
న్యూఢిల్లీ: పిల్లల సంరక్షణలో ఉన్న మహిళను పనికి/ ఉద్యోగానికి వెళ్లమని బలవంతం చేయరాదని ఢిల్లీ కోర్టు సంచలనాత్మక తీర్పునిచ్చింది. పిల్లల సంరక్షణ కోసం ఇస్తున్న రూ.10వేలను రూ.35వేలకు పెంచాలంటూ భార్యనుంచి విడిపోయిన ఓ భర్తను కోర్టు ఆదేశించింది. భర్త నుంచి విడిపోయిన భార్య పిల్లాడి సంరక్షణకోసం తనకు మంచి లాభదాయకమైన ఉద్యోగాన్ని కూడా వదులుకోవాల్సి వచ్చిందని, ఆమెకు ఇచ్చే మెయింటెనెన్స్‌ను రూ.10,000 నుంచి రూ. 35,000కు పెంచి ఆ మొత్తాన్ని రెండు నెలల్లోగా పూర్తిగా చెల్లించాలని సదరు భర్తను ఆదేశించింది. పిల్లల సంరక్షణలో ఉన్న మహిళలను బలవంతంగా పనికి వెళ్లమని చెప్ప జాలరని, వారు రోజంతా పనిచేసే యంత్రాలు కాదని కోర్టు వ్యాఖ్యానించింది.
Comments
Please login to add a commentAdd a comment