చేసిందంతా చేసి.. నంగనాచి కబుర్లా చంద్రబాబూ: మంత్రి బొత్స | Botsa Satyanarayana Fires On Chandrababu And Nimmagadda | Sakshi
Sakshi News home page

చేసిందంతా చేసి.. నంగనాచి కబుర్లా చంద్రబాబూ: మంత్రి బొత్స

Published Mon, Apr 1 2024 1:41 PM | Last Updated on Mon, Apr 1 2024 2:54 PM

Botsa Satyanarayana Fires On Chandrababu And Nimmagadda - Sakshi

సాక్షి, విశాఖపట్నం: ఈనాడు, ఆంధ్రజ్యోతి ప్రజలను ఫూల్స్‌ను చేస్తున్నాయని మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, పెన్షన్లను అడ్డుకొని వారే తప్పుడు రాతలు రాస్తున్నాయని ధ్వజమెత్తారు. ‘‘ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసిందెవరు? సిటిజన్‌ ఫర్‌ డెమొక్రసీ పేరుతో ఫిర్యాదు చేశారు. సిటిజన్‌ ఫర్‌ డెమొక్రసీ సంస్థకు నిమ్మగడ్డ రమేష్‌ అధ్యక్షుడు. చంద్రబాబును దేవుడు క్షమించడు’’ అని మంత్రి బొత్స ధ్వజమెత్తారు.

‘‘వికలాంగులకు, పెన్షనర్లకు ఏం సమాధానం చెప్తారు?. ప్రతిదీ రాజకీయం చేస్తారా? మానవత్వం ఉండొద్దా?. చేసిందంతా చేసి నంగనాచి కబుర్లు చెబుతున్నారు. నిమ్మగడ్డ రమేష్‌ను అడ్డుపెట్టుకుని కుంత్రంతాలు పన్నారు. ఇన్ని నెలలు వాలంటీర్లు పెన్షన్లు పంపిణీ చేస్తే అప్పుడు రాని ఇబ్బంది ఇప్పుడెందుకు వచ్చింది’’ అంటూ మంత్రి నిలదీశారు.

చీపురుపల్లి పోటీపై  మంత్రి బొత్స కామెంట్స్‌
బొత్సకు రెండు కొమ్ములు.. కళా వెంకట్రావుకు మూడు కొమ్ములు వుంటాయా?. ఎన్నికలు ఎక్కడైనా ఒక్క తీరుగానే జరుగుతాయి. మూడు అక్షరాల గంటా పోయి.. రెండు అక్షరాల కళా వచ్చాడు తప్ప అంతకు మించిన మార్పు లేదు.

వాలంటీర్లు రాజీనామాలపై స్పందించిన బొత్స
ఏదో ఒక కారణంతో రిజైన్ చేస్తే వాళ్ల అభ్యర్థన పరిశీలించి నిర్ణయం తీసుకుంటాం. రాజకీయ లబ్ధి కోసం ప్రజలను ఫూల్స్ చేద్దాం అనుకుని చంద్రబాబు ఫూల్ అయ్యాడు.

ఇదీ చదవండి: వలంటీర్లంటేనే వణికిపోతున్న పెత్తందారులు 


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement