సాక్షి, న్యూఢిల్లీ : 1984లో సిక్కులకు వ్యతిరేకంగా జరిగిన అల్లర్ల కేసు పునర్విచారణకు సర్వోన్నత న్యాయస్ధానం ఆదేశించింది. దివంగత ప్రధాని ఇందిరాగాంధీ హత్యానంతరం చెలరేగిన అల్లర్లకు సంబంధించి గతంలో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) మూసివేసిన 186 కేసులను తిరగదోడాలని సుప్రీం కోర్టు నిర్ణయించింది. రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి నేతృత్వంలో ముగ్గురు సభ్యుల కమిటీని నియమించనున్నట్టు తెలిపింది.
మూసివేసిన 186 కేసులను పరిశీలించిన అనంతరం వీటిని తిరిగి విచారించాలా లేదా అనే అంశంపై ఈ కమిటీ నిర్ణయం తీసుకుంటుంది. సిక్కు వ్యతిరేక అల్లర్లకు సంబంధించి 293 కేసులకు గాను సిట్ 186 కేసులను ఎలాంటి విచారణ చేపట్టకుండానే మూసివేసిందని రిటైర్డ్ జడ్డీలు కేపీఎస్ రాధాకృష్ణన్, జేఎం పంచల్ సమర్పించిన నివేదిక నేపథ్యంలో సుప్రీం కోర్టు కేసుల పునర్విచారణపై ఆదేశాలు జారీ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment