
సాక్షి, హైదరాబాద్: వాన్‌పిక్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ కేసులో హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. సీబీఐ దాఖలు చేసిన ఛార్జ్‌షీట్ చెల్లదని హైకోర్టు తేల్చింది. వైఎస్సార్ హయాంలో ఉమ్మడి ఏపీలో పారిశ్రామిక కారిడార్ ఏర్పాటుకు వాన్‌పిక్ ప్రాజెక్ట్‌కు భూముల కేటాయింపు జరిగింది.
చదవండి: పడకగదిలో అశ్లీల ఫొటోలు తీసి.. నిత్య పెళ్లికొడుకు లీలలెన్నో..!
గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో భూముల కేటాయింపుపై సీబీఐ కేసు నమోదు చేసింది. హైదరాబాద్ సీబీఐ కోర్టులో సీబీఐ అధికారుల ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. ఛార్జ్ షీట్ చెల్లదంటూ తెలంగాణ హైకోర్టులో వాన్ పిక్ ప్రాజెక్ట్స్ క్వాష్ పిటిషన్ వేసింది. విచారణ అనంతరం వాన్ పిక్ ప్రాజెక్ట్స్‌కు అనుకూలంగా హైకోర్టు తీర్పునిచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment