Sikhs for Justice (SFJ)
-
ఖలిస్తానీ బంధంలో కెనడా ప్రధాని కార్యాలయం
ఒట్టావా: భారత వ్యతిరేక శక్తులు కెనడాలో ఏకంగా అధికారవర్గంతోనూ అంటకాగాయన్న వాదనలు నిజమని నిర్ధారణ అయింది. జస్టిన్‌ట్రూడో నేతృత్వంలోని కెనడా ప్రభుత్వంతో సంప్రతింపులు జరుపుతున్నామని భారత్‌లో నిషేధిత ఉగ్రసంస్థ సిఖ్స్ ఫర్ జస్టిస్ చీఫ్, ఖలిస్తానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూ తాజాగా ప్రకటించారు. కెనడా ప్రధాని కార్యాలయంతో గత రెండు, మూడేళ్లుగా ఉత్తరప్రత్యుత్తరాల తంతు కొనసాగుతోందని ఆయన వెల్లడించారు. సీబీసీ న్యూస్ ముఖాముఖిలో ట్రూడోను పన్నూ పొగిడారు. ‘‘మీడియా సమావేశంలో ట్రూడో చేసిన ప్రకటనతో జాతి భద్రతకు, న్యాయం, చట్టం అమలుకు కెనడా ప్రభుత్వం ఎంతగా కట్టుబడిందో చాటిచెబుతోంది. పీఎం కార్యాలయంతో గత మూడేళ్లుగా సంప్రతింపులు జరుపుతున్నాం. కెనడాలో భారతీయ ఏజెంట్ల నిఘా నెట్వర్క్ గుట్టుమట్లను ప్రభుత్వానికి అందజేశాం. హర్దీప్ సింగ్ పన్నూ హత్యకు కెనడాలో భారత హైకమిషనర్ సంజయ్ వర్మ, అతని సిబ్బంది ఎలా కుట్ర పన్నారో, ఎలా అమలుచేశారో పీఎంఓకు తెలియజేశాం’’అని అన్నారు. కెనడాలో భారతీయ ఏజెంట్లు హింసను ఉసిగొల్పుతున్నారని రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీసులు చేసిన ఆరోపణలనే పన్నూ వల్లెవేయడం గమనార్హం. భారతీయ–కెనడియన్ పౌరులు కెనడా రాజ్యాంగాన్ని గౌరవించట్లేరని పన్నూ ఆరోపించారు. భారతీయ కెనడియన్లను దేశం విడిచిపోవాలని పన్నూ గతంలో హెచ్చరించారు. ‘‘కెనడా రాజ్యాంగాన్ని పాటించని మీరు కెనడాలో ఉండకూడదు. కెనడాను వదిలేసి భారత్‌కు వెళ్లిపొండి’అని గత ఏడాది ఇండో కెనడియన్ హిందువులను పన్నూ హెచ్చరించడం తెల్సిందే. -
Sikh for Justice: వరల్డ్ కప్ కాదు.. టెర్రర్ కప్
అహ్మదాబాద్: కరడుగట్టిన ఖలిస్తాన్ ఉగ్రవాది, నిషేధిత సిఖ్స్ ఫర్ జస్టిస్(ఎస్ఎఫ్జే) సంస్థ అధినేత గురుపట్వంత్ సింగ్ పన్నూపై గుజరాత్ పోలీసుల ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో అక్టోబర్ 5 నుంచి ప్రారంభమయ్యే క్రికెట్ ప్రపంచ కప్ ‘ప్రపంచ టెర్రర్ కప్’గా మారతుందంటూ సోషల్ మీడియాలో పన్నూ చేసిన హెచ్చరికలను పోలీసులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. ప్రజలను భయభ్రాంతులకు గురిచేసేలా బెదిరింపులకు పాల్పడినందుకు అతడిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశామని అహ్మదాబాద్ సైబర్ క్రైమ్ విభాగం పోలీసు అధికారులు శుక్రవారం వెల్లడించారు. ముందే రికార్డు చేసిన ఓ వాయిస్ మెసేజ్‌ను విదేశీ ఫోన్ నంబర్‌తో సోషల్ మీడియాలో పన్నూ పోస్టు చేశాడని తెలిపారు. +447418343648 అనే నంబర్‌తో దేశవ్యాప్తంగా చాలామందికి ఈ మెసేజ్ అందిందని పేర్కొన్నారు. మెసేజ్ అందుకున్నవారు ఈ విషయాన్ని తమ దృష్టికి తీసుకొచ్చారని చెప్పారు. సబ్ఇన్స్పెక్టర్ హెచ్.