న్యూయార్క్: ఇందిరాగాంధీ హత్యానంతరం 1984లో ఢిల్లీలో జరిగిన సిక్కుల ఊచకోత వ్యవహారం మూడు దశాబ్దాలు గడుస్తున్నా కాంగ్రెస్ పార్టీని వదలట్లేదు. ఈ మారణకాండలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ నాయకులను రక్షిస్తూ వారికి అండదండలు అందిస్తున్నందుకు ఆ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి అమెరికా కోర్టు సమన్లు జారీ చేసింది. దాడుల కేసులో నిందితులను సోనియా రక్షిస్తున్నారని ఆరోపిస్తూ, అలాగే తగిన నష్టపరిహారం కోరుతూ ‘సిఖ్స్ ఫర్ జస్టిస్’ (ఎస్‌ఎఫ్‌జే) అనే సంస్థతో పాటు ఇద్దరు బాధితులు ఈనెల 3న పిటిషన్ దాఖలు చేశారు. దీన్ని విచారించిన న్యూయార్క్‌లోని యూఎస్ ఈస్ట్రన్ డిస్ట్రిక్ట్ కోర్టు సోనియాకు సమన్లు జారీ చేసింది.