Vanpic case
-
వాన్‌పిక్ ప్రాజెక్ట్ లిమిటెడ్‌కు ఊరట
-
వాన్‌పిక్ ప్రాజెక్ట్స్‌పై కీలక తీర్పు వెలువరించిన సీజే జస్టిస్ ఉజ్జల్ భుయాన్
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కంపెనీల్లో పెట్టుబడులకు సంబంధించిన వ్యవహారంలో తెలంగాణ హైకోర్టు తాజాగా కీలక తీర్పు వెలువరించింది. వాన్‌పిక్ ద్వారా పలు ప్రయోజనాలు కల్పించినందుకు నిమ్మగడ్డ ప్రసాద్ జగతి పబ్లికేషన్స్‌లో పెట్టుబడులు పెట్టారని ఆరోపిస్తూ వాన్‌పిక్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్‌పై సీబీఐ నమోదు చేసిన కేసును హైకోర్టు కొట్టి వేసింది. చట్టం అనుమతినిస్తే మినహా కంపెనీపై వచ్చిన నేరారోపణలకు, కంపెనీ చర్యలకు దాని చైర్మన్‌నుగానీ, ఆ కంపెనీని నడుపుతున్న వ్యక్తులను గానీ బాధ్యులుగా చేయడానికి వీల్లేదని స్పష్టం చేసింది. వాన్‌పిక్ ప్రాజెక్ట్స్పె సీబీఐ నమోదు చేసిన అభియోగ పత్రాన్ని (చార్జిషీట్) విచారణ నిమిత్తం పరిగణలోకి (కాగ్నిజెన్స్) తీసుకునేటప్పుడు సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం యాంత్రికంగా వ్యవహరించిందని హైకోర్టు తేల్చి చెప్పింది. అభియోగపత్రాన్ని విచారణకు స్వీకరిస్తూ ఉత్తర్వులు జారీ చేసే సమయంలో సీబీఐ కోర్టు మెదడు ఉపయోగించలేదని ఘాటు వ్యాఖ్యలు చేసింది. వాన్‌పిక్ ప్రాజెక్ట్స్ అనేది ఓ వ్యక్తి కాదనే విషయాన్ని సీబీఐ కోర్టు పరిగణలోకి తీసుకోలేదని పేర్కొంది. అంతేకాక వాన్‌పిక్ ప్రాజెక్ట్స్పైగానీ, దానికి నేతృత్వం వహిస్తున్న నిమ్మగడ్డ ప్రసాద్పైగానీ సీబీఐ ఆరోపణలకు ప్రాథమిక ఆధారాలున్నాయని సంతృప్తి చెందేందుకు సీబీఐ కోర్టు ఎలాంటి కారణాలను నమోదు చేయలేదని తేల్చి చెప్పింది. చార్జిషీటు, దానితో జత చేసిన డాక్యుమెంట్లు, ఆఫీసు నోటు, కోర్టు తీర్పులను మాత్రమే సీబీఐ కోర్టు పరిశీలించిందని తెలిపింది. సీబీఐ ఆరోపణలకు ఓ కార్పొరేట్ సంస్థగా వాన్పిక్స్ ప్రాజెక్ట్స్ లేదా దాని చైర్మన్‌గా ప్రాథమిక ఆధారాలున్నాయా? కార్పొరేట్ సంస్థ చేసినట్లు ఆరోపిస్తున్న నేరాలకు చైర్మన్ మాత్రమే బాధ్యత వహించాలా? అన్న విషయంలో సీబీఐ ఎలాంటి కారణాలను నమోదు చేయలేదని హైకోర్టు స్పష్టం చేసింది. కార్పొరేట్ సంస్థ ఓ వ్యక్తి కాదని, అలాంటి కంపెనీ లేదా కార్పొరేషన్ నేరస్తుడైతే, అందుకు సంబంధించిన బాధ్యతను దాని డైరెక్టర్లకు గానీ, ఆ కంపెనీని నడుపుతున్న వ్యక్తులకుగానీ యాంత్రికంగా ఆపాదించడానికి వీల్లేదని తేల్చి చెప్పింది. నేరస్తులు కంపెనీకి చెందిన వారన్న కారణంతో కంపెనీ తప్పులకు వారిని యాంత్రికంగా బాధ్యులుగా చేయడానికి వీల్లేదంది. చైర్మన్‌గా నిమ్మగడ్డ ప్రసాద్ ప్రాతినిధ్యం వహిస్తున్న కార్పొరేట్ సంస్థ అయిన వాన్‌పిక్ ప్రాజెక్ట్స్‌పై క్రిమినల్ ప్రాసిక్యూషన్‌కు అనుమతినిచ్చినట్లయితే అంతిమ న్యాయం చేసినట్లు కాదని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భుయాన్ గురువారం కీలక తీర్పు వెలువరించారు. నిరంజన్‌రెడ్డి వాదనలతో ఏకీభవించిన సీజే... సీబీఐ తమపై నమోదు చేసిన కేసును కొట్టి వేయాలని కోరుతూ వాన్‌పిక్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ 2016లో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ వ్యాజ్యంపై ఇటీవల వాదనలు విని తీర్పు రిజర్వ్ చేసిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భుయాన్ గురువారం తీర్పు వెలువరించారు. సహేతుక కారణాలు చూపకుండానే సీబీఐ దాఖలు చేసిన చార్జిషీట్‌ను సీబీఐ కోర్టు కాగ్నిజెన్స్‌లోకి తీసుకుందన్న వాన్‌పిక్ ప్రాజెక్ట్స్ తరఫు సీనియర్ న్యాయవాది టి.నిరంజన్‌రెడ్డి వాదనతో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ భుయాన్ ఏకీభవించారు. వాన్‌పిక్ ప్రాజెక్టŠస్ లాంటి కృత్రిమ వ్యక్తిని ప్రాసిక్యూట్ చేసేందుకు అవసరమైన ప్రాథమిక ఆధారాలు లేవని, ఈ విషయాన్ని కింది కోర్టు పూర్తిగా విస్మరించిందన్న నిరంజన్‌రెడ్డి వాదనను సైతం జస్టిస్ భుయాన్ పరిగణలోకి తీసుకున్నారు. చార్జిషీట్‌ను కాగ్నిజెన్స్‌లోకి తీసుకోవడం అన్నది మెదడు ఉపయోగించి చేయాల్సిన ప్రక్రియ అని, అది యాంత్రికంగా చేసే ప్రక్రియ ఎంత మాత్రం కాదని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పిందని ప్రధాన న్యాయమూర్తి తన తీర్పులో పేర్కొన్నారు. అలాంటప్పుడు నేరాన్ని ఆపాదించరాదు... ‘కాగ్నిజెన్స్ తీసుకునే విషయంలో మేజిస్ట్రేట్‌కు విస్తృత అధికారం ఉన్నప్పటికీ న్యాయపరంగా సహేతుక రీతిలో ఉపయోగించాలి. నేరం గురించి నిందితులకు అవగాహన కల్పించే విషయంలో కాగ్నిజెన్స్ అన్నది ఓ ప్రక్రియ అంటూ సుప్రీంకోర్టు పలు తీర్పుల్లో స్పష్టంగా చెప్పింది. కాగ్నిజెన్స్ అన్నది మేజిస్ట్రేట్ ఫిర్యాదులో పేర్కొన్న ఆరోపణలను, నమోదు చేసిన వాంగ్మూలాలను పరిగణలోకి తీసుకుని, నిందితులు చట్టాన్ని ఉల్లంఘించారా? లేదా? అన్న దానిపై దృష్టి సారించడానికే తప్ప, వ్యక్తులను కోర్టు ముందు హాజరుపరచడానికి, కోర్టు ముందుకు పిలిచేందుకు ఉపయోగించే యాంత్రిక ప్రక్రియ ఎంతమాత్రం కాదు. నేరపూరిత ఉద్దేశంతో కంపెనీ లేదా దానిని నడిపిస్తున్న వ్యక్తులు నేరం చేసినట్లైతే ఆ నేరానికి ఆ కంపెనీని, ఆ వ్యక్తులను బాధ్యులుగా చేయవచ్చు. అయితే ఏ ఏ సందర్బాల్లో అలా బాధ్యులుగా చేయవచ్చో సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది. కంపెనీ చేసిన నేరానికి ఆ కంపెనీని నడిపిస్తున్న వ్యక్తులను బాధ్యులుగా చేయాలంటే అందుకు చట్టం అనుమతినించి ఉండాలి. నేరంలో ఆ వ్యక్తుల పాత్ర ఉన్నట్లు నిర్దిష్ట ఆధారాలు ఉంటే, నేరానికి ఆ వ్యక్తులను బాధ్యులుగా చేయవచ్చు. ఈ సందర్భాల్లో మినహా మిగిలిన సందర్భాల్లో కంపెనీ చేసిన నేరానికి ఆ కంపెనీని నడిపిస్తున్న వ్యక్తులను యాంత్రికంగా బాధ్యులుగా చేయడానికి ఎంత మాత్రం వీల్లేదు. ఈ విషయాన్ని సుప్రీంకోర్టు తన తీర్పుల ద్వారా చాలా స్పష్టంగా చెప్పింది.’అని జస్టిస్ భుయాన్ స్పష్టం చేశారు. స్వతఃసిద్ధ అధికారాలను ఉపయోగించొచ్చు... ‘క్రిమినల్ కేసుల్లో నిందితులకు సమన్లు జారీ చేయడం అన్నది చాలా తీవ్రమైన విషయం. క్రిమినల్ లాను అమలు చేసే చర్య ఇది. సమన్లు జారీ చేయాలంటే, సంబంధిత మేజిస్ట్రేట్ నిందితులైన మేనేజింగ్ డైరెక్టర్, కంపెనీ సెక్రటరీ, ఇతర డైరెక్టర్లకు వ్యతిరేకంగా ప్రాథమికాధారాలు ఉన్నాయని సంతృప్తి చెందుతూ అందుకు కారణాలను నమోదు చేయాలి. ప్రస్తుత కేసులో కూడా సీబీఐ కోర్టు వాన్‌పిక్ ప్రాజెక్ట్స్, దాని చైర్మన్ నిమ్మగడ్డ ప్రసాద్‌కు వ్యతిరేకంగా ప్రాథమిక ఆధారాలున్నాయని సంతృప్తి చెందేందుకు ఎలాంటి కారణాలను నమోదు చేయలేదు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం కంపెనీ చేసిన నేరాన్ని దాని చైర్మన్‌కు ఆపాదించడానికి ఎంత మాత్రం వీల్లేదు. అంతిమ న్యాయం అందించేందుకు, న్యాయ ప్రక్రియ దుర్వినియోగాన్ని అడ్డుకునేందుకు హైకోర్టు సీఆర్పీసీ సెక్షన్ 482 కింద తనకున్న స్వతఃసిద్ధ అధికారాలను ఉపయోగించవచ్చు. ఈ అధికారాన్ని ఉపయోగించి క్రిమినల్ ప్రొసీడింగ్స్‌ను కొట్టేయవచ్చు. చైర్మన్‌గా నిమ్మగడ్డ ప్రసాద్ ప్రాతినిధ్యం వహిస్తున్న కార్పొరేట్ సంస్థ అయిన వాన్‌పిక్ ప్రాజెక్టులపై క్రిమినల్ ప్రాసిక్యూషన్‌కు అనుమతినిచ్చినట్లయితే అంతిమ న్యాయం చేసినట్లు అవదు. అందువల్ల వీటన్నింటినీ పరిగణలోకి తీసుకుంటూ నాంపల్లి సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంలో వాన్‌పిక్ ప్రాజెక్టులపై పెండింగ్‌లో ఉన్న కేసును కొట్టి వేస్తున్నాం’అని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ భుయాన్ తన తీర్పులో పేర్కొన్నారు. -
వాన్‌పిక్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ కేసులో హైకోర్టు సంచలన తీర్పు
సాక్షి, హైదరాబాద్: వాన్‌పిక్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ కేసులో హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. సీబీఐ దాఖలు చేసిన ఛార్జ్‌షీట్ చెల్లదని హైకోర్టు తేల్చింది. వైఎస్సార్ హయాంలో ఉమ్మడి ఏపీలో పారిశ్రామిక కారిడార్ ఏర్పాటుకు వాన్‌పిక్ ప్రాజెక్ట్‌కు భూముల కేటాయింపు జరిగింది. చదవండి: పడకగదిలో అశ్లీల ఫొటోలు తీసి.. నిత్య పెళ్లికొడుకు లీలలెన్నో..! గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో భూముల కేటాయింపుపై సీబీఐ కేసు నమోదు చేసింది. హైదరాబాద్ సీబీఐ కోర్టులో సీబీఐ అధికారుల ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. ఛార్జ్ షీట్ చెల్లదంటూ తెలంగాణ హైకోర్టులో వాన్ పిక్ ప్రాజెక్ట్స్ క్వాష్ పిటిషన్ వేసింది. విచారణ అనంతరం వాన్ పిక్ ప్రాజెక్ట్స్‌కు అనుకూలంగా హైకోర్టు తీర్పునిచ్చింది. -
తెలంగాణ హైకోర్టులో వాన్‌పిక్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి ఊరట
-
ఆస్తుల అటాచ్మెంట్ కేసు 23కి వాయిదా
సాక్షి, న్యూఢిల్లీ: వాన్‌పిక్ ప్రమోటర్ నిమ్మగడ్డ ప్రసాద్, జగతి పబ్లికేషన్స్ లిమిటెడ్ ఆస్తుల అటాచ్మెంట్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ న్యాయప్రాధికార సంస్థ విచారణను ఈ నెల 23కి వాయిదా వేసింది. వాన్‌పిక్ ప్రమోటర్లు వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం నుంచి లబ్ధి పొంది ఆయన కుమారుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి కంపెనీలకు పెట్టుబడుల రూపంలో అక్రమంగా నిధులు సమకూర్చారని ఆరోపిస్తూ ఎన్ఫోర్స్మెంట్ డెరైక్టరేట్(ఈడీ) నిమ్మగడ్డ ప్రసాద్ ఆస్తులను, జగతి పబ్లికేషన్స్ ఆస్తులను అటాచ్ చేయడం విదితమే. ఈ కేసులో గురువారం ఈడీ తన వాదనలు వినిపించింది. కాగా న్యాయాధికారి ఈ విచారణను ఈ నెల 23వ తేదీకి వాయిదా వేశారు. -
కోర్టులో లొంగిపోయిన మోపిదేవి
హైదరాబాద్: వైఎస్ జగన్మోహన్రెడ్డి కంపెనీల్లో వాన్‌పిక్ పెట్టుబడుల కేసులో నిందితునిగా ఉన్న మాజీమంత్రి మోపిదేవి వెంకటరమణారావు గురువారం సీబీఐ ప్రత్యేక కోర్టులో లొంగిపోయారు. వెన్నునొప్పి శస్త్రచికిత్స కోసం కోర్టు మంజూరు చేసిన 45 రోజుల తాత్కాలిక బెయిల్ ఈ నెల 31తో ముగియనుంది. నవంబర్ 1న లొంగిపోవాలని కోర్టు షరతు విధించింది. ఈ నేపథ్యంలో ఆయన కోర్టులో లొంగిపోయి బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణను కోర్టు రేపటికి వాయిదా వేసింది. ఆయనకు 31 వరకు రిమాండ్ విధించింది. ఇదే కేసులో దర్యాప్తు పూర్తయిందని సీబీఐ మెమో దాఖలు చేయడంతో జగన్మోహన్రెడ్డి, సాయిరెడ్డి సహా వాన్‌పిక్ కేసులో నిందితులుగా ఉన్న నిమ్మగడ్డ ప్రసాద్, ఇతర నిందితులందరికీ ప్రత్యేక కోర్టు ఇప్పటికే బెయిల్ మంజూరు చేసింది. దర్యాప్తు పూర్తయినందున.. తనకూ బెయిల్ మంజూరు చేయాలని మోపిదేవి తన పిటిషన్లో కోరారు. -
నేడు కోర్టులో లొంగిపోనున్న మోపిదేవి వెంకటరమణారావు
సాక్షి, హైదరాబాద్: వైఎస్ జగన్మోహన్రెడ్డి కంపెనీల్లో వాన్‌పిక్ పెట్టుబడుల కేసులో నిందితునిగా ఉన్న మాజీమంత్రి మోపిదేవి వెంకటరమణారావు గురువారం సీబీఐ ప్రత్యేక కోర్టులో లొంగిపోనున్నారు. వెన్నునొప్పి శస్త్రచికిత్స కోసం కోర్టు మంజూరు చేసిన 45 రోజుల తాత్కాలిక బెయిల్ ఈ నెల 31తో ముగియనుంది. నవంబర్ 1న లొంగిపోవాలని కోర్టు షరతు విధించింది. ఈ నేపథ్యంలో ఆయన గురువారమే కోర్టులో లొంగిపోయి బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకోనున్నారు. లొంగిపోయిన వెంటనే మోపిదేవిని కోర్టు రిమాండ్‌కు తరలిస్తుంది. తదుపరి ఆయన దాఖలు చేసుకునే బెయిల్ పిటిషన్‌పై మెరిట్స్ ఆధారంగా నిర్ణయం తీసుకునే అవకాశముంది. ఇదే కేసులో దర్యాప్తు పూర్తయిందని సీబీఐ మెమో దాఖలు చేయడంతో జగన్మోహన్రెడ్డి, సాయిరెడ్డి సహా వాన్‌పిక్ కేసులో నిందితులుగా ఉన్న నిమ్మగడ్డ ప్రసాద్, ఇతర నిందితులందరికీ ప్రత్యేక కోర్టు ఇప్పటికే బెయిల్ మంజూరు చేసింది. దర్యాప్తు పూర్తయినందున.. తనకూ బెయిల్ మంజూరు చేయాలని మోపిదేవి తన పిటిషన్లో కోరనున్నారు. -
నిమ్మగడ్డ, బ్రహ్మానందరెడ్డిలకు బెయిల్
సాక్షి, హైదరాబాద్: వైఎస్ జగన్మోహన్రెడ్డి కంపెనీల్లో వాన్‌పిక్ పెట్టుబడులకు సంబంధించిన కేసులో నిందితులుగా ఉన్న పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్, ఐఆర్ఏఎస్ అధికారి కేవీ బ్రహ్మానందరెడ్డిలకు సీబీఐ ప్రత్యేక కోర్టు సోమవారం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఒక్కొక్కరూ రూ. 2 లక్షల చొప్పున రెండు పూచీకత్తు బాండ్లు సమర్పించి బెయిల్ పొందాలని, న్యాయస్థానం అనుమతి లేకుండా హైదరాబాద్ విడిచి వెళ్లరాదని, సాక్షులను ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రభావితం చేయరాదని ప్రత్యేక కోర్టుల ప్రధాన న్యాయమూర్తి యు.దుర్గాప్రసాద్‌రావు షరతులు విధించారు. కోర్టు వాయిదాలకు క్రమం తప్పకుండా హాజరుకావాలని, న్యాయస్థానం విధించిన షరతులను వారు ఉల్లంఘిస్తే బెయిల్ రద్దు చేయాలని సీబీఐ ఎప్పుడైనా కోర్టును కోరవచ్చని స్పష్టం చేశారు. బెయిల్ మంజూరు చేస్తే సాక్షులను ప్రభావితం చేస్తారని ఆందోళన వ్యక్తం చేసిన సీబీఐ అందుకు బలమైన ఆధారాలను చూపలేదని, ఈ నేపథ్యంలో వీరిద్దరూ బెయిల్‌కు అర్హులేనని న్యాయమూర్తి తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. బెయిల్ ఉత్తర్వులు వెలువరించే సమయానికి కోర్టు సమయం ముగియడంతో...పూచీకత్తు బాండ్లను వీరిద్దరి తరఫు న్యాయవాదులు మంగళవారం కోర్టుకు సమర్పించనున్నారు. ఈ కేసులో నిమ్మగడ్డ, బ్రహ్మానందరెడ్డిలను గత ఏడాది మే 15న సీబీఐ అరెస్టు చేసింది. దాదాపు 17 నెలల జైలు జీవితం తర్వాత వీరిద్దరూ మంగళవారం మధ్యాహ్నం 2 గంటల తర్వాత జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉంది. -
నిమ్మగడ్డ బెయిల్‌పై విచారణ 3కు వాయిదా
సాక్షి, హైదరాబాద్: వైఎస్ జగన్మోహన్రెడ్డి కంపెనీల్లో వాన్‌పిక్ పెట్టుబడుల కేసులో నిందితుడైన పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్, ఐఆర్ఏఎస్ అధికారి కేవీ బ్రహ్మానందరెడ్డిల బెయిల్ పిటిషన్లపై విచారణ అక్టోబర్ 3కు వాయిదా పడింది. ఈ పిటిషన్లపై కౌంటర్లు దాఖలు చేసేందుకు తమకు గడువు కావాలని సీబీఐ స్పెషల్ పీపీ సురేంద్ర సీబీఐ ప్రత్యేక కోర్టుకు గురువారం విజ్ఞప్తి చేశారు. దీనిపై నిమ్మగడ్డ తరఫు న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ కేసు దర్యాప్తు అధికారిగా ఎస్పీ చంద్రశేఖర్ ఇక్కడే ఉన్నారని, అయినా కౌంటర్ దాఖలుకు గడువు కోరడం భావ్యం కాదని తెలిపారు. వాన్‌పిక్ అంశంపై మాత్రమే దర్యాప్తు చేసిన అధికారులు ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నారని, వారు హైదరాబాద్‌కు రావడానికి కొంత సమయం పడుతుందని.. అందుకే గడువు కోరుతున్నామని సురేంద్ర నివేదించారు. స్పందించిన న్యాయమూర్తి విచారణను 3కు వాయిదా వేశారు. కౌంటర్ దాఖలు చేయడంతోపాటు అదే రోజు వాదనలు వింటామని న్యాయమూర్తి స్పష్టం చేశారు. -
మూడు నాల్కల ముచ్చట
జగతిలో పెట్టుబడులుపై సీబీఐ రకరకాల వాదనలు ప్రాజెక్టులు చేపట్టిన వారి పెట్టుబడులు ‘క్విడ్ ప్రో కో’ అట అలా చేపట్టని వారి విషయంలో రెండు రకాల వాదన కొందరి విషయంలో పెట్టుబడులు కరెక్టేనంటూ సమర్థన మరికొందరి విషయంలో వారు మోసపోయారనే వాదన తాజా మెమోతో మరింతగా బయటపడ్డ సీబీఐ డొల్ల వాదన రాజకీయ కుట్రతోనే 16 నెలలుగా జైల్లో జగన్ ఏ కేసులోనూ జరగనన్ని విచిత్రాలు ఈ కేసులో జరిగిన తీరు ‘ముక్కల చార్జిషీట్ల’ నుంచి... మీడియా సంచలనాల దాకా చివరకు సుప్రీంకోర్టు జోక్యంతో దర్యాప్తు ముగించిన సీబీఐ దర్యాప్తు ముగియడంతో బెయిల్ మంజూరు చేసిన కోర్టు వాళ్లంతా ఇన్వెస్టర్లే. అంతా ఒకే ధరకు షేర్లు కొన్నవాళ్లే. కాకపోతే వాళ్లలో కొందరు మాత్రమే అసలైన ఇన్వెస్టర్లట..!! వాళ్ల ఇన్వెస్ట్మెంట్లే అసలైనవట! మిగతా వాళ్ల ఇన్వెస్ట్మెంట్లు మాత్రం ‘క్విడ్ ప్రో కో’ అట. ఇదీ... వైఎస్ జగన్మోహన్రెడ్డి సంస్థల్లో పెట్టుబడులకు సంబంధించి సీబీఐ చెబుతూ వచ్చిన కథ, కథనం. సీబీఐ చెబుతూ వచ్చిన కథనం ఆధారంగానే జగన్మోహన్రెడ్డిని 16 నెలల పాటు జనానికి దూరం చేశారు. ఈ స్క్రీన్‌ప్లేతోనే జగన్మోహన్రెడ్డి సంస్థలను నానా ఇబ్బందులూ పెట్టారు. ఆఖరికి దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డికీ బురద పులిమే ప్రయత్నాలు చేశారు. అసలు ఈ కథనాన్ని ఎవరైనా నమ్ముతారా? ఒక కంపెనీలో షేర్ హోల్డర్లంతా ఒకే ధరకు షేర్లు కొన్నపుడు వారిలో కొందరివి అసలైన ఇన్వెస్ట్మెంట్లని, మరికొందరివి ‘క్విడ్ ప్రో కో’ ఇన్వెస్ట్మెంట్లని చెప్పటంలో అర్థమేమైనా ఉందా? ఇదంతా ఎందుకంటే జగన్ కంపెనీల్లో పెట్టుబడుల కేసుకు సంబంధించి సీబీఐ సోమవారం కోర్టుకు ఒక మెమో అందజేసింది. దాన్లో జగతి పబ్లికేషన్స్ ఇన్వెస్టర్లకు సంబంధించి కొన్ని కంపెనీల పేర్లను వెల్లడిస్తూ... ఎలాంటి క్విడ్ ప్రో కో ఉన్నట్లు తేలలేదని స్పష్టం చేసింది. ఇలా సీబీఐ పేర్కొన్న కంపెనీల్లో పీవీపీ బిజినెస్ వెంచర్స్, జూబ్లీ మీడియా కమ్యూనికేషన్స్, ఆర్ఆర్ గ్లోబల్ ఎంటర్ప్రైజెస్ వంటివి ఉన్నాయి. వీటిలో పీవీపీ బిజినెస్ వెంచర్స్ రూ.55 కోట్లు, జూబ్లీ మీడియా కమ్యూనికేషన్స్ రూ.30 కోట్లు, ఆర్ఆర్ గ్లోబల్ రూ.49 కోట్లు చొప్పున జగతి పబ్లికేషన్స్‌లో ఇన్వెస్ట్ చేశాయి. అంటే మూడు సంస్థలూ కలిపి రూ.134 కోట్లు పెట్టుబడి పెట్టాయి. మూడు సంస్థలూ ఒక్కో షేరు రూ.350 చొప్పునే కొనుగోలు చేశాయి. వీటి పెట్టుబడులు క్విడ్ ప్రో కో అనేందుకు ఆధారాలు లేవని చెప్పిన సీబీఐ... ఈ కేసుకు సంబంధించి ఇప్పటికి 10 చార్జిషీట్లు దాఖలు చేసింది. ప్రతి చార్జిషీట్లోనూ కొందరిని పేర్కొంటూ... వారికి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ప్రభుత్వపరంగా ఏ ప్రాజెక్టు దక్కిందో చెబుతూ... అందుకు ప్రతిఫలంగానే వారు జగన్మోహన్రెడ్డి సంస్థల్లో పెట్టుబడి పెట్టారనే వాదన చేసుకుంటూ వచ్చింది. దానికి క్విడ్ ప్రో కో అని పేరు పెట్టింది. ఇలా చార్జిషీట్లలో సీబీఐ పేర్కొన్న సంస్థల్లో అరబిందో ఫార్మా, హెటెరో డ్రగ్స్, రాంకీ ఇన్ఫ్రా, వాన్‌పిక్, దాల్మియా సిమెంట్స్, ఇండియా సిమెంట్స్, పెన్నా సిమెంట్స్ వంటి పలు సంస్థలున్నాయి. అవి కూడా జగతి పబ్లికేషన్స్‌లో షేరు రూ.350 చొప్పునే కొన్నాయి. మరి ఈ సంస్థలు కూడా పీవీపీ బిజినెస్ వెంచర్స్, జూబ్లీ మీడియా, ఆర్ఆర్ గ్లోబల్ మాదిరి లాభాల కోసమే ఇన్వెస్ట్మెంట్ చేశాయని భావించాల్సిన పని లేదా? ప్రభుత్వపరంగా వీటికి ప్రాజెక్టులు దక్కడమే తప్పా? అయినా ఈ సంస్థలన్నీ ప్రభుత్వం నుంచి అప్పుడే ప్రాజెక్టులు తీసుకున్నవేమీ కాదే? ప్రభుత్వమేమీ వీటికి నిబంధనల్ని పక్కనపెట్టి ప్రాజెక్టులు కేటాయించలేదే? అరబిందో, హెటెరో రాష్ట్రంలో ఫార్మా దిగ్గజాలు. అలాంటి సంస్థలకు ఒక చోట ప్లాంటు కోసం భూమి కేటాయిస్తే... దాన్ని తక్కువ రేటుకిచ్చారని, అందుకే అవి జగన్ సంస్థల్లో పెట్టుబడులు పెట్టాయని వాదించడం కరెక్టా? రాంకీదీ అలాంటి కథే. వాన్‌పిక్ వ్యవహారమైతే మరీ ఘోరం. ఆ సంస్థ అధిపతి నిమ్మగడ్డ ప్రసాద్ జాతీయ స్థాయిలోనూ పలు సంస్థల్లో ఇన్వెస్ట్మెంట్లు చేశారు. వాటి ద్వారా లాభాలు కూడా ఆర్జించారు. అగ్రశ్రేణి ఇన్వెస్టర్‌గా రుజువు చేసుకున్నారు. అలాంటి వ్యక్తి జగతి పబ్లికేషన్స్‌లో పెట్టుబడి పెడితే... అది కేవలం వాన్‌పిక్ ప్రాజెక్టును పొందినందుకే అని చెప్పారంటే ఏమనుకోవాలి? జగన్‌కు చెందిన భారతి సిమెంట్‌లో కూడా ప్రసాద్ పెట్టుబడి పెట్టి, తన వాటాను విక్రయించుకుని లాభాన్ని ఆర్జించారు. దాన్నీ క్విడ్ ప్రో కో అన్నారంటే ఏమనుకోవాలి? ఇండియా సిమెంట్స్, దాల్మియా సిమెంట్స్ కూడా అంతే. అవి సిమెంట్ కంపెనీలు కాబట్టి, సహజంగానే మరో సిమెంట్ కంపెనీలో వాటా తమకు అనుకున్న ధరకు, అనుకున్నట్టుగా వస్తే కొనటానికి మొగ్గు చూపుతాయి. అదే రీతిన అవి భారతి సిమెంట్‌లో పెట్టుబడి పెట్టాయి. అవకాశం రాగానే విక్రయించుకుని లాభాలు కూడా ఆర్జించాయి. అయినా సరే, వాటి పెట్టుబడులను క్విడ్ ప్రో కో అన్నారంటే ఏమనుకోవాలి? అసలు క్విడ్ ప్రో కో పెట్టుబడులకు లాభాలొస్తాయా? అంతా రాజకీయమయం... ఇక్కడ గమనించాల్సిందొక్కటే. కాంగ్రెస్‌ను రెండుసార్లు అధికారంలోకి తెచ్చిన వైఎస్ రాజశేఖరరెడ్డి అంటే ఈ రాష్ట్రంలో ఒక వర్గానికి అస్సలు గిట్టదు. అందుకే వైఎస్ మరణానంతరం జనమంతా ఆయన తనయుడు జగన్మోహన్రెడ్డిని అక్కున చేర్చుకోవడాన్ని వారు సహించలేకపోయారు. మరో రాజశేఖరరెడ్డి తయారు కావడాన్ని జీర్ణించుకోలేకపోయారు. అందుకే కాంగ్రెస్‌లోని వైఎస్ వ్యతిరేకులతో చేతులు కలిపారు. కొన్ని రాజకీయ పక్షాలు, వారికి వత్తాసు పలికే మీడియా, దర్యాప్తు సంస్థలు, కొందరు వ్యక్తులు కలిసి నడిపిన ఈ కుట్ర ఏ స్థాయిలో సాగిందంటే... ఈ దేశ చరిత్రలో ఎన్నడూ ఏ కేసులోనూ జరగని వైపరీత్యాలు ఈ కేసులో మాత్రమే జరిగాయి. ఆదినుంచీ రాంగ్ రూట్లోనే... ఈ కేసులో ప్రధానమైన ఆరోపణ క్విడ్ ప్రో కో. అంటే ఇచ్చిపుచ్చుకోవటం. వైఎస్ హయాంలో పలు సంస్థలకు భూములు కేటాయించడంతో పాటు అనుమతులు మంజూరు చేశారని, అందుకు ప్రతిగా అవి జగన్ సంస్థల్లో పెట్టుబడులు పెట్టాయనేది ప్రధానారోపణ. కేంద్రంలోనైనా... ఏ రాష్ట్రంలోనైనా ఇలా ప్రభుత్వ నిర్ణయాలపై ఆరోపణలు వచ్చినప్పుడు మొదట తేల్చేది ఆ నిర్ణయం తప్పా, కాదా అని. ఆ నిర్ణయాన్ని నిబంధనలకు విరుద్ధంగా తీసుకున్నారా. లేక అదంతా నిబంధనల ప్రకారమే జరిగిందా అని. ప్రభుత్వ నిర్ణయం తప్పని తేలితే ఆ పెట్టుబడుల్ని క్విడ్ ప్రో కో అనొచ్చు. కానీ ఇక్కడ సీబీఐ ఆ నిర్ణయాల జోలికి పోలేదు. అవి తప్పో ఒప్పో పట్టించుకోలేదు. జగన్‌ను టార్గెట్ చేసి... ఆయన సంస్థల్లోకి పెట్టుబడిగా వచ్చిన ప్రతి రూపాయినీ అనుమానించింది. సదరు ఇన్వెస్టర్లు ప్రభుత్వ ప్రాజెక్టులేమైనా పొందారో లేదో చూసింది. పొంది ఉంటే... అవన్నీ క్విడ్ ప్రోకోలేనంటూ వారిని వేధించింది. దారుణమేంటంటే.. ఒకవేళ ఏ ప్రభుత్వ ప్రాజెక్టూ చేపట్టని ఇన్వెస్టర్లుంటే... వారు పెట్టుబడులు పెట్టి మోసపోయారని మరీ కేసు పెట్టింది. పెపైచ్చు వైఎస్ కుటుంబాన్ని వ్యతిరేకించే ఒక వర్గం మీడియాకు లీకులిచ్చి మరీ కథనాలు రాయిస్తూ... వారి పరువు ప్రతిష్టలను దెబ్బతీయడమే ఏకైక లక్ష్యంగా వ్యవహరించింది. అసలు కేటాయింపుల్లో తప్పేంటి? అసలు సీబీఐ నెత్తీనోరూ బాదుకుంటున్న ఈ కేటాయింపుల్లో తప్పేముంది? భూములు, గనుల కేటాయింపు... సెజ్‌లు, ప్రాజెక్టులకు అనుమతులు... కంపెనీలకు లెసైన్సులు, రాయితీలు, మినహాయింపులు ఇస్తే తప్పేంటి? ఒక్క వైఎస్ హయాంలోనే ఇలా ఇచ్చారా? అంతకు ముందరి ప్రభుత్వాలేవీ ఇవ్వలేదా? ప్రస్తుత ప్రభుత్వం ఏ భూ కేటాయింపులూ చేయడం లేదా? రాయితీలివ్వడం లేదా? ఏ జీవోనైనా అంతకు ముందరి జీవోల్ని అనుసరించో, నిబంధనల్ని పాటించో జారీ చేస్తారు కదా? దర్యాప్తులో ఇవన్నీ చూడాలి కదా! వైఎస్ హయాంలో కంపెనీలకు నీళ్లిచ్చినందుకు కూడా క్విడ్ ప్రో కో పెట్టుబడులొచ్చాయని తాను చేస్తున్న వాదన ఎంత అసంబద్ధమో సీబీఐకి తెలియదా? ప్రభుత్వ కేటాయింపులు, అనుమతులు ఏమాత్రం తప్పు కాదని దానికి తెలియదనుకోగలమా? మొన్నటికి మొన్న కిరణ్ సర్కారు పలు పరిశ్రమలకు పన్ను రాయితీలివ్వలేదా? గతేడాది ప్రిజమ్ సిమెంట్స్‌కు కర్నూలు జిల్లాలో 1,000 ఎకరాలు కేటాయించలేదా? ఇలాంటివాటన్నిటినీ సీబీఐ ఎందుకు అధ్యయనం చేయడం లేదు? వైఎస్ ప్రభుత్వం తీసుకున్న ప్రతి నిర్ణయాన్నీ తప్పుగా చూపించాలన్న తహతహ ఎందుకు? చార్జిషీట్లలోనూ రెండునాల్కలే... పెట్టుబడి అంటే ఇన్వెస్టర్, ప్రమోటర్ మధ్య ఒప్పందం. తమకు అన్యాయం జరిగిందనో, తాము మోసపోయామనో వారిలో ఎవరూ ఫిర్యాదు చేయనంతవరకూ దాన్లో ఏ దర్యాప్తు సంస్థా జోక్యం చేసుకోదు. కానీ సీబీఐ మాత్రం ముందే ఒక నిర్ణయానికి వచ్చేసి... దానికి అనుగుణంగా కేసును తయారు చేసుకుంటూ వెళ్లింది. ఇన్వెస్టర్లను వేధిస్తూ... వారు వైఎస్ హయాంలో ఏ ప్రాజెక్టులు చేపట్టారో వెతికి మరీ చూసి... వాటికి బదులుగానే ఆ పెట్టుబడులు పెట్టారని సీబీఐ వాదించింది. వారిని వేధించింది. కానీ సీబీఐ ఎంత వెదికినా కొంతమంది ఈ రాష్ట్రంలో ఎలాంటి ప్రాజెక్టులూ చేపట్టినట్టు కనిపించలేదు. దాంతో, వారికి మోసపూరిత నివేదికలిచ్చి, లాభాలొస్తాయని ఆశ చూపించి జగతి ప్రతినిధులు వారితో పెట్టుబడులు పెట్టించారని, వారికి వడ్డీ కూడా దక్కలేదని, వారు మోసపోయారని తెగ ఆవేదన వ్యక్తం చేసింది. ఆ మేరకు ఏకంగా ఒక చార్జిషీటు (నంబర్-2) కూడా వేయడం మరీ విచిత్రం. మళ్లీ అదే సీబీఐ... కొందరి పెట్టుబడులేమో క్విడ్ ప్రో కో అనటానికి ఆధారాలేమీ లేవని పేర్కొంది. అంటే... ఒకే ఒరలో రెండు కాదు, మూడు కత్తులన్నమాట! ఇన్వెస్టర్లు మోసపోయారా? ‘‘2008లో టి.ఆర్.కణ్ణన్ అనే వ్యక్తిని విజయసాయిరెడ్డి కలిశారు. జగతిలో రూ.5 కోట్లు పెట్టుబడి పెట్టాలని అడిగారు. కణ్ణన్ ఓకే చేశారు. 2010లో కర్నూలు జిల్లా బనగానపల్లిలో సిమెంట్ ప్లాంట్ పెట్టారు. 2010 ఆగస్టు 19న (రోశయ్య హయాంలో) ఆయనకు లెసైన్స్ మంజూరయింది. దుబాయ్ ఎన్నారై మాధవ్ రామచంద్రతో 2008లో విజయసాయిరెడ్డి మాట్లాడారు. త్వరలో జగతి పబ్లికేషన్స్ పబ్లిక్ ఇష్యూకు వెళ్లబోతోందని, భారీ లాభాలు వస్తాయని ఆశపెట్టారు. డెలాయిట్ నివేదిక ప్రతిని కూడా ఆయనకు పంపడంతో ఆయన రూ.19.65 కోట్లు పెట్టుబడి పెట్టారు. దండమూడి అరుణ్‌కుమార్ కూడా సాయిరెడ్డి మాటలు నమ్మి రూ.10 కోట్లు పెట్టుబడి పెట్టారు. వారికి ఇప్పటిదాకా ఎలాంటి డివిడెండూ రాలేదు. పెట్టుబడిపై వడ్డీ కూడా రాలేదు. లాభాలపై తప్పుడు సమాచారమిచ్చి వారి ద్వారా పెట్టుబడి పెట్టించారు. తరవాత వారెన్ని ఫోన్లు చేసినా జగతి ప్రతినిధులు స్పందించలేదు’’ ఇదీ రెండో చార్జిషీట్లో సీబీఐ మోపిన అభియోగం. ఈ ప్రశ్నలకు బదులుందా? . అసలు సీబీఐ విచారించాల్సింది క్విడ్ ప్రో కో పెట్టుబడులనా, లేక ఇన్వెస్టర్లు మోసపోయారనే అంశాన్నా? ఒకే విచారణలో ఈ రెండంశాలూ ఉండటం ఎలా సాధ్యం? ప్రాజెక్టులు దక్కిన వారినైతే అందుకే పెట్టారని చెప్పడం... లేనివారైతే మోసపోయారని చెప్పడం... కొందరి పెట్టుబడులు క్విడ్ ప్రో కో కాదని చెప్పడం... ఒకే కంపెనీలో ఈ మూడు రకాల పెట్టుబడులూ ఉంటాయా? . అసలు జగతిలో గానీ, భారతి సిమెంట్‌లో గానీ పెట్టుబడి పెట్టి తాము మోసపోయామంటూ ఏ ఇన్వెస్టరైనా ఫిర్యాదు చేశారా? కంపెనీల్లో ఇన్వెస్ట్మెంట్లు చేసినపుడు లాభనష్టాలు సహజమని సీబీఐకి తెలియదా? మరి భారతి సిమెంట్‌లో ప్రతి ఇన్వెస్టరుకూ లాభం వచ్చింది కదా? దాన్నెందుకు పట్టించుకోవడం లేదు? . డెలాయిట్ నివేదిక ఆధారంగా పెట్టుబడులు పెట్టించారని, మోసం చేశారని చెబుతున్న సీబీఐ... అదే నివేదికలో ఉన్న ‘డిస్‌క్లెయిమర్’ను ప్రస్తావించలేదెందుకు? ఆ నివేదిక ఆధారంగా పెట్టినవారు దాన్లోని డిస్‌క్లెయిమర్‌ను చూసుకోరా? ఇన్వెస్టర్లకు వచ్చే నష్టాల్ని విచారించటానికా సీబీఐ ఈ దర్యాప్తును చేస్తున్నది? . ఆంధ్రప్రదేశ్‌లో ‘సాక్షి’తో సమానంగా సర్క్యులేషన్ ఉన్న ‘ఈనాడు’ తన గ్రూప్ విలువను రూ.7,800 కోట్లుగా అంచనా కట్టినప్పుడు ‘సాక్షి’ విలువ దాన్లో సగం కూడా చెయ్యదా? ‘సాక్షి’ కొత్త సంస్థ. కానీ 35 ఏళ్లుగా నడుస్తున్న ‘ఈనాడు’ 2008 నుంచి తన దగ్గర పెట్టుబడి పెట్టిన అంబానీకి ఒక్క పైసా అయినా డివిడెండ్ ఇచ్చిందా? అఏ కేసులోనైనా ఒక ఎఫ్ఐఆర్కు ఒకటే చార్జిషీటు. కానీ ఈ కేసులో వీలైనంత ఎక్కువకాలం జగన్‌ను జైల్లో ఉంచటానికి వీలైనన్ని ఎక్కువ చార్జిషీట్లు వేసేందుకు కుట్ర పన్నారు. అఅసలు జగన్మోహన్రెడ్డిని కనీసం విచారణకు కూడా పిలవకుండానే ఆయన్ను మొదటి నిందితుడిగా పేర్కొంటూ మూడు చార్జిషీట్లు వేశారు. దేశంలో ఏ కేసులోనూ ఇలా జరగలేదు. చిన్న కేసైనా, పెద్ద కేసైనా నిందితుడిని విచారించాకే చార్జిషీటు వేస్తారు. అచార్జిషీటును విచారణకు స్వీకరించే నిమిత్తం తమ ఎదుట హాజరు కావాల్సిందిగా జగన్‌కు కోర్టు సమన్లు జారీ చేసింది. ఆయన కోర్టు ఎదుట హాజరయితే... వ్యక్తిగత పూచీపై అక్కడికక్కడే బెయిలొచ్చే అవకాశముండేది. అది తెలిసిన సీబీఐ... అలా హాజరవడానికి మూడు రోజుల ముందే, తన ఎదుట విచారణకు హాజరు కావాలంటూ నోటీసులిచ్చింది. మూడు రోజులు విచారించాక... కొన్ని గంటల్లో కోర్టు ఎదుట హాజరవుతారనగా అరెస్టు చేస్తున్నట్టు ప్రకటించింది. చరిత్రలో ఏ కేసులోనూ ఇలా జరిగిన దాఖలాలు లేవు. అజగన్కు చెందిన మీడియా గొంతు నులమటానికీ సీబీఐ ప్రయత్నించింది. సాక్షి బ్యాంకు ఖాతాలను స్తంభింపజేసింది. సాక్షి ఆస్తులనూ అటాచ్ చేయబోయింది. మరో వంక సీబీఐతో ప్రభుత్వమూ జతకలిసింది. సాక్షికి ప్రకటనలివ్వడాన్ని నిషేధిస్తూ ఏకంగా జీవోలనే జారీ చేసింది. అనిజానికి తన అరెస్టును జగన్ ముందే ఊహించారు. అందుకే ముందస్తు బెయిలుకు దరఖాస్తు చేశారు. కానీ చట్టప్రకారమే అంతా జరుగుతుందని భావించిన కోర్టు... అరెస్టు జరగదని, అదంతా ఆయన భయం మాత్రమేనని చెప్పింది. ఒకవేళ ఆయనది భయమే అనుకున్నా... ఆయన భయపడ్డట్టే జరిగింది. అఅరెస్టు అక్రమమంటూ జగన్ దిగువ కోర్టులో బెయిలు కోసం దరఖాస్తు చేశారు. అప్పటి నుంచి హైడ్రామా మొదలయింది. బెయిల్‌పై తీర్పు వచ్చే ముందు... సంచలనాత్మక సంఘటనలు చోటు చేసుకోవటం మొదలయ్యాయి. అవి ఏ స్థాయిలో అంటే న్యాయం సైతం నివ్వెరపోయేంతగా!! ఇంతకుముందు జగన్ ఆరుసార్లు బెయిల్ కోసం వివిధ న్యాయస్థానాల్లో పిటిషన్లు దాఖలు చేస్తే, ప్రతిసారీ ఏదో ఒక సంచలనమే. ప్రతిసారీ ఎల్లో మీడియాలో తీర్పు ముందు రోజున జగన్‌కు వ్యతిరేకంగా తాటికాయలంత అక్షరాలతో పతాక కథనాలే. ప్రతిసారీ ఏదో జరిగిపోతోందన్న రీతిలో చంద్రబాబు, ఆయన తాబేదార్లు ఢిల్లీకి వెళ్లి మరీ నానాయాగీ చేయడమే. జగన్ కేసులో ఎప్పుడేం జరిగింది..? 2010 నవంబర్ 5: హైకోర్టుకు 5 పేజీల లేఖ రాసిన శంకర్రావు. 75 పేజీల అనుబంధ పత్రాల సమర్పణ 2011 జనవరి 24: ఆ లేఖను సుమోటోగా విచారణకు స్వీకరించిన హైకోర్టు 2011 ఫిబ్రవరి 9: శంకర్రావు మరో అఫిడవిట్. 2011 మార్చి 14: జగన్ ఆస్తులపై సీబీఐ, ఏసీబీ దర్యాప్తు కోరుతూ టీడీపీ నేతలు ఎర్రన్నాయుడు, అశోక్‌గజపతిరాజు, బెరైడ్డి రాజశేఖర్‌రెడ్డి పిల్. 2011 జూలై 11: ఎమ్మార్‌పై సీబీఐ ప్రాథమిక దర్యాప్తుకు హైకోర్టు ఆదేశం 2011 జూలై 12: వైఎస్ జగన్, సాక్షిలో పెట్టుబడులపై సీబీఐ ప్రాథమిక విచారణకు హైకోర్టు ఆదేశం 2011 జూలై 22: హైకోర్టు ఆదేశాలను నిలిపివేయాలని కోరుతూ జగన్ వేసిన పిటిషన్‌ను తిరస్కరించిన సుప్రీంకోర్టు 2011 జూలై 26: సీల్డ్ కవర్లో హైకోర్టుకు సీబీఐ నివేదిక 2011 ఆగస్టు 1: హైకోర్టుకు సీబీఐ రెండో నివేదిక 2011 ఆగస్టు 4: శంకర్రావు, టీడీపీ నేతల పిటిషన్లపై తీర్పు వాయిదా 2011 ఆగస్టు 10: ఎమ్మార్, జగన్ కంపెనీల్లో పెట్టుబడులపై దర్యాప్తు చేయాలని సీబీఐకి హైకోర్టు ఆదేశం 2011 ఆగస్టు 17: హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఎఫ్ఐఆర్ (ఆర్సీ 19(ఎ)) నమోదు చేసిన సీబీఐ 2011 ఆగస్టు 18: జగన్ సంస్థలు, సాక్షి కార్యాలయాల్లో సీబీఐ సోదాలు 2011 నవంబర్ 4: ఓఎంసీ కేసులో సాక్షిగా సీబీఐ ఎదుట హాజరైన జగన్ 2012 జనవరి 2: జగన్ కంపెనీల్లో పెట్టుబడుల కేసులో జగతి పబ్లికేషన్స్ ఆడిటర్ వేణుంబాక విజయసాయిరెడ్డి అరెస్టు 2012 మార్చి 31: ఫార్మా కంపెనీల పెట్టుబడులపై చార్జిషీట్ దాఖలు 2012 ఏప్రిల్ 13: ఆడిటర్ విజయసాయిరెడ్డికి బెయిల్ 2012 ఏప్రిల్ 24: వ్యక్తుల పెట్టుబడులపై చార్జిషీట్ దాఖలు 2012 మే 7: జగన్ కంపెనీల్లో రాంకీ ఫార్మా పెట్టుబడులపై చార్జిషీట్ దాఖలు 2012 మే 7: మొదటి చార్జిషీట్‌ను విచారణకు స్వీకరించిన ప్రత్యేక కోర్టు. జగన్‌కు సమన్లు జారీ. మే 28న హాజరవాలంటూ జగన్‌కు కోర్టు సమన్లు 2012 మే 8: జగతి పబ్లికేషన్స్, ఇందిరా టెలివిజన్, జననీ ఇన్ఫ్రా సంస్థల బ్యాంకు (ఎస్బీఐ, ఓబీసీ) ఖాతాలను స్తంభింపజేసిన (ఫ్రీజ్) సీబీఐ 2012 మే 9: జగతి పబ్లికేషన్స్, జననీ ఇన్ఫ్రా సంస్థలకు చెందిన మరో రెండు బ్యాంకు (ఎస్బీఐ, ఓబీసీ) ఖాతాలను స్తంభింపజేసిన సీబీఐ 2012 మే 22: విచారణకు హాజరు కావాలంటూ జగన్‌కు సీబీఐ నోటీసులు 2012 మే 23: ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన జగన్మోహన్రెడ్డి 2012 మే 24: అరెస్టు చేస్తారని జగన్‌ది కేవలం అపోహ మాత్రమేనంటూ ఆయన పిటిషన్‌ను కొట్టివేసిన సీబీఐ ప్రత్యేక కోర్టు 2012 మే 25: విచారణకు హాజరైన జగన్ 2012 మే 27: జగన్ అరెస్టు.. 2012 మే 28: ప్రత్యేక కోర్టులో హాజరు... రిమాండ్‌కు తరలింపు, బెయిల్ పిటిషన్ దాఖలు. 2012 ఆగస్టు 13: వాన్‌పిక్‌పై చార్జిషీట్ దాఖలు 2012 అక్టోబర్ 5: జగన్ బెయిల్‌పై సుప్రీంకోర్టు తీర్పు... దర్యాప్తు పూర్తయిన తర్వాత జగన్ బెయిల్ పిటిషన్‌ను పరిశీలించాలని ఆదేశం 2013 ఏప్రిల్ 8: దాల్మియా పెట్టుబడులపై చార్జిషీట్ దాఖలు 2013 మే 9: నాలుగు నెలల్లో దర్యాప్తు పూర్తి చేయాలని సీబీఐకి సుప్రీం కోర్టు ఆదేశం. దర్యాప్తు తర్వాత బెయిల్ కోసం జగన్ పిటిషన్ దాఖలు చేసుకోవచ్చని స్పష్టీకరణ 2013 సెప్టెంబర్ 10: పెన్నా, ఇండియా, రఘురామ్ సిమెంట్స్‌కు సంబంధించి మూడు చార్జిషీట్లు దాఖలు చేసిన సీబీఐ 2013 సెప్టెంబర్ 11: బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన జగన్ 2013 సెప్టెంబర్ 12: కౌంటర్ దాఖలుకు గడువు కోరిన సీబీఐ, విచారణ 18కి వాయిదా 2012 సెప్టెంబర్ 17: ఇందూ టెక్, లేపాక్షి నాలెడ్జి హబ్‌కు సంబంధించి రెండు చార్జిషీట్లు దాఖలు 2013 సెప్టెంబర్ 18: బెయిల్ పిటిషన్‌పై వాదనలు పూర్తి... తీర్పును 23కు వాయిదా వేసిన ప్రత్యేక కోర్టు 2013 సెప్టెంబర్ 23: జగన్‌కు బెయిల్ మంజూరు చేసిన సీబీఐ ప్రత్యేక కోర్టు -
మోపిదేవికి తాత్కాలిక బెయిల్
సాక్షి, హైదరాబాద్: వైఎస్ జగన్మోహన్రెడ్డి కంపెనీల్లో వాన్‌పిక్ పెట్టుబడులకు సంబంధించిన కేసులో నిందితునిగా ఉన్న మాజీ మంత్రి మోపిదేవి వెంకట రమణారావు వెన్నునొప్పికి చికిత్స చేయించుకునేందుకు సీబీఐ ప్రత్యేక కోర్టు అనుమతించింది. సోమవారం షరతులతో కూడిన 45 రోజుల తాత్కాలిక బెయిల్ మంజూరు చేసింది. మంగళవారం నుంచి అక్టోబరు 31 వరకు ఆయన బెయిల్‌పై ఉంటూ చికిత్స పొందవచ్చని, నవంబర్ 1న తిరిగి ప్రత్యేక కోర్టులో లొంగిపోవాలని ప్రత్యేక కోర్టుల ప్రధాన న్యాయమూర్తి యు. దుర్గాప్రసాద్‌రావు తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రూ. లక్ష చొప్పున రెండు పూచీకత్తు బాండ్లను సమర్పించడంతోపాటు, కోర్టు ముందస్తు అనుమతి లేకుండా హైదరాబాద్ విడిచి వెళ్లరాదని షరతు విధించారు. అలాగే ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ దర్యాప్తులో జోక్యం చేసుకోరాదని, సాక్ష్యులను ప్రభావితం చేసే ప్రయత్నం చేయరాదని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. వైద్యుల అభిప్రాయాన్ని పరిశీలిస్తే మోపిదేవి వెన్నునొప్పితో బాధపడుతున్నట్లు స్పష్టమవుతోందని, చికిత్స పొందేందుకు మాత్రమే బెయిల్ ఇస్తున్నట్లు పేర్కొన్నారు. తీవ్రమైన వెన్నెనొప్పితో బాధపడుతున్నానని, 3 నెలల తాత్కాలిక బెయిల్ మంజూరు చేయాలని మోపిదేవి దాఖలు చేసుకున్న పిటిషన్‌ను విచారించిన కోర్టు ఈ మేరకు ఉత్తర్వులు జారీచేసింది. -
ఆ పిటిషన్‌పై విచారణ వాయిదా వేయండి: సీబీఐ
సాక్షి, హైదరాబాద్: వైఎస్ జగన్మోహన్రెడ్డి కంపెనీల్లో వాన్‌పిక్ పెట్టుబడులకు సంబంధించిన కేసులో నిందితునిగా ఉన్న మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావుపై అవినీతి నిరోధక చట్టం(పీసీయాక్టు) కింద మోపిన అభియోగాలను విచారణకు స్వీకరించాలని కోరుతూ తాము దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను వాయిదా వేయాలని సీబీఐ సోమవారం ప్రత్యేక కోర్టుకు నివేదించింది. ధర్మానపై పీసీ యాక్టు అభియోగాలను నమోదు చేయడాన్ని తప్పుబడుతూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశామని, అక్టోబరు మొదటి వారంలో విచారణకు వచ్చే అవకాశం ఉందని సీబీఐ స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ సురేంద్ర విజ్ఞప్తి చేశారు. తమ పిటిషన్‌పై సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకునే వరకూ... ఇక్కడ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ ప్రక్రియను ఆపాలని కోరారు. దీనిపై న్యాయమూర్తి దుర్గాప్రసాద్‌రావు విచారణను అక్టోబరు 21కి వాయిదా వేశారు. -
ధర్మానకు సుప్రీంకోర్టు నోటీసులు
సాక్షి లీగల్ కరస్పాండెంట్, న్యూఢిల్లీ: వాన్‌పిక్‌కు భూముల కేటాయింపు కేసులో రాష్ట్ర మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావుకు సుప్రీంకోర్టు సోమవారం నోటీసులు జారీ చేసింది. అవినీతి ఆరోపణల కేసులో ప్రభుత్వ అనుమతి లేకున్నా ధర్మానపై సీబీఐ ప్రత్యేక కోర్టు విచారణ చేపట్టడాన్ని హైకోర్టు నిలిపేసిన సంగతి తెలిసిందే. హైకోర్టు నిర్ణయాన్ని సవాలు చేస్తూ సీబీఐ సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ (ఎస్ఎల్పీ) దాఖలు చేసింది. దీనిపై ధర్మాసనం విచారణ చేపట్టింది. ధర్మాన ప్రసాదరావు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని, అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 19 కింద ఆయనను విచారించడానికి ఎలాంటి అనుమతి అవసరం లేదని అభయ్ సింగ్ చౌతాలా కేసును సీబీఐ ఉటంకించింది. తదుపరి విచారణ కొనసాగించడానికి వీలుగా హైకోర్టు ఆదేశాలను రద్దు చేయాలని ధర్మాసనానికి విన్నవించింది. సీబీఐ ఎస్ఎల్పీపై తన స్పందనను నాలుగు వారాల్లోగా తెలియజేయాలని ఆదేశిస్తూ ధర్మానకు సుప్రీం నోటీసులు జారీ చేసింది. -
ఉస్మానియాలో మోపిదేవికి వైద్య పరీక్షలు
సాక్షి, హైదరాబాద్: వాన్‌పిక్ కేసులో చంచల్‌గూడ జైల్లో ఉన్న మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణను వైద్య పరీక్షల నిమిత్తం గురువారం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కొంతకాలంగా ఆయన వెన్నునొప్పి, అధిక రక్తపోటుతో బాధపడుతున్నారు. నిమ్స్, ఉస్మానియా ఆస్పత్రి వైద్యుల పర్యవేక్షణలో ఆయన జైల్లోనే చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో ఉస్మానియా ఆస్పత్రిలోని మెడికల్ బోర్డులో మోపిదేవికి వైద్య పరీక్షలు నిర్వహించి ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఈ నెల 12న సమగ్ర నివేదిక ఇవ్వాల్సిందిగా సీబీఐ కోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మోపిదేవిని ఉస్మానియాకు తరలించి వైద్య పరీక్షలు నిర్వహించి తిరిగి జైలుకు తరలించారు. మెడికల్ బోర్డు ఇచ్చే నివేదికను కోర్టుకు అందించనున్నట్లు చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్ బి.సైదయ్య తెలిపారు.