టైట్లర్ కేసులో నిర్ణయం వాయిదా | Jagdish Tytler appeared in Delhi court today | Sakshi
Sakshi News home page

టైట్లర్ కేసులో నిర్ణయం వాయిదా

Published Sat, May 31 2014 11:00 PM | Last Updated on Sat, Sep 2 2017 8:08 AM

Jagdish Tytler appeared in Delhi court today

న్యూఢిల్లీ: సిక్కు అల్లర్ల కేసులో బాధితుల తరఫు సీనియర్ న్యాయవాది దాఖలుచేసిన పరువు నష్టం వ్యాజ్యాన్ని పరిశీలించిన స్థానిక న్యాయస్థానం కాంగ్రెస్ నాయకుడు జగదీశ్ టైట్లర్‌పై నేరపూరిత బెదిరింపు అభియోగాలు మోపవచ్చా అనే అంశానికి సంబంధించి తన నిర్ణయాన్ని ఈ నెల రెండో తేదీకి వాయిదా వేసింది. గతంలో ఇచ్చిన ఆదేశాల మేరకు జగదీష్ టైట్లర్ శనివారం స్థానిక ప్రధాన మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు న్యాయమూర్తి గౌరవ్‌రావ్ ఎదుట హాజరయ్యారు. 2004, సెప్టెంబర్ ఏడో తేదీన ఓ ప్రైవేట్ టెలివిజన్ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన ప్రతిష్టకు భంగం కలిగేవిధంగా వ్యాఖ్యలు చేశారంటూ ఈ సందర్భంగా సీనియర్ న్యాయవాది హెచ్.ఎస్.
 
 ఫుల్కా చేసిన వాదనను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి ఇందుకు సంబంధించి తన నిర్ణయాన్ని ఈ నెల రెండో తేదీకి వాయిదా వేశారు. కోర్టు బయట ఈ సమస్యను పరిష్కరించుకోవాలని అనుకుంటున్నారా ?లేక బహిరంగ క్షమాపణ చెబితే సరిపోతుందని భావిస్తున్నారా ? అని  అంతకుముందు న్యాయమూర్తి అడిగినప్పటికీ ఫుల్కా అందుకు నిరాకరించారు.తనపై అత్యంత తీవ్రమైన అభియోగాలు చేశారని ఆరోపించారు. ఆ సమయంలో టైట్లర్ మంత్రిగా ఉన్నారని, తనను బెదిరింపులకు గురిచేశాడన్నారు. అందువల్ల బహిరంగ క్షమాపణకు ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించే ప్రసక్తే లేదన్నారు. కాగా ఈ కేసు తొలుత లూధియానా కోర్టులో నమోదైంది. ఆ తర్వాత సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఢిల్లీకి బదిలీ చేశారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement