వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బెయిల్‌కు సంబంధించి జామీను పత్రాల పరిశీలన పూర్తయింది.
హైదరాబాద్ : వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బెయిల్‌కు సంబంధించి జామీను పత్రాల పరిశీలన పూర్తయింది. వైఎస్ అవినాష్ రెడ్డి, యశ్వంత్ రెడ్డి మంగళవారం ష్యూరిటీ పత్రాలను నాంపల్లి సీబీఐ కోర్టుకు సమర్పించారు. వీరు సమర్పించిన పత్రాలను న్యాయమూర్తి దుర్గాప్రసాద్ పరిశీలించారు. జామీను ఇచ్చిన అవినాష్ రెడ్డి, యశ్వంత్ రెడ్డి వ్యక్తిగత వివరాలను న్యాయమూర్తి తెలుసుకున్నారు.
ష్యూరిటీ పత్రాలను పరిశీలించిన కోర్టు... వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విడుదలకు సంబంధించిన పత్రాలు సిద్ధమని సిబ్బందిని ఆదేశించింది. విడుదల ఆర్డర్ సిద్ధమైన వెంటనే... న్యాయమూర్తిపై వాటిపై సంతకం చేస్తారు. కోర్టు సిబ్బంది ఆ ఆదేశాలను చంచల్‌గూడ జైలు అధికారులకు అందజేస్తారు. జైల్లో కోర్టు ఆదేశాల పరిశీలన తర్వాత... వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బయటకు వస్తారు. ఈ ప్రక్రియ అంతా పూర్తవడానికి దాదాపు గంటన్నర నుంచి రెండు గంటల సమయం పట్టవచ్చు.