ఎన్.ప్రజాపతి ఫిర్యాదు మేరకు పన్నూపై కేసు పెట్టినట్లు వివరించారు. +44 అనేది యునైటెడ్ కింగ్డమ్(యూకే) కోడ్ కావడం గమనార్హం. అయితే, ఇంటర్నెట్ కాల్ టెక్నాలజీతో ఇలా విదేశీ ఫోన్ నంబర్ల నుంచి సందేశం వస్తున్నట్లు తప్పుదోవ పట్టించవచ్చని నిపుణులు చెబుతున్నారు. అందుకే పన్నూ హెచ్చరికల మెసేజ్ ఎక్కడి నుంచి వస్తోందన్న దానిపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ...ఇట్లు గురుపట్వంత్ సింగ్ పన్నూ విదేశీ ఫోన్ నంబర్‌తో వచి్చన కాల్‌ను రిసీవ్ చేసుకున్న తర్వాత ప్రి–రికార్డెడ్ వాయిస్ మెసేజ్ వినిపిస్తోందని అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీసు జీతూ యాదవ్ తెలియజేశారు. ‘‘అమర వీరుడు హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యకు కచి్చతంగా ప్రతీకారం తీర్చుకుంటాం. మీ బుల్లెట్లకు వ్యతిరేకంగా బ్యాలెట్లు ఉపయోగిస్తాం. మీరు సాగిస్తున్న హింసాకాండకు వ్యతిరేకంగా ఓట్లు వేస్తాం. అక్టోబర్ 5వ తేదీని గుర్తు పెట్టుకోండి. ఆ రోజు క్రికెట్ ప్రపంచ కప్ కాదు, ప్రపంచ టెర్రర్ కప్ ప్రారంభమవుతుంది. సిఖ్స్ ఫర్ జస్టిస్ ఆధ్వర్యంలో ఖలిస్తాన్ జెండాలతో అహ్మదాబాద్‌ను ముట్టడిస్తాం.. ఇట్లు గురుపట్వంత్ సింగ్ పన్నూ’’ అంటూ ఆ సందేశంలో హెచ్చరికలు వినిపిస్తున్నాయని వెల్లడించారు. అహ్మదాబాద్ నగర ప్రజలకు గత రెండు రోజులుగా ఈ మెసేజ్ వస్తోందన్నారు. ఎవరీ పన్నూ? సిక్కుల కోసం భారత్‌లో ఖలిస్తాన్ అనే ప్రత్యేక దేశం ఏర్పాటే తన జీవితాశయమని ప్రకటించుకున్న గురుపట్వంత్ సింగ్ పన్నూ పంజాబ్ రాష్ట్రంలో అమృత్సర్ సమీపంలోని ఖంజోత్ అనే గ్రామంలో జని్మంచాడు. న్యాయ విద్య అభ్యసించాడు. అనంతరం కెనడాకు వలస వెళ్లి, అక్కడే స్థిరపడ్డారు. కెనడా పౌరసత్వం కూడా సంపాదించాడు. సిఖ్స్ ఫర్ జస్టిస్ అనే సంస్థను స్థాపించాడు. భారత్‌కు వ్యతిరేకంగా కార్యకలాపాలు సాగిస్తున్నాడు. భారత్‌లో జరిగిన పలు ఉగ్రవాద దాడుల్లో అతడి హస్తం ఉన్నట్లు గుర్తించారు. ఖలిస్తాన్ ఉద్యమానికి మద్దతుగా కెనడాతోపాటు అమెరికా, యూకే, ఆ్రస్టేలియా తదితర దేశాల్లో ర్యాలీలు నిర్వహించాడు. ఖలిస్తాన్‌కు అనుకూలంగా వివిధ దేశాల ప్రభుత్వాల మద్దతును కూడగట్టడానికి లాబీయింగ్ చేస్తున్నాడు. హరిదీప్ సింగ్ నిజ్జర్ హత్యపై పన్నూ తీవ్రంగా రగిలిపోయాడు. కెనడాలోని హిందువులంతా దేశం విడిచి వెళ్లిపోవాలని కొన్ని రోజుల క్రితం హెచ్చరికలు జారీ చేశాడు. 2020 జూలైలో పన్నూను భారత ప్రభుత్వం ఉగ్రవాదిగా ప్రకటించింది. ప్రస్తుతం అతడు కెనడాలో అజ్ఞాతంలో ఉన్నాడు. -
ఉర్దూస్తాన్, ఖలిస్తాన్..
న్యూఢిల్లీ: భారత్‌లో ప్రత్యేక ఖలిస్తాన్ కోసం వేర్పాటువాదం, ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న సిఖ్స్ ఫర్ జస్టిస్(ఎస్ఎఫ్జే) ఉగ్రసంస్థ చీఫ్ గురుపత్వంత్ సింగ్ పన్నూ పెద్ద ప్రణాళికలే రచించాడు. సంబంధిత వివరాలు ఉన్న భారత నిఘా వర్గాల నివేదిక ఈ విషయాలను వెల్లడిస్తోంది. ఆ నివేదికలోని వివరాలను ఓసారి గమనిస్తే ► మతాల ప్రాతిపదికన భారత్‌ను విడగొట్టాలి అనేది పన్నూ ప్రధాన ఎజెండా. ► ఢిల్లీ, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, హరియాణా, ఉత్తరాఖండ్‌సహా పలు రాష్ట్రాల్లో పన్నూపై పలు కేసులు ఉన్నాయి. ప్రస్తుతం అమెరికాలో తలదాచుకుంటున్న పన్నూపై భారత్‌లో చాలా రాష్ట్రాల్లో పదహారుకు పైగా కేసులు నమోదవడాన్ని బట్టి ఎస్ఎఫ్జే కార్యకలాపాలు ఇండియాలో ఎంతగా విస్తరించాయో అర్ధమవుతుంది. ► భారత భూభాగంలో ముస్లింల కోసం ప్రత్యేక దేశాన్ని ఏర్పాటుచేయాలనేది పన్నూ ఆలోచన. దీనికి ‘ డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ ఉర్దూస్తాన్’ అని పేరు కూడా ఖాయం చేసుకున్నాడు. ► దేశం నుంచి కశీ్మర్‌ను వేరుచేసేందుకు కశ్మీర్‌లోని ప్రజలను విప్లవకారులుగా తయారుచేయాలని కంకణం కట్టుకున్నాడు. అందుకోసం భారత్ పట్ల వ్యతిరేకభావన ఉన్న ప్రాంతాల్లో విద్వేషాన్ని రెచ్చగొడుతున్నారు. కశీ్మర్లో అసంతృప్తితో రగిలిపోతున్న వారికి మరింత ఉద్రేకపరిచేందుకు ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఖలిస్తాన్ జెండా ఎగరేస్తానని పన్నూ గతంలో ప్రకటించాడు కూడా. అసలు ఎవరీ పన్నూ ? దేశ విభజన కాలంలో 1947లో పన్నూ కుటుంబం పాకిస్తాన్ నుంచి అమృత్సర్ దగ్గర్లోని ఖాన్కోట్ గ్రామానికి వలసవచి్చంది. అమృత్‌సర్‌లో పుట్టిన పన్నూ.. పంజాబ్ విశ్వవిద్యాలయం నుంచి లా పట్టా పుచ్చుకున్నాడు. అమెరికాలో ఉంటున్న పన్నూ అక్కడే అటారీ్నగా పనిచేస్తున్నాడు. భారత్‌లో ఖలిస్తాన్‌ను ఏర్పాటుకు కృషిచేస్తున్న ఎస్ఎఫ్జే సంస్థకు న్యాయ సలహాదారుగా ఉంటున్నట్లు పన్నూ చెప్పుకుంటున్నాడు. భారత వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు సాక్ష్యాధారాలతో గుర్తించిన కేంద్ర హోం శాఖ పన్నూను ఉగ్రవాదిగా ప్రకటించింది. పన్నూ ప్రేలాపణలు.. భారత్‌లో ఖలిస్తాన్ వేర్పాటువాదంలో నిమగ్నమైన వారికి నగదు ప్రోత్సాహకాలు ఇస్తుంటాడని పన్నూపై ఆరోపణలు ఉన్నాయి. తాను చెప్పిన పనులు చేసినా భారీ బహుమతులు ఇస్తానని గతంలో బహిరంగ ప్రకటనలుచేశాడు. ఢిల్లీలోని ప్రఖ్యా త ఇండియాగేట్ వద్ద ఖలిస్తాన్ జెండా ఎగరేస్తే 25 లక్షల డాలర్లు ఇస్తానని పిలుపునిచ్చాడు. 2021లో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల వేళ ఢిల్లీలో ఎర్రకోటపై ప్రధాని మోదీ మువ్వన్నెల జెండా ఎగరేయకుండా ఎవరైనా పోలీసు అడ్డుకుంటే అతనికి 10 లక్షల డాలర్లు ఇస్తానని ప్రకటించాడు. భారత వ్యతిరేక కార్యకలాపాల్లో మునిగిన పన్నూపై ఎన్ఐఏ కోర్టు 2021 ఫిబ్రవరిలో నాన్‌బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీచేసింది. -
ఖలిస్తాన్ రెఫరెండం!
టొరంటో: భారత వ్యతిరేక శక్తులు కెనడాలో తిష్టవేశాయని స్వయంగా ఆ దేశ ప్రధాని ట్రూడో ఎదుటే ప్రధాని మోదీ ఆందోళన వ్యక్తంచేసిన వేళ అదే రోజు మరో పరిణామం చోటుచేసుకుంది. భారత్‌ను విడగొట్టి సిక్కుల కోసం ఖలిస్తాన్‌ను ఏర్పాటుచేయడంపై అభిప్రాయం తెలపాలంటూ కెనడాలో సిఖ్స్ ఫర్ జస్టిస్(ఎస్ఎఫ్జే) వేర్పాటువాద సంస్థ రెఫరెండం నిర్వహించింది. సుర్రే పట్టణంలో ఎస్ఎఫ్జే వ్యవస్థాపకుడు గురుపత్వంత్ సింగ్ పన్నూ సారథ్యంలో సిక్కు ప్రజాభిప్రాయ సేకరణ(రెఫరెండం) చేపట్టారు. భారీ వ్యక్తిగత భద్రత నడుమ రెఫరెండం ప్రాంతానికి వచి్చన గురపత్వంత్ అక్కడే భారత వ్యతిరేక విద్వేష ప్రసంగం చేశారు. గురు నానక్ సింగ్ గురుద్వారా వద్ద జరిగిన ఈ రెఫరెండం తంతులో దాదాపు 7వేల మంది పాల్గొన్నారు. దాదాపు 50 వేలకుపైగా జనం వస్తారని ఆశించిన నిర్వాహకులకు భంగపాటు ఎదురైంది. కెనడా ప్రధాని ట్రూడోతో మోదీ ఖలిస్తాన్ వేర్పాటువాదం సహా పలు ద్వైపాక్షిక అంశాలపై చర్చించిన ఆదివారం రోజే ఈ రెఫరెండంను ఎస్ఎఫ్జే నిర్వాహకులు పనిగట్టుకుని నిర్వహించారు. అంతకుముందు పత్వంత్ సింగ్ ఒక ఆడియో సందేశం విడుదలచేశారు. ‘ఢిల్లీలో జీ20 సదస్సు జరుగుతున్న ప్రగతి మైదాన్ ప్రాంగణానికి భారీ సంఖ్యలో వెళ్లి నిరసన గళం వినిపించండి’ అని కశీ్మర్ లోయలో నివసించే ముస్లింలకు పిలుపునిస్తున్నట్లు ఆ ఆడియోలో ఉంది. ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఖలిస్తాన్ వేర్పాటువాద జెండా ఎగరేస్తామని పత్వంత్‌సింగ్ సవాల్ చేశారు. -
