ప్రపంచ సంపన్న నేతల్లో యూపీఏ చైర్‌పర్సన్, కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీకి 12వ స్థానాన్ని కట్టబెట్టిన అమెరికన్ వెబ్‌సైట్ హఫింగ్టన్ పోస్ట్ నాలుక్కరుచుకుంది.
వాషింగ్టన్: ప్రపంచ సంపన్న నేతల్లో యూపీఏ చైర్‌పర్సన్, కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీకి 12వ స్థానాన్ని కట్టబెట్టిన అమెరికన్ వెబ్‌సైట్ హఫింగ్టన్ పోస్ట్ నాలుక్కరుచుకుంది. జాబితాలోంచి సోనియా పేరును తొలగించింది. ఆమె పేరును చేర్చడం వల్ల ఏర్పడిన గందరగోళంపై విచారం కూడా వ్యక్తం చేసింది. సోనియాకు 2 బిలియన్ డాలర్ల (రూ. 12వేల కోట్లకు పైగా) విలువైన ఆస్తులు ఉన్నాయని పేర్కొన్న హఫింగ్టన్.. తమ ఎడిటర్లు సోనియా ఆస్తుల మొత్తాన్ని ధ్రువీకరించుకోలేకపోయారని పేర్కొంది.