'థ్రిల్లర్' డ్యాన్స్తో అదరగొట్టిన ఒబామా
'థ్రిల్లర్' డ్యాన్స్తో అదరగొట్టిన ఒబామా
Published Tue, Nov 1 2016 11:48 AM | Last Updated on Mon, Sep 4 2017 6:53 PM
దివాలి వేడుకలతో మెరిసిపోయిన వైట్హోస్, బరాక్ ఒబామా, మిచెల్లీ డ్యాన్సులతో హోరెత్తింది. సోమవారం రాత్రి వైట్హోస్లో జరిగిన హాలోవీన్ ట్రిక్ ఆర్ ట్రీట్ ఈవెంట్లో మైకెల్ జాక్సన్ "థ్రిల్లర్" డ్యాన్స్లతో అమెరికా అధ్యక్షుడు ఒబామా, ఆయన భార్య మిచెల్లీ ప్రేక్షకులను మురిపించారు. వైట్హోస్లో సౌత్ లాన్లో ఏర్పాటుచేసిన ఈ ఈవెంట్కు 4వేలకు పైగా ప్రజలను ఒబామా ఆహ్వానించారు. వీరిలో ఎక్కువగా వాషింగ్టన్ ప్రాంతంలోని ఎలిమెంటరీ స్కూల్ పిల్లలు, సైనిక కుటుంబాలు ఉన్నాయి.
ఈ సందర్భంగా ఒబామా పలు చమత్కారాలు చేశారు. కనీసం ఈరోజైనా తల్లిదండ్రులు మిచెల్లీపై, పోషకాహారంపై శ్రద్ధ తీసుకోకుండా ఉండాలని ఆశిస్తున్నట్టు చమత్కరించారు. ఈ విషయానికి తానుకూడా సమ్మతిస్తున్నట్టు మిచెల్లీ తెలిపారు. ప్రతిఒక్కరూ క్యాండీ(మిఠాయి) తినాలని మిచెల్ చెప్పారు. అలా మిఠాయిలను ఆస్వాదిస్తూ రాత్రంతా ఈవెంట్ వేడుకలను ఎంజాయ్ చేయాలని ఒబామా పిలుపునిచ్చారు.
Advertisement
Advertisement