లుథియానా కోర్టు పేలుడు కేసు... జర్మనీలో సూత్రధారి పట్టివేత
న్యూఢిల్లీ: లూథియానా జిల్లా కోర్టులో సంభవించిన బాంబు పేలుడు దర్యాప్తులో లోతుల్లోకి వెళ్లి కూపీ లాగిన భారత దర్యాప్తు సంస్థలు సూత్రధారిని పట్టుకోవడంలో సఫలమయ్యాయి. వేర్పాటువాద కార్యకలాపాలను ప్రోత్సహించే సిఖ్స్ ఫర్ జస్టిస్ (ఎస్ఎఫ్ఐ) సంస్థకు చెందిన ఉగ్రవాది జస్విందర్ సింగ్ ముల్తానీని భారత నిఘా వర్గాల సమాచారంతో జర్మనీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 23న లూథియానా కోర్టు రెండో అంతస్తులో బాంబు పేలిన విషయం తెల్సిందే. మాజీ కానిస్టేబుల్ గగన్‌దీప్ బాంబును అమర్చుతుండగా పేలి అతను మరణించాడు. ఎన్నికల వేళ పంజాబ్‌లో శాంతిభద్రతల సమస్యను సృష్టించేందుకు పాకిస్తాన్ గడ్డపై నుంచి ఖలిస్థాన్ నేతలు కుట్రలు చేస్తున్నారని తెలియడంతో కేంద్ర దర్యాప్తు సంస్థలు దీన్ని సీరియస్‌గా తీసుకొన్నాయి. గగన్‌దీప్... జస్విందర్ సింగ్ ముల్తానీతో నిరంతరం సంప్రదింపులు జరిపాడని గుర్తించాయి. దాంతో ఇతనిపై పంజాబ్ రెండు ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. భారత్ తమ రాయబార కార్యాలయం ద్వారా జర్మనీ పోలీసులకు తగిన ఆధారాలను సమర్పించడంతో వారు ఎర్ఫర్ట్ పట్టణంలో ముల్తానీని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. మరిన్ని పేలుడు పదార్థాలు, హ్యాండ్ గ్రెనేడ్లను పాక్ మీదుగా భారత్‌లోకి పంపే ప్రయత్నాల్లో ముల్తానీ ఉన్నాడని, పంజాబ్‌లో మళ్లీ పేలుళ్లకు కుట్ర చేస్తున్నాడని భారత ఏజెన్సీలు గుర్తించాయి. ఖలిస్థానీ అగ్రనేతలతో ముల్తానీకి సన్నిహిత సంబంధాలున్నట్లు తెలిసింది. -
మోదీకి నిద్రలేకుండా చేస్తాం.. ఎస్ఎఫ్జే గ్రూప్ హెచ్చరిక
వాషింగ్టన్: భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికాలో నిద్రలేని రాత్రులు గడపాల్సి వస్తుందని ఖలిస్తానీ ఉగ్రవాద గ్రూప్ సిక్స్ ఫర్ జస్టిస్ (ఎస్ఎఫ్జే) హెచ్చరికలు జారీ చేసింది. ఈ నెల 24న మోదీ అగ్రరాజ్యానికి వెళ్తున్న సందర్భంగా ఆ సంస్థ ఈ వ్యాఖ్యలు చేసింది. దీంతో పాటు వైట్ హౌస్ వెలుపల కూడా నిరసన కార్యక్రమాలు చేసేందుకు ఆ సంస్థ ప్లాన్ చేస్తోంది. ఎందుకంటే తొలిసారి ప్రత్యక్ష క్వాడ్ సమావేశంతోపాటు ఐక్యరాజ్య సమితి సాధారణ సభలో పాల్గొనడానికి మోదీ అమెరికాకు వెళ్తున్నారు. కాగా భారత్‌లో రైతులపై హింసకు వ్యతిరేకంగా తాము ఈ నిరసనలు చేపట్టనున్నట్లు ఎస్ఎఫ్జే సంస్థ పేర్కొంది. ఆ గ్రూపు జనరల్ కౌన్సిల్ గుర్పత్వంత్ సింగ్ పన్నన్ మాట్లాడుతూ .. అమెరికాలో మోదీకి నిద్రలేని రాత్రులను గడిపేలా చేస్తామని తెలపడం గమనార్హం. వీటితో పాటు పన్నన్.. యూకే, యూఎస్, యూరోపియన్ యూనియన్ దేశాలు తాలిబాన్లను గుర్తిస్తే, ఎస్ఎఫ్జే కూడా ఖలిస్తాన్ మద్దతు కోసం తాలిబాన్లను సంప్రదిస్తామని పేర్కొన్నాడు. లండన్‌లో ఆగస్ట్ 15న ఖలిస్థాన్ రెఫరెండమ్ జరుగుతుందని గతేడాది ఈ గ్రూపు ప్రకటించినప్పటికీ ఆ తర్వాత కొవిడ్ కారణంగా అక్టోబర్‌కు వాయిదా వేశారు. ఎస్ఎఫ్జే సమస్యపై చర్చించడానికి ఇంటెలిజెన్స్ అధికారులు ఇటీవల ఢిల్లీలో పంజాబ్ పోలీసు ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించినట్లు ఉన్నత వర్గాల సమాచారం. ముఖ్యంగా ఈ నిషేధిత సంస్థ పంజాబ్ యువతను విద్రోహ కార్యకలాపాలను ప్రేరేపించడం కోసం ప్రయత్నిస్తోంది. ఎస్ఎఫ్జే గ్రూప్ తమ ప్రచారం కోసం వాట్సాప్ గ్రూపులు క్రియేట్ చేసింది. అందులో పాకిస్థాన్, ఐఎస్ఐ ఏజెంట్ల నంబర్లు కూడా ఉన్నాయి. అయితే చట్టానికి వ్యతిరేకంగా వారి కార్యకలాపాలు ఉన్నాయని భారత ప్రభుత్వం ఈ గ్రూపును జులై 10, 2019న నిషేధించిన సంగతి తెలిసిందే. చదవండి: Jeff Bezos: జెఫ్‌బెజోస్ దెబ్బకు దిగివచ్చిన నాసా..! -
కాంగ్రెస్‌పై సిక్కు అలర్ల కేసును కొట్టేసిన అమెరికా కోర్టు
న్యూయార్క్: సిక్కు వ్యతిరేక అల్లర్లకు సంబంధించి కాంగ్రెస్ పార్టీపై సిఖ్స్ ఫర్ జస్టిస్(ఎస్ఎఫ్జే) అనే సంస్థ వేసిన మానవ హక్కుల ఉల్లంఘన కేసును అమెరికాలోని ఓ కోర్టు మంగళవారం కొట్టేసింది. ఎస్ఎఫ్జేకు ఈ కేసును దాఖలు చేసేందుకు చట్టబద్ధమైన అర్హత లేదని, అమెరికాతో సంబంధం లేని సంఘటనలపై అమెరికా కోర్టు విచారణ జరపజాలదని న్యూయార్క్‌లోని యూఎస్ జిల్లా కోర్టు తన తీర్పులో పేర్కొంది. ఈ తీర్పును అప్పీలు కోర్టులో సవాలు చేయనున్నట్లు ఎస్ఎఫ్జే తెలిపింది.