నేడు కోర్టులో లొంగిపోనున్న మోపిదేవి వెంకటరమణారావు | Mopidevi venkataramana Rao will attend in CBI special court on Thrusday | Sakshi
Sakshi News home page

నేడు కోర్టులో లొంగిపోనున్న మోపిదేవి వెంకటరమణారావు

Published Thu, Oct 24 2013 1:37 AM | Last Updated on Sat, Jul 6 2019 12:52 PM

నేడు కోర్టులో లొంగిపోనున్న మోపిదేవి వెంకటరమణారావు - Sakshi

నేడు కోర్టులో లొంగిపోనున్న మోపిదేవి వెంకటరమణారావు

సాక్షి, హైదరాబాద్: వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కంపెనీల్లో వాన్‌పిక్ పెట్టుబడుల కేసులో నిందితునిగా ఉన్న మాజీమంత్రి మోపిదేవి వెంకటరమణారావు గురువారం సీబీఐ ప్రత్యేక కోర్టులో లొంగిపోనున్నారు. వెన్నునొప్పి శస్త్రచికిత్స కోసం కోర్టు మంజూరు చేసిన 45 రోజుల తాత్కాలిక బెయిల్ ఈ నెల 31తో ముగియనుంది. నవంబర్ 1న లొంగిపోవాలని కోర్టు షరతు విధించింది. ఈ నేపథ్యంలో ఆయన గురువారమే కోర్టులో లొంగిపోయి బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకోనున్నారు.

 

లొంగిపోయిన వెంటనే మోపిదేవిని కోర్టు రిమాండ్‌కు తరలిస్తుంది. తదుపరి ఆయన దాఖలు చేసుకునే బెయిల్ పిటిషన్‌పై మెరిట్స్ ఆధారంగా నిర్ణయం తీసుకునే అవకాశముంది. ఇదే కేసులో దర్యాప్తు పూర్తయిందని సీబీఐ మెమో దాఖలు చేయడంతో జగన్‌మోహన్‌రెడ్డి, సాయిరెడ్డి సహా వాన్‌పిక్ కేసులో నిందితులుగా ఉన్న నిమ్మగడ్డ ప్రసాద్, ఇతర నిందితులందరికీ ప్రత్యేక కోర్టు ఇప్పటికే బెయిల్ మంజూరు చేసింది. దర్యాప్తు పూర్తయినందున.. తనకూ బెయిల్ మంజూరు చేయాలని మోపిదేవి తన పిటిషన్‌లో కోరనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement