సిక్కు అల్లర్ల కేసులో టైట్లర్‌పై చార్జిషీటు | CBI files charge sheet against Congress leader Jagdish Tytler | Sakshi
Sakshi News home page

సిక్కు అల్లర్ల కేసులో టైట్లర్‌పై చార్జిషీటు

Published Sun, May 21 2023 6:18 AM | Last Updated on Sun, May 21 2023 6:18 AM

CBI files charge sheet against Congress leader Jagdish Tytler - Sakshi

న్యూఢిల్లీ: 1984 సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో కాంగ్రెస్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి జగదీశ్‌ టైట్లర్‌(78)పై సీబీఐ శనివారం ప్రత్యేక కోర్టులో చార్జిషీటు వేసింది. ఢిల్లీలోని పుల్‌ బంగాష్‌ గురుద్వారాకు నిప్పుపెట్టడంతోపాటు ముగ్గురు సిక్కులు సజీవ దహనమయ్యారు. ఈ ఘటనకు జగదీశ్‌ టైట్లరే కారణమని, అక్కడ చేరిన గుంపును రెచ్చగొట్టారని చార్జిషీటులో పేర్కొంది.

ఈ నేరానికి గాను ఆయన పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసింది. ఈ అభియోగాలపై జూన్‌ 2న కోర్టు విచారణ చేపట్టనుందని సీబీఐ వర్గాలు తెలిపాయి. 1984లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ అంగరక్షకుల తుపాకీ గుళ్లకు బలైన అనంతరం ఢిల్లీతోపాటు పలు ప్రాంతాల్లో సిక్కులపై జరిగిన దాడుల్లో భారీగా ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement