టీవీ సీరియల్‌ మేకప్‌మెన్‌ దారుణ హత్య | Hyderabad Makeup Artist Murdered At Borabanda, Details Inside | Sakshi
Sakshi News home page

టీవీ సీరియల్‌ మేకప్‌మెన్‌ దారుణ హత్య

Published Thu, May 16 2024 6:35 AM | Last Updated on Thu, May 16 2024 1:29 PM

Makeup artist murdered at Borabanda

కార్మిక నగర్ నిమ్స్‌మే మైదానంలో ఘటన 

 సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎస్సార్‌ నగర్‌ ఏసీపీ 

 ధారాలు సేకరించిన క్లూస్‌ టీమ్‌ 

రహమత్‌నగర్‌: రహమత్‌నగర్‌ డివిజన్‌ పరిధిలోని నిమ్స్‌మే మైదానంలో మంగళవారం రాత్రి ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. పోలీసుల సమాచారం మేరకు... కార్మిక నగర్ చిల్లా వద్ద పక్కన ఉన్న నిమ్స్‌మే మైదానం లోపల గోడ వద్ద పడివున్న యువకుడి మృతదేహాన్ని గుర్తించిన నిమ్స్‌మే సెక్యూరిటీ సిబ్బంది బుధవారం ఉదయం పోలీసులకు సమాచారం అందించారు.

 ఎస్‌ఆర్‌నగర్‌ ఏసీపీ వెంకటరమణ, బోరబండ పోలీస్‌ స్టేషన్‌ ఎస్‌హెచ్‌ఓ వీరశేఖర్‌ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతుడు టీవీ సీరియల్స్‌ మేకప్‌మెన్‌గా పనిచేసే మహబూబ్‌నగర్‌ వనపర్తి ప్రాంతానికి చెందిన చుక్కా చెన్నయ్య అలియాస్‌ తరుణ్‌తేజ్‌(28)గా గుర్తించారు. క్లూస్‌ టీం, డాగ్‌ స్క్వాడ్‌ను రప్పించి ఆధారాలు సేకరించారు.

మారణాయుధాలతో దాడి జరుగున్న క్రమంలో మృతుడు గాయాలతో పరిగెత్తి గోడ వద్ద కుప్పకూలి పోయి ఉంటాడని పోలీసులు అంచనాకు వచ్చారు. ఇదిలా ఉండగా మంగళవారం రాత్రి మృతుడు చెన్నయ్యతో పాటు ఎంత మంది నిమ్స్‌ మే మైదానంలోని వచ్చారు? ఎలా వచ్చారు? అనే వివరాలను పోలీసులు అరా తీస్తున్నారు. కార్మిక నగర్, బస్‌ స్టాప్, కారి్మకనగర్‌ శ్రీరాంనగర్‌ ఉన్న సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. ఈ మేరకు బోరబండ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement