లండన్ : తింటున్న ఆహారం ఎంత స్వచ్ఛమైనదో మీకు తెలుసా? కల్తీ లేనివే తింటున్నామని బలంగా నమ్ముతున్నారా? అయితే మీరో విషయం తెలుసుకోవాల్సిందే. మనం చేసే ప్రతి భోజనం ద్వారా 100 ప్లాస్టిక్ కణాలు పొట్టలోకి వెళ్లిపోతున్నాయట. ఈ విషయాన్ని అమెరికాలోని హీరియట్–వాట్ యూనివర్సిటీ పరిశోధకులు వెల్లడించారు. దీనిని నిరూపించడం కోసం శాస్త్రవేత్తలు ఓ చిన్న ప్రయోగం చేశారు. డిన్నర్ సమయానికి ముందు ప్లేట్స్ పక్కన పెట్రీడిష్‌లను ఉంచారట. వీటి ప్రత్యేకత ఏంటంటే వాటిపై పడిన దుమ్ము వాటికే అతుక్కుపోతుంది. డిన్నర్ పూర్తయిన తర్వాత వాటిని పరిశీలించగా 20 నిమిషాల భోజనం సమయంలో 14 ప్లాస్టిక్ కణాలు వాటికి అతుక్కున్నాయట.
భోజనం పూర్తయ్యేసరికి సగటున 114 ప్లాస్టిక్ కణాలు మనం తినే భోజనంలో పడుతున్నాయట. ఈ విధంగా సంవత్సరానికి సగటున ఒక మనిషి 68,415 ప్లాస్టిక్ ఫైబర్స్‌ను తింటున్నాడని పరిశోధకులు చెబుతున్నారు. మానవ శరీరంలో కూడా ప్లాస్టిక్ అవశేషాలు గుర్తించదగిన స్థాయిలోనే ఉన్నాయని తెలిపారు. అయితే సముద్రాలను కూడా ప్లాస్టిక్ కలుషితం చేస్తున్న విషయం తెలిసిందే. మరి సముద్ర జీవుల సంగతేంటని పరిశీలిస్తే.. నత్తలో కూడా ప్లాస్టిక్ అవశేషాలను గుర్తించారట. అయితే మనిషిలో ఉండే స్థాయితో పోలిస్తే నత్తలో తక్కువగానే ఉన్నాయట. దీనినిబట్టి మనం ఎంతగా ప్లాస్టిక్ తింటున్నామో ఒక్కసారి ఊహించుకోండి.
ప్లాస్టిక్‌నూ తింటున్నామట!
Published Thu, Apr 5 2018 10:42 PM | Last Updated on Thu, Apr 4 2019 3:25 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment