Jagdish Tytler
-
జగదీశ్ టైట్లర్‌పై హత్యాభియోగం
న్యూఢిల్లీ: 1984నాటి సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో కాంగ్రెస్ నేత జగదీశ్ టైట్లర్‌పై ఢిల్లీ కోర్టు హత్య తదితర అభియోగాలు మోపింది. ఢిల్లీలోని పాల్ బంగాశ్ ప్రాంతంలో ముగ్గురువ్యక్తుల హత్యకు సంబంధించిన కేసుపై స్పెషల్ కోర్టు ఆగస్ట్ 30న విచారణ జరిపింది. ఆయనపై అభియోగాలు మోపేందుకు తగు ఆధారాలున్నట్లు స్పష్టం చేసింది. శుక్రవారం టైట్లర్‌పై హత్యతోపాటు దొంగతనం, చట్ట విరుద్ధంగా గుమికూడటం, కొట్టాట, వివిధ వర్గాల మధ్య శత్రుత్వాన్ని పెంచడం వంటి అభియోగాలు మోపుతూ తీర్పు వెలువరించింది. ఈ కేసులో సీబీఐ గతేడాది మే 20వ తేదీన టైట్లర్‌పై చార్జిషీటు నమోదు చేసింది. 1984 నవంబర్ ఒకటో తేదీన ఢిల్లీలోని పాల్ బంగాశ్ గురుద్వారా వద్దకు తెల్ల అంబాసిడర్లో వచ్చిన టైట్లర్..సిక్కులను చంపండి..వాళ్లు మా అమ్మ(అప్పటి ప్రధాని ఇందిర)ను చంపారు’అంటూ అనుచరులను రెచ్చగొట్టారని చార్జిషీటులో పేర్కొంది. దీంతో, టైట్లర్ అనుచరుల దాడిలో ముగ్గురు సిక్కులు ప్రాణాలు కోల్పోయారంది. 1984లో అప్పటి ప్రధాని ఇందిర హత్యానంతరం ఢిల్లీ చుట్టుపక్కల ప్రాంతాల్లో సిక్కులపై దాడులు జరగడం తెలిసిందే. -
సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసు.. కాంగ్రెస్ నేతపై హత్యాభియోగం
న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో 1984లో జరిగిన సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులు కాంగ్రెస్ నేత జగదీష్ టైట్లర్‌ను వదిలేలా లేవు. ఈ కేసుల్లో భాగమైన గురుద్వారా పుల్ బంగశ్ హత్యల కేసులో టైట్లర్‌పై హత్యా నేరం అభియోగాలు నమోదు చేయాలని ఢిల్లీ రౌస్ఎవెన్యూ ప్రత్యేక కోర్టు సీబీఐని ఆదేశించింది. ఈ మేరకు సీబీఐ ప్రత్యేక కోర్టు జడ్జి రాకేశ్ సియాల్ ఆదేశాలు జారీ చేశారు. టైట్లర్‌పై విచారణ చేపట్టేందుకు సరిపడా సాక్ష్యాధారాలు ఉన్నాయని తెలిపారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ హత్య తర్వాత ఢిల్లీలో జరిగిన సిక్కు వ్యతిరేక అల్లర్లపై గతంలో ప్రత్యక్ష సాక్షి ఒకరు వాంగ్మూలం ఇచ్చారు. ఈ వాంగ్మూలం ఆధారంగా టైట్లర్‌పై అభియోగాల నమోదుకు కోర్టు ఆదేశించింది. కేసు తదుపరి విచారణ సెప్టెంబర్ 13కు వాయిదా వేశారు. -
కాంగ్రెస్ నేత జగదీశ్ టైట్లర్‌పై హత్యానేరం అభియోగాలు..
ఢిల్లీ: 1984 నాటి సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ మంత్రి జగదీశ్ టైట్లర్‌పై హత్యానేరం అభియోగాలు మోపింది సీబీఐ. ఢిల్లీలోని పుల్ బంగాష్ గురుద్వారా వద్ద సిక్కులను హత్య చేయడానికి ఆందోళనకారులను రెచ్చగొట్టాడని సీబీఐ ఛార్జిషీటులో పేర్కొంది. 1984లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ అంగరక్షకుల తుపాకీ గుళ్లకు బలైన అనంతరం ఢిల్లీతోపాటు పలు ప్రాంతాల్లో సిక్కులపై దాడులు జరిగాయి. ఈ దాడులకు జగదీశ్ టైట్లర్ రెచ్చగొట్టాడని సీబీఐ ఆరోపించింది. ఢిల్లీలోని పుల్ బంగాష్ గురుద్వారాకు నిప్పుపెట్టడంతోపాటు ముగ్గురు సిక్కులు సజీవ దహనమయ్యారు. ఈ ఘటనకు జగదీశ్ టైట్లరే కారణమని, అక్కడ చేరిన గుంపును రెచ్చగొట్టారని ఛార్జిషీటులో పేర్కొంది. ఇదీ చదవండి: గుజరాత్లో బీజేపీకి షాక్.. జనరల్ సెక్రెటరీ ప్రదీప్ గుడ్ బై -
సిక్కు అల్లర్ల కేసులో టైట్లర్‌పై చార్జిషీటు
న్యూఢిల్లీ: 1984 సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ మంత్రి జగదీశ్ టైట్లర్(78)పై సీబీఐ శనివారం ప్రత్యేక కోర్టులో చార్జిషీటు వేసింది. ఢిల్లీలోని పుల్ బంగాష్ గురుద్వారాకు నిప్పుపెట్టడంతోపాటు ముగ్గురు సిక్కులు సజీవ దహనమయ్యారు. ఈ ఘటనకు జగదీశ్ టైట్లరే కారణమని, అక్కడ చేరిన గుంపును రెచ్చగొట్టారని చార్జిషీటులో పేర్కొంది. ఈ నేరానికి గాను ఆయన పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసింది. ఈ అభియోగాలపై జూన్ 2న కోర్టు విచారణ చేపట్టనుందని సీబీఐ వర్గాలు తెలిపాయి. 1984లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ అంగరక్షకుల తుపాకీ గుళ్లకు బలైన అనంతరం ఢిల్లీతోపాటు పలు ప్రాంతాల్లో సిక్కులపై జరిగిన దాడుల్లో భారీగా ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది. -
వివాదాస్పదమైన టైట్లర్ హాజరు
న్యూఢిల్లీ: ఢిల్లీ కాంగ్రెస్ విభాగం అధ్యక్షురాలిగా షీలా దీక్షిత్ బాధ్యతలు స్వీకరించిన వేడుకకు ఆ పార్టీ సీనియర్ నేత జగదీశ్ టైట్లర్ హాజరు కావడం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. సిక్కు వ్యతిరేక అల్లర్ల సాక్షులను బెదిరించేందుకే టైట్లర్‌ను కాంగ్రెస్ పార్టీ ఆహ్వానించిందని శిరోమణి అకాళీదళ్ నేత, ఢిల్లీ సిక్కు గురుద్వారా మేనేజ్మెంట్ కమిటీ జనరల్ సెక్రటరీ మజిందర్ సింగ్ సిర్సా మండిపడ్డారు. ఇన్నాళ్లు కాంగ్రెస్ పార్టీ దూరంగా ఉంచిన జగదీశ్ టైట్లర్‌ను షీలా దీక్షిత్ మళ్లీ పార్టీ కార్యక్రమాలకు ఆహ్వానించి ఆయనకు అధిక ప్రాధాన్యం ఇవ్వడాన్ని సిర్సా తీవ్రంగా విమర్శించారు. ‘‘1984 నాటి సిక్కు వ్యతిరేక అల్లర్లకు సంబంధించిన కేసులో సాక్షులను జగదీశ్ టైట్లర్ భయపెట్టారన్న సంగతి బహిరంగ రహస్యమే. అటువంటి వ్యక్తికి కాంగ్రెస్ ప్రాధాన్యం ఇవ్వడం సరికాదు. ఈ అల్లర్లకు సంబంధించి జగదీశ్ టైట్లర్ తోపాటుగా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌కు కూడా జైలు శిక్ష పడుతుంది. సిక్కు అల్లర్ల కేసులో సాక్షులను బెదిరించేందుకు, టైట్లర్‌కు అధిష్టానం మద్దతు మెండుగా ఉందన్న సందేశాన్ని తెలియచెప్పేందుకే కాంగ్రెస్ పార్టీ ఇలా వ్యవహరించింది’’అని ఆయన తన ట్విటర్లో పేర్కొన్నారు. ఢిల్లీ కాంగ్రెస్ విభాగం అధ్యక్షురాలిగా ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ బుధవారం బాధ్యతల్ని స్వీకరించారు. ఈ కార్యక్రమానికి పార్టీ సీనియర్ నేతలు కరణ్‌సింగ్, జనార్దన్ ద్వివేది, మీరా కుమార్, పీసీ చాకో, సందీప్ దీక్షిత్, అజయ్ మాకెన్‌తో పాటుగా పార్టీ ఇతర ముఖ్యనేతలు కూడా హాజరయ్యారు. అయితే జగదీశ్ టైట్లర్‌ను ఆహ్వానించడాన్ని షీలా దీక్షిత్ సమర్థించుకున్నారు. ‘ఆయన ఎందుకు రాకూడదు? ఆయనను ఇక్కడ మేము గౌరవించుకున్నామ’ని ఆమె వ్యాఖ్యానించారు. ఇందిర నుంచి రాహుల్ గాంధీ వరకు టైట్లర్ వారికి ప్రధాన అనుచరుడిగా ఉన్నారని కేంద్రమంత్రి హర్సిమ్రత్ కౌర్ బాదల్ పేర్కొన్నారు. దీన్ని బట్టే సిక్కుల పట్ల కాంగ్రెస్ వైఖరి అర్థమవుతుందన్నారు. -
టైట్లర్, సజ్జన్లకు సొంత పార్టీ ఝలక్
న్యూఢిల్లీ : నరేంద్రమోదీ సర్కారు హయాంలో దళితులపై అకృత్యాలు పెరిగిపోయాయని, సామాజిక సామరస్యం దెబ్బతింటోందని ఆరోపిస్తూ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఒక రోజు నిరాహార దీక్షకు దిగారు. అయితే రాహుల్ గాంధీ దీక్షా స్థలానికి రావడానికి ముందే ఇద్దరు వివాదాస్పద కాంగ్రెస్ నాయకులు జగదీశ్ టైట్లర్, సజ్జన్ కుమార్ అక్కడికి చేరుకున్నారు. వారిని వేదికపైకి అనుమతించకుండా పార్టీ కార్యకర్తలతో పాటు కింద కూర్చోవాలంటూ ఆదేశించినట్లు వార్తలు వచ్చాయి. ఈ విషయమై ఢిల్లీ కాంగ్రెస్ చీఫ్ అజయ్ మాకెన్ మాట్లాడుతూ.. ‘ఆ ఇద్దరు నాయకులను వేదికపైకి అనుమతించకపోవడానికి ప్రత్యేక కారణాలేవీ లేవు. ఈ నిరసనలో పార్టీ కార్యకర్తలంతా పాల్గొనవచ్చు. మాజీ ఎంపీలకు వేదికపై కూర్చునేందుకు సీటింగ్ ఏర్పాటు చేయలేదని’ వివరణ ఇచ్చారు. ఇందిరా గాంధీ హత్య తర్వాత చెలరేగిన సిక్కు వ్యతిరేక అల్లర్లలో ప్రధాన పాత్ర పోషించారని జగదీశ్ టైట్లర్, సజ్జన్ కుమార్ ఆరోపణలు ఎదుర్కొన్నారు. అయితే మత సామరస్యాన్ని పెంపొందించాలనే ఉద్దేశంతో చేపట్టిన దీక్షలో వీరు పాల్గొంటే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశాలు ఉన్నాయని, బీజేపీకి ఇది ఒక అస్త్రంగా మారుతుందనే కారణంగానే వారిని పక్కకు పెట్టినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. సీబీఎస్ఈ పరీక్షా పత్రాలు లీక్ కావడం, పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణం, పార్లమెంటు సమావేశాలు పూర్తిగా స్తంభించిపోవడం, దళిత సంఘాలు ఈనెల 2న నిర్వహించిన భారత్ బంద్‌లో హింస చోటుచేసుకోవడం వంటి పరిణామాల నేపథ్యంలో మోదీ సర్కారును, బీజేపీ విధానాలను ఎండగట్టేందుకు రాహుల్ ఈ నిరసన దీక్షకు పూనుకున్నారు. కాగా, ఈ విషయంపై స్పందించిన జగదీశ్ టైట్లర్ మీడియాతో మాట్లాడుతూ... ‘నన్నెవరూ వెళ్లిపొమ్మని చెప్పలేదు. నేనెప్పుడూ కార్యకర్తలతో పాటే కూర్చుంటాను. పార్టీలో నన్నెవరూ వ్యతిరేకించే వాళ్లు లేర’న్నారు. -
టైట్లర్, సజ్జన్‌కు ఢిల్లీ ఎన్నికల ప్రచార బాధ్యతలు?
సాక్షి, న్యూఢిల్లీ: 1984లో సిక్కు అల్లర్లను రెచ్చగొట్టారనే ఆరోపణలు ఎదుర్కొన్న కారణంగా ఇంతకా లం పక్కన పెట్టిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జగ్దీశ్ టైట్లర్, సజ్జన్‌కుమార్‌కు ఎట్టకేలకు విముక్తి కల్పించనుంది. వారిద్దరికి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కీలక బాధ్యతలను అధిష్ఠానం అప్పగించనుంది. సీనియర్ నాయకులతో కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సమావేశమై ఈ మేరకు నిర్ణయించినట్లు తెలిసింది. పైగా సిక్కుల అల్లర్లకు కారణమనే ఆరోపణలు ఎదుర్కొన్న టైట్లర్, సజ్జన్‌కు అవకాశం ఇవ్వడం, ఢిల్లీకి 15 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న షీలాదీక్షిత్‌కు తగినంత ప్రాధాన్యత ఇవ్వకపోవడం అంతటా చర్చనీయాంశంగా మారింది. ఏదిఏమైనా అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రె స్ పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోందని కొందరు ఆ పార్టీ నాయకులు అంటున్నారు. 8 మందితో కమిటీ? రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారం కోసం 8 మంది సభ్యల కమిటీని నియమించారని ఈ కమిటీలో టైట్లర్, సజ్జన్కుమార్లతో పాటు అర్విందర్ సింగ్ లవ్లీ, జై ప్రకాశ్ అగర్వాల్, హరూన్ యూసఫ్, జైకిషన్ , మహాబల్ మిశ్రా, మతీన్ అహ్మద్‌కు చోటు కల్పించారని వార్తలు వచ్చాయి. షీలాదీక్షిత్‌కు ఈ కమిటీలో చోటు దక్కలేదని తెలిసింది. కమిటీని ఏర్పాటు చేయలేదు: ముఖేష్ కానీ, కాంగ్రెస్ పార్టీ ఈ వార్తలను ఖండించింది. రాహుల్ గాంధీ ఎటువంటి కమిటీని ఏర్పాటు చే యలేదని కాంగ్రెస్ ప్రతినిధి ముఖేష్ శర్మ చెప్పారు. కమిటీ ఏర్పాటు చేయనప్పటికీ కొందరు కాంగ్రెస్ నేతలకు రాహుల్ గాంధీ కీలక ఎన్నికల బాధ్యతలు అప్పగించారని అంటున్నారు. సజ్జన్‌కుమార్‌కు అనధికార కాలనీలు, జుగ్గా జుగ్గీ జోపిడీవాసుల ఓట్లు తెచ్చే బాధ్యతలు, సదర్ ఓటర్ల మనసు గెలచుకునే బాధ్యతను జగదీశ్టైట్లర్కు అప్పగించారని అంటున్నారు. రాహుల్ గాంధీ బుధవారం ఉదయం జరిపిన సమావేశంలో ఈ వివాదస్పద నేతలు ఇరువురు పాల్గొన్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. విస్మయం: ఇప్పటికే ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ సిక్కు ఓటర్లను మచ్చిక చేసుకోవడానికి విశ్వప్రయత్నిస్తుండగా, కాంగ్రెస్ పార్టీ పుండుమీద కారం చల్లిన చందంగా సిక్కు వ్యతిరేకత మూటకట్టుకొన్న జైట్లీ, సజ్జన్‌కు ఎన్నికల ప్రచార బాధ్యతలు అప్పగించనుండడంపై రాజకీయ పరిశీలకుల్లో విస్మయం వ్యక్తమవుతోంది. ఈ చర్య కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల్లో నష్టపర్చుతుందనే అభిప్రాయాన్ని కొందరు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే బీజేపీ ప్రతినిధి సంబిత్‌పాత్ర కాంగ్రెస్ పార్టీ వైఖరిపై ఆందోళన వ్యక్తం చేశారు. -
ఫూల్కాకు క్షమాపణ చెబుతానన్న టైట్లర్
న్యూఢిల్లీ: సిక్కు వ్యతిరేక అల్లర్ల బాధితుల న్యాయవాది హెచ్.ఎస్.ఫూల్కా దాఖలు చేసిన పరువునష్టం కేసులో ఆయన బేషరతుగా క్షమాపణ చెప్పడానికి కాంగ్రెస్ నాయకుడు జగదీశ్ టైట్లర్ అంగీకరించారు. అయితే ఇందుకు తిరస్కరించిన ఫూల్కా, టైట్లర్ క్షమాపణను అంగీకరిస్తే ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళ్తాయని ఆక్షేపించారు. ఈ కేసులో ప్రజాప్రయోజనం ఏదీ లేదు కాబట్టి తన కక్షిదారు ఫూల్కాకు క్షమాపణ చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని నిందితుడి న్యాయవాది అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ గౌరవ్రావుకు విన్నవించారు. ‘ఇది 2004లో నమోదైన కేసు. మనం ఇప్పుడు 2014లో ఉన్నాం.. అంటే పదేళ్లు గడిచాయి. నా కక్షిదారు ప్రజాజీవితంలో ఉన్నారు. ఈ వివాదాన్ని సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవడానికి బేషరతుగా క్షమాపణ చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారు’ అని న్యాయమూర్తికి వివరించారు. దీనిపై ఏమంటారని న్యాయమూర్తి ఫూల్కాను ప్రశ్నించగా, క్షమాపణకు అంగీకరించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. టైట్లర్ 2004, సెప్టెంబర్ ఏడున ప్రైవేటు చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన గురించి అభ్యంతర వ్యాఖ్యలు చేశారంటూ ఫూల్కా పరువునష్టం దావా వేశారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం, ఇంటర్వ్యూ సీడీ, రాతప్రతులు సమర్పించాలని ఫిర్యాదిని ఆదేశిస్తూ తదుపరి విచారణను వచ్చే నెల రెండుకు వాయిదా వేసింది. -
టైట్లర్ కేసులో నిర్ణయం వాయిదా
న్యూఢిల్లీ: సిక్కు అల్లర్ల కేసులో బాధితుల తరఫు సీనియర్ న్యాయవాది దాఖలుచేసిన పరువు నష్టం వ్యాజ్యాన్ని పరిశీలించిన స్థానిక న్యాయస్థానం కాంగ్రెస్ నాయకుడు జగదీశ్ టైట్లర్‌పై నేరపూరిత బెదిరింపు అభియోగాలు మోపవచ్చా అనే అంశానికి సంబంధించి తన నిర్ణయాన్ని ఈ నెల రెండో తేదీకి వాయిదా వేసింది. గతంలో ఇచ్చిన ఆదేశాల మేరకు జగదీష్ టైట్లర్ శనివారం స్థానిక ప్రధాన మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు న్యాయమూర్తి గౌరవ్రావ్ ఎదుట హాజరయ్యారు. 2004, సెప్టెంబర్ ఏడో తేదీన ఓ ప్రైవేట్ టెలివిజన్ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన ప్రతిష్టకు భంగం కలిగేవిధంగా వ్యాఖ్యలు చేశారంటూ ఈ సందర్భంగా సీనియర్ న్యాయవాది హెచ్.ఎస్. ఫుల్కా చేసిన వాదనను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి ఇందుకు సంబంధించి తన నిర్ణయాన్ని ఈ నెల రెండో తేదీకి వాయిదా వేశారు. కోర్టు బయట ఈ సమస్యను పరిష్కరించుకోవాలని అనుకుంటున్నారా ?లేక బహిరంగ క్షమాపణ చెబితే సరిపోతుందని భావిస్తున్నారా ? అని అంతకుముందు న్యాయమూర్తి అడిగినప్పటికీ ఫుల్కా అందుకు నిరాకరించారు.తనపై అత్యంత తీవ్రమైన అభియోగాలు చేశారని ఆరోపించారు. ఆ సమయంలో టైట్లర్ మంత్రిగా ఉన్నారని, తనను బెదిరింపులకు గురిచేశాడన్నారు. అందువల్ల బహిరంగ క్షమాపణకు ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించే ప్రసక్తే లేదన్నారు. కాగా ఈ కేసు తొలుత లూధియానా కోర్టులో నమోదైంది. ఆ తర్వాత సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఢిల్లీకి బదిలీ చేశారు. -
జగదీశ్ టైట్లర్ పై కేసులో నిర్ణయం వాయిదా
న్యూఢిల్లీ: సిక్కు అల్లర్ల కేసులో బాధితుల తరఫు సీనియర్ న్యాయవాది దాఖలుచేసిన పరువు నష్టం వ్యాజ్యాన్ని పరిశీలించిన స్థానిక న్యాయస్థానం కాంగ్రెస్ నాయకుడు జగదీశ్ టైట్లర్‌పై నేరపూరిత బెదిరింపు అభియోగాలపై నిర్ణయాన్ని ఈ నెల రెండో తేదీకి వాయిదా వేసింది. గతంలో ఇచ్చిన ఆదేశాల మేరకు జగదీష్ టైట్లర్ శనివారం స్థానిక ప్రధాన మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు న్యాయమూర్తి గౌరవ్రావ్ ఎదుట హాజరయ్యారు. 2004, సెప్టెంబర్ ఏడో తేదీన ఓ ప్రైవేట్ టెలివిజన్ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన ప్రతిష్టకు భంగం కలిగేవిధంగా వ్యాఖ్యలు చేశారంటూ ఈ సందర్భంగా సీనియర్ న్యాయవాది హెచ్.ఎస్. ఫుల్కా చేసిన వాదనను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి ఇందుకు సంబంధించి తన నిర్ణయాన్ని ఈ నెల రెండో తేదీకి వాయిదా వేశారు. కాగా కోర్టు బయట ఈ సమస్యను పరిష్కరించుకుంటారా అని కోర్టు అడిగినప్పటికీ ఫుల్కా అందుకు నిరాకరించారు. తనపై అత్యంత తీవ్రమైన అభియోగాలు చేశారని ఆరోపించారు. -
టైట్లర్‌కు క్లీన్‌చిట్‌పై వివాదం
న్యూఢిల్లీ: 1984 సిక్కుల ఊచకోతపై... ఓ టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి అమరిందర్‌సింగ్, కాంగ్రెస్ నేత జగదీష్ టైట్లర్‌కు క్లీన్చిట్ ఇవ్వడంపై సిక్కులు ఆగ్రహించారు. ఢిల్లీలోని కాంగ్రెస్ కార్యాలయం ముందు పెద్ద సంఖ్యలో నిరసన తెలిపారు. ఎన్నికల సంఘానికి తాము ఫిర్యాదు చేస్తామని చెప్పారు. 1984 అల్లర్లకు కాంగ్రెస్సే కారణమని.. సోనియా, రాహుల్ అమరిందర్‌కు అమృత్సర్ లోకసభ టిక్కెట్టు ఇస్తే... ఆయనేమో జగదీష్ టైట్లర్‌కు క్లీన్చిట్ ఇస్తున్నాడని శిరోమణి అకాళీదళ్ ఢిల్లీ అధ్యక్షుడు మంజిత్ సింగ్ విమర్శించారు. నిరసనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు వాటర్ కేనన్లు ప్రయోగించారు. అనంతరం 70 మంది ఆందోళనకారులను అరెస్టు చేసి తుగ్లక్‌రోడ్డు పోలీసు స్టేషన్‌కు తరలించారు. మరోవైపు ఇదే విషయంపై బీజేపీ సీనియర్ నేత అరుణ్ జైట్లీ మండిపడ్డారు. వాస్తవమేంటో చట్టాలు తేలుస్తాయి... ఇలా విచారణలో ఉన్న విషయానికి కెప్టెన్ అమరిందర్ సింగ్ క్లీన్చిట్ ఇవ్వడమేంటని ఆయన ప్రశ్నించారు. బాధితుల పక్షాన నిలవకుండా అమరిందర్ సింగ్ కేవలం తన సొంత ఇష్టం, రాజకీయ లబ్ధి కోసమే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని తన బ్లాగ్‌లో పేర్కొన్నారు. సిక్కుల ఊచకోత అంశంపై ఎన్డీయే ప్రభుత్వం మాత్రమే చొరవ తీసుకుందని, నిజానిజాలేంటో విచారించడానికి నానావతి కమిషన్ వేసిందని అరున్ జైట్లీ అన్నారు. ‘‘ఈ ఘటనలో వేల మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. నిందితులెవ్వరికీ ఇంతవరకూ శిక్షపడకపోవడం బాధాకరం. ఇన్నేళ్లు గడిచినా ఇంకా ఎఫ్ఐఆర్ నమోదు కాలేదు’’ అని ఆవేదన వ్యక్తం చేశారాయన. ‘‘రాజ్యం చేసిన హింసను కప్పి పుచ్చుకోవడానికి కాంగ్రెస్ తరువాత జస్టిస్ రంగనాథ్ మిశ్రా కమిషన్ కూడా ఏమీ తేల్చలేదు. రిటైర్మెంట్ తరువాత కాంగ్రెస్ పార్టీ ఆ జడ్జీని రాజ్యసభ సభ్యుడిని చేసింది. రాజ్యం కుట్ర ఇక్కడే స్పష్టమవుతోంది’’ అని బ్లాగ్‌లో రాశారు బీజేపీ నేత అరుణ్‌జైట్లీ. -
జగదీష్ టైట్లర్‌కు అమరిందర్ సింగ్ క్లీన్ చిట్ ఇవ్వడమేంటి?
న్యూఢిల్లీ : రెండు దశాబ్దాల క్రితం సిక్కుల ఊచకోత అంశానికి సంబంధించి ఓ టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి అమరిందర్‌సింగ్, కాంగ్రెస్ నేత జగదీష్ టైట్లర్‌కు క్లీన్చిట్ ఇవ్వడంపై సిక్కులు ఆగ్రహించారు. ఢిల్లీలోని కాంగ్రెస్ కార్యాలయం ముందు పెద్ద సంఖ్యలో నిరసన తెలిపారు. ఎన్నికల సంఘానికి తాము ఫిర్యాదు చేస్తామని చెప్పారు. 1984 అల్లర్లకు కాంగ్రెస్సే కారణమని.. సోనియా, రాహుల్ అమరిందర్‌కు అమృత్సర్ లోకసభ టిక్కెట్టు ఇస్తే... ఆయనేమో జగదీష్ టైట్లర్‌కు క్లీన్చిట్ ఇస్తున్నాడని శిరోమణి అకాళీదళ్ ఢిల్లీ అధ్యక్షుడు మంజిత్ సింగ్ విమర్శించారు. నిరసనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు వాటర్ కేనన్లు ప్రయోగించారు. అనంతరం 70 మంది ఆందోళనకారులను అరెస్టు చేసి తుగ్లక్‌రోడ్డు పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. మరోవైపు ఇదే విషయంపై బీజేపీ సీనియర్ నేత అరుణ్ జైట్లీ మండిపడ్డారు. వాస్తవమేంటో చట్టాలు తేలుస్తాయి... ఇలా విచారణలో ఉన్న విషయానికి కెప్టెన్ అమరిందర్ సింగ్ క్లీన్చిట్ ఇవ్వడమేంటని ఆయన ప్రశ్నించారు.