ప్రముఖ వ్యాపారవేత్త విజయ్ మాల్యా తనయుడు సిద్ధార్థ్ మాల్యా ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారు. నటుడు, మోడల్‌గా గుర్తింపు తెచ్చుకున్న సిద్ధార్థ్ తన ప్రియురాలికి ప్రపోజ్ చేశారు. తాజాగా హాలోవిన్ పార్టీకి హాజరైన సిద్ధార్థ్.. తన ప్రియురాలు జాస్మిన్‌కు చేతికి ఉంగరం తొడిగి నిశ్చితార్థం చేసుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలను తన ఇన్‌స్టాలో షేర్ చేశారు. ఇది చూసిన ఆయన అభిమానులు ఈ జంటకు అభినందనలు చెబుతున్నారు.
సిద్ధార్థ్ తన ఇన్‌స్టాలో రాస్తూ..'ఇక నుంచి మీరు ఎప్పటికీ నాతోనే ఉంటారని ఆశిస్తున్నా. నేను నిన్ను ప్రేమిస్తున్నా. నా ప్రేమను అంగీకరించినందుకు ధన్యవాదాలు' అంటూ పోస్ట్ చేశారు. కాగా.. ప్రస్తుతం కాలిఫోర్నియాలో హాలోవిన్ పార్టీకి వీరద్దరు హాజరైనట్లు తెలుస్తోంది. ఈ జంటకు బాలీవుడ్ తారలు సుస్సానే ఖాన్, అర్పితా శర్మ, అనూషా దండేకర్ అభినందనలు తెలిపారు.
అయితే గతంలో సిద్ధార్థ్.. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణెతో రిలేషన్‌లో ఉన్నారు. రణవీర్ సింగ్‌తో వివాహం కాకముందే దీపికాతో సిద్ధార్థ్‌కు పరిచయముంది. గతంలో వీరిద్దరు కలిసి ఐపీఎల్ మ్యాచ్‌లో సందడి చేశారు. ఐపీఎల్ మ్యాచ్‌లో ముద్దు పెట్టుకోవడంతో వీరు డేటింగ్‌లో ఉన్నారంటూ రూమర్స్ వినిపించాయి. కాగా.. వ్యాపారవేత్త విజయ్ మాల్యా ప్రస్తుతం లండన్‌లో ఉన్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment