'హాలోవీన్' కోసం మూతిని కుట్టేసుకుంది!
ఏదైనా హర్రర్ సినిమాలో సూది దారం తీసుకొని నోటిని కుట్టేసుకున్న దృశ్యాన్ని చూస్తే ఒళ్లు జలదరిస్తుంది. అలాంటిది నిజంగానే మూతి కుట్టేసుకొని కనిపిస్తే భయపడిపోరు! పాశ్చాత్య దేశాల్లో ఈ నెల 31న నిర్వహించే 'హాలోవిన్' పార్టీ కోసం మూతిని సూదిదారంతో ఎలా కుట్టేసుకోవాలో ఇంటర్నెట్ వేదికగా వివరించింది 'ప్రామిస్' అనే మేకప్ ఆర్టిస్ట్. ప్రామిస్ అసలు పేరు ప్రతిగ్యా తమంగ్. నేపాల్లో పుట్టిన ఆమె ప్రస్తుతం అమెరికాలో నివాసముంటున్నది.
'మానవ ఊసరవెల్లి'గా పేరొందిన ఈ అమ్మడికి యూట్యూబ్లో పెద్దసంఖ్యలోనే ఫ్యాన్స్ ఉన్నారు. యూట్యూబ్లో ఆమెకు 40 లక్షలమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. వారికి ఈమె చిత్రవిచిత్రంగా ఆన్లైన్ పాఠాలు చెప్తుంది. తాజాగా ప్రతిగ్యా మూతిని సూది దారంతో ఎలా కుట్టేసుకోవాలో ట్యూషన్ చెప్పింది. ఆమెకు పిచ్చికాకపోతే ఎవరైనా చూస్తూ చూస్తూ మూతిని కుట్టేసుకుంటారా? అనుకోకండి. ఆమె కేవలం మూతిని కుట్టేసుకున్నట్టు ఎలా కనిపించాలో వివరించిందంతే. నోటిని కుట్టేసుకున్నట్టు దారాన్ని రెండు పెదవుల అంచులకు అంతకించుకొని.. సూది గుచ్చినట్టు ఎర్రని చుక్కలు పెట్టి నోటిని కుట్టేసుకున్నట్టు కనిపించవచ్చునని వివరించింది. ఈ వీడియోను యూట్యూబ్లో ఇప్పటివరకు 30 లక్షలమంది చూశారు.