ఢిల్లీ: 1984 నాటి సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ మంత్రి జగదీశ్ టైట్లర్‌పై హత్యానేరం అభియోగాలు మోపింది సీబీఐ. ఢిల్లీలోని పుల్ బంగాష్ గురుద్వారా వద్ద సిక్కులను హత్య చేయడానికి ఆందోళనకారులను రెచ్చగొట్టాడని సీబీఐ ఛార్జిషీటులో పేర్కొంది.
1984లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ అంగరక్షకుల తుపాకీ గుళ్లకు బలైన అనంతరం ఢిల్లీతోపాటు పలు ప్రాంతాల్లో సిక్కులపై దాడులు జరిగాయి. ఈ దాడులకు జగదీశ్ టైట్లర్ రెచ్చగొట్టాడని సీబీఐ ఆరోపించింది. ఢిల్లీలోని పుల్ బంగాష్ గురుద్వారాకు నిప్పుపెట్టడంతోపాటు ముగ్గురు సిక్కులు సజీవ దహనమయ్యారు. ఈ ఘటనకు జగదీశ్ టైట్లరే కారణమని, అక్కడ చేరిన గుంపును రెచ్చగొట్టారని ఛార్జిషీటులో పేర్కొంది.
ఇదీ చదవండి: గుజరాత్‌లో బీజేపీకి షాక్.. జనరల్ సెక్రెటరీ ప్రదీప్ గుడ్ బై
Comments
Please login to add a commentAdd a comment