anti-Sikh riots case
-
జగదీశ్ టైట్లర్‌పై హత్యాభియోగం
న్యూఢిల్లీ: 1984నాటి సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో కాంగ్రెస్ నేత జగదీశ్ టైట్లర్‌పై ఢిల్లీ కోర్టు హత్య తదితర అభియోగాలు మోపింది. ఢిల్లీలోని పాల్ బంగాశ్ ప్రాంతంలో ముగ్గురువ్యక్తుల హత్యకు సంబంధించిన కేసుపై స్పెషల్ కోర్టు ఆగస్ట్ 30న విచారణ జరిపింది. ఆయనపై అభియోగాలు మోపేందుకు తగు ఆధారాలున్నట్లు స్పష్టం చేసింది. శుక్రవారం టైట్లర్‌పై హత్యతోపాటు దొంగతనం, చట్ట విరుద్ధంగా గుమికూడటం, కొట్టాట, వివిధ వర్గాల మధ్య శత్రుత్వాన్ని పెంచడం వంటి అభియోగాలు మోపుతూ తీర్పు వెలువరించింది. ఈ కేసులో సీబీఐ గతేడాది మే 20వ తేదీన టైట్లర్‌పై చార్జిషీటు నమోదు చేసింది. 1984 నవంబర్ ఒకటో తేదీన ఢిల్లీలోని పాల్ బంగాశ్ గురుద్వారా వద్దకు తెల్ల అంబాసిడర్లో వచ్చిన టైట్లర్..సిక్కులను చంపండి..వాళ్లు మా అమ్మ(అప్పటి ప్రధాని ఇందిర)ను చంపారు’అంటూ అనుచరులను రెచ్చగొట్టారని చార్జిషీటులో పేర్కొంది. దీంతో, టైట్లర్ అనుచరుల దాడిలో ముగ్గురు సిక్కులు ప్రాణాలు కోల్పోయారంది. 1984లో అప్పటి ప్రధాని ఇందిర హత్యానంతరం ఢిల్లీ చుట్టుపక్కల ప్రాంతాల్లో సిక్కులపై దాడులు జరగడం తెలిసిందే. -
‘ఆ ముఖ్యమంత్రి జైలుకెళ్లడం ఖాయం’
చండీగఢ్: మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌పై శిరోమణి అకాలీదళ్ నేత మంజీందర్ సింగ్ సిర్సా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. 1984 సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో సజ్జన్ కుమార్లా ఆయన కూడా జైలుకెళ్లడం ఖాయమని సిర్సా పేర్కొన్నారు. 1984 సిక్కుల ఊచకోత కేసును మళ్లీ తెరిచి తాజాగా విచారణ చేపట్టాలంటూ కేంద్ర హోంశాఖ సిట్‌ను ఆదేశించిన నేపథ్యంలోనే సిర్సా ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. తాజా విచారణ పూర్తై, ఈ కేసులో కమల్‌నాథ్ నిందితుడని తేలితే ఆయన కటకటాలు లెక్కించడం ఖాయమని ఆయన అభిప్రాయపడ్డారు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా కమల్‌నాథ్‌ను నియమించడంపై గతంలోనే సిర్సా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. సిక్కులను చిత్రహింసలకు గురిచేసిన వ్యక్తిని సీఎంగా ఎలా నియమిస్తారని ఆయన బహిరంగంగానే విమర్శించారు. ఇందిర మరణాంతరం జరిగిన ఘటనతో కమల్‌నాథ్ హస్తం కూడా ఉందని ఎంతోకాలంగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసును మరోసారి విచారించాలంటూ కేంద్ర హోంశాఖ తాజాగా సిట్‌ను ఆదేశించడంతో మరోసారి తెరపైకి వచ్చింది. కాగా సిక్కుల ఊచకోత కేసులో కాంగ్రెస్ సీనియర్ నేత సజ్జన్ కుమార్‌కు జీవిత ఖైదు విధిస్తూ డిసెంబర్లో ఢిల్లీ హైకోర్టు తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. -
మీరంతా శిక్ష అనుభవించాల్సిందే
న్యూఢిల్లీ: 1984 సిక్కు వ్యతిరేక అల్లర్లకు సంబంధించి శిక్షలను రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు తోసిపుచ్చింది. 1996లో ట్రయల్ కోర్టు విధించిన ప్రకారం దోషులంతా శిక్ష అనుభవించాల్సిందేనని స్పష్టం చేసింది. 1984లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ హత్యానంతరం ఢిల్లీలోని త్రిలోక్‌పురి ప్రాంతంలో జరిగిన అల్లర్లలో 95 మంది ప్రాణాలు కోల్పోగా 100 వరకు ఇళ్లు కాలిపోయాయి. ఈ ఘటనలపై విచారణ చేపట్టిన ట్రయల్ కోర్టు 89 మందికి జైలుశిక్షలు విధించింది. అయితే, కొందరు చనిపోగా సుమారు 70 మంది ఆ శిక్షలు రద్దు చేయాలంటూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఆ పిటిషన్‌ను బుధవారం జస్టిస్ ఆర్కే గౌబా విచారించారు. దోషుల వినతిని తోసిపుచ్చిన ఆయన.. అల్లర్లు, దోపిడీలు, గృహ దహనాలకు పాల్పడిన దోషులంతా 1996 కోర్టు తీర్పు ప్రకారం ఐదేళ్ల జైలు శిక్షను అనుభవించాల్సిందేనంటూ తీర్పు వెలువరించారు. ‘1984 సిక్కు వ్యతిరేక అల్లర్లను అదుపు చేయటంలో అధికార యంత్రాంగం విఫలమైంది. ఇలాంటి ఘటనలను నివారించడానికి చట్ట సంస్కరణల అవసరం ఉంది. యంత్రాంగం సకాలంలో స్పందించకపోవడంతో అల్లర్లు వ్యాప్తి చెందాయి. చట్టపర విధానాల్లో జాప్యం వల్ల ఇలాంటి కేసులు ఏళ్లుగా కోర్టుల్లోనే ఉంటున్నాయి. దీంతో చట్టాలు అసమర్ధంగా, అసంతృప్తికరంగా మారాయి’ అని జస్టిస్ ఆర్కే గౌబా వ్యాఖ్యానించారు. -
సోనియాపై ఫిర్యాదుకు అమెరికా కోర్టు తిరస్కృతి
న్యూయార్క్: కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీపై సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో సిక్కు హక్కులగ్రూపు చేసిన సవరణఫిర్యాదును అమెరికాకోర్టు తిరస్కరించింది. అమెరికాలోని సిక్స్ ఫర్ జస్టిస్ (ఎస్జేఎఫ్) అనే సంస్థ 1984 నాటి సిక్కు అల్లర్లకు సంబంధించి గతంలో సోనియాపై హక్కుల ఉల్లంఘన ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ ఫిర్యాదును గత నెలలో విచారించిన యూఎస్ జిల్లా కోర్టు న్యాయమూర్తి బ్రియాన్ కోగెన్ సరైన ఆధారాలు లేవంటూ కొట్టేశారు. తాజాగా ఎస్జేఎఫ్ ప్రతినిధులు సోనియాపై సవరణ ఫిర్యాదును నమోదు చేయాలని కోరుతూ కోగెన్‌కు లేఖ రాశారు. ఈ కేసులో తుదితీర్పు వెలువడింద ని, తదుపరి విచారణకు సరైన ఆధారాలు లేవని కోగెన్ ఆ విజ్ఞప్తిని తిరస్కరించారు. -
కాంగ్రెస్‌పై సిక్కు అలర్ల కేసును కొట్టేసిన అమెరికా కోర్టు
న్యూయార్క్: సిక్కు వ్యతిరేక అల్లర్లకు సంబంధించి కాంగ్రెస్ పార్టీపై సిఖ్స్ ఫర్ జస్టిస్(ఎస్ఎఫ్జే) అనే సంస్థ వేసిన మానవ హక్కుల ఉల్లంఘన కేసును అమెరికాలోని ఓ కోర్టు మంగళవారం కొట్టేసింది. ఎస్ఎఫ్జేకు ఈ కేసును దాఖలు చేసేందుకు చట్టబద్ధమైన అర్హత లేదని, అమెరికాతో సంబంధం లేని సంఘటనలపై అమెరికా కోర్టు విచారణ జరపజాలదని న్యూయార్క్‌లోని యూఎస్ జిల్లా కోర్టు తన తీర్పులో పేర్కొంది. ఈ తీర్పును అప్పీలు కోర్టులో సవాలు చేయనున్నట్లు ఎస్ఎఫ్జే తెలిపింది.