న్యూఢిల్లీ: 1984నాటి సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో కాంగ్రెస్ నేత జగదీశ్ టైట్లర్‌పై ఢిల్లీ కోర్టు హత్య తదితర అభియోగాలు మోపింది. ఢిల్లీలోని పాల్ బంగాశ్ ప్రాంతంలో ముగ్గురువ్యక్తుల హత్యకు సంబంధించిన కేసుపై స్పెషల్ కోర్టు ఆగస్ట్ 30న విచారణ జరిపింది. ఆయనపై అభియోగాలు మోపేందుకు తగు ఆధారాలున్నట్లు స్పష్టం చేసింది. శుక్రవారం టైట్లర్‌పై హత్యతోపాటు దొంగతనం, చట్ట విరుద్ధంగా గుమికూడటం, కొట్టాట, వివిధ వర్గాల మధ్య శత్రుత్వాన్ని పెంచడం వంటి అభియోగాలు మోపుతూ తీర్పు వెలువరించింది.
ఈ కేసులో సీబీఐ గతేడాది మే 20వ తేదీన టైట్లర్‌పై చార్జిషీటు నమోదు చేసింది. 1984 నవంబర్ ఒకటో తేదీన ఢిల్లీలోని పాల్ బంగాశ్ గురుద్వారా వద్దకు తెల్ల అంబాసిడర్‌లో వచ్చిన టైట్లర్..సిక్కులను చంపండి..వాళ్లు మా అమ్మ(అప్పటి ప్రధాని ఇందిర)ను చంపారు’అంటూ అనుచరులను రెచ్చగొట్టారని చార్జిషీటులో పేర్కొంది. దీంతో, టైట్లర్ అనుచరుల దాడిలో ముగ్గురు సిక్కులు ప్రాణాలు కోల్పోయారంది. 1984లో అప్పటి ప్రధాని ఇందిర హత్యానంతరం ఢిల్లీ చుట్టుపక్కల ప్రాంతాల్లో సిక్కులపై దాడులు జరగడం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment