sensational judgment
-
23 ఏళ్ల తర్వాత కోర్టు సంచలన తీర్పు
ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఓ స్థలం విషయంలో వచ్చిన కోర్టు తీర్పు సంచలనంగా మారింది. సినిమా రోడ్ సమీపంలోని అన్నభావు సాఠే విగ్రహం నుంచి మున్సిపల్ కార్యాలయం వైపుగా వెళ్లే రోడ్డుకిరువైపులా బారికేడ్లను ఏర్పాటు చేసి ఈ స్థలం తమదేనంటూ గురువారం ప్లెక్సీని ఏర్పాటు చేయడం కలకలం రేపింది. రాణీసతీజీ కాలనీ సమీపంలోని సాయి పంచవటి హోటల్‌తో పాటు దానిని ఆనుకుని ఉన్న దుకాణాల స్థలం గతంలో సోమా గంగారెడ్డితో పాటు వారికి సంబంధించినదని అతడి తనయుడు సోమ రవి తెలిపారు. రికార్డుల్లో ఈ భూమి తమ పేరిటే ఉందని తెలిపాడు. అయితే ఈ స్థలాన్ని గతంలో ఓ వైద్యుడు ఇతరులకు విక్రయించాడని, దీంతో తాము 23ఏళ్లుగా పోరాడుతున్నామని, తాజాగా ఈ భూమిపై అన్ని హక్కులు సోమ గంగారెడ్డి కుటుంబీకులకే ఉన్నట్లుగా కోర్టు ఇచ్చిందని తెలిపాడు. కోర్టు తీర్పు మేరకు 33 గుంటలతో కూడిన ఈ భూమిని తమ అధీనంలోకి తీసుకుని బారికేడ్లను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నాడు. దీంతో పాటు దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు సోమ గంగారెడ్డి అండ్ అదర్స్ అన్ని ప్లెక్సీ ఏర్పాటు చేశాడు. దీనిని గమనించిన వాహనదారులు, పాదచారులు, షాపుల నిర్వాహకులు పెద్ద ఎత్తున అక్కడకు తరలివచ్చారు. షాపుల, హోటల్ నిర్వాహకులు సైతం వెళ్లేందుకు ఇబ్బందులు పడడంతో ఎలాంటి ఘర్షణలు జరుగకుండా ఎస్సై హరిబాబు ఆధ్వర్యంలో సాయుధ పోలీసులు ఉదయం నుంచి రాత్రి వరకూ బందోబస్తు చేపట్టారు. -
వాన్‌పిక్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ కేసులో హైకోర్టు సంచలన తీర్పు
సాక్షి, హైదరాబాద్: వాన్‌పిక్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ కేసులో హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. సీబీఐ దాఖలు చేసిన ఛార్జ్‌షీట్ చెల్లదని హైకోర్టు తేల్చింది. వైఎస్సార్ హయాంలో ఉమ్మడి ఏపీలో పారిశ్రామిక కారిడార్ ఏర్పాటుకు వాన్‌పిక్ ప్రాజెక్ట్‌కు భూముల కేటాయింపు జరిగింది. చదవండి: పడకగదిలో అశ్లీల ఫొటోలు తీసి.. నిత్య పెళ్లికొడుకు లీలలెన్నో..! గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో భూముల కేటాయింపుపై సీబీఐ కేసు నమోదు చేసింది. హైదరాబాద్ సీబీఐ కోర్టులో సీబీఐ అధికారుల ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. ఛార్జ్ షీట్ చెల్లదంటూ తెలంగాణ హైకోర్టులో వాన్ పిక్ ప్రాజెక్ట్స్ క్వాష్ పిటిషన్ వేసింది. విచారణ అనంతరం వాన్ పిక్ ప్రాజెక్ట్స్‌కు అనుకూలంగా హైకోర్టు తీర్పునిచ్చింది. -
‘పనికి బలవంతం చేయొద్దు’
న్యూఢిల్లీ: పిల్లల సంరక్షణలో ఉన్న మహిళను పనికి/ ఉద్యోగానికి వెళ్లమని బలవంతం చేయరాదని ఢిల్లీ కోర్టు సంచలనాత్మక తీర్పునిచ్చింది. పిల్లల సంరక్షణ కోసం ఇస్తున్న రూ.10వేలను రూ.35వేలకు పెంచాలంటూ భార్యనుంచి విడిపోయిన ఓ భర్తను కోర్టు ఆదేశించింది. భర్త నుంచి విడిపోయిన భార్య పిల్లాడి సంరక్షణకోసం తనకు మంచి లాభదాయకమైన ఉద్యోగాన్ని కూడా వదులుకోవాల్సి వచ్చిందని, ఆమెకు ఇచ్చే మెయింటెనెన్స్‌ను రూ.10,000 నుంచి రూ. 35,000కు పెంచి ఆ మొత్తాన్ని రెండు నెలల్లోగా పూర్తిగా చెల్లించాలని సదరు భర్తను ఆదేశించింది. పిల్లల సంరక్షణలో ఉన్న మహిళలను బలవంతంగా పనికి వెళ్లమని చెప్ప జాలరని, వారు రోజంతా పనిచేసే యంత్రాలు కాదని కోర్టు వ్యాఖ్యానించింది. -
ఉన్మాదికి ఉరిశిక్ష
► మూడున్నరేళ్ల బాలికపై అత్యాచారం చేసి చంపేసిన దుర్మార్గుడు ► కరీంనగర్ జిల్లా అత్యాచార నిరోధక ప్రత్యేక కోర్టు సంచలన తీర్పు ► చాక్లెట్లు కొనిస్తానంటూ బాలికను తీసుకెళ్లిన వెంకటస్వామి ► అత్యాచారం చేసి, గొంతు నులిమి హత్య ► ఆ దుష్టుడికి ఉరిశిక్షే సరైనదని నిర్ణయించిన న్యాయమూర్తి కరీంనగర్ క్రైం/కాటారం: అన్నెం పున్నెం ఎరుగని ఓ మూడున్నరేళ్ల చిన్నారిని కాటేసిన దుర్మార్గుడికి ఉరిశిక్ష పడింది. చిన్నారిపై అత్యాచారానికి ఒడిగట్టి, ఆపై గొంతు నులిమి చంపేసిన ఈ మానవ మృగాన్ని మరణించే వరకూ ఉరి తీయాల్సిందిగా కరీంనగర్ అత్యాచార నిరోధక ప్రత్యేక కోర్టు గురువారం సంచలన తీర్పు వెలువరించింది.జయశంకర్ జిల్లా కాటారం మండలం దామెరకుంటకు చెందిన ఓ మూడున్నరేళ్ల బాలిక స్థానిక అంగన్వాడీ పాఠశాలలో చదివేది. 2016 ఫిబ్రవరి 27న సాయంత్రం పాఠశాల నుంచి తిరిగి వస్తున్న ఆ చిన్నారిని, ఆమె అక్కను.. వారి ఇంటి వెనకాలే నివాసముండే జక్కుల వెంకటస్వామి (30) పిలిచాడు. చాక్లెట్లు కొనిస్తానంటూ మభ్య పెట్టి.. వెంట ఉన్న అక్కను అక్కడి నుంచి పంపిం చేశాడు. తర్వాత చిన్నారిని ఇంట్లోకి తీసుకెళ్లి.. రాక్షసంగా అత్యాచారం చేశాడు. తర్వాత పాప గొంతు నులిమి హత్య చేశాడు. ఇంటికి తాళం వేసి పారిపో యాడు. సాయంత్రం పొలం పనులు చేసుకొని ఇంటికి వచ్చిన తల్లికి చిన్న కుమార్తె కనిపించలేదు. దీంతో చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలించినా ఆచూకీ లభ్యం కాలేదు. మరుసటి రోజు ఉదయం పెద్ద కుమార్తెను వివరంగా అడగగా.. వెంకటస్వామి చాక్లెట్ కొనిస్తానంటూ తీసుకెళ్లాడని చెప్పింది. దీంతో కుటుంబసభ్యులు వెంకటస్వామి ఇంటి కిటికీలు తెరిచిచూశారు. లోపల ఓ మూలన కోళ్లను కమ్మే గంప పక్కన చిన్నారి బట్టలు కనిపించాయి. ఇంటి తాళం పగల గొట్టి, లోనికి వెళ్లి చూస్తే.. గంప కింద రక్తసిక్తమైన చిన్నారి మృతదేహం కనిపించింది. విషయం తెలుసుకున్న పోలీసులు.. వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. చిన్నా రిపై అత్యాచారం చేసి, హత్య చేసినట్లు గుర్తించారు. ఈ ఘటనపై ఐపీసీ 302, 376, ఫోక్సా యాక్ట్ 6 కింద క్రైం నంబర్ 28/2016తో కేసు నమోదు చేశారు. మార్చి 5న జక్కుల వెంకటస్వా మిని అరెస్టు చేయగా.. ఇప్పటివరకు రిమాండ్‌లో ఉన్నాడు. కరీంనగర్‌లోని బాలికలపై అత్యాచారాల నిరోధక ప్రత్యేక జిల్లా కోర్టు ఈ కేసును.. పలు దఫాలుగా విచారించింది. 11 మంది సాక్ష్యం, ఇతర ఆధారాలను పరిశీలించిన న్యాయమూర్తి సురేశ్.. వెంకట స్వామిని దోషిగా నిర్ధారించారు. అతడికి ఉరిశిక్ష విధిస్తూ తీర్పు వెలువరించారు. మా బిడ్డ ఆత్మకు శాంతి చేకూరుతుంది ‘‘అల్లారుముద్దుగా పెంచుకున్న మా బిడ్డను ఆ దుర్మార్గుడు పొట్టన పెట్టుకున్నాడు. నిత్యం మా బిడ్డ జ్ఞాపకాలతోనే బతుకుతున్నాం. ఇలాంటి పరిస్థితి మరే తల్లిదండ్రులకూ రావద్దు. దేవుడిని, చట్టాన్ని నమ్ముకున్నాం. వాడికి ఉరిశిక్ష పడింది, మా బిడ్డ ఆత్మకు ఇప్పుడు శాంతి చేకూరుతుంది..’’ – బాధిత చిన్నారి తల్లిదండ్రులు -
మృగాడికి రెండు సార్లు ఉరి
చెన్నై, సాక్షి ప్రతినిధి: కామంతో కళ్లుమూసుకుపోయి ఓ మహిళను, అభం శుభం తెలియని ఆమె కుమారులను హతమార్చిన కిరాతకుడిని రెండుసార్లు ఉరి తీయాలని, ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష విధించాలని కోయంబత్తూరు మహిళా కోర్టు మంగళవారం సంచలన తీర్పు చెప్పింది. కోర్టు కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. కోయంబత్తూరు గణపతి రామకృష్ణపురం రంగనాథన్ వీధికి చెందిన మరుదమాణిక్యానికి భార్య వత్సలాదేవీ (26), కుమారులు మగిళన్ (6), ప్రణీత్ (11నెలలు) ఉన్నారు. వీరి ఇంటిలో శివగంగై జిల్లా మానామధురైకి చెందిన సెంథిల్ (32) అద్దెకు ఉంటున్నాడు. సెంథిల్‌కు అతని భార్యకూ మధ్య తరచూ తగాదాలు చోటుచేసుకునేవి. మరుదమాణిక్యం, వత్సలాదేవీ ఇద్దరు వారికి నచ్చజెప్పేవారు. కొన్ని రోజుల తరువాత సెంథిల్ భార్య అతడి ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఈ దశలో సెంథిల్ వ్యవహారంలో మార్పు రావడంతో వత్సలాదేవీ అతని చేత ఇంటిని ఖాళీ చేయించారు. గత ఏడాది జూన్ 1న సెంథిల్ వత్సలాదేవీ ఇంటికి వచ్చి ఆమెపై అత్యాచారానికి యత్నించాడు. ఆమె గట్టిగా ప్రతిఘటించడంతో మరింత రెచ్చిపోయిన అతను సమీపంలోని కత్తి తీసుకుని ఆమె, గొంతు కడుపు తదితర భాగాల్లో విచక్షణా రహితంగా పొడిచాడు. రక్తం మడుగుల్లో విలవిలా కొట్టుకుంటూ ఆమె ప్రాణాలు విడిచింది. ఈ దారుణాన్ని భయంతో చూస్తున్న ఆమె ఆరేళ్ల కుమారుడు మగిళన్‌ను సమీపంలో ఏడుస్తున్న 11 నెలల పసిబిడ్డ ప్రణీత్‌ను ఇష్టం వచ్చినట్లు కత్తితో పొడిచి హతమార్చాడు. హతుల వద్దనున్న బంగారు వస్తువులను తీసుకుని పరారయ్యాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రత్యేక బృందంగా ఏర్పడి నిందితుడు సెంథిల్‌ను కోయంబత్తూరు సమీపం సూలూరులో అరెస్ట్ చేశారు. కోయంబత్తూరు మహిళా కోర్టులో గత వారం వరకు విచారణ సాగగా మంగళవారానికి (ఈనెల 17వ తేదీ) వాయిదా పడింది. ఈ దశలో గట్టి బందోబస్తు నడుమ నిందితుడు సెంథిల్‌ను మంగళవారం కోర్టులో హాజరుపరిచారు. సరిగ్గా అదే సమయంలో హతురాలు వత్సలాదేవి తల్లిదండ్రులు, అత్తగారు బంధువులతో కోర్టు ప్రాంగణం నిండిపోయింది. సరిగ్గా 12 గంటలకు విచారణ పూర్తికాగా న్యాయమూర్తి సుబ్రమణియన్ తీర్పు చెప్పారు. హతురాలి ఒంటిపై 54 చోట్ల కత్తిపోట్లు ఉన్నాయన్నారు. ఆరేళ్ల చిన్నారి ఒంటిపై 21 కత్తిపోట్లు, 11 నెలల పసికందుపై 11 కత్తిపోట్లు ఉన్నట్లు తేలిందని న్యాయమూర్తి చెప్పారు. వత్సలాదేవి లొంగలేదనే ఆత్రంలో ఆమెను, సాక్ష్యం చెబుతారనే భీతితో ఇద్దరు చిన్నారులను నిందితుడు సెంథిల్ కిరాతకంగా హతమార్చినట్లు రుజువైందని చెప్పారు. భవిష్యత్తులో ఇటువంటి నేరాలకు మరెవ్వరూ పాల్పడని రీతిలో తీర్పు చెప్పబోతున్నట్లు ముందుగానే ప్రకటించారు. మహిళపై అత్యాచారం జరిపి హత్యచేసినందుకు యావజ్జీవ శిక్ష, తమను తాము రక్షించుకోలేని స్థితిలో ఉన్న ఇద్దరు చిన్నారులను దారుణంగా పొడిచి చంపినందుకు రెండు సార్లు ఉరి శిక్ష, వారి ఒంటిపై ఉన్న నగలను దోచుకున్నందుకు ఏడేళ్ల కఠిన కారాగారశిక్షను విధించారు. అంతేగాక ప్రతి కేసుకు రూ.1000 చొప్పున జరిమానా చెల్లించాలని, లేనిపక్షంలో మరో మూడునెలల జైలు శిక్షను అనుభవించాలని న్యాయమూర్తి తన తీర్పులో పేర్కొన్నారు. కోర్టు తీర్పు వెలువడగానే హతురాలి తల్లిదండ్రులు, అత్తగారు, బంధువులంతా ఒకరినొకరు ఓదార్చుకుంటూ కన్నీరు మున్నీరయ్యారు. -
రెండు సార్లు ఉరి : మహిళా కోర్టు సంచలన తీర్పు
చెన్నై : కామంతో కళ్లుమూసుకుపోయి తల్లీ బిడ్డలను హతమార్చిన మృగాడికి న్యాయస్థానం అదే స్థాయిలో కఠినమైన తీర్పును చెప్పింది. నిందితుడికి రెండుసార్లు ఉరిశిక్ష, ఏడేళ్ల కఠిన కారాగార శిక్షను విధిస్తూ కోయంబత్తూరు మహిళా కోర్టు మంగళవారం సంచలన తీర్పు చెప్పింది. కోర్టు కథనం ప్రకారం, కోయంబత్తూరు గణపతి రామకృష్ణపురం రంగనాధన్ వీధికి చెందిన మరుదమాణిక్యంకు భార్య వత్సలాదేవీ (26) కుమారులు మగిళన్ (6), ప్రణీత్ (11నెలలు) ఉన్నారు. వీరి ఇంటిలో శివగంగై జిల్లా మానామధురైకి చెందిన సెంథిల్ (32) అద్దెకు ఉండగా, అతని ప్రవర్తన సరిగా లేకపోవడంతో యజమాని వత్సలాదేవీ అతడిని అక్కడి నుంచి ఖాళీ చేయించారు. గత ఏడాది జూన్ 1న సెంథిల్ వత్సలాదేవీ ఇంటికి వచ్చి అత్యాచార యత్నం చేశాడు. ఆమె గట్టిగా ప్రతిఘటించడంతో విచక్షణా రహితంగా కత్తితో పలుచోట్ల పొడవడంతో ఆమె ప్రాణాలు విడిచింది. ఏమి జరుగుతోందో తెలియక బిత్తరపోయి చూస్తున్న ఆమె ఆరేళ్ల కుమారుడు మగిళన్‌ను, సమీపంలో ఏడుస్తున్న 11 నెలల పసికందు ప్రణీత్‌ను కత్తితో పొడిచి హతమార్చాడు. హతుల వద్దనున్న బంగారు వస్తువులను తీసుకుని పరారయ్యాడు. సెంథిల్‌ను కోయంబత్తూరు సమీపం సూలూరులో అరెస్ట్ చేశారు. గట్టి బందోబస్తు నడుమ నిందితుడు సెంథిల్‌ను మంగళవారం కోయంబత్తూరు కోర్టులో హాజరుపరిచారు. హతురాలి ఒంటిపై 54 చోట్ల, ఆమె కుమారులు ఆరేళ్ల చిన్నారి ఒంటిపై 21 చోట్ల, 11 నెలల పసికందుపై 11 కత్తిపోట్లు ఉన్నట్లు తేలిందని న్యాయమూర్తి చెప్పారు. భవిష్యత్తులో ఇటువంటి దారుణాలు పునరావృతం కాకుండా కఠినమైన రీతిలో తీర్పు చెప్పబోతున్నట్లు న్యాయమూర్తి ముందుగానే ప్రకటించారు. తల్లిపై అత్యాచారం జరిపి హత్యచేసినందుకు యావజ్జీవం, తమను తాము రక్షించుకోలేని స్థితిలో ఉన్న ఇద్దరు చిన్నారులను దారుణంగా పొడిచి చంపినందుకు రెండుసార్లు ఉరిశిక్ష, వారి ఒంటిపై ఉన్న నగలను దోచుకున్నందుకు ఏడేళ్ల కఠిన కారాగార శిక్షను విధించారు. అంతేగాక ప్రతి కేసుకు రూ.1000 చొప్పున జరిమానా చెల్లించాలని, లేనిపక్షంలో మరో మూడు నెలల జైలు శిక్షను అనుభవించాలని న్యాయమూర్తి తన తీర్పులో పేర్కొన్నారు.