ఎన్ఎస్ఈఎల్ స్కామ్ కేసులో జిగ్నేశ్ షా అరెస్ట్ | Jignesh Shah arrested by ED in NSEL scam | Sakshi
Sakshi News home page

ఎన్ఎస్ఈఎల్ స్కామ్ కేసులో జిగ్నేశ్ షా అరెస్ట్

Jul 13 2016 1:05 AM | Updated on Sep 15 2018 3:51 PM

ఎన్ఎస్ఈఎల్ స్కామ్ కేసులో జిగ్నేశ్ షా అరెస్ట్ - Sakshi

ఎన్ఎస్ఈఎల్ స్కామ్ కేసులో జిగ్నేశ్ షా అరెస్ట్

నేషనల్ స్పాట్ ఎక్స్ ఛేంజ్(ఎన్‌ఎస్‌ఈఎల్)లో రూ.13,000 వేల కుంభకోణం కేసుకు సంబంధించి ఫైనాన్షియల్ టెక్నాలజీస్

ముంబై: నేషనల్ స్పాట్ ఎక్స్ఛేంజ్(ఎన్‌ఎస్‌ఈఎల్)లో రూ.13,000 వేల కుంభకోణం కేసుకు సంబంధించి ఫైనాన్షియల్ టెక్నాలజీస్ (ఎఫ్‌టీఐఎల్) వ్యవస్థాకుడైన జిగ్నేశ్ షాను ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్(ఈడీ) మంగళవారం అరెస్ట్ చేసింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ-ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్) సెక్షన్ 19 కింద జిగ్నేశ్ షా అరెస్ట్ జరిగింది. దర్యాప్తునకు సరిగ్గా సహకరించలేనందున ఆయనను అరెస్ట్ చేయాల్సి వచ్చిందని ఈడీ ఉన్నతాధికారొకరు చెప్పారు. ఆయనను స్పెషల్ పీఎంఎల్‌ఏ కోర్ట్ ముందు బుధవారం ఉదయం  హాజరు పరుస్తామని పేర్కొన్నారు. జిగ్నేశ్ షా మనీల్యాండరింగ్‌కు పాల్పడ్డారనేందుకు బలమైన ఆధారాలు లభించాయని, దాంతో ఆయన కస్టడీని కోరామని వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement