Anti Sikh riots
-
సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసు.. కాంగ్రెస్ నేతపై హత్యాభియోగం
న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో 1984లో జరిగిన సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులు కాంగ్రెస్ నేత జగదీష్ టైట్లర్‌ను వదిలేలా లేవు. ఈ కేసుల్లో భాగమైన గురుద్వారా పుల్ బంగశ్ హత్యల కేసులో టైట్లర్‌పై హత్యా నేరం అభియోగాలు నమోదు చేయాలని ఢిల్లీ రౌస్ఎవెన్యూ ప్రత్యేక కోర్టు సీబీఐని ఆదేశించింది. ఈ మేరకు సీబీఐ ప్రత్యేక కోర్టు జడ్జి రాకేశ్ సియాల్ ఆదేశాలు జారీ చేశారు. టైట్లర్‌పై విచారణ చేపట్టేందుకు సరిపడా సాక్ష్యాధారాలు ఉన్నాయని తెలిపారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ హత్య తర్వాత ఢిల్లీలో జరిగిన సిక్కు వ్యతిరేక అల్లర్లపై గతంలో ప్రత్యక్ష సాక్షి ఒకరు వాంగ్మూలం ఇచ్చారు. ఈ వాంగ్మూలం ఆధారంగా టైట్లర్‌పై అభియోగాల నమోదుకు కోర్టు ఆదేశించింది. కేసు తదుపరి విచారణ సెప్టెంబర్ 13కు వాయిదా వేశారు. -
1984 అల్లర్లు: సీబీఐ చార్జిషీట్లో కాంగ్రెస్ నేత జగదీష్ టైట్లర్ పేరు
న్యూఢిల్లీ: 39 ఏళ్ల క్రితం జరిగిన సిక్కు వ్యతిరేక అల్లర్లో ఆనాటి కాంగ్రెస్ ఎంపీ జగదీశ్ టైట్లర్ గురుద్వారా పుల్ బంగాశ్ వద్ద అల్లరిమూకను రెచ్చగొట్టి గురుద్వారాను తగులబెట్టి ఠాకూర్ సింగ్, బాదల్ సింగ్, గొర్చరణ్ సింగ్ అనే ముగ్గురు సిక్కులను హత్య చేయించినట్లుగా మే 20న దాఖలు చేసిన చార్జిషీటులో పేర్కొంది సీబీఐ. ఇందిరాగాంధీ హయాంలో జరిగిన 'ఆపరేషన్ బ్లూస్టార్'కు ప్రతిగా 1984లో ఆమెను సెక్యురిటీ సిబ్బంది హత్య చేశారు. దీంతో ఒక్కసారిగా దేశవ్యాప్తంగా సిక్కు వ్యతిరేక అల్లర్లు చెలరేగాయి. సిక్కులను ఎక్కడపెడితే అక్కడ ఊచకోత కోశారు. ఆరోజు జరిగిన హింసాకాండలో సుమారుగా 3000 మంది మృతి చెందారు. అల్లర్లలో కాంగ్రెస్ నేత జగదీశ్ టైట్లర్ పాత్రపై సీబీఐ లోతైన దర్యాప్తు చేసింది. అల్లర్లలో జగదీశ్ గుంపులను రెచ్చగొట్టినట్లు మరింత విధ్వాంసానికి పాల్పడి, పలు హత్యలకు కారణమైనట్లు సీబీఐ చార్జిషీటులో పేర్కొంది. 2000లో సిక్కు వ్యతిరేక అల్లర్లపై నివేదిక సమర్పించిన నానావతి కమీషన్ అందులో జగదీశ్ టైట్లర్ ప్రత్యక్షంగానే అల్లరి మూకలను రెచ్చగొట్టే ప్రయత్నానికి పాల్పడినట్లు వెల్లడించారు. ఆరోజున జగదీశ్ కారులో వచ్చి టీబీ హాస్పిటల్ గేటు వద్ద కత్తులు, రాడ్లు, కర్రలు చేత పట్టుకుని ఉన్న ఒక గుంపుతో మాట్లాడుతూ.. "మీరు చేసిన హింస సరిపోదు.. నాకైతే సంతృప్తికరంగా లేదు.. మరింత మంది సిక్కులని చంపండి పోయి.. లేదంటే నా మాట పోతుంది, పెద్ద ఎత్తున సిక్కులను హత్య చేయిస్తానని మాటిచ్చాను" అని చెప్పినట్లు తెలిపింది. తాజాగా సీబీఐ దాఖలు చేసిన చార్జిషీటులో ఒకామె జగదీశ్ టైట్లర్ గుంపును రెచ్చగొట్టడాన్ని కళ్లారా చూసినట్లు తెలిపింది. ఆరోజు తన దుకాణాన్ని అల్లరి మూకలు ధ్వంసం చేస్తుండడం చూసి వెనక్కి వెళ్లిపోతుండగా గురుద్వారా పుల్ బంగాశ్ వద్ద జగదీశ్ టైట్లర్ ఒక తెల్లటి అంబాసిడర్ కారులో వచ్చి అక్కడున్న దుండగలతో.. "ఆస్తులను తర్వాత కొల్లగొట్టవచ్చు.. ముందు దొరికిన సిక్కులను దొరికినట్టు చంపండి" అని రెచ్చగొట్టినట్లు సాక్ష్యమిచ్చింది. అటుపై తాను ఇంటికి తిరిగొచ్చి పక్కింట్లో ఆశ్రయం పొందినట్లు అక్కడ తన భర్త వద్ద పనిచేసే శ్రీ గొర్చరణ్ సింగ్, శ్రీ బాదల్ సింగ్ మృతదేహాలను చూసినట్లు తెలిపింది. ఈ సాక్ష్యాలతో పాటు ఆనాడు ఎంపీగా ఉన్నజగదీష్ టైట్లర్‌పై సిక్కు వ్యతిరేక అల్లర్లలో అనేక నేరారోపణలున్నాయి. అందుకు తగిన ఆధారాలను సేకరించిన తర్వాతే సీబీఐ చార్జిషీటు దాఖలు చేసినట్లు తెలిపింది. అల్లరి మూకలను రెచ్చగొట్టడం, సిక్కులను హత్య చేయించడం, గురుద్వారాను తగులబెట్టడం, 1984 నవంబర్ 1న నిషేధిత ఉతర్వులను ఉలంఘించడం, మత విద్వేషాలను రెచ్చగొట్టడం వంటి నేరాలను అభియోగించింది సీబీఐ. ఇది కూడా చదవండి: ఉత్తర భారతాన్ని వదలని వానలు -
కమల్‌నాథ్ ప్రచారం చేస్తే అడ్డుకుంటాం..
న్యూఢిల్లీ: ఢిల్లీలో ఫిబ్రవరి 8న జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మధ్యప్రదేశ్ సీఎం కమల్ నాథ్ ప్రచారం చేస్తే అడ్డుకుంటామని ఢిల్లీ సిక్కు గురుద్వారా కమిటీ హెచ్చరించింది. ఢిల్లీ ప్రచార బాధ్యతలను నిర్వహించేందుకు కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్ జాబితాను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఆ జాబితాలో కమల్‌నాథ్ పేరు ఉండడంతో ఒక్కసారిగా రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఢిల్లీలో కమల్‌నాథ్ ఎక్కడ ప్రచారం చేసినా అడ్డుకుంటామని అకాలీ దల్ నాయకుడు, ఢిల్లీ సిక్కు గురుద్వారా కమిటీ ప్రెసిడెంట్ మాజిందర్ సింగ్ సిర్సా స్పష్టం చేశారు. సిర్సా మాట్లాడుతూ..సిక్కుల ఊచకోతకు కారణమైన వారిని కాంగ్రెస్ ప్రోత్సహిస్తుందని మండిపడ్డారు. కమల్‌నాథ్ నేరాలను రుజువు చేయడానికి తాము ప్రయత్నిస్తుంటే, కాంగ్రెస్ పార్టీ మాత్రం ఆయనకు సీఎం పదవి ఇచ్చిందని విమర్శించారు. -
‘సిక్కు వ్యతిరేక అల్లర్ల నిందితుడికి అందలం’
చండీగఢ్ : మధ్యప్రదేశ్ సీఎంగా కమల్ నాథ్‌ను కాంగ్రెస్ పార్టీ ఎంపిక చేయడాన్ని ప్రధాని నరేంద్ర మోదీ తప్పుపట్టారు. సిక్కు వ్యతిరేక అల్లర్లలో ఆరోపణలు ఎదుర్కొన్న నేతను కాంగ్రెస్ సీఎంను చేసిందని పరోక్షంగా కమల్ నాథ్‌ను ఉద్దేశించి మోదీ వ్యాఖ్యానించారు. పంజాబ్‌లోని గురుదాస్‌పూర్‌లో గురువారం జరిగిన ర్యాలీని ఉద్దేశించి మోదీ ప్రసంగిస్తూ కాంగ్రెస్ లక్ష్యంగా విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పట్ల పంజాబ్ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సిక్కు వ్యతిరేక అల్లర్లలో కాంగ్రెస్ సీనియర్ నేత సజ్జన్ కుమార్‌కు న్యాయస్ధానం ఇటీవల జీవిత ఖైదు విధించడాన్ని ప్రస్తావిస్తూ గాంధీ కుటుంబ సూచనలతో ఈ కేసుకు సంబంధించిన నిందితుల ఫైళ్లను సమాధి చేశారని, ఎన్డీఏ ప్రభుత్వం ఆయా కేసులను తిరగదోడిందని చెప్పారు. సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో నిందితులను కాపాడేందుకు కాంగ్రెస్ అన్ని ప్రయత్నాలూ చేసిందని ఆరోపించారు. గతంలో గరీబీ హఠావో నినాదంతో హడావిడి చేసిన కాంగ్రెస్ ఇప్పుడు రైతు రుణాల మాఫీ పేరుతో లాలీపాప్ స్కీమ్‌లతో ముందుకొస్తోందన్నారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్‌గఢ్‌లో రుణ మాఫీ హామీతో అధికారం చేపట్టిన కాంగ్రెస్ కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం కూడా వ్యవసాయ రుణాలు మాఫీ చేయాలని డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. -
సజ్జన్ కుమార్ లొంగుబాటు
సాక్షి, న్యూఢిల్లీ : 1984 సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో దోషిగా తేలి, జీవిత ఖైదు విధించబడిన మాజీ కాంగ్రెస్ నేత సజ్జన్ కుమార్ సోమవారం ఢిల్లీ కోర్టు ఎదుట లొంగిపోయారు. మెట్రపాలిటన్ మేజిస్ర్టేట్ అదితి గార్గ్ ఎదుట లొంగిపోయిన సజ్జన్ కుమార్‌ను ఈశాన్య ఢిల్లీలోని మందోలి జైలుకు తరలించాలని న్యాయస్ధానం ఆదేశించింది. తనను తీహార్ జైలులో ఉంచాలన్న సజ్జన్ కుమార్ పిటిషన్‌ను తోసిపుచ్చిన కోర్టు తనకు భద్రత కల్పించాలని, ప్రత్యేక వాహనంలో జైలుకు తరలించాలన్న వినతిని అంగీకరించింది. సిక్కు వ్యతిరేక అల్లర్లలో సజ్జన్ కుమార్‌ను దిగువ కోర్టు తప్పించడాన్ని తోసిపుచ్చుతూ డిసెంబర్ 17న ఢిల్లీ హైకోర్టు ఆయనను దోషిగా నిర్ధారించిన సంగతి తెలిసిందే. ఇక లొంగుబాటుకు నిర్ధేశించిన గడువును పొడగించాలన్న సజ్జన్ వినతినీ ఈనెల 21న కోర్టు తిరస్కరించింది. ఇందిరాగాంధీ హత్యానంతరం చెలరేగిన అల్లర్లలో ఐదుగురు సిక్కుల ఊచకోత, గురుద్వారకు నిప్పంటించిన కేసులో సజ్జన్‌ను ఢిల్లీ హైకోర్టు దోషిగా నిర్ధారించింది. హైకోర్టు తీర్పు వెలువడిన మరుసటి రోజు సజ్జన్ కుమార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. 73 సంవత్సరాల సజ్జన్ కుమార్ ఔటర్ ఢిల్లీ నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున మూడుసార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. -
ఒకరికి జైలు, మరొకరికి పదవా!?
సాక్షి, న్యూఢిల్లీ : సోమవారం నాడు దేశంలో రెండు విభిన్న పరిణామాలు చోటు చేసుకున్నాయి. అందులో ఒకటి 1984లో జరిగిన సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో కాంగ్రెస్ నాయకుడు సజ్జన్ కుమార్‌కు యావజ్జీవ కారాగార శిక్ష పడగా, అదే కేసులో నిందితుడిగా ఉన్న కాంగ్రెస్ నాయకుడు కమల్ నాథ్‌కు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి పదవి లభించింది. సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులను విచారించిన నానావతి కమిషన్ అందులో కమల్ నాథ్ హస్తం ఉందనడానికి సరైన ఆధారాలు లభించలేదని పేర్కొంది. అంతేగానీ అతను నిర్దోషి అని తేల్చలేదు. సజ్జన్ కుమార్ హస్తముందన్న విషయాన్ని నానావతి కమిషన్ అనుమానించడంతో సీబీఐ దర్యాప్తు జరిపి ఆధారాలను ఢిల్లీ హైకోర్టుకు సమర్పించింది. ఈ కేసులో సజ్జన్ కుమార్‌కు హైకోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. ‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ జర్నలిస్ట్ సహా పలువురు ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం ఢిల్లీలోని గురుద్వార్‌పై దాడి చేసిన అల్లరి మూకను రెచ్చగొడుతూ కమల్‌నాథ్ ప్రసంగించారు. అదే పని చేసిన సజ్జన్ కుమార్‌కు శిక్ష పడింది. అదే పని చేసినట్లు సాక్షులు చెబుతున్నట్లు కమల్ నాథ్ శిక్ష నుంచి తప్పించుకోవడంతోపాటు సీఎం పదవి అనే రివార్డు కూడా లభించింది. ఈ దేశంలో నేరం చేసి తప్పించుకునే అవకాశాలు రాజకీయ నాయకులకే ఎక్కువగా ఉన్నాయి. 1984 నాటి అల్లర్ల బాధితులు అవిశ్రాంతంగా పోరాడడం వల్ల 2000 సంవత్సరంలో కేంద్రం నానావతి కమిషన్‌ను ఏర్పాటు చేయాల్సి వచ్చింది. సజ్జన్ కుమార్ కేసును సీబీఐ దర్యాప్తు జరపడం, కేంద్రంలో గత నాలుగేళ్లుగా బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉండడం వల్ల రెండు కేసులను తప్పించుకున్నా మూడో కేసులో సజ్జన్ కుమార్‌కు శిక్ష పడింది. నేరం చేసిన రాజకీయ నాయకులను ఓ రాజకీయ వ్యవస్థ వెనకేసుకు రావడం వల్ల ఒకరు తప్పించుకోగలిగారు. ప్రత్యర్థికి శిక్ష పడాలని అదే రాజకీయ వ్యవస్థ కోరుకోవడం వల్ల మరొకరికి శిక్ష పడింది. ఇందులో బీజేపీ ప్రభుత్వం నిజం పక్కన నిలబడిందని భావించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సజ్జన్ కుమార్‌కు శిక్ష విధించిన హైకోర్టే, ఇంతకుముందు దేశంలో, అంటే 1993లో ముంబైలో, 2002లో గుజరాత్, 2008లో కంధమాల్, 2013లో ముజాఫర్ నగర్లో జరిగిన అల్లర్లను ప్రస్థావించింది. ఈ అన్ని అల్లర్లు ఓ మైనారిటీ మతానికి వ్యతిరేకంగా జరిగిన అల్లర్లే కాకుండా అన్నింటిలోనూ బీజేపీ హస్తం ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి, కొన్నింట్లో కేసులు కూడా కొనసాగుతున్నాయి. అలాంటి బీజేపీని రానున్న ఎన్నికల్లో ఎదుర్కోవాలంటే కాంగ్రెస్ ‘హస్తం’ ముందుగా శుభ్రంగా ఉండాలి. -
కాంగ్రెస్‌కు సజ్జన్ కుమార్ రాజీనామా
-
‘ఆ దాడుల వెనుక పెద్ద నాయకుల హస్తం’
సాక్షి, న్యూఢిల్లీ: గుజరాత్ అల్లర్లు, ముజాఫర్‌నగర్ మారణాహోమం వంటి ఘటనలకు కారణమైన వారిని కూడా శిక్షించాలని ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ డిమాండ్ చేశారు. 1984 సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో సజ్జన్ కుమార్‌కు శిక్షను విధించిన ఢిల్లీ హైకోర్టు తీర్పును స్వాగతిస్తూ, మిగిలిన వారికి కూడా శిక్ష పడాలన్నారు. సిక్కు అల్లర్లు, గుజరాత్, ముజఫర్‌నగర్ వంటి ఘటనల్లో పెద్ద నాయకుల హస్తముందనీ వారందరిని చట్టప్రకారం శిక్షించాలని కేజ్రీవాల్ పేర్కొన్నారు. సిక్కు అల్లర్ల కేసులో చాలా అలస్యంగా తీర్పు వచ్చినా బాధిత కుటుంబాలకు కొంత సంతోషం కలిగించిందని అభిప్రాయపడ్డారు. నేరాలు చేసి వాటిని కప్పిపుచ్చుకోవడానికి దోషులు రాజకీయ నాయకులుగా చలమణి అవుతున్నారని కేజ్రీవాల్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన మంగళవారం ట్విటర్లో స్పందించారు. 1984 సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో సజ్జన్ కుమార్‌ను దోషిగా నిర్ధారిస్తూ ఢిల్లీ హైకోర్టు తీర్పును వెలువరించిన విషయం తెలిసిందే. -
కాంగ్రెస్‌కు సజ్జన్ కుమార్ రాజీనామా
సాక్షి, న్యూఢిల్లీ : 1984 సిక్కు వ్యతిరేక అల్లర్లలో ఢిల్లీ హైకోర్టు దోషిగా నిర్ధారించిన మరుసటి రోజు సజ్జన్ కుమార్ కాంగ్రెస్ పార్టీకి మంగళవారం రాజీనామా చేశారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీకి రాసిన లేఖలో సజ్జన్ పేర్కొన్నారు. తనకు వ్యతిరేకంగా ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి తక్షణమే రాజీనామా చేస్తున్నానని రాహుల్‌కు రాసిన లేఖలో ఆయన వెల్లడించారు. కాగా, 1984 సిక్కు వ్యతిరేక అల్లర్లలో సజ్జన్‌ను దోషిగా తేల్చిన ఢిల్లీ హైకోర్టు ఆయనకు జీవిత ఖైదు విధించిన విషయం తెలిసిందే. ఇదే కేసులో సజ్జన్‌ను ప్రత్యేక కోర్టు నిర్ధోషిగా పేర్కొంటూ విముక్తి కల్పించడాన్ని సవాల్ చేస్తూ సీబీఐ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. దిగువ కోర్టు తీర్పును పక్కనపెట్టిన హైకోర్టు సజ్జన్ దోషేనంటూ స్పష్టం చేసింది. సిక్కు వ్యతిరేక అల్లర్లను మానవత్వంపై జరిగిన దాడిగా అభివర్ణించింది. -
‘ఆ పాపాలకు మూల్యం చెల్లిస్తారు’
సాక్షి, న్యూఢిల్లీ : 1984 సిక్కు వ్యతిరేక అల్లర్లలో కాంగ్రెస్ నేత సజ్జన్ కుమార్‌ను ఢిల్లీ హైకోర్టు దోషిగా నిర్ధారిస్తూ దిగువ కోర్టు ఉత్తర్వులను తోసిపుచ్చడంపై కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ కాంగ్రెస్‌పై మండిపడ్డారు. సజ్జన్ కుమార్‌ను దోషిగా హైకోర్టు తేల్చడం న్యాయం గెలిచితీరుతుందని కాస్త ఆలస్యమైనా వెల్లడైందన్నారు. 1984 సిక్కు వ్యతిరేక అల్లర్ల పాపాలకు కాంగ్రెస్ పార్టీతో పాటు గాంధీ కుటుంబం మూల్యం చెల్లించకతప్పదని వ్యాఖ్యానించారు. 1984 ఘర్షణల బాధితులకు కాంగ్రెస్ ఎలాంటి న్యాయం చేయలేదని, బాధితుల్లో ఎన్డీఏ ప్రభుత్వం విశ్వసనీయతను పాదుకొల్పిందన్నారు. సిక్కు వ్యతిరేక ఊచకోత ఘటనల్లో అల్లర్లను ప్రేరేపించేలా సజ్జన్ కుమార్ ప్రసంగించారని, మత సామరస్యానికి విఘాతం కల్పించారని ఢిల్లీ హైకోర్టు ఆయనను దోషిగా పేర్కొంటూ జీవిత ఖైదును విధించిన సంగతి తెలిసిందే. -
సజ్జన్ కుమార్‌ను దోషిగా తేల్చిన హైకోర్టు
సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్ నేత సజ్జన్ కుమార్‌ను 1984 సిక్కు వ్యతిరేక ఘర్షణల కేసులో ఢిల్లీ హైకోర్టు సోమవారం దోషిగా తేల్చింది. ఈ కేసులో కాంగ్రెస్ నేతకు విముక్తి కల్పిస్తూ దిగువ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులకు భిన్నంగా హైకోర్టు ఆయనను దోషిగా నిర్ధారించింది. ఈ కేసులో సజ్జన్ కుమార్‌కు జీవిత ఖైదు విధించింది. 1984, అక్టోబర్ 31న ఇందిరా గాంధీ హత్యానంతరం ఢిల్లీ కంటోన్మెంట్ ప్రాంతంలో ఐదుగురి హత్యకు సంబంధించిన కేసులో జస్టిస్ మురళీధర్, జస్టిస్ వినోద్ గోయల్‌తో కూడిన బెంచ్ ఈ ఉత్తర్వులు జారీ చేసింది. 1984 సిక్కు వ్యతిరేక అల్లర్లు మానవత్వంపై జరిగిన దాడిగా పేర్కొన్న హైకోర్టు ఈ కేసులో వాస్తవాలు వెలుగులోకి వస్తాయనే భరోసాను బాధితుల్లో కల్పించాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించింది. ఈ కేసులో సజ్జన్‌ను నిర్ధోషిగా పేర్కొంటూ మరో ఐదుగురిని దోషులుగా పేర్కొన్నప్రత్యేక న్యాయస్ధానం ఉత్తర్వులను సవాల్ చేస్తూ సీబీఐ హైకోర్టును ఆశ్రయించింది. మాజీ కౌన్సిలర్ బల్వాన్ కొక్కర్, మాజీ ఎమ్మెల్యే మహేందర్ యాదవ్, కిషన్ కొక్కర్, గిర్ధారి లాల్, కెప్టెన్ భాగ్మల్లను కేసులో దోషులుగా 2013లో ప్రత్యేక న్యాయస్ధానం స్పష్టం చేసింది. ఢిల్లీలోని కంటోన్మెంట్‌కు చెందిన రాజ్‌నగర్ ప్రాంతంలో ఒకే కుటుంబంలోని కేహార్ సింగ్, గుర్ప్రీత్ సింగ్, రాఘవేందర్ సింగ్, నరేందర్ పాల్ సింగ్, కుల్దీప్ సింగ్‌లను హత్య చేసిన కేసులో సజ్జన్ కుమార్ సహా ఐదుగురు ఇతరులు విచారణ ఎదుర్కొన్నారు. జస్టిస్ జీటీ నానావతి కమిషన్ సిఫార్సుల మేరకు సజ్జన్ కుమార్ ఇతరులపై 2005లో కేసు నమోదైంది. -
సిక్కు వ్యతిరేక అల్లర్లు : హైకోర్టు కీలక ఉత్తర్వులు
సాక్షి, న్యూఢిల్లీ : 1984 సిక్కు వ్యతిరేక అల్లర్లలో ప్రత్యేక న్యాయస్ధానం ఉత్తర్వులను ఢిల్లీ హైకోర్టు బుధవారం సమర్ధించింది. 1984లో తూర్పుఢిల్లీలోని త్రిలోక్‌పురి ప్రాంతంలో జరిగిన సిక్కు వ్యతిరేక అల్లర్లకు సంబంధించి 88 మందిని దోషులుగా నిర్ధారిస్తూ ప్రత్యేక న్యాయస్ధానం వెలువరించిన తీర్పును ఢిల్లీ హైకోర్టు సమర్ధించింది. ఈ ఘర్షణల్లో 2800 మంది సిక్కులు మరణించగా, వీరిలో 2100 మంది బాధితులు ఢిల్లీకి చెందినవారే కావడం గమనార్హం. కాగా 1984 సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసుకు సంబంధించి ఓ కేసులో దోషులుగా నిర్ధారించిన యశ్పాల్ సింగ్‌కు మరణశిక్ష, నరేష్ షెరావత్కు జీవిత ఖైదు విధిస్తూ ఈనెల 20న ఢిల్లీలోని ప్రత్యేక న్యాయస్ధానం తీర్పు వెలువరించింది. సిక్కు వర్గానికి చెందిన ఇద్దరిని హత్య చేసిన కేసులో వీరిని కోర్టు దోషులుగా నిర్ధారించింది. వీరిద్దరికీ మరణ శిక్ష విధించాలని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) కోరింది. సిక్కు వ్యతిరేక అల్లర్లలో దక్షిణ ఢిల్లీలోని మహిపాల్పూర్ ప్రాంతంలో హర్దేవ్ సింగ్, అవతార్ సింగ్‌లను హత్య చేసిన కేసులో వీరు దోషులుగా తేలారు. మరోవైపు తగిన ఆధారాలు లేవంటూ 1994లో ఢిల్లీ పోలీసులు ఈ కేసును మూసివేయగా, సిట్ పునర్విచారణలో న్యాయస్ధానం వీరిని దోషులుగా నిర్ధారించడం గమనార్హం. -
రాజీవ్‌పై బాదల్ సంచలన ఆరోపణలు
సాక్షి, న్యూఢిల్లీ : సిక్కు వ్యతిరేక అల్లర్లను అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ స్వయంగా పర్యవేక్షించారని పంజాబ్ మాజీ సీఎం, అకాలీదళ్ నేత సుక్బీర్ సింగ్ బాదల్ ఆరోపించారు. 1984లో ఇందిరాగాంధీ హత్యానంతరం చెలరేగిన సిక్కు వ్యతిరేక అల్లర్లను పరిశీలించేందుకు రాజీవ్ తనతో ఢిల్లీ అంతటా కలియతిరిగారని మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్ నేత జగదీష్ టైట్లర్ ఇటీవల చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా బాదల్ ప్రస్తావించారు. జగదీష్ టైట్లర్ వ్యాఖ్యల ప్రకారం రాజీవ్‌గాంధీ సిక్కుల హత్యాకాండను దగ్గరుండి పర్యవేక్షించారని స్పష్టమవుతోందని బాదల్ ఆరోపించారు. టైట్లర్ వెల్లడించిన విషయాలను సీబీఐ సీరియస్‌గా పరిశీలించాలని కోరారు. ఇందిరాగాంధీ హత్యానంతరం 1984లో జరిగిన సిక్కు వ్యతిరేక అల్లర్లపై సుప్రీం కోర్టు ఇటీవల నూతన సిట్‌ను ఏర్పాటు చేసి కేసుల పునర్విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే. 1984 అక్టోబర్ 31న ఇంధిరాగాంధీని ఆమె బాడీగార్డులు కాల్చిచంపిన అనంతరం ఢిల్లీ, యూపీ, హర్యానా, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర సహా పలు రాష్ట్రాల్లో చెలరేగిన అల్లర్లలో 3325 మంది మరణించారు. దేశ రాజధాని ఢిల్లీలోనే 2,733 మంది మరణించారు. -
సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసుల పునర్విచారణ
సాక్షి, న్యూఢిల్లీ : 1984లో సిక్కులకు వ్యతిరేకంగా జరిగిన అల్లర్ల కేసు పునర్విచారణకు సర్వోన్నత న్యాయస్ధానం ఆదేశించింది. దివంగత ప్రధాని ఇందిరాగాంధీ హత్యానంతరం చెలరేగిన అల్లర్లకు సంబంధించి గతంలో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) మూసివేసిన 186 కేసులను తిరగదోడాలని సుప్రీం కోర్టు నిర్ణయించింది. రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి నేతృత్వంలో ముగ్గురు సభ్యుల కమిటీని నియమించనున్నట్టు తెలిపింది. మూసివేసిన 186 కేసులను పరిశీలించిన అనంతరం వీటిని తిరిగి విచారించాలా లేదా అనే అంశంపై ఈ కమిటీ నిర్ణయం తీసుకుంటుంది. సిక్కు వ్యతిరేక అల్లర్లకు సంబంధించి 293 కేసులకు గాను సిట్ 186 కేసులను ఎలాంటి విచారణ చేపట్టకుండానే మూసివేసిందని రిటైర్డ్ జడ్డీలు కేపీఎస్ రాధాకృష్ణన్, జేఎం పంచల్ సమర్పించిన నివేదిక నేపథ్యంలో సుప్రీం కోర్టు కేసుల పునర్విచారణపై ఆదేశాలు జారీ చేసింది. -
కేజ్రీవాల్ సర్కారుకు మరో విజయం
ఇందిరాగాంధీ హత్యానంతరం ఢిల్లీలో జరిగిన అల్లర్లపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటుకు ఎట్టకేలకు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ ఎట్టకేలకు ఆమోదముద్ర వేశారు. దాంతో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వానికి - లెఫ్టినెంట్ గవర్నర్‌కు మధ్య వివాదం సమసిపోయినట్లయింది. కేజ్రీవాల్ సర్కారుకు మరో విజయం దక్కినట్లయింది. సిక్కులకు వ్యతిరేకంగా జరిగిన మతఘర్షణలపై సిట్ ఏర్పాటు అనేది ఆమ్ ఆద్మీ పార్టీ మేనిఫెస్టోలో ఓ హామీ. అయితే, దానికి లెఫ్టినెంట్ గవర్నర్ అడ్డుపడ్డారు. ఇప్పుడు ఆయన దాన్ని అనుమతించడం లోక్‌సభ ఎన్నికలకు ముందు కేజ్రీవాల్‌కు ఇది చాలా సానుకూల అంశం అవుతుంది. సిక్కు వ్యతిరేక మత ఘర్షణలపై సిట్ ఏర్పాటుచేయాలన్న ప్రతిపాదనను ఢిల్లీ సర్కారు లెఫ్టినెంట్ గవర్నర్ వద్దకు ఈనెల ప్రారంభంలోనే పంపింది. 1984 నవంబర్ నెలలో జరిగిన ఈ అల్లర్లను నియంత్రించేందుకు నాటి రాజీవ్ గాంధీ ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకుందని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఓ టీవీ చానల్ ఇంటర్వ్యూలో చెప్పిన కొద్ది రోజులకే ఆప్ ప్రభుత్వం సిట్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది. అదే సమయంలో గుజరాత్‌లోని నరేంద్ర మోడీ సర్కారు మాత్రం 2002 గోధ్రా అనంతర అల్లర్లను నియంత్రించడంలో విఫలం అయ్యిందని రాహుల్ అప్పట్లో అన్నారు. దీంతో సిక్కు సంఘాలు తీవ్ర నిరసన వ్యక్తం చేశాయి. -
సోనియాకు అమెరికా కోర్టు సమన్లు
న్యూయార్క్: ఇందిరాగాంధీ హత్యానంతరం 1984లో ఢిల్లీలో జరిగిన సిక్కుల ఊచకోత వ్యవహారం మూడు దశాబ్దాలు గడుస్తున్నా కాంగ్రెస్ పార్టీని వదలట్లేదు. ఈ మారణకాండలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ నాయకులను రక్షిస్తూ వారికి అండదండలు అందిస్తున్నందుకు ఆ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి అమెరికా కోర్టు సమన్లు జారీ చేసింది. దాడుల కేసులో నిందితులను సోనియా రక్షిస్తున్నారని ఆరోపిస్తూ, అలాగే తగిన నష్టపరిహారం కోరుతూ ‘సిఖ్స్ ఫర్ జస్టిస్’ (ఎస్ఎఫ్జే) అనే సంస్థతో పాటు ఇద్దరు బాధితులు ఈనెల 3న పిటిషన్ దాఖలు చేశారు. దీన్ని విచారించిన న్యూయార్క్‌లోని యూఎస్ ఈస్ట్రన్ డిస్ట్రిక్ట్ కోర్టు సోనియాకు సమన్లు జారీ చేసింది.