Greenpeace
-
స్వచ్ఛ ప్రపంచం కోసం ఏటా కావాలో...రూ.2.24 కోట్ల కోట్లు!
కర్బన, గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాలు. ప్రస్తుతం ప్రపంచ మానవాళికి పెను ప్రమాదంగా పరిణమించిన పెను సమస్యలు. పర్యావరణం పట్ల మనిషి బాధ్యతారాహిత్యానికి పరాకాష్ట. వాటిని ఎలాగైనా తగ్గించాలన్న ప్రతినలు, లక్ష్యాలు కాగితాలకే పరిమితమ వుతున్నాయి. భావితరాల భద్రత పట్ల మన జవాబుదారీతనాన్ని నిరంతరం ప్రశ్నిస్తూనే ఉన్నాయి. ప్రస్తుత లెక్కల్లో 2050 నాటికి ఉద్గారాలను పూర్తిగా (నెట్ జీరో స్థాయికి) తగ్గించాలంటే ప్రపంచ స్థాయిలో ఇప్పటి నుంచీ ఏటా కనీసం 2.24 కోట్ల కోట్ల రూపాయలు (2.7 లక్షల కోట్ల డాలర్లు) వెచి్చంచాల్సి ఉంటుందట! అలాగైతేనే ఈ శతాబ్దాంతానికల్లా అంతర్జాతీయ సగటు ఉష్ణోగ్రతలు కూడా 1.5 డిగ్రీ సెంటీగ్రేడ్ పరిమితిని దాటకుండా ఉంటాయట. కానీ ఉద్గారాలకు ప్రధాన కారణంగా ఉన్న చాలా దేశాలు తామే స్వయంగా నిర్దేశించుకున్న 2030 లక్ష్యాల సాధనకే అల్లంత దూరంలో ఉన్నాయనీ తాజా నివేదిక ఒకటి వాపోతోంది! ఈ పరిస్థితుల్లో వాటి నుంచి 2050 లక్ష్యాల పట్ల చిత్తశుద్ధితో కూడిన కార్యాచరణను ఆశించడం అత్యాశేనని పర్యావరణవేత్త లు అంటున్నారు. మరోవైపు సముద్రాలకు ముప్పు కూడా నానాటికీ మరింతగా పెరిగిపోతోందని గ్రీన్ పీస్ నివేదిక హెచ్చరిస్తోంది. చేపల వేట విచ్చలవిడిగా సాగుతోందని, గత నాలుగేళ్లలో 8.5 శాతం దాకా పెరిగిందని అది పేర్కొంది! లక్ష్యాలు ఘనమే కానీ... ► కర్బన ఉద్గారాల కట్టడికి ప్రస్తుతం అన్ని దేశాలూ కలిపి ఏటా 1.9 లక్షల కోట్ల డాలర్లు వెచి్చంచాలన్నది లక్ష్యం. కానీ ఇదీ ఒక్క ఏడాది కూడా జరగడం లేదు. ► పలు కీలక సంపన్న దేశాలు ఈ విషయంలో చేస్తున్న గొప్ప ప్రకటనలు మాటలకే పరిమితమవుతున్నాయి. ► అవి పాటిస్తున్న ఈ ద్వంద్వ ప్రమాణాలు పరిస్థితిని మరింత జటిలం చేస్తున్నాయి. ► అవిలాగే దాటవేత ధోరణి కొనసాగిస్తే ప్రపంచ సగటు ఉష్ణోగ్రతలు 2050 కల్లా ఏకంగా 2.5 డిగ్రీలు పెరగడం, మానవాళి మనుగడ పెను ప్రమాదంలో పడటం ఖాయమని స్వయంగా ఐక్యరాజ్యసమితే తాజాగా హెచ్చరించింది. సముద్రాలకు ’మహా’ ముప్పు మహా సముద్రాలలో విచ్చలవిడిగా సాగుతున్న చేపల వేటపై అంతర్జాతీయ పర్యావరణ సంస్థ గ్రీన్ పీస్ తాజా నివేదిక తీవ్ర ఆందోళన వెలిబుచి్చంది... ► 2018తో పోలిస్తే 2022 నాటికి సముద్రాల్లో చేపల వేట 8.5 శాతం పెరిగింది. ప్రత్యేక రక్షిత ప్రాంతాలైన సున్నిత సముద్ర జలాల్లోనైతే ఏకంగా 23.5 శాతం పెరిగింది. ► నిర్దిష్ట అంతర్జాతీయ సముద్ర జలా లను చేపల వేటను నిషేధించాలన్న ప్రతిపాదనలు ఏళ్ల తరబడి గ్రీన్ పీస్ చేసిన కృషి ఫలించి ఎట్టకేలకు గత మార్చిలో ఒప్పందంగా రూపుదాల్చాయి. జూన్‌లో ఐరాస కూడా దానికి ఆమోదముద్ర వేసింది. ► కానీ ఏ దేశమూ ఈ ఒప్పందాన్ని చిత్తశుద్ధితో అమలు చేస్తున్న దాఖలాలు కనిపించడం లేదని నివేదిక వాపోతోంది. ► విచ్చలవిడిగా వేట దెబ్బకు అరుదైన సముద్ర జీవరాశులు దాదాపుగా అంతరించిపోతున్నాయి. ► ఉదాహరణకు పసిఫిక్ బ్లూఫిన్ ట్యూనా చేప జాతి గత మూడు దశాబ్దాల్లోనే ఏకంగా 90 శాతానికి పైగా క్షీణించిపోయింది. ► ’30 బై 30’ లక్ష్య సాధనకు దేశాలన్నీ ఇప్పటికైనా నడుం బిగిస్తే మేలని గ్రీన్ పీస్ నివేదిక పేర్కొంది. ► ప్రపంచంలోని భూ, జలవనరులను 2030 కల్లా కనీసం 30 శాతమన్నా సంపూర్ణంగా సురక్షితంగా తీర్చిదిద్ద డమే ‘30 బై 30’ లక్ష్యం. నెట్ జీరో అంటే.. ► కర్బన ఉద్గారాలను దాదాపుగా సున్నా స్థాయికి తగ్గించడం. ► కాస్తో కూస్తో మిగిలే ఉద్గారాలను మహా సముద్రాలు, అడవుల వంటి ప్రాకృతిక వనరులు శోషించుకుంటాయన్నది సిద్ధాంతం. ► ఇందుకు ఉద్దేశించిన నిధుల్లో మూడొంతులు కీలకమైన ఇంధన, మౌలిక రంగాలపై వెచి్చంచాలన్నది లక్ష్యం. మిగతా లక్ష్యాలు ఏమిటంటే... ► రవాణా రంగాన్ని వీలైనంతగా విద్యుదీకరించడం. ► గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ‘1.5 డిగ్రీ ఉష్ణోగ్రత లక్ష్య సాధన అత్యంత పెను సవాలేనని చెప్పాలి. ఈ దశాబ్దంలో మిగిలి ఉన్న ఆరేళ్లలో ఆ దిశగా ఎంత చిత్తశుద్ధితో ప్రయతి్నస్తామన్న దానిపైనే ప్రపంచ భవిష్యత్తు చాలావరకు ఆధారపడి ఉంటుంది‘ – సైమన్ ఫ్లవర్స్ సీఈఓ, చీఫ్ స్ట్రాటజిస్ట్, వుడ్ మెకంజీ సంస్థ ‘లక్ష్యాల మాట ఎలా ఉన్నా చమురు, సహజ వాయువు పాత్ర అంతర్జాతీయ స్థాయి లో కనీసం మరి కొన్నేళ్ల పాటు కీలకంగానే ఉండనుంది‘ – ప్రకాశ్ శర్మ వైస్ ప్రెసిడెంట్, వుడ్ మెకంజీ – సాక్షి, నేషనల్ డెస్క్ -
సునాక్ ఇంటిపై నల్లవస్త్రం
లండన్: బ్రిటన్ ప్రధాని ఇంటిపై నల్లటి వ్రస్తాన్ని కప్పిన నలుగురు పర్యావరణ కార్యకర్తలను పోలీసులు గురువారం అరెస్టు చేశారు. ఉత్తర ఇంగ్లాండ్‌లో నార్త్ యార్క్‌షైర్ ప్రాంతంలోని రిచ్మండ్లో ఉన్న రిషి సునాక్ ఇంటిపై వారు నల్లటి వస్త్రం కప్పి తమ నిరసనను తెలియజేశారు. వీరు ‘గ్రీన్‌పీస్’ అనే పర్యావరణ పరిరక్షణ సంస్థలో సభ్యులుగా ఉన్నారు. సముద్రంలో చమురు, గ్యాస్ వెలికితీతను మరింత విస్తరిస్తూ సునాక్ ఇటీవల తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా ఇలా నిరసన వ్యక్తం చేశారు. సునాక్ ఇంటిపైకి ఎక్కి 200 చదరపు మీటర్ల నల్ల వస్త్రాన్ని కప్పారు. అలాగే సునాక్ ఇంటి ముందు మరో ఇద్దరు కార్యకర్తలు ‘చమురు లాభాలు ముఖ్యమా? లేక మా భవిష్యత్తు ముఖ్యమా?’ అని ప్రశ్నిస్తూ బ్యానర్‌ను ప్రదర్శించారు. ఈ సమయంలో సునాక్ కుటుంబసభ్యులెవరూ ఆ ఇంట్లో లేరు. -
దేశంలో అన్ని చోట్లా కాలుష్యమే...
న్యూఢిల్లీ: భారత్‌లో సర్వే జరిపిన 168 పట్టణాల్లో ఏ ఒక్కటీ ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) ప్రమాణాలకు అనుగుణంగాలేదని ప్రముఖ పర్యావరణ సంస్థ గ్రీన్‌పీస్ బుధవారం ప్రకటించింది. ‘ఎయిర్పోకాలైప్స్’ పేరిట 24 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో జరిపిన ఈ అధ్యయనానికి సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ), ఇతర వనరుల సేకరించిన సమాచారాన్ని ప్రాతిపదికగా తీసుకున్నారు. శిలాజాల ఇంధనాలు మండించడంతో గాలి పీల్చుకోలేనంతగా కలుషితమైందని వెల్లడైంది. దక్షిణ భారత్‌లో వరంగల్ లాంటి పట్టణాలు మాత్రం జాతీయ పరిసర వాయు నాణ్యత(ఎన్ఏఏక్యూ) ప్రమాణాలకు లోబడి ఉన్నట్లు తేలింది. -
పొరపాటున బాంబు వేశాం: ఫ్రెంచ్ ప్రధాని
ఇరవై ఐదేళ్ళ తర్వాత ఫ్రాన్స్, న్యూజిల్యాండ్ దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫ్రెంచ్ ప్రధాని మాన్యుయెల్ వాల్స్ న్యూజిల్యాండ్ లో పర్యటించడం అందుకు పెద్ద నిదర్శనంగా చెప్పాలి. అక్కడకు వెళ్ళడమేకాక, ఫ్రాన్స్ 31 ఏళ్ళ క్రితం న్యూజిల్యాండ్ పై జరిపిన దాడి పెను తప్పిదమంటూ వాల్స్ విశ్లేషించడం ఇరు దేశాలమధ్య సంబంధాలు మరింత బలపడే అవకాశం కనిపిస్తోంది. ఫ్రెంచ్ సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు గ్రీన్ పీస్ పై 31 ఏళ్ళ క్రితం జరిపిన బాంబు దాడి పెను తప్పిదమేనన్నారు ఫ్రెంచ్ ప్రధాని మాన్యుయెల్ వాల్స్. 25 సంవత్సరాల అనంతరం మొదటిసారి ఫ్రెంచ్ ప్రధాని న్యూజిల్యాండ్ ను సందర్శించారు. ఈ సందర్శన ఫ్రెంచ్, న్యూజిల్యాండ్‌ల మధ్య మైత్రిని పెంపొందించే అవకాశం ఉన్నట్లు జిన్హువా వార్తా సంస్థ అభిప్రాయపడింది. 1985 జూలైలో ఫ్రెంచ్ గూఢచారులు... ఆక్లాండ్ ప్రధాన పట్టణం పై.. రెండు భారీ మైన్లతో దాడికి పాల్పడ్డాయి. ఫసిఫిక్ లో ఫ్రాన్స్ జరుపుతున్న అణ్వస్త్ర పరీక్షలకు వ్యతిరేకంగా గ్రీన్ పీస్ ప్రచారం కొనసాగిస్తున్నసమయంలో రైన్బో వారియర్ నౌక.. బాంబుదాడితో నిమిషాల్లో నీటిలో మునిగిపోయింది. అనంతరం దాడిలో పాల్గొన్న ఇద్దరు ప్రెంచ్ సీక్రెట్ ఏజెంట్లను న్యూజిల్యాండ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 30 సంవత్సరాలక్రితం మా సంబంధం పెద్ద పవాలుగా ఉండేదని, అప్పట్లో జరిగిన బాంబు దాడి తప్పిదమేనని, దాడితో చెరిగిపోయిన ఇరుదేశాల మధ్య బంధం... తిరిగి చిగురించాలని కోరుకుంటున్నట్లు ఫ్రాన్స్ ప్రధాని వెల్లడించారు. జరిగిన తప్పిదాలను గుర్తుంచుకొని, అటువంటివి మరెప్పుడూ జరగకుండా చూసుకుంటూ...ఇరు దేశాలు కలసి అభివృద్ధి పథంలో ముందడుగు వేయాలని వాల్స్ ఆకాంక్షించారు. మరోవైపు.. బాంబు దాడి ఘోరమైన తప్పిదంగా ఫ్రాన్స్ అంగీకరించడం మంచి పరిణామమని న్యూజిల్యాండ్ ప్రధాని జాన్ కీ అభిప్రాయపడ్డారు. సోమవారం ఆక్లాండ్ లో వాల్స్ తో చర్చలు జరిపిన అనంతరం న్యూజిల్యాండ్ నష్టాన్ని, బాధను ఫ్రాన్స్ అర్థం చేసుకొందని అటువంటి సమస్యలు తిరిగి తెచ్చే అవకాశం లేదని తాను నమ్ముతున్నట్లు జాన్ కీ తెలిపారు. ఫ్రాన్స్ తన చర్యలను పెద్ద లోపంగా భావించిందని, ప్రస్తుతం ఫ్రాన్స్ ప్రధాని రాక ఇరు దేశాల మధ్య సంబంధాలను పెంచుతుందని న్యూజిల్యాండ్ ప్రధాని కీ అభిప్రాయపడ్డారు. -
గ్రీన్‌పీస్ సంస్థ రిజిస్ట్రేషన్ రద్దు
వాయు కాలుష్యం, ఇతర సమస్యలపై పోరాడుతున్న స్వచ్ఛంద సంస్థ గ్రీన్ పీస్ ఇండియా రిజిస్ట్రేషన్ రద్దయింది. తమిళనాడు రిజిస్ట్రార్ ఆఫ్ సొసైటీస్ ఈ సంస్థ గుర్తింపును శుక్రవారం రద్దుచేసింది. కావడానికి ఇది జాతీయస్థాయి సంస్థే అయినా, తమిళనాడు రిజిస్ట్రార్ ఆఫ్ సొసైటీస్ చట్టం కింద ఇది రిజిస్టర్ అయ్యింది. దాంతో అక్కడ దీని గుర్తింపును రద్దుచేశారు. ప్రజాస్వామ్యం ఆరోగ్యవంతంగా ఉండటంలో పౌరసమాజం ప్రాధాన్యం ఎంతో ఉందని ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ సహా అనేకమంది అంతర్జాతీయ నాయకులు చెప్పారని, కానీ ఇక్కడ మాత్రం తమ సంస్థ గుర్తింపును రద్దుచేయడం దారుణమని గ్రీన్ పీస్ ఓ ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేసింది. ఈ నిర్ణయాన్ని మద్రాసు హైకోర్టులో సవాలు చేయాలని ఈ సంస్థ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. -
టీ తాగబోతున్నారా.... ఒక నిమిషం ఆగండి