సాక్షి, న్యూఢిల్లీ: గుజరాత్ అల్లర్లు, ముజాఫర్‌నగర్ మారణాహోమం వంటి ఘటనలకు కారణమైన వారిని కూడా శిక్షించాలని ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ డిమాండ్ చేశారు. 1984 సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో సజ్జన్ కుమార్‌కు శిక్షను విధించిన ఢిల్లీ హైకోర్టు తీర్పును స్వాగతిస్తూ, మిగిలిన వారికి కూడా శిక్ష పడాలన్నారు. సిక్కు అల్లర్లు, గుజరాత్, ముజఫర్‌నగర్ వంటి ఘటనల్లో పెద్ద నాయకుల హస్తముందనీ వారందరిని చట్టప్రకారం శిక్షించాలని కేజ్రీవాల్ పేర్కొన్నారు.
సిక్కు అల్లర్ల కేసులో చాలా అలస్యంగా తీర్పు వచ్చినా బాధిత కుటుంబాలకు కొంత సంతోషం కలిగించిందని అభిప్రాయపడ్డారు. నేరాలు చేసి వాటిని కప్పిపుచ్చుకోవడానికి దోషులు రాజకీయ నాయకులుగా చలమణి అవుతున్నారని కేజ్రీవాల్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన మంగళవారం ట్విటర్‌లో స్పందించారు. 1984 సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో సజ్జన్ కుమార్‌ను దోషిగా నిర్ధారిస్తూ ఢిల్లీ హైకోర్టు తీర్పును వెలువరించిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment