Jagati Publications
-
సాక్షిలో ఆ పెట్టుబడులు సక్రమమే
-
గతంలోనూ ఇలానే..
సాక్షి, అమరావతి: జగతి పబ్లికేషన్స్ లిమిటెడ్ ఆస్తుల జప్తు చట్టబద్ధం కాదని 2018లోనే మనీ లాండరింగ్ నిరోధక అప్పిలేట్ ట్రిబ్యునల్ తేల్చి చెప్పింది. ఆ ఉత్తర్వులు చట్ట నిబంధనలకు అనుగుణంగా లేనందున, వాటిని ఎత్తివేస్తున్నట్లు అప్పట్లోనే స్పష్టం చేసింది. ఆస్తుల జప్తుపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జారీ చేసిన తాత్కాలిక ఉత్తర్వులను, ఆ ఉత్తర్వులను సమర్థిస్తూ ఈడీ అడ్జుడికేటింగ్ అథారిటీ జారీ చేసిన ఉత్తర్వులను మనీ లాండరింగ్ నిరోధక అప్పిలేట్ ట్రిబ్యునల్ 2018 ఫిబ్రవరి 13న తప్పు పట్టింది. ఈడీ తాత్కాలిక జప్తు ఉత్తర్వులను, అడ్జుడికేటింగ్ అథారిటీ ఉత్తర్వులను ట్రిబ్యునల్ రద్దు చేసింది. ఆ ఆస్తులను అన్యాక్రాంతం చేయవద్దని హైకోర్టు ఇప్పటికే స్పష్టమైన ఉత్తర్వులు ఇచ్చిన నేపథ్యంలో వాటి జప్తు ఎంతమాత్రం అవసరం లేదని చెప్పింది. చార్జ్‌షీట్‌లోని ఆరోపణలను మనీ లాండరింగ్ చట్టం కింద నేరంగా భావించలేమని స్పష్టం చేసింది. -
సాక్షిలో ఆ పెట్టుబడులు సక్రమమే
సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: సాక్షి మీడియాలోకి వచ్చిన పెట్టుబడులన్నీ సక్రమమేనని, చట్టబద్ధమేనని స్పష్టమయింది. జగతి పబ్లికేషన్స్‌లో ఇన్వెస్టర్లంతా చట్టానికి లోబడే పెట్టుబడులు పెట్టారని, ఇన్వెస్ట్మెంట్ల స్వీకరణలో కంపెనీలు చట్టప్రకారం పాటించాల్సిన నిబంధనలన్నిటినీ జగతి పబ్లికేషన్స్ పాటించిందని ఆదాయపు పన్ను శాఖ అప్పిలేట్ ట్రిబ్యునల్ స్పష్టంచేసింది. ఈ కంపెనీలోకి పెట్టుబడులన్నీ క్విడ్–ప్రో–కో రూపంలో వచ్చాయి కనుక వాటిని ఆదాయంగా పరిగణించి, ఆ మొత్తంపై పన్ను చెల్లించాలంటూ 2011లో నాటి ఐటీ అధికారి ఇచ్చిన నోటీసులను ఐటీఏటీ కొట్టివేసింది. ఐటీ విభాగం తమ వాదనకు మద్దతుగా సమర్పించిన సీబీఐ ఛార్జిషీటును... అసలు సాక్ష్యంగానే పరిగణించలేమని తెగేసి చెప్పింది. సాక్ష్యానికి ఉండాల్సిన కనీస లక్షణాలేవీ ఆ ఛార్జిషీట్లకు లేవని కూడా బెంచ్ వ్యాఖ్యానించింది. ‘‘ఆ ఛార్జిషీట్లలో ఉన్నవన్నీ సీబీఐ చేసిన ఆరోపణలే తప్ప నిరూపితమైనవేమీ కావు. అయినా మీరు నోటీసులిచ్చిన అసెస్మెంట్ ఇయర్ దాటి ఇప్పటికి పదేళ్లు గడిచింది. మీరేమైనా దర్యాప్తు చేశారా? క్విడ్ ప్రోకో ఆరోపణలు నిరూపించే ఆధారాలు సంపాదించారా? సీబీఐ ఆరోపణలనే సాక్ష్యంగా సమర్పిస్తే ఎలా? సీబీఐ ఛార్జిషీట్లకు ఎలాంటి హేతుబద్దతా లేదు. ఈ కేసులో అవి అనవసరం, అప్రస్తుతం కూడా’’ అని జ్యుడీషియల్, అకౌంటింగ్ సభ్యులతో కూడిన ట్రిబ్యునల్ బెంచ్ తేల్చిచెప్పింది. తద్వారా... సాక్షి మీడియాలోకి వచ్చిన పెట్టుబడులపై పదేళ్లుగా టీడీపీ అధిపతి చంద్రబాబు నాయుడు, ఆయన గ్యాంగ్‌లోని ఎల్లో మీడియా పనిగట్టుకుని చేస్తున్న దుష్ప్రచారానికి తెరవేసినట్లయింది. సుదీర్ఘకాలం విచారించి, ఇరుపక్షాల వాదనలూ సమగ్రంగా విన్న అనంతరం గతనెల 23న బెంచ్ 153 పేజీల ఉత్తర్వులను వెలువరించింది. నాటి ఐటీ అధికారి ఇచ్చిన ఉత్తర్వు చెల్లదంటూ... అందులో పేర్కొన్నట్లుగా పన్ను చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టంచేసింది. ప్రీమియాన్ని ఆదాయమంటారా? 2008–09 అసెస్మెంట్ సంవత్సరంలో సాక్షి మీడియా గ్రూపునకు చెందిన జగతి పబ్లికేషన్స్‌లో పలువురు ఇన్వెస్టర్లు, పారిశ్రామికవేత్తలు ఇన్వెస్ట్ చేశారు. రూ.10 ముఖ విలువగల షేరుకు 350 రూపాయలు ప్రీమియం చెల్లించి కొనుగోలు చేశారు. ఈ ప్రీమియం రూపంలో వచ్చిన రూ.277 కోట్లను ఆదాయంగా పేర్కొంటూ... దానిపై పన్ను చెల్లించాలని 2011లో నాటి ఐటీ అధికారి సంస్థకు నోటీసులిచ్చారు. జగతి సంస్థ దాన్ని సవాలు చేసింది. వివిధ విచారణల అనంతరం అదిపుడు ఐటీ ట్రిబ్యునల్ ముందుకు వచ్చింది. షేర్లను విక్రయించటం ద్వారా సమీకరించిన పెట్టుబడిని ఏ కంపెనీ అయినా మూలధనంగా పరిగణిస్తుంది. కానీ... ముఖ విలువ రూపంలో స్వీకరించిన షేరుకు రూ.10ని మాత్రం చట్టబద్ధమైనదిగా... సక్రమమైనదిగా పేర్కొన్న ఐటీ అధికారి... ఆయా ఇన్వెస్టర్లకు ప్రభుత్వం వివిధ ప్రాజెక్టులు కట్టబెట్టిందని, అందుకే అంత ప్రీమియానికి వారు ఇన్వెస్ట్ చేశారని, క్విడ్ ప్రోకో రూపంలో వచ్చిన ప్రీమియాన్ని ఆదాయంగా పరిగణించాలని ఐటీ అధికారి పేర్కొనటాన్ని బెంచ్ తప్పుబట్టింది. దీనికి సాక్ష్యంగా ప్రత్యేక కోర్టులో సీబీఐ దాఖలు చేసిన ఛార్జిషీట్లను తమకు సమర్పించడాన్ని కూడా బెంచ్ ఆక్షేపించింది. ‘‘షేర్ ముఖ విలువ రూపంలో వచ్చిన సొమ్ము సహేతుకమే అంటున్నారు. దానిపై ఎలాంటి అభ్యంతరాలూ వ్యక్తంచేయటం లేదు. జగతి సంస్థ కార్యకలాపాల విషయంలోనూ ఎలాంటి అభ్యంతరాలూ లేవు. వారి అభ్యంతరమల్లా షేర్ ప్రీమియంపై మాత్రమే’’ అంటూ ఒక కంపెనీ పెట్టిన మొత్తంలో కొంత సక్రమం, మరికొంత అక్రమం ఎలా అవుతుందని బెంచ్ ప్రశ్నించింది. దీన్ని ఇంకోలా చూద్దామంటూ.... ‘‘ఒకే కంపెనీ!. ముఖ విలువ పెట్టినపుడేమో సక్రమమైనది. షేర్ ప్రీమియం విషయంలో మాత్రం సక్రమం కాకుండా పోతుందా? ఒకే కంపెనీ విషయంలో అధికారి ఇలా రెండు రకాలుగా ఎలా ఆలోచిస్తారు? కాబట్టి రూ.277 కోట్లు పెట్టుబడిగానే వచ్చిందని, ఆదాయం కాదని మేం భావిస్తున్నాం’’ అని బెంచ్ తేల్చిచెప్పింది. ఒక్కొక్కరికీ ఒక్కో‘లా’ ఎలా? ‘‘కొందరు ఇన్వెస్టర్ల విషయంలో ఇదే సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంలో మెమో దాఖలు చేసింది. వారి విషయంలో ఎలాంటి క్విడ్ ప్రో కో లావాదేవీలూ జరగలేదని స్పష్టంగా చెప్పింది. పోనీ... మిగతా ఇన్వెస్టర్ల విషయంలో క్విడ్‌ప్రోకో జరిగిందని కూడా ఆ మెమోలో చెప్పలేదు. మరి క్విడ్ ప్రో కో అని మీరెలా అంటారు?’’ అని బెంచ్ తన ఉత్తర్వుల్లో ఐటీ విభాగాన్ని ప్రశ్నించింది. ప్రయివేటు లిమిటెడ్‌లో షేరు ప్రీమియం అనేది ఇన్వెస్టర్లతో జరిగే చర్చలు, వారి అంచనాల వల్లే నిర్ణయమవుతుందని పేర్కొంది. వాల్యుయేషన్ నివేదిక నిజమేగా? పెట్టుబడులకు సంబంధించి ఇన్వెస్టర్లకు వాల్యుయేషన్ నివేదికలు చూపించారని, ఆ నివేదికలు కంపెనీ వేసిన అంచనాలు, కంపెనీ ఇచ్చిన సమాచారం మేరకే రూపొందించారని, అవి సరైనవి కావని ఐటీ విభాగం పేర్కొంది. దానిప్రకారం షేరు ప్రీమియాన్ని నిర్ణయించటం సరికాదన్న వానదతో బెంచ ఏకీభవించలేదు. ‘‘వాల్యుయేషన్ రిపోర్టును అస్సలు తప్పు బట్టడానికి లేదు. అందులో పేర్కొన్న అంచాలన్నీ సాక్షి పత్రిక విషయంలో నిజమయ్యాయి. అనుకున్నట్లుగానే సర్క్యులేషన్ పెరిగింది. పోటీపత్రిక ఈనాడు గుత్తాధిపత్యం తగ్గింది. పోటీ పత్రిక 30 ఏళ్లలో సాధించిన సర్క్యులేషన్‌ను సాక్షి ఏడాదిన్నరలోనే సాధించింది. కనక వాల్యుయేషన్ నివేదికను తప్పుబట్టలేం. సాక్షి యాజమాన్యానికి అనుభవం లేకున్నా అంత ప్రీమియం తీసుకున్నారనే వాదన అర్ధరహితం. వారి లీడర్‌షిప్‌లో ఆ పత్రిక అంచనాలన్నిటినీ అందుకుంది. కాబట్టి క్విడ్ ప్రో కో వాదనకు అర్థమే లేదు’’ అని బెంచ్ పేర్కొంది. ఇన్వెస్టర్ల వాదనను గమనించారా? సాక్ష్యాలుగా సమర్పించిన పలు వాదనల్లో నిమ్మగడ్డ గ్రూపు సంస్థల డైరెక్టరు నిమ్మగడ్డ ప్రకాశ్ చేసిన వాదనను బెంచ్ ప్రస్తావించింది. ‘‘ఈనాడులో పెట్టుబడులకోసం బ్లాక్‌స్టోన్ అనుకున్న విలువలో 20 శాతం డిస్కౌంట్‌కే సాక్షిలో వాటా దొరికింది. 5 ప్రాధాన్య రంగాల్లో పెట్టుబడులు పెడదామని అనుకున్నాం. అందులో మీడియా ఒకటి. అందుకే సాక్షిలో పెట్టాం’’ అనే వ్యాఖ్యల్ని పరిగణనలోకి తీసుకోవాలని బెంచ్ వ్యాఖ్యానించింది. వచ్చిన పెట్టుబడులు షేరు ముఖ విలువ రూపంలో వచ్చాయా? ప్రీమియం రూపంలోనా? అనేది అప్రస్తుతమని, అది ఆదాయమా? కాదా? అన్నదే ప్రశ్న అని... ఆదాయంగా పరిగణించలేమని విస్పష్టంగా తేల్చిచెప్పింది. తెలియని మార్గాలంటే ఎలా? కోల్‌కతాలోని కొన్ని కంపెనీల నుంచి వచ్చిన రూ.15 కోట్లను తెలియని మార్గాల నుంచి వచ్చిన మొత్తంగా ఐటీ విభాగం పేర్కొంది. దాన్ని బెంచ్ తప్పుబడుతూ... కోల్‌కతా కంపెనీలతో సహా పెట్టుబడి ప్రతి కంపెనీకి సంబంధించిన పాన్, రిజిస్ట్రేషన్ నెంబరు, అడ్రసు వంటి వివరాలన్నీ జగతి సంస్థ సమర్పించిందని, అన్నీ చట్టబద్ధంగానే ఉన్నపుడు ‘గుర్తు తెలియని ఆదాయం’ ఎలా అవుతుందని ప్రశ్నించింది. -
రాజకీయ దురుద్దేశాలతోనే పిటిషన్
సాక్షి, హైదరాబాద్: ‘ఎంపీ రఘురామకృష్ణరాజు వ్యక్తిగత ప్రయోజనాలతోను, రాజకీయ దురుద్దేశాలతోను నా బెయిల్‌ను రద్దు చేయాలంటూ పిటిషన్ దాఖలు చేశారు. ఇది చట్టప్రక్రియను దుర్వినియోగం చేయడమే..’ అని సీఎం వైఎస్ జగన్ సీబీఐ ప్రత్యేక కోర్టుకు నివేదించారు. పిటిషన్ దాఖలు చేసిన తీరు, అందులో వాడిన భాష ఆయన దురుద్దేశాన్ని స్పష్టం చేస్తున్నాయని తెలిపారు. అవాస్తవాలు, తప్పుడు ఆరోపణలు, అభూత కల్పనలతో ఈ పిటిషన్ దాఖలు చేశారని, ప్రత్యేక కోర్టు విధించిన బెయిల్ షరతులను తాను ఎప్పుడూ ఉల్లంఘించలేదని జగన్ తెలిపారు. సీఎం జగన్‌బెయిల్‌ను రద్దుచేయాలంటూ రఘురామ దాఖలు చేసిన పిటిషన్‌పై జగన్ తరఫు న్యాయవాది జి.అశోక్‌రెడ్డి మంగళవారం సీబీఐ ప్రత్యేక కోర్టులో కౌంటర్ దాఖలు చేశారు. ఓ సాక్షిని జగతి పబ్లికేషన్స్ ఇంటర్వ్యూ చేసిందన్న కారణంగా 2017లో బెయిల్ రద్దుచేయాలంటూ సీబీఐ దాఖలు చేసిన పిటిషన్‌ను ప్రత్యేక కోర్టు కొట్టివేసిందని తెలిపారు. జగన్ బెయిల్ షరతులను ఉల్లంఘించలేదని, ఆయన బెయిల్‌ను రద్దు చేయాల్సిన అవసరం లేదని కోర్టు స్పష్టం చేసిందన్నారు. కరోనా నియంత్రణలో భాగంగా సీఎం హోదాలో చర్యలు తీసుకోవాల్సి ఉన్నందునే కోర్టు విచారణకు హాజరుకాలేకపోతున్నానని, తాను హాజరుకాకపోయినా విచారణకు ఎక్కడా అంతరాయం కలగలేదని తెలిపారు. వ్యక్తిగత ద్వేషంతో రాజకీయంగా ప్రయోజనం పొందాలని దాఖలు చేసే ఈ తరహా పిటిషన్లు ఎంతమాత్రం విచారణార్హం కాదని పేర్కొన్నారు. అందువల్ల ఈ పిటిషన్‌ను కొట్టివేయాలని కోరారు. రఘురామ అనేక కేసుల్లో నిందితుడు బెయిల్ రద్దుచేయాలని కోరే హక్కు థర్డ్‌పార్టీకి లేదని అనేక కేసుల్లో సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పులిచ్చిందని తెలిపారు. హైకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ ప్రత్యేక కోర్టు రోజువారీ పద్ధతిలో ఈ కేసులను విచారిస్తోందని, నిందితుల డిశ్చార్జ్ పిటిషన్లపై వాదనలు వింటోందని తెలిపారు. విచారణను జాప్యం చేస్తున్నారంటూ రఘురామ పేర్కొనడం కోర్టు ధిక్కరణకు పాల్పడమేనని పేర్కొన్నారు. రఘురామ వాస్తవాలను దాచి ఈ పిటిషన్ దాఖలు చేశారని తెలిపారు. ఆయనపై బ్యాంకుల నుంచి రుణంగా తీసుకున్న రూ.947.71 కోట్లకుపైగా ఎగ్గొట్టారనే తీవ్రమైన ఆరోపణలున్నాయని, సీబీఐ నమోదు చేసిన 2 కేసుల్లో నిందితుడని తెలిపారు. ఆయనపై 7 క్రిమినల్ కేసులున్నాయని పేర్కొన్నారు. వైఎస్సార్సీపీ విధానాలకు విరుద్ధంగా వ్యవహరించినందున ఎంపీగా ఆయన్ని అనర్హుడిగా ప్రకటించాలని కోరుతూ గతేడాది లోక్‌సభ స్పీకర్‌కు ఫిర్యాదు చేసినట్లు కౌంటర్లో జగన్ వివరించారు. దీనిపై రిజాయిండర్ దాఖలు చేసేందుకు గడువు ఇవ్వాలని రఘు న్యాయవాదులు కోరడంతో విచారణను న్యాయమూర్తి ఈనెల 14కు వాయిదా వేశారు. కాగా, ఈ పిటిషన్‌పై చట్టప్రకారం తగిన నిర్ణయం తీసుకోవాలని సీబీఐ ప్రత్యేక కోర్టులో మెమో దాఖలు చేసింది. -
కక్ష గట్టి కృష్ణ కిషోర్‌ను సస్పెండ్ చేశారు
సాక్షి, అమరావతి: జగతి పబ్లికేషన్స్ వ్యవహారంపై నిక్కచ్చిగా ఆడిట్ చేసినందుకే ఐఆర్ఎస్ అధికారి కృష్ణకిషోర్‌పై కక్ష గట్టి పద్ధతి లేకుండా ఆయన్ను సస్పెండ్ చేశారని ప్రతిపక్ష నేత ఎన్.చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ఇది ఉన్మాది చర్య కాకుంటే మరేంటన్నారు. శుక్రవారం టీడీపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మూకుమ్మడిగా తనపై దాడి చేయాలనుకుంటున్నారని, మీరింతలా కక్ష సాధిస్తారని తెలిస్తే ప్రజలు వైఎస్సార్సీపీకి అధికారం ఇచ్చేవారు కాదని అన్నారు. సభలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, మంత్రులకు స్పీకర్ ఎప్పుడంటే అప్పుడు మైక్ ఇస్తున్నారన్నారు. 14 ఏళ్లు సీఎంగా చేసిన వ్యక్తిని అడ్డుకునే అధికారం చీఫ్ మార్షల్‌కు ఉంటుందా? అని మండిపడ్డారు. చీఫ్ మార్షల్‌ను బాస్టర్డ్ అన్నానని వక్రీకరించారని, సబ్జెక్ట్ డైవర్ట్ చేయడానికి అనని మాటలు అన్నట్లు చెబుతున్నారని అన్నారు. సీఎం విలువలు, విశ్వసనీయత లేకుండా మాట్లాడుతున్నారన్నారు. కృష్ణకిషోర్ అంశం చర్చకు రాకుండా సబ్జెక్ట్ డైవర్ట్ చేశారని ఆరోపించారు. సీఎంపై సభాహక్కుల నోటీసిచ్చామని చెప్పారు. ఇదిలా ఉంటే.. ‘ప్రతిపక్ష సభ్యుల్ని అసెంబ్లీకి రాకుండా అడ్డుకోవడమనే అప్రజాస్వామిక చర్యలకు పాల్పడింది వైఎస్సార్సీపీవాళ్లే. తిరిగి నేనే అనని పదాన్ని అన్నట్లుగా వాళ్లు సభలో సృష్టించారు. ఎంత కోపంలోనైనా వైఎస్సార్సీపీ వాళ్లలాగా సంస్కారహీనమైన భాష ఉపయోగించడం, అమర్యాదకరంగా ప్రవర్తించడం నాకు రాదు’ అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు. -
‘జగతి’ ఎఫ్‌డీఆర్‌ను వెంటనే విడుదల చేయండి
సాక్షి, అమరావతి: జగతి పబ్లికేషన్స్, రాంకీ గ్రూపు ఆస్తుల జప్తు విషయంలో ఈడీ, అడ్జ్యుడికేటింగ్ అథారిటీల తీరును మనీ లాండరింగ్ అప్పిలేట్ ట్రిబ్యునల్ తప్పుపట్టింది. జగతి పబ్లికేషన్స్, రాంకీ సంస్థ లేవనెత్తిన అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకోకుండా, అందుబాటులో ఉన్న ఆధారాలను పట్టించుకోకుండా ఏకపక్ష వైఖరిని అవలంభించిందని పేర్కొంది. జగతి పబ్లికేషన్స్ ఎఫ్డీఆర్ జప్తు విషయంలో అడ్జ్యుడికేటింగ్ అథారిటీ ఉత్తర్వులను పాక్షికంగా సవరించింది. రూ.10 కోట్ల ఎఫ్‌డీఆర్‌ను వెంటనే జప్తు నుంచి విడుదల చేయాలని ఆదేశించింది. ఆ రూ.10 కోట్ల మొత్తానికి సమానమైన ఇండెమ్నిటీ బాండ్‌ను హామీగా ఈడీకి సమర్పించాలని జగతి పబ్లికేషన్స్‌కు స్పష్టం చేసింది. ఈ మేరకు ట్రిబ్యునల్ చైర్మన్ జస్టిస్ మన్మోహన్సింగ్ శుక్రవారం తీర్పు వెలువరించారు. మిగిలిన ఆస్తులను వెంటనే విడుదల చేయండి ప్రత్యేక కోర్టు తుది తీర్పునిచ్చేంత వరకు ఫార్మా సిటీ లోపల 50 మీటర్ల బఫర్ జోన్‌ను కొనసాగించాలని అప్పిలెట్ ట్రిబ్యునల్ రాంకీ ఫార్మాస్యూటికల్ సిటీ లిమిటెడ్‌ను ఆదేశించింది. దీని విషయంలో మాత్రం జప్తు కొనసాగుతుందని, మిగిలిన ఆస్తులను జప్తు నుంచి వెంటనే విడుదల చేయాలని తేల్చి చెప్పింది. అనుకూలంగా ఉత్తర్వులు వచ్చేంత వరకు బఫర్ జోన్లో ఎటువంటి నిర్మాణాలు చేపట్టడం గానీ, బఫర్ జోన్ ప్రాంతాన్ని అమ్మడం గానీ చేయరాదని రాంకీని ఆదేశించింది. అలాగే 16 ప్లాట్లను వెంటనే రాంకీ సంస్థకు స్వాధీనం చేయాలని ఈడీ అధికారులకు స్పష్టం చేసింది. ఈ ప్లాట్లను విక్రయించడం గానీ, ఇందులో నిర్మాణాలు చేపట్టడం గానీ, థర్డ్ పార్టీ హక్కులు సృష్టించడం గానీ చేయరాదని రాంకీకి సూచించింది. ఆరోపణల నిరూపణ బాధ్యత ఈడీదే జగతి పబ్లికేషన్స్‌కు చెందిన రూ.10 కోట్ల ఎఫ్‌డీఆర్‌ను, అలాగే రాంకీ గ్రూపునకు చెందిన పలు ఆస్తులను ఈడీ జప్తు చేసిన సంగతి తెలిసిందే. ఈ జప్తును సమర్థిస్తూ ఈడీ అడ్జ్యుడికేటింగ్ అథారిటీ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ జగతి పబ్లికేషన్స్, రాంకీ సంస్థ అప్పిలేట్ ట్రిబ్యునల్ ముందు వేర్వేరుగా అప్పీళ్లు దాఖలు చేశాయి. ఈ అప్పీళ్లపై సుదీర్ఘ విచారణ జరిపిన ట్రిబ్యునల్ చైర్మన్ జస్టిస్ మన్మోహన్సింగ్ అడ్జ్యుడికేటింగ్ అథారిటీ ఉత్తర్వులను పాక్షికంగా సవరిస్తూ తాజాగా తీర్పు వెలువరించారు. ఈ మొత్తం కేసులో ప్రత్యేక కోర్టు ఇంకా అభియోగాలు నమోదు చేయలేదన్నారు. అభియోగాలను నమోదు చేయనంత వరకు వ్యక్తులపై, సంస్థలపై మనీ లాండరింగ్ ఆరోపణలు చేశారో, ఆ ఆరోపణలను నిరూపించాల్సిన బాధ్యత ఈడీపై ఉంటుందన్నారు. ఈ కేసులో రాంకీ గ్రూపు ‘కళంకిత డబ్బు’తో భూములు కొన్నట్లు ఈడీ ఆధారాలు చూపలేదని తెలిపారు. రాంకీతో చంద్రబాబు ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందంలోని కొన్ని కీలక క్లాజులను ఈడీ, అడ్జ్యుడికేటింగ్ అథారిటీ విస్మరించాయని వెల్లడించారు. ఫార్మా ఇండస్ట్రియల్ పార్కు గ్రీన్‌బెల్ట్ ఏరియాను 50 మీటర్లకు తగ్గించినందుకే రాంకీ గ్రూపు జగతి పబ్లికేషన్స్‌లో రూ.10 కోట్లు పెట్టుబడి పెట్టిందన్నది సీబీఐ ప్రధాన ఆరోపణ. సీబీఐ చార్జిషీట్ ఆధారంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) కేసు నమోదు చేసింది. అదే చార్జిషీట్ ఆధారంగానే రాంకీ, జగతి పబ్లికేషన్స్ ఆస్తులను జప్తు చేసింది. ఆ జప్తును అడ్జ్యుడికేటింగ్ అథారిటీ సమర్థించింది. అయితే, మనీ లాండరింగ్ కింద ఈడీ స్వతంత్రంగా దర్యాప్తు చేయలేదు. సీబీఐ ఆరోపణలను ఆధారంగా చేసుకుంటూ జప్తు ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే మనీ లాండరింగ్ కింద తాను చేసిన ఆరోపణలను నిరూపించాల్సిన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించడంలో ఈడీ విఫలమైంది. ఆ రూ.10 కోట్లు ‘లంచం’ అని ప్రాథమికంగా నిరూపించలేకపోయింది. కేవలం అనుమానాలు, ఊహల ఆధారంగానే జగతి పబ్లికేషన్స్, రాంకీ ఆస్తులను ఈడీ జప్తు చేసింది. రాష్ట్రంలో ఫార్మా రంగం అభివృద్ధి కోసం 18.7.2000న అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఓ టాస్క్‌ఫోర్స్ ఏర్పాటైంది. విశాఖపట్నం పరవాడలో 2,162.5 ఎకరాల్లో ఫార్మా ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వం ఏపీఐఐసీకి అప్పగించింది. రాంకీ గ్రూపునకు చెందిన రాంకీ ఫార్మాస్యూటికల్ సిటీ ఇండియా లిమిటెడ్ (ఆర్‌పీసీఐఎల్) ఫార్మా ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకు సుముఖత వ్యక్తం చేయడంతో 12.3.2004న ఏపీఐఐసీ–ఆర్‌పీసీఐఎల్ మధ్య జాయింట్ వెంచర్ కింద ఒప్పందం జరిగింది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగిన ఈ ఒప్పందంలో గ్రీన్‌బెల్ట్ గురించి ప్రస్తావనే లేదు. అయినప్పటికీ ఎటువంటి వివాదాలు లేకుండా ఉండేందుకు 50 మీటర్ల గ్రీన్‌బెల్ట్‌కు అంగీకరించినట్లు రాంకీ చెప్పింది. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రి కాకముందే ఈ ఒప్పందం జరిగింది. – మనీ లాండరింగ్ అప్పిలేట్ ట్రిబ్యునల్ చైర్మన్ జస్టిస్ మన్మోహన్సింగ్ -
జగతి పబ్లికేషన్స్‌కు హైకోర్టు ఊరట
ఈ నెల 17 వరకు అభియోగాల నమోదు వద్దంటూ సీబీఐ కోర్టుకు ఆదేశం సాక్షి, హైదరాబాద్: జగతి పబ్లికేషన్స్‌కు ఉమ్మడి హైకోర్టులో ఊరట లభించింది. జగన్ కంపెనీల్లో పెట్టుబడులకు సంబంధించి సీబీఐ నమోదు చేసిన కేసుల్లో ఈ నెల 17వ తేదీ దాకా ఎలాంటి అభియోగాల నమోదు ప్రక్రియా చేపట్టొద్దని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానాన్ని హైకోర్టు ఆదేశించింది. న్యాయమూర్తి జస్టిస్ ఎం.సీతారామమూర్తి ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. సీబీఐ నమోదు చేసిన కేసుల్లో ఒకేసారి అభియోగాల నమోదు చేపట్టేందుకు నిరాకరిస్తూ సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం జారీ చేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ జగతి పబ్లికేషన్స్ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేయడం తెలిసిందే. వీటిపై న్యాయమూర్తి గురువారం మరోసారి విచారణ జరిపారు. వేర్వేరుగా అభియోగాల నమోదు ప్రక్రియ చేట్టడం వల్ల తమకు కలిగే నష్టాన్ని జగతి పబ్లికేషన్స్ తరఫున సీనియర్ న్యాయవాదులు టి.నిరంజన్‌రెడ్డి, డి.వి.సీతారామ్మూర్తి ఈ సందర్భంగా న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. తరువాత సీబీఐ తరఫు న్యాయవాది పి.కేశవరావు వాదనలు వినిపిస్తూ ఈ వ్యాజ్యాలకు విచారణార్హత లేదన్నారు. ఈ వ్యాజ్యాలపై విచారణకు సమయం పడుతున్నందున వారం పాటు అభియోగాల నమోదు ప్రక్రియను నిలిపేస్తే అభ్యంతరమేమైనా ఉందా అని న్యాయమూర్తి ప్రశ్నించారు. వారం పాటైతే అభ్యంతరం లేదని కేశవరావు పేర్కొనడంతో 17 వరకు అభియోగాల నమోదు ప్రక్రియ చేపట్టవద్దని ఆదేశించారు. విచారణను ఈ నెల 14కు వాయిదా వేశారు. వ్యాజ్యాలన్నింటినీ రెగ్యులర్ కోర్టు ముందుంచాలని రిజిస్ట్రీని ఆదేశించారు. -
ఈడీ కేసు సీబీఐ ప్రత్యేక కోర్టుకు బదిలీ..
♦ జగతి, విజయసాయిరెడ్డి పిటిషన్ల అనుమతి ♦ హైకోర్టు ఉత్తర్వులు సాక్షి, హైదరాబాద్: జగతి పబ్లికేషన్స్‌లో రూ.34.65 కోట్ల పెట్టుబడులకు సంబంధించిన వ్యవహారంలో ఎన్ఫోర్స్మెంట్ డెరైక్టరేట్ (ఈడీ) నమోదు చేసిన కేసును మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి(ఎంఎస్‌జే) కోర్టు నుంచి సీబీఐ ప్రత్యేక న్యాయస్థానానికి బదిలీ చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఎంఎస్‌జే కోర్టులో జరుగుతున్న ఈడీ కేసు విచారణను సీబీఐ ప్రత్యేక న్యాయస్థానానికి బదిలీ చేయాలంటూ ఆడిటర్ వి.విజయసాయిరెడ్డి, జగతి పబ్లికేషన్స్ దాఖలు చేసుకున్న పిటిషన్లను హైకోర్టు అనుమతించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ రాజా ఇలంగో ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు. జగతి పబ్లికేషన్స్‌లో ఎ.కె.దండమూడి, టి.ఆర్.కన్నన్, మాధవ్ రామచంద్రన్‌లు పెట్టిన పెట్టుబడులకు సంబంధించి సీబీఐ కేసు నమోదు చేసి చార్జిషీట్ కూడా దాఖలు చేసింది. అలాగే ఈడీ కూడా కేసు నమోదు చేయగా.. దీనిపై ఎంఎస్‌జే కోర్టు విచారణ జరుపుతోంది. ఒకే అంశానికి సంబంధించి రెండు కోర్టులు వేర్వేరుగా విచారణ జరపడం వల్ల తమకు నష్టం జరుగుతుందని, అందువల్ల ఈడీ కేసును సీబీఐ కోర్టుకు బదిలీ చేయాలంటూ జగతి పబ్లికేషన్స్, విజయసాయిరెడ్డి హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు వేశారు. పిటిషనర్ల తరఫున న్యాయవాది ఎస్.నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. జగతిలో పెట్టుబడులకు సంబంధించి సీబీఐ కేసును ఎంఎస్‌జే కోర్టుకు బదిలీ చేయాలన్న ఈడీ అభ్యర్థనను సీబీఐ కోర్ట్టు తిరస్కరించిందన్నారు. ఈడీ కేసుల్ని విచారించే పరిధిని సీబీఐ కోర్టుకు కల్పిస్తూ ఇటీవల కేంద్రం జారీచేసిన ఉత్తర్వుల్ని న్యాయస్థానం దృష్టికి ఆయన తీసుకొచ్చారు. ఈడీ కేసును సీబీఐ ప్రత్యేక న్యాయస్థానానికి బదిలీ చేసేందుకు తమకు ఎలాం టి అభ్యంతరం లేదని ఈడీ తరఫు న్యాయవాది పి.ఎస్.పి.సురేష్‌కుమార్ తెలిపారు. అయితే సీబీఐ కేసుతోపాటు ఈడీ కేసునూ విచారించేలా సీబీఐ కోర్టును ఆదేశించాలన్నారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. ఎంఎస్‌జే కోర్టులో ఉన్న ఈడీ కేసును సీబీఐ కోర్టుకు బదిలీ చేస్తూ ఉత్తర్వులిచ్చారు. అయితే సీబీఐ కేసుతోపాటు ఈడీ కేసును కూడా విచారించాలని ఆదేశాలివ్వడం సాధ్యం కాదని, దీనిపై సీబీఐ కోర్టే నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. -
విచారణ ప్రారంభించండి
సాయిరెడ్డి పిటిషన్‌పై ఈడీ కౌంటర్ హైదరాబాద్: వైఎస్ జగన్మోహన్రెడ్డి కంపెనీల్లో పెట్టుబడులకు సంబంధించి నమోదు చేసిన కేసులో.. జగతి పబ్లికేషన్స్ సంస్థలో పెట్టుబడులపై దర్యాప్తు పూర్తిచేసి చార్జిషీట్ దాఖలు చేశామని, ఇందులో విచారణ ప్రారంభించాలని ఈడీ న్యాయస్థానానికి నివేదించింది. మనీలాండరింగ్ నిరోధక (పీఎంఎల్) చట్టం ప్రకారం దర్యాప్తు పూర్తిచేసి చార్జిషీట్ దాఖలు చేశామని పేర్కొంది. ఈడీ నమోదు చేసి ఈసీఐఆర్ పేర్కొన్న ఆరోపణలపై దర్యాప్తు ఏ దశలో ఉందో స్పష్టం చేయాలని కోరుతూ ఈడీని ఆదేశించాలని, అప్పటివరకు న్యాయస్థానంలో విచారణను ఆపాలని కోరుతూ ఆడిటర్ వేణుంబాక విజయసాయిరెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై ఈడీ తరఫు న్యాయవాది సురేష్‌కుమార్ బుధవారం కౌంటర్ దాఖలు చేశారు. జగతిలో పెట్టుబడులపై దాఖలు చేసిన చార్జిషీట్‌కు ఇతర ఆరోపణలతో సంబంధం లేదని తెలిపారు. నేర విచారణచట్టం (సీఆర్పీసీ)నిబంధనల మేరకు ప్రాథమిక సమాచార నివేదిక (ఎఫ్ఐఆర్) నమోదు చేస్తారని, దాన్ని వెంటనే కోర్టుకు అందజేయాల్సి ఉంటుందని.. అయితే పీఎంఎల్ చట్టం ప్రకారం ఈసీఐఆర్ ఈడీ దర్యాప్తు కోసం నమోదుచేసే అంతర్గత పత్రమని తెలిపారు. ఈసీఐఆర్‌ను కోర్టుకు సమర్పించాల్సిన అవసరంలేదని, ఈసీఐఆర్‌కు ఎటువంటి చట్టబద్ధత లేదని చెప్పారు. ఈ నేపథ్యంలో ఈసీఐఆర్పై దర్యాప్తు ఏ దశలో ఉందో స్పష్టం చేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేయడం విచారణార్హం కాదన్నారు. ఇప్పటికే దాఖలు చేసిన చార్జిషీట్‌పై విచారణ ప్రారంభించినా నిందితులకు ఎటువంటి నష్టం లేదని పేర్కొన్నారు. ఈ కౌంటర్‌ను పరిశీలించిన న్యాయమూర్తి టి.రజని విచారణను ఆగస్టు 14కు వాయిదా వేశారు. కాగా ఈ కేసు విచారణలో భాగంగా వైఎస్ జగన్మోహన్రెడ్డి, వి.విజయసాయిరెడ్డిలు కోర్టు ముందు హాజరయ్యారు. -
జగతి ఆస్తుల అటాచ్‌మెంట్‌పై తీర్పు రిజర్వ్
సాక్షి, న్యూఢిల్లీ: జగతి పబ్లికేషన్స్‌కు చెందిన రూ.34.65 కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్ల (ఎఫ్డీలు) అటాచ్మెంట్ కేసును ఢిల్లీలోని పీఎంఎల్ఏ న్యాయ ప్రాధికార సంస్థ మంగళవారం విచారించింది. అథారిటీ చైర్మన్ కె.రామమూర్తి, సభ్యుడు ముఖేశ్‌కుమార్ ఎదుట జగతి తరఫు న్యాయవాది రవి గుప్తా, ఎన్ఫోర్స్మెంట్ డెరైక్టరేట్ (ఈడీ) న్యాయవాది విపుల్‌కుమార్ తుది విడత వాదనలు వినిపించారు. అనంతరం కేసు విచారణ పూర్తయిందన్న అథారిటీ.. ఇరుపక్షాలు లిఖితపూర్వకంగా వాదనలు సమర్పించడానికి వారంపాటు గడువునిస్తూ తీర్పును రిజర్వ్ చేసింది. తొలుత రవిగుప్తా వాదిస్తూ.. జగతి పబ్లికేషన్స్ ఆస్తుల అటాచ్మెంట్ విషయంలో ఎన్ఫోర్స్మెంట్ డెరైక్టరేట్ (ఈడీ) వాదన పూర్తిగా అసంబద్ధం, లొసుగులమయమని పేర్కొన్నారు. ‘‘మెరిట్ ఆధారంగా ఈడీ పెట్టిన కేసును అంగీకరించినప్పటికీ అటాచ్‌మెంట్‌పై వారు తీసుకున్న చర్య పీఎంఎల్ఏ సెక్షన్ 5(1)(బీ) ప్రకారం నిలవదు’’ అని నివేదించారు. అనంతరం ఈడీ తరఫు న్యాయవాది వాదిస్తూ.. హైకోర్టు ఆదేశాలు, సీబీఐ చార్జిషీట్, ఐటీ నివేదికల్లోని విషయాలతోపాటు దర్యాప్తులో వెల్లడైన అంశాలంటూ గతంలో ఏకరువుపెట్టిన విషయాలనే పునరుద్ఘాటించారు. జగతిలో పెట్టుబడులు పెట్టిన ముగ్గురు వ్యాపారవేత్తలు.. టి.ఆర్.కణ్ణన్, మాధవ్ రామచంద్ర, ఎ.కె.దండమూడి నుంచి తీసుకున్న స్టేట్మెంట్లలోని అంశాలను ప్రస్తావించారు. -
అటాచ్మెంట్ అసమంజసం
పీఎంఎల్ఏ న్యాయ ప్రాధికార సంస్థ ముందు ‘జగతి’ న్యాయవాది వాదన సాక్షి, న్యూఢిల్లీ: జగతి పబ్లికేషన్స్‌కు చెందిన ఆస్తుల అటాచ్మెంట్ పూర్తిగా అసమంజసమని, మనీ లాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) నిబంధనల స్ఫూర్తిని దెబ్బతీసేలా ఎన్ఫోర్స్మెంట్ డెరైక్టరేట్(ఈడీ) వ్యవహరించిందని జగతి పబ్లికేషన్స్ తరఫు న్యాయవాది రవి గుప్తా వాదించారు. జగతి పబ్లికేషన్స్‌కి చెందిన రూ. 34.65 కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్ల(ఎఫ్డీలు) అటాచ్మెంట్ కేసుపై ఢిల్లీలోని పీఎంఎల్ఏ న్యాయ ప్రాధికార సంస్థ (అడ్జుడికేటింగ్ అథారిటీ) మంగళవారం విచారణ జరిపింది. అథారిటీ చైర్మన్ కె.రామమూర్తి, సభ్యుడు ముకేశ్‌కుమార్ ముందు రవి గుప్తా వాదనను వినిపించారు. పీఎంఎల్ఏ నిబంధనలు ఏ సందర్భంలో ఆస్తుల్ని అటాచ్ చేయాలో స్పష్టంగా చెబుతున్నాయని, ‘క్విడ్ ప్రో కో’ అనేదే జరగని ఈ కేసులో ఆ నిబంధనలను ఉపయోగించడం సరికాదన్నారు. ‘సంస్థలో పెట్టుబడులను అక్రమాల తాలూకు సొమ్ముగా చెబుతున్న ఈడీ అదెలాగో మాత్రం చూపడం లేదు. ఆస్తుల అటాచ్‌మెంట్‌కు తగిన కారణాలు చూపాలి. వారు పెట్టిన కేసు లోపభూయిష్టమైనందున అటాచ్మెంట్ ఉత్తర్వును కొట్టివేయాలి’ అని విన్నవించారు. పెట్టుబడులు పెట్టిన ముగ్గురు వ్యాపారవేత్తలు టి.ఆర్.కణ్ణన్, మాధవ్ రామచంద్ర, ఎ.కె.దండమూడి ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రయోజనాన్నీ పొందలేదని కూడా రికార్డులు స్పష్టం చేస్తున్నాయని వివరించారు. అలాంటప్పుడు వారి పెట్టుబడులను ‘క్విడ్ ప్రో కో’గా ఎలా అభివర్ణిస్తారని ప్రశ్నించారు. రవి గుప్తా వాదనల తర్వాత అథారిటీ తదుపరి విచారణను ఈ నెల 15వ తేదీకి వాయిదావేసింది. -
‘క్విడ్ ప్రో కో’ లేనే లేదు
పీఎంఎల్ఏ అడ్జుడికేటింగ్ అథారిటీ ఎదుట ‘జగతి’ వాదనలు కణ్ణన్, మాధవ్ రామచంద్ర, దండమూడి ప్రభుత్వం నుంచి ఏ ప్రయోజనాలూ పొందలేదు ఆ ముగ్గురూ ప్రభుత్వం నుంచి ఏదైనా లబ్ధి పొందివుంటే అందుకు ఆధారాలు చూపాలని ఈడీకి అథారిటీ ఆదేశం సాక్షి, న్యూఢిల్లీ: జగతి పబ్లికేషన్స్‌లో పెట్టుబడుల వెనుక ‘క్విడ్ ప్రో కో’ అనేది ఎక్కడా లేదని, వ్యాపారవేత్తలు టి.ఆర్.కణ్ణన్, మాధవ్ రామచంద్ర, ఎ.కె.దండమూడి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రయోజనాలూ పొందలేదని జగతి పబ్లికేషన్స్ తరఫు న్యాయవాది రవిగుప్తా చెప్పారు. ఈ ముగ్గురూ అత్యంత సహజమైన వ్యాపార దృష్టితో లాభాలనాశించి జగతి పబ్లికేషన్స్‌లో పెట్టుబడులు పెడితే ఆ కారణంగా ప్రభుత్వానికి నష్టం వాటిల్లిందని ఎన్ఫోర్స్మెంట్ డెరైక్టరేట్ (ఈడీ) చెప్పడం పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేశారు. జగతి పబ్లికేషన్స్‌కు చెందిన రూ.34.65 కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్ల (ఎఫ్డీలు) అటాచ్మెంట్ కేసును ఢిల్లీలోని పీఎంఎల్ఏ న్యాయ ప్రాధికార సంస్థ (అడ్జుడికేటింగ్ అథారిటీ) శుక్రవారం విచారించింది. అథారిటీ చైర్మన్ కె.రామమూర్తి, సభ్యుడు ముకేశ్‌కుమార్ ఎదుట రవిగుప్తా దాదాపు మూడుగంటల పాటు వాదనలు వినిపించారు. ఆగస్టు 27న విచారణ సందర్భంగా అసంపూర్ణంగా ముగించిన వాదనను కొనసాగిస్తూ.. ఆ వ్యాపారవేత్తలు పెట్టిన పెట్టుబడులతో ప్రభుత్వానికి నష్టమే లేనప్పుడు అసలు ఇది పీఎంఎల్ఏ కేసు ఎలా అవుతుందని ప్రశ్నించారు. నష్టం జరిగిందంటున్న ఈడీ అదెలా జరిగిందో వివరాలు మాత్రం చెప్పడం లేదని అథారిటీ దృష్టికి తీసుకువచ్చారు. జగతిలోకి వచ్చిన పెట్టుబడులు ముడుపులు అవునో కాదో ఈడీ ఆధారసహితంగా చూపకుండా, క్విడ్ ప్రో కోని నిరూపించకుండా ఇష్టానుసారం ఆస్తుల అటాచ్‌మెంట్‌కు దిగడం అసమంజసమని అన్నారు. జగతిలో పెట్టుబడులు పెట్టిన కణ్ణన్, మాధవ్ రామచంద్ర, దండమూడి వాటికి తగ్గ షేర్లు పొందారు. వారు నష్టపోయిందే లేనప్పుడు ఇందులో ప్రభుత్వానికి వచ్చిన నష్టమేంటి?’’ అని ఆయన ప్రశ్నించారు. ‘పెట్టుబడులను పెట్టినవారిని సంస్థ మోసం చేస్తే అది తప్పవుతుంది కానీ అసలు పెట్టుబడుల్ని తీసుకోవడాన్నే నేరంగా పేర్కొనడం విడ్డూరం..’ అని అన్నారు. నిజానికి ఈ కేసులో ఇన్వెస్టర్లను మోసం చేయడమన్నదే జరగలేదంటూ, అలా చేసినట్టుగా వారెవరూ ఫిర్యాదు చేయని సంగతినీ ఆయన అథారిటీ దృష్టికి తీసుకొచ్చారు. కణ్ణన్, మాధవ్ రామచంద్ర, దండమూడి తొలుత ఈ కేసులో నిందితులుగా ఉన్నారని, తర్వాత వారు ప్రాసిక్యూషన్ తరఫున సాక్షులుగా మారి స్టేట్మెంట్లు ఇచ్చారని రవిగుప్తా తెలిపారు. ఈ కేసు వ్యవహారాలు తలాతోకా లేకుండా నడుస్తున్నాయనడానికి ఇదొక నిదర్శనమని అన్నారు. సొమ్ముకు తగిన షేర్లు పొందారు... ‘‘కణ్ణన్, మాధవ్ రామచంద్ర, దండమూడి... ఈ ముగ్గురూ మోసపోయారా అంటే లేనే లేదు. పెట్టిన సొమ్ముకు తగ్గ షేర్లను పొందారు. తమ వ్యాపారాలను భిన్నరంగాల్లోకి విస్తరించుకునే ఉద్దేశంతో వారు స్వీయ నిర్ణయం మేరకే పెట్టుబడులు పెట్టారు. ‘జగతి’లో పెట్టుబడులు పెట్టేటప్పుడు ఈ ముగ్గురికీ చేసిన వాగ్దానాలను అనంతర కాలంలో నెరవేర్చలేదని చెబుతున్నారు. అలాగైతే అది వారికి, సంస్థకు మధ్య వ్యవహారం. దీంట్లో పీఎంఎల్ఏకి సంబంధం ఏమిటి? వారు పెట్టుబడులు పెట్టింది ప్రభుత్వం నుంచి పొందిన లబ్ధికి ప్రతిఫలంగానేనని ఈడీ ఆరోపిస్తోంది. దీనికేమో ఆధారాలు చూపడం లేదు. ఎలా చూసినా ఇది క్విడ్‌ప్రో కో కేసు కానీ, సర్కార్‌కు నష్టం జరిగిన కేసు కానీ కానే కాదు..’’ అని రవిగుప్తా వాదించారు. ఈ వాదనలు ఆలకించిన అథారిటీ... ఈ ముగ్గురు ఇన్వెస్టర్లు ప్రభుత్వం నుంచి ఏదైనా లబ్ధి పొందివుంటే అందుకు ఆధారాలను చూపాల్సిందిగా ఈడీని ఆదేశించింది. సీబీఐ పెట్టిన కేసు ఆధారంగా ఈడీ దర్యాప్తును సాగించి అటాచ్మెంట్లకు దిగినందున ఆధారాల విషయంలో సీబీఐని సంప్రదించాలని సూచించింది. కేసు తదుపరి విచారణను అక్టోబర్ 8వ తేదీకి వాయిదా వేస్తూ, ఆ రోజు సదరు ఆధారాల వివరాలను తమ ముందుంచాలని ఈడీ తరఫు న్యాయవాది విపుల్కుమార్కు స్పష్టం చేసింది. -
ఈ ఏడాది లాభాల్లోకి ‘సాక్షి’
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: గత రెండేళ్లుగా ‘సాక్షి’ ఎదుర్కొంటున్న గడ్డు పరిస్థితులు త్వరలో తొలగిపోనున్నాయని జగతి పబ్లికేషన్స్ చైర్పర్సన్ వై.ఎస్.భారతి రెడ్డి చెప్పారు. ఈ ఏడాది చివరికల్లా ‘సాక్షి’ లాభాల్లోకి వస్తుందని, వచ్చే ఏడాది ఇన్వెస్టర్లకు ఆ లాభాల్లో వాటాను అందించే స్థాయికి చేరుకుంటుందని ఆశిస్తున్నామని తెలియజేశారు. శనివారం ‘సాక్షి’ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఏడవ వార్షిక సర్వసభ్య సమావేశంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘గతేడాది ప్రభుత్వ ప్రకటనలపై ఆంక్షలు విధించడం వల్ల ఆదాయం గణనీయంగా తగ్గింది. ఇప్పుడు ఆ పరిస్థితులు సద్దు మణిగాయి. అన్నీ సజావుగా సాగుతున్నాయి’’ అని చెప్పారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని రాజకీయంగా దెబ్బతీయడానికి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వివిధ కేసులు పెట్టినప్పటికీ 1.43 కోట్ల రీడర్షిప్తో... జాతీయ, ప్రాంతీయ దినపత్రికల్లో ఏడో స్థానంతో సాక్షి ముందుకెళుతోందని భారతిరెడ్డి చెప్పారు. సాక్షిని మరింత మంది పాఠకులకు చేరువ చేయడానికి మొబైల్ అప్లికేషన్స్, సాక్షి పోస్ట్‌తో వెబ్‌పోర్టల్‌ను మరింత ఆధునీకరించినట్లు ఆమె తెలియజేశారు. సమావేశంలో పాల్గొన్న జగతి పబ్లికేషన్స్ ఫైనాన్స్ డెరైక్టర్ వై.ఈశ్వర్ ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కొన్ని నెలలు లాభాలు వచ్చినా ఉద్యమ ప్రభావం వలన ప్రకటనల ఆదాయం తగ్గిందన్నారు. ఈ ఆర్థిక సంవత్సరాంతానికి తిరిగి లాభాల్లోకి రాగలమని ఆశాభావం వ్యక్తం చేశారు. 2014-15 సంవత్సరం జగతి పబ్లికేషన్స్ పూర్తిస్థాయిలో లాభాల్లోకి వస్తుందన్న నమ్మకం ఉందన్నారు. జగతి పబ్లికేషన్స్ కంపెనీ సెక్రటరీ సి.పి.ఎన్.కార్తీక్ ప్రవేశపెట్టిన 2012-13 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బ్యాలెన్స్ షీట్‌ను ఆమోదించటంతో పాటు హెచ్.వి.ఈశ్వరయ్య, ఎ.ఎన్.ప్రకాష్ రాజులను డెరైక్టర్లుగా తిరిగి నియమిస్తూ ప్రవేశపెట్టిన తీర్మానానికి కూడా వాటాదారులు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. -
ప్రభుత్వానికి నష్టమెలా: జగతి న్యాయవాదులు
తమ సంస్థలో పెట్టుబడులపై పీఎంఎల్ఏ అథారిటీ ముందు ‘జగతి’ వాదనలు అసలు ఇది మనీలాండరింగ్ కేసు ఎలా అవుతుంది? ప్రభుత్వం నుంచి పెట్టుబడిదారులకు దక్కిన ప్రయోజనాలేంటి? వారేమైనా నష్టపోయినట్లు ఫిర్యాదు చేశారా? అవేవీ లేనపుడు ‘జగతి’ డిపాజిట్లు ఎలా అటాచ్ చేస్తారు? తదుపరి విచారణ వచ్చేనెల 27కు వాయిదా సాక్షి, న్యూఢిల్లీ: వ్యాపారవేత్తలు టి.ఆర్.కణ్ణన్, మాధవ్ రామచంద్ర, ఎ.కె.దండమూడి మున్ముందు లాభాలొస్తాయనే ఉద్దేశంతోనే జగతి పబ్లికేషన్స్‌లో పెట్టుబడులు పెట్టారని, ప్రభుత్వం నుంచి లబ్ధి పొంది అందుకు ప్రతిగా జగతిలోకి నిధులు తరలించారనడం పూర్తిగా అవాస్తవమని జగతి పబ్లికేషన్స్ తరఫు న్యాయవాది రవి గుప్తా స్పష్టంచేశారు. జగతి పబ్లికేషన్స్‌కు చెందిన రూ.34.65 కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్ల (ఎఫ్డీలు) అటాచ్మెంట్ కేసుపై ఢిల్లీలోని పీఎంఎల్ఏ న్యాయ ప్రాధికార సంస్థ చైర్మన్ కె.రామమూర్తి ఎదుట మంగళవారం ఆయన ఈ మేరకు వాదనలు వినిపించారు. ఆ ఇన్వెస్టర్లూ ఎలాంటి ప్రభుత్వ ప్రాజెక్టులూ చేపట్టలేదని, ఈడీ మాత్రం వారు జగతిలో పెట్టిన పెట్టుబడులతో ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లిందంటోందని, ఆ నష్టం వివరాలు మాత్రం చెప్పటం లేదని తెలియజేశారు. ‘‘ఒక సంస్థలో ఎవరైనా లాభాలు వస్తాయన్న ఉద్దేశంతో పెట్టుబడులు పెడితే దాంతో ప్రభుత్వ ఖజానాకు నష్టమెలా వస్తుంది? పైగా మోసం చేశారని అనడమేంటి? అసలు ఇది మనీలాండరింగ్ కేసు ఎలా అవుతుంది?’’ అని ఆయన ప్రశ్నించారు. ఎమ్మెల్యే శంకర్రావు ఒక లేఖ రాస్తే దాన్నే పిటిషన్‌గా పరిగణించారని, హైకోర్టు అమికస్ క్యూరీని నియమించినా ఆయన పిటిషనర్ కోసమేనని చెప్పారు. ‘‘అమికస్ క్యూరీ స్వతంత్రంగా నివేదిక ఇచ్చినట్లు ఈడీ చెబుతోంది. కానీ ఆయన్ను పిటిషనర్ ప్రయోజనాలను పరిరక్షించేందుకు కోర్టు నియమించింది. పిటిషనర్ ప్రతినిధిగా మారినపుడు అమికస్ క్యూరీ స్వతంత్ర అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం ఎలా సాధ్యం? ఆ నివేదిక నిష్పాక్షికమైనదని ఎలా చెబుతారు’’ అని ఆయన అన్నారు. హైకోర్టు చెప్పిందొకటి.. ఎఫ్ఐఆర్ ఒకటి.. చార్జిషీట్ మరొకటి హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులో ఉన్నది ఒకటైతే ఎఫ్ఐఆర్లో పేర్కొన్న అంశాలు వేరని, ఇక చార్జిషీట్లో పొందుపరిచిన అంశాలకు అసలు సంబంధమే లేదని రవి గుప్తా వివరించారు. ఈడీ వాదన పొంతన లేకుండా ఉందని చెప్పారు. పెట్టుబడి పెట్టిన ముగ్గురూ.. తర్వాత ప్రాసిక్యూషన్ తరఫు సాక్షులుగా మారారని, వారి స్టేట్మెంట్లను ఈడీ రికార్డు చేసిందని, ప్రభుత్వం నుంచి దక్కిన లబ్ధికి ప్రతిఫలంగానే పెట్టుబడులు పెట్టామని వారెక్కడా చెప్పలేదని వివరించారు. డెలాయిట్ నివేదికపై ఈడీ ఆరోపణలను ఆయన ఖండించారు. ‘‘ఆ నివేదిక సాయంతో ఇన్వెస్టర్లను మోసం చేస్తే అది వారికి, కంపెనీకి మధ్య చీటింగ్ కేసు. అది కూడా కంపెనీల చట్టం కింద. అంతేతప్ప ఇందులో ప్రభుత్వాన్ని మోసం చేయడమనేది ఎక్కడుంది? దీనిపై పీఎంఎల్ఏ కేసు ఎలా పెడతారు?’’ అని ప్రశ్నించారు. జగతి షేర్లను రూ.350 చొప్పున విక్రయించ డం అక్రమం అనడాన్ని ప్రస్తావిస్తూ... ‘ఈనాడు’ని ప్రచురించే ఉషోదయా ఎంటర్ప్రైజెస్ సంస్థ తమ షేర్లను రూ.5.28 లక్షల ప్రీమియంతో విక్రయించిందని, ఆది నుంచీ నష్టాల్లోనే ఉంటూ 30 ఏళ్లుగా అదే ఒరవడిని సాగించిన సంస్థ ఇంత భారీ ధరకు షేర్లను విక్రయించగా లేనిది అత్యధిక సర్క్యులేషన్‌తో మార్కెట్లోకి ప్రవేశించిన జగతి తన షేర్లను రూ.350ధరకు విక్రయించడం తప్పెలా అవుతుందని రవి గుప్తా ప్రశ్నించారు. కణ్ణన్ ఎలా నష్టపోయారు?: ‘‘జయలక్ష్మి టెక్స్టైల్స్ డెరైక్టర్ కణ్ణన్ ఆంధ్రప్రదేశ్‌లో జయజ్యోతి సిమెంట్ ఫ్యాక్టరీని స్థాపించారు. దీనికి సంబంధించి ఏ ఒక్కటి కూడా వైఎస్సార్ హయాంలో జరగలేదు. ఆయన జగతిలో పెట్టిన రూ.5 కోట్ల పెట్టుబడులకు షేర్లు పొందారు. ఇక్కడ ప్రభుత్వానికొచ్చిన నష్టమేంటి? కణ్ణన్ ఎలా నష్టపోయారు? ఎన్నారై వ్యాపారవేత్త మాధవ్ రామచంద్ర రూ.19.65 కోట్లను జగతిలో పెట్టారు? ఇందులో పీఎంఎల్ఏ కేసుకు ఆస్కారమెక్కడ? ఎ.కె.దండమూడి రూ.10 కోట్లు పెట్టి ఈక్విటీ షేర్లను పొందారు. ఇక్కడా పీఎంఎల్ఏ సెక్షన్లు ఎలా వస్తాయి? తమ డబ్బును వ్యాపార లాభాల కోసం ఎక్కడైనా ఎవరైనా పెట్టుకోవచ్చుగా’’ అని రవి వాదించారు. అంతకుముందు ఈడీ తరఫు న్యాయవాది విపుల్‌కుమార్ వాది స్తూ... ఆ ముగ్గురి పెట్టుబడుల వల్ల ప్రభుత్వానికి నష్టం వాటిల్లిందన్నారు. ఆ నిధు లు ముడుపులుగా తేల్చామని, అందుకే 34.65 కోట్ల జగతి ఫిక్స్డ్ డిపాజిట్లను అటాచ్ చేశామని చెప్పారు. తర్వాత రవి గుప్తా వాదనలు వినిపిస్తుండగా.. విపుల్‌కుమార్ లేచి, తాను మరో కేసుకు హాజరవ్వాల్సి ఉన్నందున మరో రోజున వాదనలు వినాలని కోరారు. ఇందుకు రామమూర్తి సమ్మతిస్తూ తదుపరి విచారణను సెప్టెంబర్ 27కు వాయిదా వేశారు. -
జగతి ఎఫ్‌డీల కేసు విచారణ 27కి వాయిదా
సాక్షి, న్యూఢిల్లీ: జగతి పబ్లికేషన్స్‌కు చెందిన రూ.34.65 కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్ల(ఎఫ్డీలు)ను ఎన్ఫోర్స్మెంట్ డెరైక్టరేట్(ఈడీ) అటాచ్ చేయడానికి సంబంధించిన కేసులో పీఎంఎల్ఏ న్యాయ ప్రాధికార సంస్థ చేపట్టిన విచారణ ఈ నెల 27వ తేదీకి వాయిదా పడింది. ఢిల్లీలోని పీఎంఎల్ఏ న్యాయ ప్రాధికార సంస్థ చైర్మన్ కె.రామమూర్తి ఎదుట బుధవారం ఈ కేసు విచారణకు వచ్చింది. ఈడీ లేవనెత్తిన పలు అంశాలపై కౌంటర్ దాఖలు చేయడానికి తమకు కొంత వ్యవధి కావాలని ఈ సందర్భంగా జగతి తరఫు న్యాయవాది రవిగుప్తా అభ్యర్థించారు. ఇందుకు సమ్మతించిన రామమూర్తి.. ఇరుపక్షాల న్యాయవాదులను సంప్రదించిన అనంతరం ఈ నెల 27కి విచారణను వాయిదావేశారు.