సిక్కు వ్యతిరేక అల్లర్లకు సంబంధించి కాంగ్రెస్ పార్టీపై సిఖ్స్ ఫర్ జస్టిస్(ఎస్‌ఎఫ్‌జే) అనే సంస్థ వేసిన మానవ హక్కుల ఉల్లంఘన కేసును అమెరికాలోని ఓ కోర్టు మంగళవారం కొట్టేసింది.
న్యూయార్క్: సిక్కు వ్యతిరేక అల్లర్లకు సంబంధించి కాంగ్రెస్ పార్టీపై సిఖ్స్ ఫర్ జస్టిస్(ఎస్‌ఎఫ్‌జే) అనే సంస్థ వేసిన మానవ హక్కుల ఉల్లంఘన కేసును అమెరికాలోని ఓ కోర్టు మంగళవారం కొట్టేసింది.
ఎస్‌ఎఫ్‌జేకు ఈ కేసును దాఖలు చేసేందుకు చట్టబద్ధమైన అర్హత లేదని, అమెరికాతో సంబంధం లేని సంఘటనలపై అమెరికా కోర్టు విచారణ జరపజాలదని న్యూయార్క్‌లోని యూఎస్ జిల్లా కోర్టు తన తీర్పులో పేర్కొంది. ఈ తీర్పును అప్పీలు కోర్టులో సవాలు చేయనున్నట్లు ఎస్‌ఎఫ్‌జే తెలిపింది.