అంతర్జాతీయ మార్కెట్లో రోజు రోజుకి కొత్త వాహనాలు విడుదలవుతూనే ఉన్నాయి. ఈ రోజు నుంచి లాస్ వెగాస్‌లో ప్రారంభమైన సీఈఎస్ 2024 వేదికగా మరిన్ని కొత్త వాహనాలు అరంగేట్రం చేసే అవకాశం ఉంది. లాస్ వేగాస్‌లో జరుగుతున్న ఈ ఈవెంట్‌లో 'సోనీ' (Sony) కంపెనీ ఓ సరికొత్త ఎలక్ట్రిక్ కారుని ప్రదర్శించింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
గత కొన్ని సంవత్సరాలుగా సోనీ, హోండా కలిసి 'అఫీలా' (Afeela) అనే కొత్త కాన్సెప్ట్ ఎలక్ట్రిక్ వెహికల్ తయారీలో నిమగ్నమై ఉన్నాయి. ఆ కారుని కంపెనీ ఎట్టకేలకు ఈ CES 2024 వేదికగా ప్రదర్శించింది. ఇక్కడ కనిపించే కారు కేవలం డెమో కోసం మాత్రమే అని, రానున్న రోజుల్లో టెస్టింగ్ వంటివి నిర్వహించి మార్కెట్లో విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.
కంపెనీ ప్రెసిడెంట్ అండ్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ 'ఇజుమి కవానిషి' ప్రకారం, ఈ కారు 2025 చివరి నాటికి లేదా 2026 ప్రారంభం నాటికి మార్కెట్లో లాంచ్ అవుతుంది, ఈ కారు లాంచ్ అయిన తరువాత మరిన్ని ఉత్పత్తులు పుట్టుకొస్తాయని వెల్లడించారు.
ఇదీ చదవండి: వాచ్‌మెన్‌కు ఇప్పుడే సారీ చెప్పు.. ఆకాశ్‌ను ఆదేశించిన ముకేశ్ అంబానీ - ఎందుకంటే?
అఫీలా (Afeela) కారు అద్భుతమైన డిజైన్ పొందనున్నట్లు తెలుస్తోంది. ఇది 3డీ గ్రాఫిక్స్, విజువల్స్ కలిగి మల్టిపుల్ కెమెరా సెటప్ వంటి వాటిని కలిగి ఉంటుంది. మంచి డిజైన్, లేటెస్ట్ ఫీచర్స్ కలిగి ఉండటమే కాకుండా.. ఇందులో ఆధునిక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సేఫ్టీ ఫీచర్స్ కూడా ఉంటాయని చెబుతున్నారు.
కంపెనీ ఈ కారుకు సంబంధించిన చాలా విషయాలను రానున్న రోజుల్లో వెల్లడించనుంది. అయితే ఈ మోడల్ భారతీయ తీరానికి చేరుకుంటుందా? లేదా?.. ఒక వేళా ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయితే ఎప్పుడు లాంచ్ అవుతుందనే విషయాలు కూడా తెలియాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment