వాయు కాలుష్యం, ఇతర సమస్యలపై పోరాడుతున్న స్వచ్ఛంద సంస్థ గ్రీన్ పీస్ ఇండియా రిజిస్ట్రేషన్ రద్దయింది. తమిళనాడు రిజిస్ట్రార్ ఆఫ్ సొసైటీస్ ఈ సంస్థ గుర్తింపును శుక్రవారం రద్దుచేసింది. కావడానికి ఇది జాతీయస్థాయి సంస్థే అయినా, తమిళనాడు రిజిస్ట్రార్ ఆఫ్ సొసైటీస్ చట్టం కింద ఇది రిజిస్టర్ అయ్యింది. దాంతో అక్కడ దీని గుర్తింపును రద్దుచేశారు.
ప్రజాస్వామ్యం ఆరోగ్యవంతంగా ఉండటంలో పౌరసమాజం ప్రాధాన్యం ఎంతో ఉందని ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ సహా అనేకమంది అంతర్జాతీయ నాయకులు చెప్పారని, కానీ ఇక్కడ మాత్రం తమ సంస్థ గుర్తింపును రద్దుచేయడం దారుణమని గ్రీన్ పీస్ ఓ ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేసింది. ఈ నిర్ణయాన్ని మద్రాసు హైకోర్టులో సవాలు చేయాలని ఈ సంస్థ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
గ్రీన్‌పీస్ సంస్థ రిజిస్ట్రేషన్ రద్దు
Published Fri, Nov 6 2015 5:41 PM | Last Updated on Mon, Oct 8 2018 3:56 PM
Advertisement