
దేశంలో అన్ని చోట్లా కాలుష్యమే...
న్యూఢిల్లీ: భారత్‌లో సర్వే జరిపిన 168 పట్టణాల్లో ఏ ఒక్కటీ ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) ప్రమాణాలకు అనుగుణంగాలేదని ప్రముఖ పర్యావరణ సంస్థ గ్రీన్‌పీస్ బుధవారం ప్రకటించింది. ‘ఎయిర్‌పోకాలైప్స్’ పేరిట 24 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో జరిపిన ఈ అధ్యయనానికి సమాచార హక్కు చట్టం (ఆర్‌టీఐ), ఇతర వనరుల సేకరించిన సమాచారాన్ని ప్రాతిపదికగా తీసుకున్నారు. శిలాజాల ఇంధనాలు మండించడంతో గాలి పీల్చుకోలేనంతగా కలుషితమైందని వెల్లడైంది. దక్షిణ భారత్‌లో వరంగల్ లాంటి పట్టణాలు మాత్రం జాతీయ పరిసర వాయు నాణ్యత(ఎన్‌ఏఏక్యూ) ప్రమాణాలకు లోబడి ఉన్నట్లు తేలింది.