టైట్లర్‌కు క్లీన్‌చిట్‌పై వివాదం | Captain Amarinder Singh gives clean chit to Jagdish Tytler | Sakshi
Sakshi News home page

టైట్లర్‌కు క్లీన్‌చిట్‌పై వివాదం

Published Mon, Apr 21 2014 11:33 PM | Last Updated on Sat, Sep 2 2017 6:20 AM

టైట్లర్‌కు క్లీన్‌చిట్‌పై వివాదం

టైట్లర్‌కు క్లీన్‌చిట్‌పై వివాదం

న్యూఢిల్లీ: 1984 సిక్కుల ఊచకోతపై... ఓ టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి అమరిందర్‌సింగ్, కాంగ్రెస్ నేత జగదీష్ టైట్లర్‌కు  క్లీన్‌చిట్ ఇవ్వడంపై సిక్కులు ఆగ్రహించారు. ఢిల్లీలోని కాంగ్రెస్ కార్యాలయం ముందు పెద్ద సంఖ్యలో నిరసన తెలిపారు. ఎన్నికల సంఘానికి తాము ఫిర్యాదు చేస్తామని చెప్పారు. 1984 అల్లర్లకు కాంగ్రెస్సే కారణమని.. సోనియా, రాహుల్  అమరిందర్‌కు అమృత్‌సర్ లోకసభ టిక్కెట్టు ఇస్తే... ఆయనేమో జగదీష్ టైట్లర్‌కు క్లీన్‌చిట్ ఇస్తున్నాడని శిరోమణి అకాళీదళ్ ఢిల్లీ అధ్యక్షుడు మంజిత్ సింగ్ విమర్శించారు. నిరసనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు వాటర్ కేనన్లు ప్రయోగించారు. అనంతరం 70 మంది ఆందోళనకారులను అరెస్టు చేసి తుగ్లక్‌రోడ్డు పోలీసు స్టేషన్‌కు తరలించారు.
 
 మరోవైపు ఇదే విషయంపై బీజేపీ సీనియర్ నేత అరుణ్ జైట్లీ మండిపడ్డారు. వాస్తవమేంటో చట్టాలు తేలుస్తాయి... ఇలా విచారణలో ఉన్న విషయానికి కెప్టెన్ అమరిందర్ సింగ్ క్లీన్‌చిట్ ఇవ్వడమేంటని ఆయన ప్రశ్నించారు. బాధితుల పక్షాన నిలవకుండా అమరిందర్ సింగ్ కేవలం తన సొంత ఇష్టం, రాజకీయ లబ్ధి కోసమే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని తన బ్లాగ్‌లో పేర్కొన్నారు. సిక్కుల ఊచకోత అంశంపై ఎన్డీయే ప్రభుత్వం మాత్రమే చొరవ తీసుకుందని, నిజానిజాలేంటో విచారించడానికి నానావతి కమిషన్ వేసిందని అరున్ జైట్లీ అన్నారు. ‘‘ఈ ఘటనలో వేల మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. నిందితులెవ్వరికీ ఇంతవరకూ శిక్షపడకపోవడం బాధాకరం. ఇన్నేళ్లు గడిచినా ఇంకా ఎఫ్‌ఐఆర్ నమోదు కాలేదు’’ అని ఆవేదన వ్యక్తం చేశారాయన. ‘‘రాజ్యం చేసిన హింసను కప్పి పుచ్చుకోవడానికి కాంగ్రెస్ తరువాత జస్టిస్ రంగనాథ్ మిశ్రా కమిషన్ కూడా  ఏమీ తేల్చలేదు. రిటైర్‌మెంట్ తరువాత కాంగ్రెస్ పార్టీ  ఆ జడ్జీని రాజ్యసభ సభ్యుడిని చేసింది. రాజ్యం కుట్ర  ఇక్కడే స్పష్టమవుతోంది’’ అని బ్లాగ్‌లో రాశారు బీజేపీ నేత అరుణ్‌జైట్లీ.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement