ఆ షోకు.. లోయిస్ విట్మన్ మిస్సవ్వలేదు..! | Meet Lois Whitman, she's attended every CES since 1967 | Sakshi
Sakshi News home page

ఆ షోకు.. లోయిస్ విట్మన్ మిస్సవ్వలేదు..!

Published Thu, Jan 7 2016 8:49 PM | Last Updated on Sun, Sep 3 2017 3:16 PM

ఆ షోకు.. లోయిస్ విట్మన్ మిస్సవ్వలేదు..!

ఆ షోకు.. లోయిస్ విట్మన్ మిస్సవ్వలేదు..!

ఎలక్ట్రానిక్స్ షోలో ఆమెది ఏభై ఏళ్ళ ప్రస్థానం.. జనవరి తొమ్మిది వరకూ లాస్ వెగాస్ కన్వెన్షన్ సెంటర్ లో జరిగే కంజ్యూమర్ ఎలక్ట్రానిక్స్ షో లోనూ లోయిస్ విట్మన్ పాత్ర ఉంది. ఇప్పుడే కాదు ఆమె న్యూయార్క్ సిటీ లో 1967లో మొట్టమొదటిసారి జరిపిన ప్రదర్శననుంచి ప్రతి సీఈఎస్ కు హాజరౌతూనే ఉంది. కంన్జూమర్ ఎలక్ట్రానిక్స్ లో నిర్వహిస్తున్న తన ఉద్యోగాన్నే కాక, ఆ వ్యాపారంలో ఉండే ప్రతి వారినీ ఆమె ఎంతో ఇష్ట పడుతుంది.

హోం ఫర్నిషింగ్ డైలీ మాగజిన్ లో 1966 లో కెరీర్ ప్రారంభించిన లోయిస్ విట్మన్.. 1967 లో ప్రారంభమైన  మొట్టమొదటి  కన్జూమర్ ఎలక్ట్రానిక్ షో  నుంచీ ప్రతి ప్రదర్శనలో పాల్గొంటోంది. అప్పట్లో ఈ షోలో... గడియారాలు, రేడియోలు, ఫర్నిచర్ తో పాటు, గృహోపకరణాల్లో ఉండే కన్సోల్ ఆడియోసిస్టమ్స్, టీవీలు వంటివి ఎక్కువగా  ఉండేవి. అప్పటికే అమెరికాలో  ఇళ్ళు కంప్యూటర్ ప్రపంచాన్ని ఆక్రమించడంతో..  హోం ఆడియోలు, టీవీలు యూఎస్ లో తయారుచేసేవారు. అయితే రాను రాను కొన్ని జపనీస్ కంపెనీల ఆధిపత్యం... హోమ్ ఆడియో సెక్టార్లో పుంజుకుంది.  మొదట్లో కొన్ని షోలు కేవలం కొన్ని గంటల్లోనే చూడగలిగేలా చిన్నగా ఉండేవని విట్మన్ తన ఏభై ఏళ్ళ అనుభవాన్ని గుర్తు చేసుకుంటుంది.

1967 లో మొట్టమొదటిసారి న్యూయార్క్ సిటీలో మొదలైన కన్జూమర్ ఎలక్ట్రానిక్ షో 1970 వరకూ అక్కడే కొనసాగింది. ఆ తర్వాత చికాగో కు చేరి అక్కడే 1971 నుంచి 77 వరకు కొనసాగి, అక్కడినుంచి 1978 వింటర్ లో లాస్ వెగాస్ కు చేరింది. అప్పట్నుంచీ అక్కడ ప్రతి జనవరిలో వింటర్ సీఈఎస్ తోపాటు, లాస్ వెగాస్ లో 1978 నుంచి 95 వరకు ప్రతి సంవత్సరం సమ్మర్ సీఈఎస్ కూడ కొనసాగుతూనే ఉంది. అయితే ఈ ప్రతి షోలో విట్మన్ ఉంది. వీసీఆర్ లు వచ్చే సమయానికి విట్మస్ జర్నలిజం నుంచి బయటకు వచ్చి, హెచ్ డబ్ల్యూ హెచ్  పేరిట  1978లో ప్రజాంసంబంధాల సంస్థ ప్రారంభించింది. అప్పట్లో  ఆమె ఖాతాల్లో ఒకటైన వీహెచ్ ఎస్... వీడియో టేప్ ఫార్మాట్ లో ఉండే జేవీసీ... సోనీ బీటామాక్స్  పేరిట బయటకు వచ్చేది.  1970 నుంచి 1980 లమధ్య  వచ్చిన ఫార్మాట్ వార్ తో  వీహెచ్ ఎస్ అమ్మకాలు కూడ ఒక్కో సంవత్సరం పెరుగుతూ వచ్చాయి. దీంతో విట్మన్ విజయపథంవైపు అడుగులు వేసింది. మొదటిసారి లేజర్ డిస్క్, ఆప్టికల్ డిస్క్ వీడియో ప్లేయర్ సంయుక్తంగా  1978 సమయంలో ప్రారంభిచబడింది.  అప్పట్లో వీహెచ్ ఎస్, బీటా లకు ప్రజాదరణ కాస్త తగ్గినా... లేజర్ డిస్క్ మాత్రం మాస్ మార్కెట్లో దూసుకుపోయింది.

1982 లో సీఈఎస్ ప్రారంభమయ్యే సమయానికి విట్మస్ ఎనిమిది నెలల గర్భవతి. అయినా ఆమె ప్రదర్శనకు వెళ్ళడం మానలేదు. ఫ్లాట్ స్క్రీన్ డిస్ ప్లే  ప్రారంభ సమయం కావడంతో 2000 సంవత్సరంలో ఆమె శామ్సంగ్ కు ఆ వర్గ మేనేజర్ గా మారింది. . పనిని ప్రేమించే తత్వం ఉన్న విట్మన్  2016 సీఈఎస్ లో కొత్త ఎలక్ట్రానిక్ పరికరాలకోసం ఆత్రుతగా చూస్తోంది. ప్రస్తుతం డిజిడ్యామ్ బ్లాగ్ తోపాటు... తన భర్త ఎలైట్ హెస్ తో కలసి... విట్మన్... హెచ్ డబ్ల్యూ హెచ్ పబ్లిక్ రిలేషన్ ఏజెన్సీని నడుపుతోంది. ఎన్నో కంపెనీలకు బిజినెస్ అడ్వైజర్ గా, మార్కెటింగ్ కన్సల్టెంట్ గా, స్పీకర్ గా, రచయితగా  ఉండటమే కాక, నేటికీ  అలుపెరుగని నెట్వర్కర్ గా ఉత్సాహంగా జీవితాన్ని గడుపుతోంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement