి కేంద్రీయ పరోక్ష పన్నులు, కస్టమ్స్ బోర్డు (సీబీఐసీ) ప్రత్యేకంగా స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (ఎస్వోపీ)ని రూపొందించింది. ఇందులో నిర్దిష్ట కఠిన చర్యలను కూడా చేర్చినట్లు తెలుస్తోంది. దఫదఫాలుగా నోటీసులు... కాంపొజిషన్ స్కీమ్ ఎంచుకున్న అసెసీలు.. మూడు నెలలకోసారి, మిగతా వారు నెలకోసారి జీఎస్టీ రిటర్నులు దాఖలు చేయాల్సి ఉంటోంది. అయితే, జీఎస్టీ అసెసీల్లో 20 శాతం మంది రిటర్నులు దాఖలు చేయడం లేదని, దీనివల్ల పన్ను వసూళ్లు గణనీయంగా దెబ్బతింటున్నాయని అధ్యయన నివేదికలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలోనే సీబీఐసీ... ఎస్‌వోపీని తెరపైకి తెచ్చింది. దీని ప్రకారం గడువులోగా చెల్లింపులు జరపని పక్షంలో డిఫాల్టరుకు ముందు సిస్టమ్ నుంచి ఒక నోటీస్ వెడుతుంది. ఆ తర్వాత అయిదు రోజుల్లోగా చెల్లించకపోతే.. ఫారం 3–ఎ కింద మరో నోటీసు జారీ అవుతుంది. ఇది వచ్చాక 15 రోజుల్లోగానైనా చెల్లించాల్సి ఉంటుంది. అప్పటికీ కట్టకపోతే.. అధికారులు సదరు అసెసీ కట్టాల్సిన పన్ను బాకీలను మదింపు చేసి, ఫారం ఏఎస్‌ఎంటీ–13 జారీ చేస్తారు. -
ఇన్ఫోసిస్ ఫౌండేషన్ రిజిస్ట్రేషన్ రద్దు
-
కేకే భూముల రిజిస్ట్రేషన్ రద్దు
♦ హాఫీజ్‌పూర్‌లో 70 ఎకరాలను స్వాధీనం చేసుకున్న సర్కారు ♦ అలాగే టీసీఎస్ సమీపంలో ఐదెకరాలు వెనక్కి ♦ బహిరంగ మార్కెట్లో దీని విలువ రూ.20 కోట్లపైనే సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: ఇబ్రహీం పట్నం మండలం హఫీజ్‌పూర్‌లో రాజ్యసభ సభ్యుడు కే.కేశవరావు చేయించుకున్న అటవీ, ప్రభుత్వ భూముల రిజిస్ట్రేషన్‌ను ప్రభుత్వం రద్దు చేసింది. కేకే, గోల్డ్‌స్టోన్ యాజమాన్యం గుప్పిట్లో ఉన్న 70 ఎకరాలను స్వాధీనం చేసుకుంది. దండు మైలారం గ్రామం హఫీజ్‌పూర్ రెవెన్యూ పరిధి లోని సర్వే నంబర్ 36/1లో 1,822 ఎకరాలు, 36/2లో 422.29 ఎకరాల మేర అటవీ, ప్రభుత్వ భూమి ఉంది. ఈ భూమి లో 50 ఎకరాలను కేకే తన కుటుంబీకులు కంచర్ల నవజ్యోత్, జ్యోత్న, గద్వాల విజయలక్ష్మి పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. గోల్డ్‌స్టోన్ యాజ మాన్యం నుంచి కొనుగోలు చేసిన ఈ భూమి నిషేధిత జాబితాలో ఉంది. అయితే, ఈ భూమిని చట్టపరంగానే కొనుగోలు చేశానని మొదట వాదించిన కేశవరావు చివరకు వెనక్కి తగ్గారు. ఈ భూ వ్యవహారం తన మెడకు చుట్టుకుం టుందని పసిగట్టిన ఆయన రిజిస్ట్రేషన్‌ను రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించారు. మరోవైపు 22ఏ కింద నమోదైన ఈ భూమి చేతులు మారడాన్ని సీరియస్‌గా పరిగణించిన ప్రభుత్వం.. కేకే రిజిస్ట్రేషన్‌ను రద్దు చేసింది. అలాగే ఇదే సర్వే నంబర్లలో గోల్డ్‌స్టోన్ యాజమాన్యం తన అనుబంధ సంస్థలకు కట్టబెట్టిన 20 ఎకరాల రిజిస్ట్రేషన్‌ను రద్దు చేసిన జిల్లా యంత్రాంగం భూమిని స్వాధీనం చేసుకుంది. రూ.20 కోట్ల భూమి వెనక్కి! ఆదిబట్లలోని టీసీఎస్ సంస్థను ఆనుకొని ఉన్న సర్వే నంబర్ 79/2 లోని రూ.20 కోట్ల విలువైన ఐదెకరాల అసైన్డ్ భూమిని ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. అసైన్డ్‌దారుల నుంచి చేతులు మారిన ఈ భూమిని స్వాధీనం చేసుకున్న సర్కారు.. బోర్డులు నాటి ప్రహరీగోడను ఏర్పాటు చేసింది. అనంతరం ఈ స్థలంపై కన్నేసిన ల్యాండ్ మాఫియా.. గోడలు, సూచిక బోర్డులను తొలగించి మళ్లీ ఆక్రమించింది. మియాపూర్ భూముల కుంభకోణం వెలుగులోకి రావడంతో అప్రమత్తమైన రెవెన్యూ యం త్రాంగం.. అన్యాక్రాంతమవుతున్న ఈ భూమిని తిరిగి స్వాధీనం చేసుకుంది. అలాగే దురాక్రమణకు గురైన మరో 25 ఎకరాల భూమిని పీఓటీ చట్టం కింద వెనక్కి తీసుకునేందుకు నోటీసులు జారీ చేసింది. -
గ్రీన్‌పీస్ సంస్థ రిజిస్ట్రేషన్ రద్దు
వాయు కాలుష్యం, ఇతర సమస్యలపై పోరాడుతున్న స్వచ్ఛంద సంస్థ గ్రీన్ పీస్ ఇండియా రిజిస్ట్రేషన్ రద్దయింది. తమిళనాడు రిజిస్ట్రార్ ఆఫ్ సొసైటీస్ ఈ సంస్థ గుర్తింపును శుక్రవారం రద్దుచేసింది. కావడానికి ఇది జాతీయస్థాయి సంస్థే అయినా, తమిళనాడు రిజిస్ట్రార్ ఆఫ్ సొసైటీస్ చట్టం కింద ఇది రిజిస్టర్ అయ్యింది. దాంతో అక్కడ దీని గుర్తింపును రద్దుచేశారు. ప్రజాస్వామ్యం ఆరోగ్యవంతంగా ఉండటంలో పౌరసమాజం ప్రాధాన్యం ఎంతో ఉందని ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ సహా అనేకమంది అంతర్జాతీయ నాయకులు చెప్పారని, కానీ ఇక్కడ మాత్రం తమ సంస్థ గుర్తింపును రద్దుచేయడం దారుణమని గ్రీన్ పీస్ ఓ ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేసింది. ఈ నిర్ణయాన్ని మద్రాసు హైకోర్టులో సవాలు చేయాలని ఈ సంస్థ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.