సంధ్య థియేటర్ దగ్గర మహిళా మృతి చెందిన కేసులో హీరో అల్లు అర్జున్‌ని హైదరాబాద్ చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. బెయిల్ వచ్చినా సరే రాత్రంతా చంచల్‌గూడ జైలులోనే ఉంచారు. తమ అభిమాన హీరోని వెంటనే జైలు నుంచి విడుదల చేయాలని బన్నీ అభిమాని ఒకరు.. జైలు బయట వీరంగం సృష్టించాడు. ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యా ప్రయత్నం చేశాడు. పోలీసులు సకాలంలో స్పందించి అతడిని అదుపులోకి తీసుకున్నారు.
(ఇదీ చదవండి:కావాలనే జైల్లో ఉంచారు.. పోలీసులపై కేసు పెడతాం: బన్నీ లాయర్)
శుక్రవారం ఉదయం అరెస్ట్ అయిన అల్లు అర్జున్‌కి.. 4 వారాల మధ్యంతర బెయిల్ లభించింది. దీంతో శనివారం ఉదయం 6:45 చంచల్‌గూడ జైలు నుంచి బయటకొచ్చాడు. అక్కడి నుంచి నేరుగా గీతా ఆర్ట్స్ కార్యాలయానికి వెళ్లాడు. కాసేపు అక్కడే ఉండి ఇంటికెళ్లాడు. అనంతరం మీడియాతో మాట్లాడాడు. కేసు కోర్టు పరిధిలో ఉందని, ప్రస్తుతం తానే మాట్లాడనని చెప్పాడు. తనకు మద్దతు తెలిపిన అందరికీ ధన్యవాదాలు చెప్పాడు.
తాను బాగానే ఉన్నానని, అభిమానులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అల్లు అర్జున్ చెప్పాడు. మరణించిన రేవతి కుటుంబానికి నా సానుభూతి, అనుకోకుండా జరిగిన సంఘటన ఇదని, నిజంగా అలా జరగడం దురదృష్టకరమని పేర్కొన్నాడు. బన్నీ ఇంటికొచ్చేసిన నేపథ్యంలో సుకుమార్, నిర్మాతలు దిల్ రాజు, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు, హీరో విజయ్ దేవరకొండ తదితరులు వచ్చి పలకరించారు.
(ఇదీ చదవండి: అరెస్ట్ వెనకున్నోళ్లు సర్వనాశనం అయిపోతారు: రైటర్ చిన్నికృష్ణ)
Comments
Please login to add a commentAdd a comment