సోనియాపై ఫిర్యాదును కొట్టివేసిన అమెరికా కోర్టు | SFJ can't file amended rights complaint against Sonia, america court | Sakshi
Sakshi News home page

సోనియాపై ఫిర్యాదును కొట్టివేసిన అమెరికా కోర్టు

Published Thu, Jul 10 2014 6:28 PM | Last Updated on Thu, Apr 4 2019 3:25 PM

SFJ can't file amended rights complaint against Sonia, america court

న్యూయార్క్:కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీపై సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో సిక్కు హక్కుల గ్రూపు దాఖలు చేసిన సవరణ పిటీషన్ ను అమెరికా కోర్టు తిరస్కరించింది. అమెరికాలోని సిక్స్ ఫర్ జస్టిస్(ఎస్ జేఎఫ్) అనే సంస్థ 1984 నాటి సిక్కు అల్లర్లకు సంబంధించి సోనియా గాంధీపై మానవ హక్కుల ఉల్లంఘన ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. గత నెలలో ఈ పిటీషన్ ను విచారించిన యూఎస్ జిల్లా కోర్టు న్యాయమూర్తి బ్రియాన్ కోగెన్ సరైన ఆధారాలు లేవంటూ కొట్టిపారేశారు. తాజాగా ఎస్ జేఎఫ్ ప్రతినిధులు సోనియా గాంధీపై సవరణ ఫిర్యాదు చేయాలంటూ కోగెన్ కు లేఖ రాశారు. దీనిపై కోగెన్ స్పందిస్తూ.. ఈ కేసులో తుది తీర్పు వెలువడిందని, తదుపరి విచారణకు సరైన ఆధారాలు లేవంటూ ఎస్ జేఎఫ్ విజ్ఞప్తిని తిరస్కరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement