![Delhi Court Directs CBI To Frame Charges Against Jagdish Tytler](/styles/webp/s3/article_images/2024/08/30/jagadishtytler.jpg.webp?itok=1u2XW1ey)
న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో 1984లో జరిగిన సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులు కాంగ్రెస్ నేత జగదీష్ టైట్లర్‌ను వదిలేలా లేవు. ఈ కేసుల్లో భాగమైన గురుద్వారా పుల్ బంగశ్ హత్యల కేసులో టైట్లర్‌పై హత్యా నేరం అభియోగాలు నమోదు చేయాలని ఢిల్లీ రౌస్‌ఎవెన్యూ ప్రత్యేక కోర్టు సీబీఐని ఆదేశించింది. ఈ మేరకు సీబీఐ ప్రత్యేక కోర్టు జడ్జి రాకేశ్ సియాల్ ఆదేశాలు జారీ చేశారు.
టైట్లర్‌పై విచారణ చేపట్టేందుకు సరిపడా సాక్ష్యాధారాలు ఉన్నాయని తెలిపారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ హత్య తర్వాత ఢిల్లీలో జరిగిన సిక్కు వ్యతిరేక అల్లర్లపై గతంలో ప్రత్యక్ష సాక్షి ఒకరు వాంగ్మూలం ఇచ్చారు. ఈ వాంగ్మూలం ఆధారంగా టైట్లర్‌పై అభియోగాల నమోదుకు కోర్టు ఆదేశించింది. కేసు తదుపరి విచారణ సెప్టెంబర్ 13కు వాయిదా వేశారు.
Comments
Please login to add a commentAdd a comment