
తొలి స్వాతంత్ర్య సమరయోదుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథ ఆధారంగా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న ‘సైరా నరసింహారెడ్డి’ సినిమా ఇప్పటికే సంచలనం నమోదు చేసింది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్‌కు సూపర్బ్ రెస్పాన్స్ వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో కన్నడ నటుడు కిచ్చ సుదీప్ ఓ కీలకపాత్ర పోషిస్తున్నారు. శుక్రవారం సుదీప్ బర్త్‌డే సందర్భంగా సైరా టీమ్ ఓ స్పెషల్ మోషన్ పోస్టర్ విడుదల చేసింది. ‘హ్యాపీ బర్త్ డే అభినయ చక్రవర్తి’ అంటూ విష్ చేసింది. ఒంటినిండా నల్లని వస్త్రాలతో, చేతిలో ఆయుధంతో పోజిచ్చిన సుదీప్ స్టిల్ అభిమానులను ఆకట్టుకుంటోంది.
Comments
Please login to add a commentAdd a comment