నేడు ఢిల్లీకి సోనియా రాక | Congress president Sonia Gandhi to return from US today | Sakshi
Sakshi News home page

నేడు ఢిల్లీకి సోనియా రాక

Published Wed, Sep 11 2013 1:04 AM | Last Updated on Thu, Apr 4 2019 3:25 PM

నేడు ఢిల్లీకి సోనియా రాక - Sakshi

నేడు ఢిల్లీకి సోనియా రాక

వైద్య పరీక్షల నిమిత్తం ఈ నెల 2న అమెరికా వెళ్లిన కాంగ్రెస్ అధినేత్రి, యూపీఏ చైర్‌పర్సన్ సోనియా గాంధీ బుధవారం ఢిల్లీ చేరుకోనున్నారు. సోనియా గాంధీకి 2011, ఆగస్టు 5న అమెరికాలో శస్త్ర చికిత్స జరిగిన విషయం తెలిసిందే. అయితే, గత నెల ఆగస్టులో ఆహార భద్రతా బిల్లుపై లోక్‌సభలో చర్చ జరిగిన సందర్భంలో తీవ్ర అలసట, ఛాతీ నొప్పితో అనారోగ్యానికి గురైన సోనియా గాంధీని హుటాహుటిన ఎయిమ్స్‌కు తరలించారు.

అక్కడ దాదాపు 5 గంటల పరీక్షల అనంతరం డిశ్చార్జ్ చేశారు. తర్వాత, సెప్టెంబర్ 2న ఆమె తన కుమార్తె ప్రియాంకా గాంధీతో కలిసి వైద్య పరీక్షల నిమిత్తం అమెరికా వెళ్లారు. కాగా, బుధవారం ఉదయానికే సోనియా, ఆమె కుమార్తె ప్రియాంకలు ఢిల్లీ చేరుకుంటారని అధికార వర్గాలు వెల్లడించాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement